కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lmd పాఠం 1
  • శ్రద్ధ చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శ్రద్ధ చూపించండి
  • ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు ఏం చేశాడు?
  • యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
  • యేసులా ఉందాం
  • సహజంగా మాట్లాడండి
    ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సాక్ష్యం ఇచ్చే అవకాశం వచ్చేలా మాట్లాడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • సంభాషణా సామర్థ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు?
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—రోజువారీ పనుల్లో కలిసేవాళ్లకు ఎలా సాక్ష్యమివ్వవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2014
మరిన్ని
ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
lmd పాఠం 1

మొదటిసారి మాట్లాడేటప్పుడు

యేసు బావి దగ్గర ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు.

యోహా. 4:6-9

పాఠం 1

శ్రద్ధ చూపించండి

సూత్రం: “ప్రేమ . . . సొంత ప్రయోజనం మాత్రమే చూసుకోదు.”—1 కొరిం. 13:4, 5.

యేసు ఏం చేశాడు?

యేసు బావి దగ్గర ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు.

వీడియో: బావి దగ్గర యేసు, సమరయ స్త్రీ

1. వీడియో చూడండి, లేదా యోహాను 4:6-9 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1. ఎ. సమరయ స్త్రీతో మాట్లాడడం మొదలుపెట్టే ముందు యేసు ఏమేం గమనించాడు?

  2. బి. “తాగడానికి నాకు కొన్ని నీళ్లు ఇవ్వు” అని యేసు అడిగాడు. మాటలు మొదలుపెట్టడానికి ఇది ఒక మంచి పద్ధతి అని ఎందుకు చెప్పవచ్చు?

యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మొదటిసారి మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి ఆసక్తి ఉన్న విషయాన్ని ఎంచుకుంటే ఆయన మనతో చక్కగా మాట్లాడవచ్చు.

యేసులా ఉందాం

3. పరిస్థితికి తగ్గట్టు మాట్లాడండి. మీరు సిద్ధపడిన విషయాల గురించే మాట్లాడాలని అనుకోకుండా, ప్రస్తుతం ఇతరులు వేటిగురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో వాటితోనే మాటలు మొదలుపెట్టండి. ఇలా ప్రశ్నించుకోండి:

  1. ఎ. ‘ఈ మధ్య వార్తల్లో దేని గురించి ఎక్కువగా చెప్తున్నారు?’

  2. బి. ‘నా చుట్టూ ఉన్నవాళ్లు, తోటి ఉద్యోగులు లేదా తోటి విద్యార్థులు వేటి గురించి మాట్లాడుకుంటున్నారు?’

4. బాగా గమనించండి. ఇలా ప్రశ్నించుకోండి:

  1. ఎ. ‘ఈ వ్యక్తి ఏ పనిలో ఉన్నాడు? బహుశా ఆయన దేని గురించి ఆలోచిస్తుండవచ్చు?’

  2. బి. ‘ఈ వ్యక్తి వేసుకున్న బట్టలు, కనపడే తీరు, ఇల్లు ఆయన నమ్మకాల గురించి లేదా ఆయన పెరిగిన విధానం గురించి ఏం చెప్తున్నాయి?’

  3. సి. ‘ఆయనతో మాట్లాడడానికి ఇది సరైన సమయమేనా?’

5. వినండి.

  1. ఎ. మీరే ఎక్కువగా మాట్లాడకండి.

  2. బి. ఎదుటి వ్యక్తి తన మనసులో ఉన్నది చెప్పేలా ప్రోత్సహించండి. అవసరమైతే ప్రశ్నలు వేయండి.

ఇవి కూడా చూడండి

మత్త. 7:12; 1 కొరిం. 9:20-23; ఫిలి. 2:4; యాకో. 1:19

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి