కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 4/1 పేజీలు 30-31
  • సైనాయ్‌టికస్‌ వ్రాతపతి పుస్తకమును కాపాడుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సైనాయ్‌టికస్‌ వ్రాతపతి పుస్తకమును కాపాడుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఫలితము దక్కించినవి
  • రష్యాలోని పురాతన గ్రంథాలయం నుండి బైబిలు మీద ప్రసరించబడిన “స్పష్టమైన వెలుగు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • వాటికన్‌ కోడెక్స్‌యొక్క రహస్యము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • బైబిలు మనకు చేరిన విధానం—భాగం మూడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 4/1 పేజీలు 30-31

సైనాయ్‌టికస్‌ వ్రాతపతి పుస్తకమును కాపాడుట

సైనాయ్‌టికస్‌ వ్రాతప్రతిపుస్తకము “ఉనికియందున్న పుస్తకములలో అతిప్రాముఖ్యమైన, ఉత్తేజవంతమైన, మరియు విలువకరమైన పుస్తకముగా” వర్ణించబడినది. దానికి కారణము కేవలమది 1,600 సంత్సరములనాటి పురాతనమైనదైనందున కాదుగాని బైబిలు వ్రాతప్రతుల కేటలాగునందు అది ఒక ప్రాముఖ్యమైన సంబంధమును కలిగియున్నది. కేవలము వందసంవత్సరముల పూర్వము టిస్‌చెన్‌డార్ఫ్‌చే అది తిరిగి కనుగొనబడిన విషయము ఒక ఆసక్తికరమైన కథయైయున్నది.

ఉత్తర ఐరోపాలోని సాక్సోని నందు 1815లో జన్మించిన కాన్‌స్టేంటిన్‌ వాన్‌ టిస్‌చెన్‌డోర్ఫ్‌ లెప్‌జిగ్‌ యూనివర్సిటీనందు గ్రీకు నభ్యసించెను. ఆయన చదువుతున్న కాలములో క్రైస్తవగ్రీకు లేఖనములు సత్యమైనవికావని రుజువుపరచ యత్నించు జర్మను వేదాంతులు బైబిలును తీవ్రముగా విమర్శించుటనుబట్టి ఆయన కలతచెందెను. అయితే టిస్‌చెన్‌డార్ఫ్‌, తొలివ్రాతప్రతుల పఠనము బైబిలు లేఖనసత్యమును రుజువుచేస్తుందని నమ్మాడు. దానిఫలితంగా తాను ప్రయాణించుకొలది తక్కినవి దొరకునను ఆశతో అప్పటికి తెలియబడియున్న వ్రాతప్రతులను పరిశోధించ నిర్ణయించుకొనెను.

టిస్‌చెన్‌డార్ఫ్‌ ఐరోపాలోని మంచిమంచి గ్రంధాలయాలన్నిటి వెదుకుతూ నాలుగు సంవత్సరములు గడిపిన తదుపరి, చివరకు 1844, మే నెలలో, ఎర్రసముద్రమునకు 4,500 అడుగుల ఎత్తులో సీనాయిలోనున్న సెయింట్‌ కేథరిన్‌ ఆశ్రమానికి చేరుకొని, పెద్దకోటలాగ ఉన్న ఆ ఆశ్రమములోనికి గోడకున్న ఒక చిన్నద్వారము గుండా, త్రాడుతో వ్రేలాడదీయబడిన గంపసహాయముతో లోపల ప్రవేశించెను.

ఫలితము దక్కించినవి

కొద్ది దినములు వారి యొద్దనున్న మూడు గ్రంధాలయాలను వెదకుటకు ఆయన అనుమతించబడెను. కాని ఫలితము లేదు. చివరకు ఆ చోటును విడిచి వచ్చుటకు ముందు తాను వెదకుచున్న—వ్రాతతోనిండిన ఆ పురాతన చర్మపుకాగితములను ఆయన చూశాడు! ముఖ్యగ్రంధాలయములో ఉన్న ఒక బుట్టనిండా అవి ఉన్నవి. అంతలో గ్రంథాలయ పర్యవేక్షకుడు నిండుగా ఉన్న రెండు బుట్టలను ఇప్పటికే కాల్చివేశాము, దీనిని కూడా కాల్చాలని చెప్పాడు. ఈ చర్మపుచుట్టలలో తానెప్పుడు చూడనటువంటి అతి పురాతనమైన 129 కాగితములను అనగా గ్రీకుభాషలోనికి తర్జుమాచేయబడియున్న హెబ్రీలేఖనములలోని కొన్నిభాగములను చూచి టిస్‌చెన్‌డార్ఫ్‌ ఆశ్చర్యపోయెను. వాటిలో 43 కాగితములను ఆయనకిచ్చి తక్కినవాటిని తిరస్కరించారు.

టిస్‌చెన్‌డార్ఫ్‌ రెండవసారి మరలా 1853లో దర్శించినప్పుడు అదే నాల్గవశతాబ్దపు వ్రాతప్రతులలో ఆదికాండములోని కొంతభాగమును కనుగొనగల్గెను. నిజమునకు “ఆ వ్రాతప్రతిలో తొలుత పాతనిబంధనంతయు ఉన్నదికాని, చాలా కాలము క్రితమే అది కాల్చివేయబడెనని” వారుతెలిపిరి. బహుశా పూర్తిగా ఉన్న ఆ వ్రాతప్రతి 730 కాగితములను కల్గియుండవచ్చును. అవి గ్రీకు పెద్దఅక్షరములలో (కేపిటల్‌ లెటర్స్‌) వెల్లం అనగా శ్రేష్టమైన గొర్రె లేక మేక చర్మముపై వ్రాయబడియున్నవి.

ఆరుసంవత్సరముల తర్వాత టిస్‌చెన్‌ డార్ఫ్‌ మరలా మూడవసారి సీనాయినందలి ఆశ్రమములో సన్యాసిని దర్శించెను. ఆయన తిరిగి వచ్చేసమయములో సందర్భసహితంగా తాను 15సంవత్సరముల క్రితము అగ్నినుండి కాపాడిన కాగితములు మరియు ఇతరములు చూపించబడెను. వాటిలో క్రైస్తవ గ్రీకులేఖనములన్నియు మరియు హెబ్రీలేఖన భాగములును ఉన్నవి.

టిస్‌చెన్‌డార్ఫ్‌ ఆ వ్రాతప్రతులను ఐగుప్తులోని కైరోకు తీసుకువెళ్లి వాటిని కాపి చేయుటకును, ఆ తదుపరి సన్యాసినుండి పొందిన బహుమతిగా రష్యాలోని జూర్‌కు వాటిని తీసుకుపోవుటకును ఆయన అనుమతించబడెను. నేడు అవి బ్రిటీషు మ్యూజియంలో కోడెక్స్‌ అలక్సాండినస్‌ ప్రక్కనే ఉంచబడి ప్రదర్శించబడుచున్నవి. మొదటి 43 కాగితములు జర్మనీ డెమాక్రటిక్‌ రిపబ్లిక్‌లోని లెప్‌జిగ్‌ యూనివర్సిటీ లైబ్రరీలో యున్నవి.

టిస్‌చెన్‌డార్ఫ్‌ తనజీవితమును తన సామర్ధ్యములను పురాతన బైబిలు వ్రాతప్రతులను వెదకుటకు ఉపయోగించినందుకు, ముఖ్యముగా సైనాయ్‌టికస్‌ వ్రాతప్రతిపుస్తకమును (కోడెక్స్‌ను) నాశనము చేయబడుటనుండి రక్షించినందుకు మనము కృతజ్ఞులమై యుండవలెను. అయితే మరి ఎక్కువగా ఈనాటి మన ప్రయోజనము నిమిత్తమై ఖచ్ఛితముగా అవి దాచబడియుండేలాగున చేసిన యెహోవాదేవునికి మన కృతజ్ఞతలు వెళ్లవలయును. (w88 10/15)

[30వ పేజీలోని బాక్సు]

వ్రాతపతి పుస్తకమును ఉపయోగించుట

ఈ సైనాయ్‌టికస్‌ వ్రాతపతి పుస్తకము א అను ఈ హెబ్రీ అక్షరముతో సూచించబడియున్నది. ఈ కోడెక్స్‌ (వ్రాతప్రతిపుస్తకము) ఇటీవలి బైబిలు పాపిరస్‌ వ్రాతప్రతుల వాస్తవికతను స్థిరపరచుచున్నది. మరియు తదుపరి కాపీలలోనికి కుయుక్తితో ప్రవేశింపజేయబడిన తప్పిదములను గుర్తించుటకును ఆధునిక బైబిలు పాండిత్యమునకు ఇది సహాయపడుతుంది.

ఉదాహరణకు, యోహాను 1:18లో: “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయదేవుడే ఆయనను బయలుపరచెను.” అని చదువబడుతుంది. అయితే దానికి చేయబడిన మార్పులనుబట్టి “అద్వితీయకుమారుడు” అని చదువబడు బడుటకు బదులు, న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్సు బైబిలుయొక్క ఫుట్‌నోట్‌ “అద్వితీయదేవుడే” అని తెలుపుచున్నది. అది సైనాయ్‌టికస్‌ వ్రాతప్రతిపుస్తకముచే బలపరచబడినది. ఇంకా ఫుట్‌నోట్‌ రెఫరెన్సు אc కూడా “ది ఓన్లీ బిగాటన్‌ గాడ్‌” (“అద్వితీయదేవుడే”) అనుటకు తగిన ఆధారముగా ఈ కోడెక్స్‌యొక్క సరిదిద్దబడిన ప్రతిని కూడా సూచించుచున్నది. ఈ లేఖనము ధృవపరచునట్లు యేసుక్రీస్తుయొక్క స్థానము అద్వితీయమైనది.

[31వ పేజీలోని చిత్రాలు]

పవిత్రముగా యెంచబడు సీనాయిపర్వత దిగువన ఉన్న సెయింట్‌ కేథరిన్‌ ఆశ్రమము [లోపలి] ప్రస్తుత దాని గ్రంథాలయము

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est.

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est.

[31వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of the British Museum, London

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి