పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—రోజువారీ పనుల్లో కలిసేవాళ్లకు ఎలా సాక్ష్యమివ్వవచ్చు?
ఎందుకు ప్రాముఖ్యం? మనం ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు, చాలామంది ఇళ్లల్లో లేకపోవడం చూస్తుంటాం. ప్రయాణిస్తున్నప్పుడో, హాస్పిటల్లో వేచివున్నప్పుడో, స్కూల్ లేదా పని స్థలంలో విరామం తీసుకుంటున్నప్పుడో వాళ్లను మనం కలిసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికీ రాజ్య సందేశం అందాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 తిమో. 2:3, 4) సువార్త చెప్పాలంటే, సాధారణంగా మనమే చొరవ తీసుకొని మాట్లాడాలి.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
సువార్త పంచుకోవాలనే ఉద్దేశంతో, రోజువారీ పనుల్లో కలిసేవాళ్లలో వారానికి కనీసం ఒకరితోనైనా మాట్లాడడానికి ప్రయత్నించండి.