కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 2/1 పేజీలు 29-31
  • బరుండిలో కొనసాగుచున్న హింస

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బరుండిలో కొనసాగుచున్న హింస
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 2/1 పేజీలు 29-31

బరుండిలో కొనసాగుచున్న హింస

1989వ సంవత్సరము ప్రారంభములో మధ్యఆఫ్రికా దేశమైన బరుండి పాలకులు యెహోవాసాక్షుల పైన హింసను ఒక్క తరంగంలా విడిచిపెట్టరు. అక్టోబరు1, 1989 కావలికోటలో రిపోర్టుచేసిన విధంగా, బాధించుట, నిర్బంధించుట, కొట్టుట మరియు క్రూరమైన ఇతర పనులద్వారా విశ్వాసాన్ని విడిచిపెట్టేటట్టు, సాక్షులను బలాత్కరించడానికి ప్రయత్నించారు. అప్పటినుండి ఇప్పటివరకూ పరిస్థితి ఎలా వుంది?

బరుండి బయటనుండి వచ్చిన మరియొక రిపోర్టు చెప్పునదేమనగా, జిల్లాకాపరి కినిన్యా, గిటేగాలను దర్శించుసమయంలో అధికారులు సంఘసభ్యులను ఒక మీటింగులో నిర్బంధించడానికి ప్రయత్నించిరి. జిల్లా మరియు ప్రాంతీయకాపరులు తప్పించుకోగలిగారు, కాని ఇద్దరు ఉన్నతపాఠశాల విద్యార్థులు మరియు ప్రాధమిక పాఠశాలలోని ఒకబాలిక, నిర్బంధించబడినవారిలో చేర్చబడ్డారు. అందరు కొట్టబడ్డారు. నిర్బంధించబడిన సాక్షులు మరుసటిరోజు గవర్నరు ముందు అగుపడిరి మరియు ఎందుకు వారు రాజకీయపార్టీలో సభ్యులు కాలేకపోయిరో వివరించెను. మరలా కొట్టబడ్డారు. ఇదేవిధంగా జరిగిన సంఘటనలు గురించి వేరే రిపోర్టులుకూడా చెపుతున్నాయి.

బరుండిలోని బాధ్యతకల్గిన ఒక క్రైస్తవపెద్ద యిలా వ్రాస్తున్నాడు: “దొంగతనము, హత్య, రాజకీయవ్యవస్థను నాశనం చేసారనే ఆరోపణలపై ఏ ఒక్క యెహోవాసాక్షి కూడా అరెస్టుచేయబడలేదు. శాంతియుతంగాయున్న నగరవాసులను కఠినంగా హింసించడం, వారి ఆస్తులను బలాత్కారంగా పట్టుకోవడం, క్రూరజంతువూల్ల వేటాడేందుకు బదులుగా అధికారులకు సాక్షులను శిక్షించడానికి ఆధారాలున్నట్లయితే, బహిరంగన్యాయస్థానంలో శిక్షించవచ్చును. మంచి యిండ్లలో నివసిస్తున్న చాలామంది సహోదరులు యిండ్లను విడిచి పారిపోయేటట్టు బలవంతచేయబడ్డారు. భర్త చెరసాలలోవున్న ఒక సహోదరి భర్తను చెరసాలనుండి విడిపించాలనే ప్రయత్నంలో ఆమె చాలామంది అధికారులను చూడవలసి వచ్చెను. అందరూ కూడా ఆమెకు సహాయం చేయడానికి నిరాకరిస్తూ యిలా సమాధానమిచ్చారు: ‘మన దేశాన్ని అస్థిరమైనదిగా చేయడంకోసం దూరప్రాంతాలనుండి నీవు డబ్బును స్వీకరిస్తున్నావు కాబట్టి నీ భర్తను యిక ఎన్నడూ విడుదల చేయలేము.’ ఏమి అపవాదము!”

ఏమైనప్పటికి, బరుండినుండి మంచి వార్త వచ్చినది. అక్కడవున్న యెహోవాసాక్షులు భయపడి లేదా పిరికిపోయేవారుకాదు. అపాయస్థితిలోవున్నప్పటికీ, నిస్సందేహంగా సువార్త ప్రచారము అభివృద్ధి అవుతుంది మరియు యెహోవా దేవునిపైన పూర్తినమ్మకముంచడంతో వారు సహించగలరని సహోదర సహోదరీలు నిరూపించారు. దౌర్జన్యము చేయడాన్ని వివరిస్తూ యిప్పటికే చాలా వుత్తరాలు వ్రాయబడ్డాయి, మరియు యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా బరుండి కొనసాగిస్తున్న దాని హింసాయుత పోరాటాన్ని లోకము ఎప్పుడైతే తెలుసుకుంటుందో, ఖచ్ఛితంగా అటువంటి యింకా అనేకమైన వుత్తరాలు అనుసరించగలవు.

[29వ పేజీలోని బాక్సు]

బరుండి రాష్ట్రపతి చిరునామా:

His Excellency Major Pierre Buyoya;

President of the Republic of Burundi;

Bujumbura;

REPUBLIC OF BURUNDI

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి