కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 2/15 పేజీలు 30-31
  • ప్రేమ యొక్క ఉత్కృష్టమైన విధానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేమ యొక్క ఉత్కృష్టమైన విధానం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవిక ప్రేమ ప్రవర్తించే విధానం
  • “వీటన్నిటిలో గొప్పది ప్రేమ”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ప్రేమ (అగాపె)—ఏమి కాదు, ఏమైయుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ప్రేమతో బలపర్చబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 2/15 పేజీలు 30-31

ప్రేమ యొక్క ఉత్కృష్టమైన విధానం

(This article has been taken from Insight book - Love)

దేవుడు ప్రేమయై ఉన్నట్లు, ప్రేమ ఎంత అద్భుతమైనదంటే దాన్ని నిర్వచించడం కష్టం. అదెలా ప్రవర్తిస్తుందో చెప్పడం సులభం. ఈ విషయాన్ని గురించి వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు, క్రైస్తవ విశ్వాసికి అదెంత అత్యావశ్యకమైనదో మొదట నొక్కి తెలియజేస్తూ తర్వాత అదెలా నిస్వార్థంగా ప్రవర్తిస్తుందో ఇలా వివరిస్తున్నాడు: “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.”—1 కొరింథీయులు 13:4-7.

దైవిక ప్రేమ ప్రవర్తించే విధానం

“ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును.” అది అననుకూలమైన పరిస్థితులను, ఇతరుల తప్పుడు చర్యలను సహిస్తుంది. ఎందుకంటే తప్పు చేస్తున్నవారు లేక ఆ పరిస్థితుల్లో ఇమిడివున్నవారు చివరికి రక్షణ పొందాలన్నదే దాని సంకల్పం. అలాగే దేవుని నామానికి గౌరవాన్ని ఘనతను తీసుకురావాలన్నది కూడా దాని తుది సంకల్పం. (2 పేతురు 3:15) ఎలా రెచ్చగొట్టినప్పటికీ ప్రేమ దయను చూపిస్తుంది. ఒక క్రైస్తవుడు ఇతరుల ఎడల కఠినంగా లేక కర్కశంగా ఉండడం ఏ మంచినీ సాధించదు. అయితే, ప్రేమ స్థిరంగా ఉండి, నీతి నిమిత్తం న్యాయంగా ప్రవర్తించగలదు. అధికారంవున్నవారు తప్పిదస్థులను శిక్షించవచ్చు, అయినప్పటికీ వారు అలా చేస్తున్నప్పుడు దయ చూపించాలి. నిర్దయ అనేది దయలేని ఉపదేశకునికి అలాగే తప్పిదస్థునికి ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చదు, అంతేకాక అది ఆ వ్యక్తిని పశ్చాత్తాపం నుండి మరియు మంచి క్రియల నుండి మరింత దూరం చేస్తుంది.—రోమీయులు 2:4.

“ప్రేమ మత్సరపడదు.” ఇతరులకు లభించే మంచి విషయాలనుబట్టి అది అసూయపడదు. తోటి వ్యక్తి అధిక బాధ్యతతో కూడిన ఒక స్థానాన్ని పొందడం చూసినప్పుడు అది ఆనందిస్తుంది. చివరికి ఒకరి శత్రువులు మంచి విషయాలను పొందినప్పుడు కూడా అది అసంతృప్తి చెందదు.

ప్రేమ “డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు.” అది సృష్టి ప్రాణుల స్తుతిని, మెప్పుదలను కోరదు. (యూదా 15) ప్రేమగల వ్యక్తి తాను గొప్పగా కనిపించేలా చేసుకోవడానికి మరో వ్యక్తిని క్రిందికి పడద్రోయడు. బదులుగా, ఆయన దేవున్ని ఉన్నతపర్చి, ఇతరులను యథార్థంగా ప్రోత్సహించి పురికొల్పుతాడు. (కొలొస్సయులు 1:3-5) మరో క్రైస్తవుడు అభివృద్ధి చెందడాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. తాను చేయబోతున్నదాని గురించి ఆయన ప్రగల్భాలు పలకడు. (సామెతలు 27:1) తాను చేస్తున్నవన్నీ యెహోవా నుండి వస్తున్న బలం ద్వారానేనని ఆయన గుర్తిస్తాడు.—కీర్తన 34:2.

ప్రేమ “అమర్యాదగా నడువదు.” అది సభ్యతలేనిది కాదు. అది లైంగిక దుర్నీతి లేక విపరీత ప్రవర్తన వంటి అమర్యాదకరమైన ప్రవర్తన కలిగివుండదు. అది ఎవరితోనూ క్రూరంగా, నీచంగా, అగౌరవంగా, అవమానపర్చే విధంగా, అసభ్యంగా, లేక అమర్యాదగా ఉండదు. ప్రేమగల వ్యక్తి తన క్రైస్తవ సహోదరులకు చిరాకు కలిగించేలా కనిపించే వాటిని లేక వాస్తవంగా అలాంటి చర్యలను నివారిస్తాడు. క్రైస్తవ విశ్వాసులు కాని ఇతరుల దృష్టిలో గౌరవపూర్వకంగా నడుచుకోవడానికి కూడా అది ఒకరిని పురికొల్పుతుంది.—రోమీయులు 13:13.

ప్రేమ “స్వప్రయోజనమును విచారించుకొనదు.” “ఎవడును తనకొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలుచేయ చూచుకొనవలెను” అనే సూత్రాన్ని అది అనుసరిస్తుంది. (1 కొరింథీయులు 10:24) ఇతరుల నిత్య క్షేమం ఎడల శ్రద్ధ ఈ సందర్భంలోనే, వెలుగులోకి వస్తుంది. ఇతరుల ఎడల ఇలా యథార్థంగా శ్రద్ధ కలిగివుండడం ప్రేమలో పురికొల్పునిచ్చే బలమైన శక్తులలో ఒకటి, అలాగే అత్యంత ప్రభావవంతమైన మరియు ప్రయోజనకరమైన ఫలితాల్లో అది ఒకటి. ప్రేమగల వ్యక్తి ప్రతిదీ తన పంథాలోనే జరగాలని పట్టుబట్టడు. ప్రేమ తన “హక్కులను” కోరదు; అది ఇతరుల ఆత్మీయ క్షేమం ఎడల ఎక్కువ శ్రద్ధ కలిగివుంటుంది.—రోమీయులు 14:13, 15.

ప్రేమ “త్వరగా కోపపడదు.” అది ఆగ్రహించడానికి సందర్భం కొరకు లేక సాకు కొరకు చూడదు. అది శరీరకార్యమైన క్రోధము కలిగివుండదు. (గలతీయులు 5:19, 20) ప్రేమగల వ్యక్తి ఇతరులు చెప్పేదాన్నిబట్టి లేక చేసేదాన్నిబట్టి సులువుగా అభ్యంతరపడడు.

ప్రేమ “అపకారమును మనస్సులో ఉంచుకొనదు.” అది తాను గాయపడినట్లు భావించదు, ఆ విషయాన్ని గురించి లెక్క ఒప్పజెప్పేందుకు లేక లెక్క చెల్లించేందుకు సరైన సమయం వచ్చేంత వరకు వేచి చూస్తూ ఆ సమయంలో, గాయపర్చిన వ్యక్తికి గాయపడిన వ్యక్తికి మధ్య ఎలాంటి సంబంధాలను కూడా అనుమతించకుండా ఉంటూ ఆ గాయాన్ని గురించి లెక్కలో ఉంచుకోవాలన్నట్లు ఉండదు. అది బైబిలునందు ఖండించబడిన ప్రతీకార దృక్పథము. (రోమీయులు 12:19) ప్రేమ మరొకరికి చెడు ఉద్దేశాలను అంటగట్టదు కాని ఇతరులను శంకించకుండా, సర్దుబాట్లు చేసుకొనే కోరిక కలిగివుంటుంది.—రోమీయులు 14:1, 5.

ప్రేమ “దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.” మునుపు కలిగివున్న నమ్మకాలను లేక చేయబడిన వ్యాఖ్యానాలను సత్యము తారుమారు చేసినప్పటికీ, ప్రేమ సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది. అది దేవునివాక్య సత్యాన్ని హత్తుకొని ఉంటుంది. బాధితుడు ఎవరైనప్పటికీ, చివరికి బాధితుడు ఒక శత్రువైనప్పటికీ అది తప్పు, అబద్ధాలు, లేక ఏ విధమైన అన్యాయం వంటివాటిలో ఆనందాన్ని పొందకుండా, ఎల్లప్పుడూ సరైనదాని పక్షం వహిస్తుంది. అయితే, ఏదైనా ఒక విషయం తప్పైతే లేక తప్పుదోవ పట్టించేదైతే, సత్యం కొరకు మరియు ఇతరుల కొరకు మాట్లాడేందుకు ప్రేమ భయపడదు. (గలతీయులు 2:11-14) ఒక విషయాన్ని చక్కబరిచేందుకు మరో తప్పు చేసే బదులు తప్పును సహించడానికి కూడా అది ఇష్టపడుతుంది.—రోమీయులు 12:17, 20.

ప్రేమ “అన్నిటికి తాళుకొనును.” అది సహించడానికి, నీతి కొరకు శ్రమ అనుభవించడానికి ఇష్టపడుతుంది. ప్రేమగల వ్యక్తి తన ఎడల తప్పు చేసిన వ్యక్తి గురించి ఇతరులకు తెలియజేయడానికి ఆత్రపడడు. తప్పిదం మరీ గంభీరమైనది కాకపోతే, ఆయన దాన్ని చూసీచూడనట్లు విడిచిపెడతాడు. లేకపోతే, మత్తయి 18:15-17 నందు యేసు సిఫారసు చేసిన విధానం అన్వయించుకొనే వీలుంటే, ఆయన దాన్ని అనుసరిస్తాడు.

ప్రేమ “అన్నిటిని నమ్మును.” దేవుడు తన వాక్య సత్యమందు చెప్పిన విషయాలు పైకి కనిపించే వాటికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, విశ్వసించని లోకం అపహాస్యం చేసినప్పటికీ ప్రేమ వాటియందు విశ్వాసముంచుతుంది. మనమొక నిజమైన, నమ్మకమైన స్నేహితుని గురించి తెలిసివుండి, ఆయనను ప్రేమిస్తూ బహుశా సాక్ష్యాధారం లేనిదేదైనా ఆయన మనకు చెప్పినప్పుడు మనమెలా సందేహించమో అలాగే, ఈ ప్రేమ ప్రాముఖ్యంగా దేవుని ఎడలగల ప్రేమ, ఆయన విశ్వాస్యత మరియు విశ్వసనీయతల వృత్తాంతంపై ఆధారపడిన సత్యసంధతను గుర్తించేదై ఉంటుంది. (యెహోషువ 23:14) ప్రేమ తమ నమ్మకమైన క్రైస్తవ సహోదరులయందు విశ్వాసాన్ని ఉత్పన్నం చేస్తుంది; వారు తప్పు చేశారని కచ్చితమైన నిదర్శనముంటే తప్ప ఒక క్రైస్తవుడు వారిని అనుమానించడు లేక వారిని నమ్మకుండా ఉండడు.—గలతీయులు 5:10; ఫిలేమోను 21.

ప్రేమ “అన్నిటిని నిరీక్షించును.” యెహోవా వాగ్దానం చేసిన అన్నిటిలో దానికి నిరీక్షణ ఉంటుంది. (రోమీయులు 12:12) అది యెహోవా సఫలం చేయాలని, విషయాలు అభివృద్ధి చెందేలా చేయాలని ఓర్పుతో ఎదురు చూస్తూ, పనిచేయడంలో కొనసాగుతుంది. (1 కొరింథీయులు 3:7) ప్రేమగల వ్యక్తి తన క్రైస్తవ సహోదరులు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, కొందరు విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పటికీ వారికి మంచి జరగాలని ఎదురు చూస్తాడు. యెహోవా అలాంటి బలహీనమైన వారి ఎడల సహనం కలిగివుంటే, తాను తప్పకుండా అదే దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన గుర్తిస్తాడు.—2 పేతురు 3:15.

ప్రేమ “అన్నిటినీ ఓర్చును.” యెహోవా దేవుని ఎడల తన యథార్థతను కాపాడుకోవడానికి క్రైస్తవునికి ప్రేమ అవసరం. క్రైస్తవునికి దేవుని ఎడల గల భక్తి విశ్వాస్యతల శ్రేష్ఠతను పరీక్షించడానికి అపవాది ఏమి చేసినప్పటికీ, ఆ క్రైస్తవుడు దేవుని ఎడల యథార్థంగా ఉండే విధంగా ప్రేమ సహిస్తుంది.—రోమీయులు 5:3-5.

“ప్రేమ శాశ్వతకాలముండును.” అది ఎన్నడూ ముగింపుకు రాదు లేక ఉనికిలో ఉండకుండా పోదు. మనమొకప్పుడు విశ్వసించిన వాటిని క్రొత్త జ్ఞానం మరియు అవగాహన సరిదిద్ద వచ్చు; నిరీక్షింపబడిన విషయాలు వాస్తవమైనప్పుడు నిరీక్షణ మారుతుంది, క్రొత్త విషయాల కొరకు నిరీక్షించడం జరుగుతుంది, కాని ప్రేమ ఎల్లప్పుడూ దాని సంపూర్ణతలో ఉంటుంది, అంతకంతకూ బలంగా నిర్మింపబడడంలో కొనసాగుతుంది. నిజంగా, దైవిక ప్రేమ మనం మన వ్యక్తిగత జీవితాల్లో అలవర్చుకోవడానికి ప్రయాసపడవలసినంత ఉత్కృష్ఠమైన లక్షణమని ఇవన్నీ సిఫారసు చేస్తాయి.—1 కొరింథీయులు 13:8-13.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి