కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 10/1 పేజీ 32
  • పాఠకులనుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకులనుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • లాటరీలకు—ఎందుకంత జనాదరణ
    తేజరిల్లు!—1992
  • లాటరీలను—గెలిచేదెవరు? ఓడేదెవరు?
    తేజరిల్లు!—1992
  • లాటరీ పిచ్చి—లోకపు జూదం
    తేజరిల్లు!—1992
  • జూదమాడడాన్ని బైబిలు ఖండిస్తోందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 10/1 పేజీ 32

పాఠకులనుండి ప్రశ్నలు

◼ వచ్చిన దానిని ధర్మకార్యములకొరకై వినియోగించే పక్షములో కేవలము వినోదముగా లాటరీ టిక్కెట్లను కొనుట క్రైస్తవునికి తగునా?

యుక్తమైన వినోదాన్ని బైబిలు నిశ్చయముగా ఖండించదు. ఎందుకనగా యెహోవా “సంతోషవంతుడగు దేవుడు.” (1 తిమోతి 1:11 NW) తన ప్రజలు సంగీతమును, మితిమీరని నృత్యమును, మితముతోకూడిన తినుట, త్రాగుట లేక సమతూకముగల క్రీడలు మరియు ఆటలను ఆనందించవచ్చును. (కీర్తన 150:4; ప్రసంగి 2:24) ఏమైనను, జూదముమాత్రము దేవుని జ్ఞానయుక్తమైన ఉపదేశమునకు స్పష్టముగా భిన్నమైనదైయున్నది. ఇది లాటరీలలో పాల్గొనుటయందును సత్యమైయున్నది.

ఖచ్ఛితముగా లాటరీ ఏమైయున్నది? బహుమతిని గెలుచుకొను అవకాశాన్ని పొందుటకై టిక్కెట్లను కొనుట దానియందు యిమిడియున్నది. గురిలేకుండా ఒక సంఖ్యను ఎన్నుకొనుట, లేక తీయుటద్వారా గెలుపొందినవారు నిర్ణయించబడతారు.a సహజంగా లక్షలాది డాలర్లు, పీసోస్‌, లేక పౌండ్స్‌తో తరచు ఒక పెద్దబహుమతి యుంటుంది. అట్టి పెద్దమొత్తముతో కూడిన బహుమతినిగూర్చిన కోరిక ఎంతో ఎక్కువై, “లాటరీలు జూదములో అతిగా విస్తరించిన భాగంగా తయారైనవి.” (ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైకొపీడియా) కోట్లకొలది ప్రజలు లాటరీలద్వారా జూదములో పాల్గొనుచున్నారు.

కొందరు ప్రజలు టిక్కెట్టు వెల (అవకాశము) చాలాతక్కువ, అందులో పాల్గొనేవారు యిష్టపూర్వకముగా పాల్గొంటున్నారు, వాటిలో వచ్చిన కొంత బీదలకు సహాయకరముగా ధర్మసంబంధమైన ఉద్దేశ్యముతో వాడవచ్చునుగాన లాటరీలో పాల్గొనుట తప్పు లేక చెడు కాదు అని తర్కించారు. అట్టి తర్కము ఎంత బలమైనది?

కొందరు లాటరీ టికెట్టుకొనుట సూక్ష్మమైనది, తక్కువ ధరకలిగిన వినోదమన్నను, లోభత్వము దానిలో ఉన్నదనుదానిని కాదనలేము. పెద్దమొత్తములో డబ్బు పొందాలనే ఆశతోనే ప్రజలు లాటరీ టిక్కెట్లను కొంటారు. అది నిశ్చయముగా దేవుని ఉపదేశమునకు వ్యతిరేకముగా వెళ్లునదే కాకుండా, ఒక వ్యక్తిని “దేవుని రాజ్యమును స్వతంత్రించు” కొనకుండా జేయునంతటి గంభీరమైన చెడుక్రియయైయున్నది. కావున ఒక క్రైస్తవుడు జూదముద్వారా లోభత్వమును కొనసాగించుచున్న అతనిని సంఘమునుండి బహిష్కరించవచ్చును. (1 కొరింథీయులు 5:11; 6:10) బైబిలు ఇలా చెప్పుచున్నది: “మొదట బహు త్వరితముగా (లోభముతో) దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.” (సామెతలు 20:21NW) ‘అవకాశమును పొందుదామన్న’ ప్రేరణను ఒక క్రైస్తవుడు కలిగించుకొనిన ఆ లాటరీ ఆధారపడియున్న లోభత్వమునుగూర్చి తాను గంభీరముగా తలంచవలెను. ఎఫెసీయులు 5:3 ‘లోభత్వము. . .పేరైనను ఎత్తకూడదని’ చెప్పుచున్నది. ఇది క్రైస్తవుని వలన ఏమాత్రము తక్కువగా యెంచబడకూడదు.

లాటరీలలో పాల్గొనే వారిలో ఎక్కువమంది పేదసమాజములలోని వారైయుందురు. వెల చాలా స్వల్పమైనను, అసలైన కుటుంబ అవసరతలకు వెళ్లవలసిన—అనగా ఆహారము, చాలినన్ని వస్త్రములు, వైద్యసంబంధమైన అధిక శ్రద్ధకు వెళ్లవలసిన రొక్కము ప్రక్కకు మళ్లించబడుచున్నది. క్రైస్తవునిగా చెప్పుకుంటూ అట్టి కుటుంబ అవసరతలను నిర్లక్ష్యముచేయువాడు “అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.”—1 తిమోతి 5:8.

ఒకవేళ లాటరీ టిక్కెట్టు ఖరీదు ఒక వ్యక్తియొక్క వ్యక్తిగత లేక కుటుంబ డబ్బులలో లోటును కలిగించకపోయినను, దానివలన యితరులు గాయపడుటలేదని భావము కాదు. ఎందుకు? లాటరి టిక్కెట్టు కొను ఎవరైనను బహుమతిని గెలవాలనే ఆశిస్తారు. అతని బహుమతి ధనము ఎక్కడనుండి వస్తుంది? అతని టికెట్టు వెల పది పీసోస్‌లు, బహుమతి ధనము పదిలక్షల పీసోస్‌లు అయినట్లయిన, అతడు దాదాపు లక్షమంది యితరుల నుండి వారి టికెట్టు డబ్బులను తీసుకుంటున్నాడని భావము. యితరుల వెలగల వస్తువులకై ఆశపడకూడదను బైబిలు ఉపదేశమునకు అది అనుగుణ్యముగా ఉన్నదా? (ద్వితీయోపదేశకాండము 5:21) వాస్తవానికి తన బహుమతిలో ఇంకా చాలా ఎక్కువమంది నుండియు డబ్బు తీసుకొనటం జరుగుతుంది ఎందుకనగా లక్షకంటే ఎక్కువ టిక్కెట్లు అమ్మబడవలెను. టిక్కెట్ల ధనమందలి చాలా భాగము దాని నిర్వాహణఖర్చులకు, లాటరీ టిక్కెట్లు సరైనవేనని కనిపింపచేసే ధర్మసంబంధమైన పనులకు ఉపయోగిస్తామనిచేయు ప్రచారముకొరకు పోవును. ఒకవేళ ఒకడు తన స్వంత టికెట్టుకొరకు పది పీసోస్‌లను వెచ్చించగల్గినను, మిగతా వారందరి విషయమేమి? అంతేకాకుండా అతని విజయము బహుశ ప్రచారము చేయబడును, అలా అనేకమంది తాము వాటిని కొనలేని స్థితిలో యున్నను, లాటరీ ఆడుటకు లేక మరిన్ని టికెట్లు కొనుటకు కదిలింపబడుదురు.

లాటరీతో పనిచేయకుండానే డబ్బు గెలువవచ్చునని కలలు కనుటకూడ అంగీకరించవలసిన విషయము. అవును, లాటరీ సోమరితనమును లేక దానిని చేపట్టుటను ప్రోత్సహించునదై యున్నది. అయితే బైబిలు దేవుని ప్రజలు పొదుపరులుగాను, శ్రమించువారిగాను, కష్టపడి పనిచేయువారిగాను ఉండవలెనని ప్రోత్సహించుచున్నది. ‘ఏమీ చేయకుండానే ఏదో సంపాదించవలెనను,’ ఆత్మను ప్రోత్సహించుటకు బదులు అది ఈ సలహానిచ్చుచున్నది: “పనిచేయనొల్లనియెడల వాడు భోజనము చేయకూడదు.”—2 థెస్సలొనీకయులు 3:10; సామెతలు 13:4; 20:4; 21:25; 1 థెస్సలొనీకయులు 4:9-12.

కొందరు తమ సంకల్పసాధనయని, అది చట్టబద్ధమని లాటరీలో పాల్గొనుటయనునది, క్రైస్తవులును దానియందు భాగము వహించుటను అది సమర్థించదు. కొన్ని ప్రభుత్వములు యితర రూపముల జూదమును, వ్యభిచారమును, బహు భార్యత్వమును చట్టబద్ధము చేయును. అవి చట్టబద్ధమైనంత మాత్రమున, మరియు అనేక మంది యిష్టపూర్వకముగా వాటియందు పాల్గొనుచున్నందున, అటువంటి కార్యములు దేవుని దృష్టియందు సరియైనవే అని అర్థము కాదు. బదులుగా క్రైస్తవులు దావీదు దృష్టిని ప్రతిబింబింప పోరాడుదురు: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము; నీ త్రోవలను నాకు తేటపరచుము.. . .నీవే నా రక్షణకర్తవైన దేవుడవు.”—కీర్తన 25:4, 5.

ఒక క్రైస్తవుడు నిష్కల్మషముగా బీదలకు, వికలాంగులకు, వృద్ధులకు సహాయము చేయగోరినట్లయిన, నేరుగా లేక జూదము యిమిడియుండని విధముగా ఆయన నిశ్చయముగా చేయవచ్చును. (w89 7/15)

[అధస్సూచీలు]

a లాటరీ అని అంతటా తెలియబడినప్పటికిని, ఈ రకమైన జూదము గుండాట, పందెములు, చీట్లువేసి అమ్ముట లేక ఆయా స్థలములకు సంబంధించిన పేర్లతో పిలువబడును.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి