కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 11/1 పేజీలు 28-29
  • వాటికన్‌ కోడెక్స్‌యొక్క రహస్యము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాటికన్‌ కోడెక్స్‌యొక్క రహస్యము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకు దాచిపెట్టబడినది
  • బెజాయి కోడెక్స్‌ ఒక సాటిలేని వ్రాతప్రతి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • సైనాయ్‌టికస్‌ వ్రాతపతి పుస్తకమును కాపాడుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • గ్రంథపుచుట్ట నుండి కోడెక్స్‌ బైబిలు పుస్తక రూపంలోకి ఎలా వచ్చింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 11/1 పేజీలు 28-29

వాటికన్‌ కోడెక్స్‌యొక్క రహస్యము

వాటికనస్‌ కోడెక్స్‌ 1209, వాటికన్‌ లైబ్రరీనందు 1475లో తయారుచేయబడిన మొదటి జాబితాలో కనిపిస్తుంది. అది అక్కడికి ఎలావచ్చింది ఎవరికి తెలియదు. ఈనాటికి భద్రముగా మిగిలియున్న మూడు గొప్ప గ్రీకు వ్రాతప్రతి పుస్తకములలో, అనగా దానితో సమకాలికమైన నాలుగవ శతాబ్దపు సైనాయిటికస్‌, అయిదవ శతాబ్దపు తొలిభాగమునాటి అలెక్సాండ్రినస్‌లతోపాటు ఇది ఒకటైయున్నది.

16వ శాతాబ్దపు తొలికాలమునాటికే ఈ వాటికన్‌ వ్రాతప్రతియొక్క ప్రాముఖ్యత విద్వాంసులకు తెలిసియున్నను, దానిని పరిశీలించుటకు అనుమతించబడినవారు ఎక్కువగాలేరు. వాటికన్‌ లైబ్రరీ 1669లో అనేక వ్రాతప్రతుల పాఠాంతరములను సమకూర్చినను ఇది మాత్రము పోగొట్టుకొనబడి 1819 వరకు తిరిగి కనుగొనబడలేదు.

ఫ్రాన్సు దేశపు నెపోలియన్‌ చక్రవర్తి 1809లో రోమును ముట్టడించి దోచుకొనిపోబడిన ఈ వ్రాతప్రతిని పారిస్‌కు తీసుకెళ్లాడు. అచ్చట దానిని పేరుగాంచిన విద్వాంసుడు లియొనార్డ్‌ హగ్‌ పరిశీలించాడు. తరువాత నెపోలియన్‌ పతనముతో ఈ వ్రాతప్రతి పుస్తకము 1815లో తిరిగి వాటికన్‌కు ఇచ్చివేయబడింది. అయితే మరలా తదుపరి 75 సంవత్సరముల వరకు ఇది మర్మమైనదానిగానే ఉంచబడి వాటికన్‌ వలన దాచిపెట్టబడినది.

ప్రపంచములోని అతి గొప్ప వ్రాతప్రతుల విద్వాంసులలో ఒకరైన కాన్‌స్టాంటిన్‌ వాన్‌ టిస్చెన్‌డార్ఫ్‌ అనేక నెలలు కనిపెట్టుకొనియున్న తర్వాత 1843లో కేవలము ఆరుగంటలు మాత్రమే దానిని పరిశీలించుటకు అనుమతించబడెను. రెండు నెలల తర్వాత, ఆంగ్లేయ విద్వాంసుడు డా. యస్‌. పి. ట్రెగెల్లెస్‌ దానిని పఠించుటకు కాక కేవలము చూచుటకే అనుమతించబడెను. ఆయన యిలా అన్నాడు: “తరచుగా ఆ వ్రాతప్రతిని నేను చూచినది వాస్తవమే. కాని దానిని ఉపయోగించుటకు వారు నన్ను అనుమతించలేదు. మొదట నా జేబులు వెదకి, నాదగ్గర పెన్ను, ఇంకు, పేపరు లేకుండా చేసేంతవరకు నన్ను దానిని తెరవనిచ్చేవారుకారు. అదేసమయమున ఇద్దరు ప్రిలాటి (ప్రీస్టులు) నాతో యెడతెగక లాటిన్‌లో మాట్లాడుతుండేవారు, ఒకవేళ నేను ఒక వాక్యమువైపు ఎక్కువసేపు చూస్తూ నా చేతుల్లోనుండి పుస్తకమును లాగేసేవారు.”

అట్టి అత్యంత అమూల్యమైన దాని వ్రాతప్రతిని లోకమునకు చూపించుటకు రోమన్‌ కేథలిక్‌ చర్చి ఎందుకు యిష్టపడలేదు?

ఎందుకు దాచిపెట్టబడినది

రోమన్‌ కేథలిక్‌ చర్చికి పరిశుద్ధలేఖనముల లాటిన్‌ వల్గేట్‌ వర్షన్‌ “అన్నిటికంటె అతి ప్రధానమైన అధికారికమైనదిగా” ఉన్నది. 1943వ సంవత్సరములో ప్రచురించబడిన పయస్‌ XII యొక్క అధికారిక ఉత్తరము డివినో అఫ్లాంటె స్పిరిటు ప్రకారము నాలుగవ శతాబ్దమందు జెరోమ్‌ లాటిన్‌ భాషాంతరము “విశ్వాసము మరియు నైతికవిషయములో ఏ విధమైన తప్పిదమునకు తావులేనిదని” దృష్టించబడింది. వల్గేట్‌ తర్జుమాకు మూలమైన హెబ్రీ మరియు గ్రీకు గ్రంథముల విషయమేమి? అధికారిక ఉత్తరము, ఇవి వల్గేట్‌యొక్క విలువను ‘ధృవీకరించుటకు’ కావలసినవని చెప్పియున్నది. కావున ఏ గ్రీకు వ్రాతప్రతియైనను చివరకు వాటికన్‌ కోడెక్స్‌ కూడా లాటిన్‌ వల్గేట్‌ కన్నా అధికారయుక్తమైనదని ఎన్నడు ఎంచబడలేదు. రోమన్‌ కేథలిక్‌ చర్చివలన గైకొనబడిన ఈ స్థానము సహజముగానే సమస్యలకు కారణమైనది.

ఉదాహరణకు 16వ శాతాబ్దపు విద్వాంసుడు ఎరాస్‌మస్‌ తన గ్రీకు “న్యూటెస్ట్‌మెంట్‌,”ను తర్జుమా చేసినప్పుడు 1 యోహాను 5వ అధ్యాయము 7 మరియు 8 వచనములలోని కల్పితపు మాటలను తీసివేయడానికి వాటికన్‌ కోడెక్స్‌ తనకు ఆధారమని తెలిపెను. ఎరాస్‌మస్‌ వాస్తవమును తెల్పినను, 1897 వరకు పోప్‌ లియో XIII లాటిన్‌ వల్గేట్‌ లోని ఈ కలుషిత వాక్యమును సమర్థించెను. చివరకు ఆధునిక రోమన్‌ కేథలిక్‌ తర్జుమాలు ప్రచురించబడటంతో వాక్యములోని ఈ తప్పిదము అంగీకరించబడినది.

ఎప్పుడైతే 19వ శతాబ్దపు తరువాయి భాగములో సైనాయ్‌టికస్‌ కోడెక్స్‌ ప్రపంచమునకు బయలుపరచబడిందో రోమన్‌కేథలిక్‌ అధికారులకు తమ వాటికనస్‌ కోడెక్స్‌ మరుగునపడిపోయే ప్రమాదములో ఉందని స్పష్టంగా అర్థమయినది. ఆ శతాబ్దపు అంతములోగా చివరకు మంచి పోటోగ్రాఫిక్‌ కాపీలను లభ్యమగునట్లు చేసిరి.

ఈ వ్రాతప్రతియందు 759 పత్రములు కలవు. అందు ఆదికాండము, కీర్తనలలోని కొన్ని భాగములు, మరియు క్రైస్తవ గ్రీకులేఖనములలోని ముగింపు భాగములు పోయినవి. అది ఎంతో శ్రేష్టమైన మరియు పలుచని పార్చమెంటు మీద అనగా జింకచర్మముపైన, సాధారణ మరియు సొగసైన పద్ధతితో వ్రాయబడినట్లు తలంచబడుచున్నది. దాని అధికారిక గుర్తు ఏమనగా కోడెక్స్‌ B, దానిని ఈనాడు మనము వాటికన్‌ లైబ్రరీలో చూడగలము. ఇప్పుడు ఏ మాత్రము అది దాచిపెట్టబడినదై యుండలేదు. చివరకు దానివిలువ గుర్తించబడి ప్రపంచవ్యాప్తముగా మెచ్చుకొనబడుచున్నది. (w89 5⁄1)

[29వ పేజీలోని చిత్రం]

ప్రాముఖ్యమైన కోడెక్స్‌ వాటికనస్‌ 1209 వాటికన్‌ వలన కొన్ని శతాబ్దములుగా దాచిపెట్టబడినది

[క్రెడిట్‌ లైను]

Facsimile from Codices E Vaticanis Selecti

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి