కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lmd పాఠం 2
  • సహజంగా మాట్లాడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహజంగా మాట్లాడండి
  • ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఫిలిప్పు ఏం చేశాడు?
  • ఫిలిప్పు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
  • ఫిలిప్పులా ఉందాం
  • ఫిలిప్పు—ఉత్సాహవంతుడైన సువార్తికుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—రోజువారీ పనుల్లో కలిసేవాళ్లకు ఎలా సాక్ష్యమివ్వవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2014
  • శ్రద్ధ చూపించండి
    ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • “యేసు గురించిన మంచివార్త” ప్రకటించడం
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
మరిన్ని
ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
lmd పాఠం 2

మొదటిసారి మాట్లాడేటప్పుడు

సువార్తికుడైన ఫిలిప్పు, రథంపై కూర్చుని గ్రంథపు చుట్ట చదువుతున్న ఇతియోపీయునితో మాట్లాడుతున్నాడు.

అపొ. 8:30, 31

పాఠం 2

సహజంగా మాట్లాడండి

సూత్రం: “సరైన సమయంలో మాట్లాడిన మాట ఎంత మంచిది!”—సామె. 15:23.

ఫిలిప్పు ఏం చేశాడు?

సువార్తికుడైన ఫిలిప్పు, రథంపై కూర్చుని గ్రంథపు చుట్ట చదువుతున్న ఇతియోపీయునితో మాట్లాడుతున్నాడు.

వీడియో: ఫిలిప్పు ఇతియోపీయుడైన అధికారికి ప్రకటించాడు

1. వీడియో చూడండి, లేదా అపొస్తలుల కార్యాలు 8:30, 31 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1. ఎ. ఫిలిప్పు తన మాటల్ని ఎలా మొదలుపెట్టాడు?

  2. బి. ఆ అధికారితో మాటలు కలిపి, కొత్త విషయాల్ని పరిచయం చేయడానికి ఫిలిప్పు ఉపయోగించిన పద్ధతి సహజమైందని ఎందుకు చెప్పవచ్చు?

ఫిలిప్పు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మనం చక్కగా మాటలు కలిపి, సహజంగా సంభాషణను ముందుకు తీసుకెళ్తే, ఎదుటి వ్యక్తి కంగారుపడకుండా మనతో మాట్లాడవచ్చు, మనం చెప్పేది వినడానికి ఇష్టపడవచ్చు.

ఫిలిప్పులా ఉందాం

3. బాగా గమనించండి. ఒక వ్యక్తి ముఖకవళికలు, నిలబడే-కూర్చునే తీరు నుండి వాళ్ల గురించి చాలానే తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నట్లు మీకు అనిపిస్తుందా? అలా అయితే “మీరు ఎప్పుడైనా ఇది విన్నారా?” అనే ఒక చిన్న ప్రశ్నతో ఒక బైబిలు సత్యాన్ని పరిచయం చేయండి. ఒకవేళ ఆ వ్యక్తి మనతో మాట్లాడడానికి ఇష్టపడకపోతే మాట్లాడమని బలవంతపెట్టకండి.

4. ఓర్పుగా ఉండండి. కలిసిన వెంటనే ఏదైనా ఒక బైబిలు సత్యాన్ని చెప్పాల్సిందే అని అనుకోకండి. సహజంగా, మాటల మధ్యలో దాన్ని చెప్పేలా సరైన అవకాశం కోసం చూడండి. కొన్నిసార్లు దానికోసం ఆ వ్యక్తిని మళ్లీ కలిసేంతవరకు మీరు ఓపిగ్గా ఎదురుచూడాల్సి రావచ్చు.

5. పరిస్థితికి తగ్గట్టు మాట్లాడండి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి మీరు అనుకున్నది కాకుండా, వేరే విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టవచ్చు. అలాంటప్పుడు మీరు అనుకున్న బైబిలు సత్యాన్ని చెప్పకుండా ఆ వ్యక్తికి తగ్గట్టు, వాళ్లకు ఉపయోగపడే విషయాల గురించే మాట్లాడండి.

ఇవి కూడా చూడండి

ప్రసం. 3:1, 7; 1 కొరిం. 9:22; 2 కొరిం. 2:17; కొలొ. 4:6

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి