కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 4/1 పేజీలు 28-29
  • బాషాను ఒక సారవంతమైన ప్రదేశము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బాషాను ఒక సారవంతమైన ప్రదేశము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 4/1 పేజీలు 28-29

వాగ్ధాన దేశమునుండి దృశ్యములు

బాషాను ఒక సారవంతమైన ప్రదేశము

బైబిలును చదువునప్పుడు వాటిరూపమును చిత్రించుకోలేని అనేక స్థలములను మీరుకనుగొనలేదా? 1989 జూన్‌—ఆగస్టు నెలలలో యెహోవాసాక్షులు మీకా నుండి జెకర్యావరకు చదివియున్నారు. ఆ పట్టికను అనుసరించునప్పుడు బాషాను అనివ్రాయబడిన మూడు లేఖనములను మీరుకనుగొందురు. (మీకా 7:14; నహూము 1:4; జెకర్యా 11:2 NW) బాషానును గాని మీ మనోనేత్రముతో చూడగలిగినట్లయిన అవి మరియు ఆసక్తికర ఇతర లేఖనములు మీకు ఎంతో అర్థవంతముగా నుండగలవు.

బాషాను ఎక్కడ ఉన్నది? సాధారణముగా అది గోలన్‌ పర్వతముల యొద్దయున్నదని మీరు గుర్తించవచ్చును. దీనిని మీరు వార్తాపత్రికల పటములలో గమనించియుండవచ్చును. ఈ బాషాను గలిలయ సముద్రమునకును, మరియు యోర్దాను లోయ పైభాగమునకును తూర్పున ఉన్నది. ముఖ్యముగా అది యార్మూకు నదినుండి (ప్రస్తుత యోర్దాను మరియు సిరియా మధ్యగల సరిహద్దులోని భాగము) హెర్మోను పర్వతమునకు ఉత్తరమున నుండి ప్రారంభమగుచున్నది.

పురాతన ఇశ్రాయేలీయులు వాగ్ధాన దేశమందు ప్రవేశించకమునుపు బాషాను రాజైన ఓగును, అతని కనాను సైన్యమును వారు జయించవలసియుండిరి. బాషానులోని ఎక్కువప్రాంతము మనష్షే గోత్రముచే స్వాధీనపరచుకొనబడెను. (ద్వితీయోపదేశకాండము 3:1-7, 11, 13; సంఖ్యాకాండము 32:33; 34:14) ఈ బైబిలు ప్రదేశము దేనివలెనున్నది? దానిపర్వతప్రాంతములందు అడవులను కలిగియున్నను, బాషానులో ఎక్కువప్రాంతము పీఠభూమి, ఎత్తైన మైదానప్రాంతము.

అనేక విషయములందు బాషాను నిజముగా మంచి ఆహారపు బుట్ట అని చెప్పవచ్చును. ఎందుకనగా ఇందులోని ఎక్కువభాగము మేతమేయు పచ్చికతో నిండియున్నది. (యిర్మీయా 50:19) ప్రక్కలోయున్న ఫోటోలు బాషానుaకు సంబంధించిన కొన్నిబైబిలు లేఖనములను మీ మనస్సుకు తేవచ్చును. “బాషాను వృషభముల”ను గూర్చి అనేకమంది చదివియుంటారు. (కీర్తన 22:12. కింగ్‌జేమ్సు వర్షన్‌) నిజముగా పురాతన కాలములో ఈ ప్రాంతము దాని పశువులకు ప్రసిద్ధిచెందినది. ఇందు బలమైన కోడెలు కలవు. యితర జీవులును అచ్చట వృద్ధిపొందినవి. వానిలో పుష్కలంగా పాలు, వెన్ననిచ్చు గొర్రె, మేకలున్నవి.—ద్వితీయోపదేశకాండము 32:14.

బాషాను అట్టిసారవంతమైన ప్రదేశమగుటకు దోహదపడినదేమి? అని మీరు ఆశ్చర్యపోవచ్చును. సహజముగా అది యొర్దానుకు తూర్పుతట్టునున్నది గనుక అనేకమంది దానిని ఎండిపోయిన ప్రాంతమని తలంతురు. అయితే వాస్తవమేమనగా గలిలయ పశ్చిమమునున్న కొండలు అంత ఎత్తైనవికావు. అందువలన మధ్యధరా సముద్రమునుండి వచ్చుమేఘములు దానిమీదుగా వెళ్లుచు విస్తారమైన వర్షములను తెచ్చేవి. తేమగల గాలి మరియు ప్రవాహములు హెర్మోను పర్వతమునుండి వచ్చేవి. అచ్చటి అగ్నిపర్వతసంబంధమైన సారమునకు శ్రేష్టమైన తేమ తగులుచున్నప్పుడు దానిబలమును మీరు ఊహించవచ్చును. ఆ ప్రాంతము విస్తారముగా ధాన్యమును ఉత్పత్తిచేసెను. రోమీయులకు ధాన్యమునందించు ముఖ్యప్రాంతము గాకముందు బాషాను సొలొమోను బల్లలకు ఆహారము నందించెను. ఇట్టి మంచికారణముతోనే విడుదలనొందిన తనప్రజలకు దేవుని ఏర్పాటుగా ఈ మాటలు పలుకబడెను: “బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు.”—మీకా 7:14; 1 రాజులు 4:7,3.

అట్టి ఫలభరిత స్థితిని ఎరిగినవారై, దేవుని అయిష్టత ఎట్టి ఫలితమునిచ్చునో నహూము తీవ్రముగా వర్ణించినదానిని మీరు గుణగ్రహించవచ్చును: “బాషానును, కర్మెలును [మహాసముద్రము దగ్గర పచ్చని పచ్చిక చెట్లతో నిండియున్న కొండలు] వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును.—నహూము 1:4బి.

బైబిలు సన్నిహితముగా వర్ణించు కొన్ని దృశ్యములను చిత్రీకరించుకొనుటకు బాషానును గూర్చిన యిట్టి దృష్టి మీకు సహాయపడును. ఉదాహరణకు, అచ్చట ఎక్కువగా పండుధాన్యమును అనగా గోధుమలను కోయుటను గూర్చి మీరు చదువవచ్చును. ఈ గోధుమకోత సాధారణముగా వేసవినెలలలో ఇయ్యర్‌, మరియు సివాను (యూదా కేలండరులో ఏప్రిల్‌ చివరి, మే, మరియు జూన్‌ తొలిభాగమునకు సరిపోవును) ఈ సమయములో వారముల పండుగ (పెంతెకొస్తు) వచ్చును. అందులో భాగముగా ప్రథమఫలములు, గొర్రెలు, పొట్టేళ్లు, ఎద్దులు అర్పింపబడేవి. పశువులు బహుశా బాషాను నుండి తేబడియుండవచ్చునా?—నిర్గమకాండము 34:22; లేవీయకాండము 23:15-18.

కోతకాలమందు గోధుమపంటను యినుముతో వంకరగా చేయబడిన కొడవలితో కోయువారు. దానిని మీరు పైనచూడవచ్చును. దానికి చెక్కపిడిలేదు. (ద్వితీయోపదేశకాండము 16:9, 10; 23:25.) తరువాత వెన్నులను కల్లములోవేసి చెక్కతో (దానిక్రింద రాళ్లు బిగించబడియుండును) వాటిని త్రొక్కించినప్పుడు గింజలు వాటినుండి రాలును. (రూతు 2:2-7, 23; 3:3, 6; యెషయా 41:15) గోలన్‌ ప్రాంతములయొద్ద తీసుకొనబడిన పై ఫోటోగ్రాఫ్‌ను చూస్తూ “నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అను దేవుని అర్థవంతమైన శాసనమును తలంచవచ్చును.”—ద్వితీయోపదేశకాండము 25:4; 1 కొరింథీయులు 9:9.

చివరగా పురాతన బాషాను దట్టమైన అడవిప్రాంతములను, సింధూరవృక్షములను కలిగియున్నట్లు గుర్తుతెచ్చు కొనవచ్చును. మీరు ఎడమవైపు చూచునటుల బాషానుయొక్క సింధూరమ్రానుతో ఫినోషియన్లు పడవనడుపు తెడ్లను చేయువారు. (యెహెజ్కేలు 27:6) అయినను, ‘చొచ్చుకుపొలేని అడవి, గుబురుగా ఉన్న సింధూర వృక్షములును’ దేవుని ఉగ్రతను తాళలేవు. (జెకర్యా 11:2; యెషయా 2:13) అట్టి వృక్షములను చూచుట సైన్యములు పారిపోవుటకు అవి ఎంత కష్టముగా యుండునో మనము మనస్సులో దృష్టించుకొనుటకు సహాయపడును. ఇంకొకచోట అబ్షాలోము చిక్కుకుపోయినట్లే ఒంటరిగా వెళ్లు రౌతును చెట్లకొమ్మలలో చిక్కుకొని పోగలడు.—2 సమూయేలు 18:8, 9.

బాషాను వాగ్ధానదేశమందలి భాగమై బైబిలునందు గుర్తింపదగిన అనేకసంఘటనలు జరగని ప్రదేశమైనను, అందులోని దృశ్యములు దానినిసూచించు బైబిలు లేఖనముల గ్రహింపును పెంచును. (w89 5/1)

[అధస్సూచీలు]

a 1989 యెహోవాసాక్షుల కేలండరును కూడా చూడుము.

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

Inset: Badè Institute of Biblical Archaeology

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి