కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 11/1 పేజీలు 4-7
  • దేవుని మాట వినుటకు మీరు యిష్టపడుచున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని మాట వినుటకు మీరు యిష్టపడుచున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు మాటను వినియుందువా?
  • వినియున్న వ్యక్తి
  • పౌలు మాటలను వినియుందువా?
  • “సమస్తమును పరీక్షించుము”
  • విశాలమనస్సును ఎందుకు కల్గియుండాలి?
  • యేసు సమరయ స్త్రీకి బోధించాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • సమరయ స్త్రీకి బోధించుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • బావి దగ్గర స్త్రీ
    నా బైబిలు పుస్తకం
  • ఎవరి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 11/1 పేజీలు 4-7

దేవుని మాట వినుటకు మీరు యిష్టపడుచున్నారా?

మనము బైబిలును చదువునప్పుడు, మొదటి శతాబ్దమందలి ప్రజల పరిస్థితులు అనేక విషయములలో నేడు మనకున్న పరిస్థితులవంటివేనని మనము వెంటనే గ్రహించగలము. మతములో అవినీతికార్యములు తరచు ఒక భాగమైయున్న కామాతురతగల ఇశ్రాయేలీయుల పొరుగువారిలో ముఖ్యంగా అవినీతి మోసము అధికంగా ఉండేవి. పేదప్రజలకు జీవితం అస్తవ్యస్థంగా ఉండేది, మరియు రాజకీయ సమస్యలు కూడ ఉండేవి. సా.శ. 66 సం.నాటికి ఇశ్రాయేలు రోమా దేశములు యుద్ధములో మునిగిపోయినవి. నేడున్నట్లే, ఆ కాలమందలి ప్రజలకుకూడా సహాయం అవసరమైయుండెను.

మతపరంగా ఆ కాలానికి మనకాలానికి అనేకమైన సారూప్యములున్నవి. యూదా మత నాయకులు వేషధారులు. (మత్తయి 23:15; లూకా 20:46, 47) యూదయేతర లోకంలో మతదృక్పదాలు సరళతనుదాటి, లోకసంబంధమగు ప్రతివిధమైన ఆశలను త్యజించవలెనను గ్రీకు వేదాంతము నుండి మూఢ నమ్మకాలకు మరియు మూఢ భక్తితోకూడిన మతఅత్యాదరణకు నడిపినది. (అపొస్తలులకార్యములు 14:8-13; 19:27, 28 పోల్చుము.) క్రొత్తగా ఏర్పడిన క్రైస్తవసంఘములో కూడా అందరూ యోగ్యంగాలేరు. మొదటి శతాబ్ద అంతమందు అపొస్తలుడైన యోహాను యిలా హెచ్చరించాడు: “వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు.” (2 యోహాను 7) అవును, ఆకాలమందు కూడా మతము విషయములో మోసకరమైన సలహాయివ్వబడెను. అయినప్పటికిని నమ్మకమైన సహాయము అందుబాటులో ఉండెను.

యేసు మాటను వినియుందువా?

ఆకాలమందు శ్రేష్టమైన సలహానిచ్చినవాడు యేసు. దాని ప్రభావమునుగూర్చి మనము యిలా చదువుట మనస్సును కరిగించి వేయుచున్నది: “జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.” (మత్తయి 7:28) అయితే ఆ జనసమూహములోనున్న కొందరే ఆయన చెప్పినదానిని నిజంగా విన్నారు. యేసు అద్భుత కార్యములనుచేసి దైవిక జీవనము మరియు ప్రవర్తన విషయములో శ్రేష్టమైన మాదిరిని కనుపర్చెను. అయినను, అత్యంత విద్యావంతులైన నాయకులని పిలువబడుచున్న వారుకూడా ఆయన చెప్పిన దానిలోని విలువను గ్రహించుటకు నిరాకరించారు. ఎందుకు?

అన్నింటికన్నా ఎక్కువగా, అది దురాభిమానమునకు సంబంధించిన విషయమైయుండెను. యేసు నజరేతువాడైనందున కొందరాయనను నిరాకరించారు. తమ పాఠశాలలో ఒకానొకదానికి కూడా ఆయన హాజరుకానందున, పాలక తరగతితో సంబంధములేనందున మరికొందరు ఆయనను తృణీకరించారు. (యోహాను 1:46; 7:12, 15, 47, 48) అంతేకాదు ప్రజలు వినడాన్కి యిష్టపడువాటినే యేసు ఎల్లప్పుడు చెప్పుటలేదు. ఆయన ఎల్లప్పుడు సత్యాన్నే చెప్పుచుండేవాడు, అందుకు పరిసయ్యులు తరచు ఆయన మాటలకు అభ్యంతరపడుచుండేవారు. (మత్తయి 15:12-14) నిజమే, ఆయన మూడున్నర సంవత్సరములు ప్రకటించిన తదుపరి, యూదామతనాయకులు ఆయనను చంపివేసిరి. (లూకా 23:20-35) యేసు “నిత్యజీవపు మాటలను” కల్గియున్నాడు. గనుక వారు ఎంతటి సదవకాశాన్ని కోల్పోయారో చూడండి!—యోహాను 6:68.

ఆకాలమందు మీరు యెరూషలేములో నివసించియున్నట్లయితే, ఆ మతనాయకులను మరియు మిగిలిన జనసమూహమును అనుసరించియుందురా? లేక యేసుచెప్పుచున్న దాని భావాన్ని గ్రహించుటకు తగినంత విశాలమనస్సును కల్గియుందురా? యేసుతన ప్రయాణములో ఉండగా కల్సుకొనిన గుర్తింపదగిన స్త్రీనిపోలి మీరు ఉందురు.

వినియున్న వ్యక్తి

ఆయన సమరయగుండా ప్రయాణించుచున్నప్పుడు ఈ స్త్రీని కలుసుకొనెను. ఒక బావిప్రక్కన ఆయన కూర్చుండి విశ్రాంతి తీసుకొనుచుండెను, ఆయన అచ్చట ఉండగా ఆ స్త్రీ నీళ్లు చేదుకొనుటకువచ్చెను. ఆమె పేరు మనకు తెలియదుగాని, యేసు అలసిపోయి ఉన్నను, మతమును గూర్చి ఆమెతో మాట్లాడడాన్కి యేసు అవకాశమును తీసుకొనెనని బైబిలు తెల్పుచున్నది.—యోహాను 4:5-15.

అయితే యేసు పరిచయాన్ని మొదట ఆమె ఎందుకు నిరాకరించిందో దానికి అనేక కారణములున్నవి. ఆమె వేరొక మతానికి చెందింది—సమరయుల ఆరాధనా విధానము యూదులకు పోల్చితే వ్యత్యాసంగా ఉంటుంది. అంతేకాదు, యూదులు, సమరయులను నీచంగా చూస్తూ వారితో సహవాసం చేయడానికి నిరాకరిస్తారు. అయినప్పటికి, యూదయపురుషులు తమకు పరిచయములేని స్త్రీలతో సర్వసాధారణంగా మాట్లాడరు. (యోహాను 4:9, 27) అంతేకాదు, ఆ సమరయ స్త్రీ అవినీతికరమైన జీవితాన్ని జీవిస్తున్నది, మరియు తాను విమర్శించబడినందుకు, లేదా తన పాపములను బహిర్గతముచేసినందుకు కోపంతో మండిపడాల్సింది—యోహాను 4:18.

అయితే, ఆమె అలా వ్యవహరించలేదు. బదులుగా, యేసుయొక్క వివేకమైన, ఆసక్తిని గొల్పు మాటలకు ప్రతిస్పందిస్తు ఆమె సహేతుకమైన ప్రశ్నలను వేసింది. సంభాషణ వృద్ధియగుచుండగా, యూదుల మధ్య సమరయులమధ్య ఉన్న మతసంబంధమైన వ్యత్యాసమును సూచించు క్లిష్టమైన విషయాన్నిఅడగతెగించింది. యేసు దయాపూర్వకంగా సమాధానమిచ్చెను. కాని ఆమెతో యిలా ఖచ్చితంగా చెప్పెను: “మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు; మేముమాకు తెలిసిన దానిని ఆరాధించువారము.” (యోహాను 4:19-22) అయినాగాని ఆమె అభ్యంతరపడలేదు. ఆమె విశాలమనస్సు యింకా ఎక్కువవినడాన్కి సంసిద్ధంగా ఉన్నది.

కనుక యేసు ఒక ప్రాముఖ్య విషయమును బయల్పరచుచూ యిలా చెప్పసాగెను: “అయితే, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది, తనను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. (యోహాను 4:23, 24) అటుపిమ్మట, తానునేర్చుకొన్నదానిని తన పొరుగువారికి ఆతురతతో చెప్పుట మూలంగా ఈ విశాల మనస్సున్న స్త్రీ మెప్పుదలను కనుపర్చెను. వారుకూడా యేసుమాటలను వినుట మూలంగా మరింత సమాచారాన్ని పొందగాల్గరు.—యోహా 4:39-42.

దీని నుండి మనమేమి నేర్చుకొనగలము? జాతి, దేశ, లేక మతపరమైన దురాభిమానము అధికంగా ఉన్నప్రాంతములో మనము నివసించుచున్నయెడల, వేరొక జాతి, దేశము లేక మతసంబంధమైన వ్యక్తి మనతో మాట్లాడితే ఎలా ప్రతిస్పందిస్తాము? చర్చించబడిన విషయాలు మనము తప్పని చూపినచో మౌనంగా ఉంటామా? లేక ఆ సమరయ స్త్రీవలెనే కనీసం మాట్లాడడాన్కి మనము యిష్టపడతామా?

పౌలు మాటలను వినియుందువా?

మొదటి శతాబ్దములో శ్రేష్టమైన సలహాను అందించిన మరొకవ్యక్తి అపొస్తలుడైన పౌలు. ఒకప్పుడు పౌలుకూడా సంకుచితమనస్సును కల్గియుండెను. అతడిలా ఒప్పుకొన్నాడు: “పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన మనుష్యుడను. అయితే తెలియక అవిశ్వాసమువలన చేసితిని గనుక కనికరింపబడితిని.” (1 తిమోతి 1:13 NW) అయితే యేసుక్రీస్తును గూర్చిన సత్యమును అతడు అంగీకరించి దురభిమానమును విడనాడెను. మన హృదయములో పాతుకుపోయిన విషయాలు మనశ్రేయస్సుకు హానికరమైనవైతే ‘వాటిని పడద్రోయుటకు’ బైబిలు సత్యము తోడ్పడునని అతని మాదిరి చూపుచున్నది.—2 కొరింథీయులు 10:4.

తాను క్రైస్తవుడైన నాటినుండి, తాను నేర్చుకొనిన సువార్తను వ్యాప్తిచేయుటకు పౌలు ధైర్యముగా కొనసాగెను. అనుకొన్నరీతిగానే తాను ఒకప్పుడు కల్గియున్న మూయబడియున్న మనస్సు కలవారినే అతడు ఎదుర్కొనెను కాని అన్ని సందర్భములలో మాత్రంకాదు. గ్రీసు యొక్క ఉత్తరప్రాంత మందలి బెరయలో సలహాను వినుటకు శ్రేష్టమైన మాదిరిగానున్న దీన హృదయులను అతడు కనుగొన్నాడు. వీరు పౌలు మాటలలోని సత్యాన్ని గుర్తించారు. కనుక, “వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి.” అయితే వారు అవివేకులుకారు, విశాలమనస్సుగలవారు. ‘సంగతులు ఆలాగున్నవోలేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచువచ్చిరి.’ (అపొస్తలులకార్యములు 17:11) తాము విన్నదానిని పూర్తిగా అంగీకరించక ముందుదాని సత్యసంధతను బైబిలుతో పరిశీలించినప్పటికిని దానిని యిష్టపడ్డారు.

“సమస్తమును పరీక్షించుము”

మనకాలమందు, యెహోవాసాక్షులు ఇతర మతములకుచెందిన తమ పొరుగువారితో రాజ్యసువార్తను పంచుకొనుటకు ఎక్కువ సమయాన్ని గడుపుచున్నారు. సాక్షులు ఎట్టి ప్రతిస్పందనను పొందుచున్నారు? స్నేహభావముగల అనేక మంది వారిని ఆహ్వానించుటకు యిష్టపడుచున్నారు. కాని కొందరు నిరాకరిస్తున్నారు, మరికొందరైతే సాక్షులు తమ్మును దర్శించినందుకు కోపపడుచున్నారుకూడా.

ఇది చాలా విచారకరము, యెహోవాసాక్షులు మాట్లాడుటకు కోరుచున్నది బైబిలులో “సువార్త” అని పిలువబడెను. (మత్తయి 24:14) అంతేకాదు అపొస్తలుడైన పౌలు దృక్పదాన్నే వారు ప్రోత్సహించుచున్నారు. ఆయన యిలాచెప్పాడు: “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుము.” (1 థెస్సలొనీకయులు 5:21) కొందరికి గట్టినమ్మకములున్నప్పటికిని, బెరయలోని వారు మరియు సమరయ స్త్రీవలెనే, దేవునిగూర్చి ఇతరులతో మాట్లాడదగ విశాలమనస్సును కల్గియుండవలెను.

విశాలమనస్సును ఎందుకు కల్గియుండాలి?

సంతోషదాయకంగా, ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ఆవిధంగా చేయుచున్నారు. బైబిలునందున్న జ్ఞానాన్ని గుర్తించుటను అనేకులు నేర్చుకున్నారు, ఫలితం వాస్తవమైనది, తమ జీవితములలో శాశ్వత మార్పులు చేసుకున్నారు. కొందరు మునుపు మాదకద్రవ్యము, మధ్యపానములకు బానిసయై దీర్ఘకాలచరిత్రను కల్గి తుదకు ఆత్మహత్యాప్రయత్నమునకు నడిపించబడిన జానెట్‌ అనే యువతివలె ఉన్నారు. నేడు జానెట్‌ సంతోషముననుభవిస్తున్న క్రైస్తవ స్త్రీయైయున్నది. పౌలు సలహానుపాటించగల బలమును పొందుటకు తన బైబిలుపఠనము ఆమెకు తోడ్పడింది: “శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్తకల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.”—2 కొరింథీయులు 7:1.

వెర్నోన్‌ ఒక మధ్యపాని, అతని వివాహము విచ్చిన్నమయ్యే ప్రమాదములో ఉన్నది. కాని బైబిలు సలహాను పాటించడం యిట్టి చెడ్డప్రవర్తనను జయించుటకు తన భార్యతో సమాధానపడుటకు అతనికి దోహదపడింది. (1 కొరింథీయులు 6:11) దెబ్రాకు జాత్యాహంకారము ఎక్కువ ఉండేది. కాని బైబిలుపఠనము మరియు క్రైస్తవులతో సహవాసంచేయడం తనతలంపును సరిచేసికొనుటకు సహాయపడింది. (అపొస్తలులకార్యములు 10:34, 35) నెదర్లాండ్స్‌నందు గల ఒక యౌవన వ్యభిచారిణి ఒకరోజు తాను యెహోవాసాక్షులతో పఠించడాన్కి అంగీకరించినప్పుడు ఆమె జీవితములో మార్పులు సంభవించగలవని ఎవరు నమ్మగలరు? కొద్దికాలంలోనే, ఆమె పవిత్రమైన జీవితమును గడుపుచున్న బాప్తిస్మ క్రైస్తవురాలాయెను, మరియు తన పిల్లలను బాధ్యతాయుతంగా పెంచుచున్నది.

బైబిలు చెప్పుచున్నదానిని ప్రజలు వినుచున్నప్పుడు అట్టి అనుభవాలు అనేక పర్యాయాలు సంభవించాయి. తమ జీవితములు మెరుగుపడ సాధ్యమగునని వారిలో అనేకులు ఎన్నడు తలంచనిరీతిగా ఉన్నవి బాగుపడినవి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా వారుదేవునితో సంబంధాన్ని పొందగాల్గరు. తద్వారా “పరలోకమందున్న మా తండ్రీ” అని ఆయనను అత్యంతాధారముగా ప్రార్థన చేయగల్గుచున్నారు. (మత్తయి 6:9) మరియు యేసు మాటొల్లని సత్యాన్ని వారు అనుభవించినప్పుడు భవిష్యత్తుకొరకు ఒక నిశ్చయమైన, భంగపడని నిరీక్షణను పొందగలరు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవుపంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.

యెహోవాసాక్షులు తమపరిచర్యను చేపట్టి తమ పొరుగువారిని సందర్శించినప్పుడు ఇటువంటి సమాచారమునే చర్చించయిష్టపడుదురు. అలాగే, త్వరలోవారు మిమ్మును మరల సందర్శించుదురు. వారిమాటలను వినగల్గు విశాల మనస్సును కల్గియుందురా? (w89 8/1)

[6వ పేజీలోని బాక్సు]

యేసు మాటలను వినకుండా దురాభిమానము తన్ను ఆటంకపర్చునట్లు సమరయ స్త్రీ అనుమతించలేదు. మీరును అంతటి విశాలమనస్సుగలవారేనా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి