కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 11/1 పేజీలు 3-4
  • సలహా కొరకు మీరు ఎచ్చటికి వెళ్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సలహా కొరకు మీరు ఎచ్చటికి వెళ్తారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మూసివేయబడిన మనస్సులు—ఎదుకు?
  • మనం మంచి సలహా ఎలా ఇవ్వొచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • మనం సలహా ఎందుకు తీసుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • మంచి సలహా వెదకండి
    తేజరిల్లు!—2007
  • దేవుడు ఆమోదించే ఆరాధన
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 11/1 పేజీలు 3-4

సలహా కొరకు మీరు ఎచ్చటికి వెళ్తారు?

ఎవరైనా ఎప్పుడైనా మీకు దొంగ కరెన్సీని యిచ్చారా? బహుశా యిచ్చియుండక పోవచ్చును, కాని దొంగ కరెన్సీ చెలామణిలో ఉన్నదని ఎవరైనా మీకు చెబితే మీరు ఎలా స్పందిస్తారు? అతని మీద తిరగబడతారా? నిశ్చయంగా అలా చేయరు! కష్టార్జితము, నిష్కళంకమైన మీ డబ్బులో కొంత దొంగ కరెన్సీగా మారిపోకుండా తగుశ్రద్ధ తీసుకొనుటకు మిమ్ములను అప్రమత్తము చేసినందుకు కృతజ్ఞులైయుంటారు.

అప్పుడప్పుడు మనలో చాలామందిమి సలహాలను లేదా హెచ్చరికలను పొందుచూ ఉంటాము. నిజమే, వాటిలో కొన్ని హెచ్చరికలు ఇతరమైన వాటికంటె ఎక్కువ ఉపయుక్తముగా ఉంటాయి. కానీ కొన్ని సలహాలు లేక హెచ్చరికలవలన కలుగు వ్యక్తిగత ప్రయోజనాన్ని మనము చూడకపోయినను, అది ఇవ్వబడినందున ప్రతిఘటించడానికి ఏమైన కారణమున్నదా?

వాస్తవమేమంటే, మనలోప్రతి ఒక్కరికి ఆయా సమయములందు సహాయ సలహాలు అవసరము. అన్నింటికి జవాబులను కలిగియున్నవారు ఒక్కరులేరు. ఆర్థిక మరియు రాజకీయ అస్థిరత్వము మనలను చుట్టిముట్టియున్నందున మనలో ప్రతిఒక్కరికి భవిష్యత్తును గూర్చిన ధృఢ నిరీక్షణ అవసరమైయున్నది. వివాహాలలో సగము విడాకులతో అంతమగుచు, పందొమ్మిదియేండ్ల ప్రాయములోపు వారిలో గర్భధారణలు పెరిగిపోవుచు, లైంగిక సంబంధముద్వారా వ్యాపించుచున్న రోగములు అధికమగుచున్న లోకములో వివేకవంతమైన, కార్యశీలక నడిపింపు ఎంతో అవసరము. సంక్షోభములోనున్న విధానమందు తమపిల్లలను పెంచుటకు శ్రేష్టమైన మార్గమేదో నిర్ణయించుకొనుటకు తల్లిదండ్రులకు సహాయము అవసరము. తమ్మును ఆవరించియున్నట్లుగా అగపడు పరస్పర విరుద్ధ భావోద్రేకములు మరియు వత్తిడులను వేరుచేసికొనుటయందు కౌమారదశలో యున్నవారికి సహాయము అవసరము. మోసము అవినీతి, మరియు హింస మరింత ఎక్కువ అంగీకరించబడుచున్న లోకములో కార్యశీలక నైతిక విలువలను పెంపొందించుటకు ప్రతి ఒక్కరికి సహాయము అవసరము.

అట్టి సహాయము ఎచ్చటదొరకును? జీవనవిధానము గూర్చిన సలహానిమిత్తమై అన్నింటికన్న శ్రేష్టమైనమూలము దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలు. ఒక ప్రాచీన గాయకుడు యిలా వ్రాసెను: “నీవాక్యము నా పాదములకు దీపము నాత్రోవకు వెలుగునైయున్నది.” (కీర్తన 119:105) దేవుని వాక్యమును చదివి దానిని అన్వయించుకొనువారలు నేడున్న అనేక శోధనలను తప్పించుకొనగలరు. ఆ కారణముచేతనే యెహోవా సాక్షులు కోట్లకొలది గంటలు హెచ్చించి తమ పొరుగువారిని దర్శిస్తూ వారితో బైబిలును చర్చిస్తూ ఉంటారు. అయినా అనేకులు వినరు. కొందరైతే ప్రతిఘటిస్తారు కూడా. ఎందుకు?

మూసివేయబడిన మనస్సులు—ఎదుకు?

చాలామంది ప్రజలు ముఖ్యంగా మతమునుగూర్చి సలహాతీసుకొనడం విషయములో చాలా విముఖత చూపుతారు. చర్చి సభ్యులైనా తమబోధకులు అందించె సలహాలను అన్ని వేళల వినడానికి యిష్టపడరు. ఒక బ్రిటీషు మతాధిపతి ఇలా వాపోయాడు: “ప్రతి ఒక్కరికి తమ స్వంత ఆలోచనలున్నవి. మరియు అవి బోధకుని సలహాలంత మంచివేనని పరిగణించబడుచున్నవి”. కనుక తమ గుమ్మమునొద్ద నిలుచున్న క్రొత్తవ్యక్తి మాటలు వినడానికి ప్రజలు యిష్టపడుటలేదంటే ఆశ్చర్యములేదు.

అయినప్పటికిని ప్రతిదానిని సందేహించు యుగములో మనము జీవించుచున్నను, అనేకమంది యింకను తమ చర్చితో స్థిరమైన, భావోద్రేక సంబంధములను కల్గియున్నారు. ఒక నిఘంటువు పేర్కొన్నట్లు, “లెక్కలేనంతమందిలో మతమనేది లోతైనభావాలను కల్గియున్నది.” అట్టివారు ఇతర మతస్థులతో బైబిలును గూర్చి మాట్లాడు అవసరతను గుర్తించరు. ఒకవేళ తమ సమస్యల పరిష్కారమును గూర్చిన చర్చయైనను దాని అవసరతను గుర్తించరు.

మరికొందరైతే మతములో ఎక్కువగా వేషధారణ అవినీతిని చూస్తున్న కారణమున బైబిలును చర్చించుటకు యిష్టపడరు. కొంతమంది మతాధికారులు అవినీతిని బలపర్చినందున వారు అభ్యంతరపడియుండవచ్చు లేదా అనేకమంది టెలివిజన్‌ సువార్తికుల సిగ్గుమాలిన లోభత్వమునుగూర్చి విసుగు చెందియుండవచ్చును. ఒక మతాధిపతి రాజకీయపోరాటములో తన అధికారమునుపయోగించి ఒకపక్షమునకు వ్యతిరేకముగా మరొక పక్షాన్ని బలపర్చుచున్నప్పుడు బహుశ వారు దానినుండి ప్రక్కకు మళ్లియుండవచ్చును. అట్టివారికి మతమనేది సమస్యలను పరిష్కరించుటకు బదులు సమస్యలను అధికం చేసేదిగా ఉన్నది.

అట్టివారు ఫిర్యాదు చేయు సమస్యలు వాస్తవమైనవే. మతసంబంధముగా మాట్లాడితే, ఎంతో “దొంగకరెన్సీ” చెలామణిలో ఉన్నది. అయితే ఈ కారణముచేత బైబిలునుండి విలువైన సహాయముపొందుటను నిరాకరించుట నిశ్చయంగా, దొంగనోట్లు చెలామణిలో ఉన్నవి కనుక అసలైన ద్రవ్యాన్నే అంగీకరించుటకు నిరాకరించుటవంటి న్యాయవిరుద్ధమైనది.

ముందు తెల్పబడిన విధంగా, క్లిష్టమైన ఎంపికలు భయంకరమైన పరిస్థితులు ఉన్న ఈలోకంలో మనందరికి సలహా అవసరము. సలహాను అంగీకరించు విషయములో జ్ఞానయుక్తంగా నడిపించబడు మార్గమేదైనా కలదా? ఇతర మతస్థునితో బైబిలునుగూర్చి మాట్లాడుట అనవసరమా లేక తప్పా? విశాలమనస్సుతో మంచి సలహాను అంగీకరించుటకు మోసకరమైన సలహావలన వంచింపబడకుండుటకు సాధ్యమేనా? దీని విషయమై బైబిలు ఏమిచెప్పుచున్నది? (w89 8⁄1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి