కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g25 No. 1 పేజీలు 6-9
  • డబ్బును తెలివిగా ఖర్చు పెట్టండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డబ్బును తెలివిగా ఖర్చు పెట్టండి
  • తేజరిల్లు!—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకు తెలివిగా ఖర్చు పెట్టాలి?
  • మీరేం చేయవచ్చు?
  • ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?
    అదనపు అంశాలు
  • 2 | పొదుపుగా జీవించండి
    తేజరిల్లు!—2022
  • ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • ఉన్నంతలోనే ఎలా జీవించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
తేజరిల్లు!—2025
g25 No. 1 పేజీలు 6-9
చిత్రాలు: 1. అమ్మానాన్నలు టేబుల్‌ మీద కూర్చుని ఖర్చుల గురించి లెక్కలు వేసుకుంటుంటే, వాళ్ల కూతురు వెనకాల వంటగదిలో ఉంది. 2. కొన్ని బిల్స్‌ మీద పెట్టిన ఫోన్లో కాలిక్యులేటర్‌ యాప్‌ తెరిచి ఉంది.

ధరలు పెరిగిపోతుంటే బ్రతికేదెలా?

డబ్బును తెలివిగా ఖర్చు పెట్టండి

రేట్లకు రెక్కలు వచ్చి ఎగిరిపోతుంటే వాటిని అందుకోవడం మనందరికి కష్టంగానే ఉంటుంది. అలాగని మనం డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. కొన్ని పనులు చేస్తే ఉన్నదాంట్లోనే చక్కగా సర్దుకుపోవచ్చు.

ఎందుకు తెలివిగా ఖర్చు పెట్టాలి?

ఒకవైపేమో రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టకపోతే చివరికి మీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు మీ ఆందోళనలు, టెన్షన్‌లు ఇంకా ఎక్కువౌతాయి. మీ ఆదాయం తక్కువే అయినా, డబ్బును పొదుపుగా వాడుకోవడానికి కొన్ని పనులు చేయవచ్చు.

మీరేం చేయవచ్చు?

ఉన్నదాంట్లో సర్దుకుపోండి. మీ ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు చేస్తూ, కాస్త పొదుపు చేయడం నేర్చుకుంటే అనవసరమైన తలనొప్పుల్ని తప్పించుకోవచ్చు. ఇలా జీవించడం అలవాటు చేసుకుంటే, ఉన్నట్టుండి పెద్ద ఖర్చులు మీదపడినా మీరు ధైర్యంగా ఉంటారు.

ఉన్నదాంట్లో సర్దుకొని జీవించాలంటే, ముందుగా బడ్జెట్‌ వేసుకోవాలి. అంటే మీకు ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది అని లెక్కలు వేసుకోవాలి. అలా వేసుకునేటప్పుడు, నిజంగా మీ అవసరాలు ఏంటో ఆలోచించుకోండి. రేట్లు గానీ, మీ ఆదాయం గానీ కాస్త అటు-ఇటు అయినా కొన్ని మార్పులు చేసుకుంటూ మీ ప్లాన్‌ ప్రకారమే ఖర్చు చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు పెళ్లయి ఉంటే, మీ ఇద్దరూ కలిసి బడ్జెట్‌ వేసుకోండి.

ఇలా చేసి చూడండి: క్రెడిట్‌ కార్డుతో లేదా ఈయమ్‌ఐ (EMI) పద్ధతిలో వస్తువుల్ని కొనే బదులు మీ దగ్గరున్న డబ్బులతో కొనడానికి చూడండి. అలా చేయడం వల్ల కొంతమందికి తాము డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నామని, అనవసరంగా అప్పులు చేయకుండా ఉంటున్నామని అనిపించింది. టైం తీసుకుని మీ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లని, బ్యాలెన్స్‌ని ఎప్పటికప్పుడు చూసుకోండి. అప్పుడు మీ దగ్గర ఎంత ఉందో, దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుస్తుంది. దానివల్ల డబ్బును పొదుపుగా వాడతారు, ప్రశాంతంగా ఉంటారు.

మీ ఆదాయంలోనే ఖర్చులన్నీ సరిపెట్టుకోవడం కాస్త కష్టమే. కానీ బాగా ఆలోచించి, మంచిగా ప్లాన్‌ చేసుకుంటే ఉన్నదాంట్లోనే సర్దుకుపోవచ్చు. ప్రతీసారి డబ్బుల గురించి దిగులుపడాల్సిన అవసరం ఉండదు.

‘కూర్చొని లెక్కలు వేసుకోండి.’—లూకా 14:28.


ఉద్యోగాన్ని నిలబెట్టుకోండి. దానికోసం మీరు ఈ పనులు చేయవచ్చు: ఉద్యోగానికి సమయానికి వెళ్లండి. ఇష్టంగా పని చేయండి. ఇతరులకు సహాయం చేయడానికి ముందుండండి, కష్టపడి పని చేయండి. మర్యాదగా ఉండండి. రూల్స్‌ పాటించండి, మీ నైపుణ్యాల్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి.


డబ్బును దుబారా చేయకండి. ఇలా ప్రశ్నించుకోండి: నేను ఖరీదైన వాటికోసం, చెడు అలవాట్ల కోసం డబ్బును దుబారా చేస్తున్నానా? కొంతమందికి డ్రగ్స్‌, పేకాట, సిగరెట్‌ లాంటి అలవాట్లు ఉంటాయి. ఇంకొంతమందికి పీకలదాకా మందు తాగే అలవాటు ఉంటుంది. వీటికోసం వాళ్లు రెక్కలు-ముక్కలు చేసుకొని కష్టపడిన డబ్బునంతా మంచి నీళ్లలా ఖర్చు పెట్టేస్తారు. ఇలాంటి అలవాట్ల వల్ల వాళ్ల ఆరోగ్యమే కాదు ఉద్యోగం కూడా చేజారిపోతుంది.

“తెలివిని కనుగొన్నవాళ్లు . . . సంతోషంగా ఉంటారు; వెండిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించడం మేలు.”—సామెతలు 3:13, 14.


అనుకోని పరిస్థితుల కోసం పొదుపు చేయండి. అనుకోని పరిస్థితులు చెప్పి రావు, ఉన్నపళంగా మీదకొచ్చి పడతాయి. కాబట్టి దానికోసం వీలైనప్పుడల్లా కొంత డబ్బును దాచి పెట్టండి. మీరు గానీ మీ ఇంట్లోవాళ్లు గానీ హాస్పిటల్‌ పాలైనా, మీ ఉద్యోగం పోయినా లేదా ఇలాంటి ఇంకే పరిస్థితి వచ్చినా ఆ డబ్బులు పనికొస్తాయి.

‘అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు అందరికీ ఎదురౌతాయి.’—ప్రసంగి 9:11.

డబ్బును ఆదా చేసే చిట్కాలు

ఒక జాడీ నిండా చిల్లర ఉంది.

ఎక్కువగా ఇంట్లోనే వండుకొని తినండి.

చీటికిమాటికి హోటల్స్‌కి వెళ్లడం, బయట నుండి భోజనం తెచ్చుకోవడం, డ్రింక్స్‌ కొనుక్కోవడం లాంటివి చేస్తే చాలా ఖర్చు అవుతుంది. నిజమే ఇంట్లో వండుకొని తినాలంటే కాస్త టైమ్‌ పెట్టాలి, కష్టపడాలి. కానీ దానివల్ల మీరు చాలా డబ్బులు ఆదా చేయవచ్చు, మంచి ఆహారాన్ని తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

తెలివిగా షాపింగ్‌ చేయండి.

  • ఏమేం సరుకులు కావాలో ముందే ఆలోచించుకుని ఒక లిస్టు తయారు చేసుకోండి. అందులో ఉన్నవాటినే కొనండి. మీకు అవసరం ఉన్నా లేకున్నా, నచ్చింది కదా అని కొనేయకండి.

  • కొన్నిసార్లు, సరుకుల్ని ఎక్కువ మోతాదులో కొంటే తక్కువ రేటుకే వస్తాయి. మీ బడ్జెట్‌ అనుకూలిస్తే, అలాంటి అవకాశాల్ని ఉపయోగించుకోండి. అయితే, అలా కొంటున్నప్పుడు త్వరగా పాడైపోయే సరుకుల్ని ఎక్కువ కాలం వచ్చేలా నిల్వచేసుకోండి.

  • నాణ్యత బాగుంటే తక్కువ ధరకు వచ్చే వస్తువుల్ని కొనండి.

  • కొన్నిసార్లు షాపుల్లో కన్నా ఆన్‌లైన్‌లో తక్కువ ధరలు ఉంటాయి. అలాంటప్పుడు, మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయండి. ఆన్‌లైన్‌లో అయితే మీరు ఏమేం కొన్నారో, ఎంత ఖర్చుపెట్టారో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు.

  • ఆఫర్లు ఉన్నప్పుడు కొనుక్కోండి. వీలైనప్పుడల్లా కూపన్స్‌ వాడడానికి చూడండి. రెండు మూడు చోట్ల రేట్లు పోల్చి చూసుకుని, ఎక్కడ తక్కువ ధరకు వస్తుందో తెలుసుకోండి. అలాగే వస్తువులు కొనేటప్పుడు మెయింటెనెన్స్‌ ఖర్చులు ఎక్కువగా ఉండనివి, తక్కువ కరెంటు తీసుకునేవి కొనడానికి ప్రయత్నించండి.

వస్తువును మార్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

ఫోన్లు లేదా ఇతర వస్తువులు తయారుచేసే కంపెనీలు వాళ్ల లాభం కోసం ఎప్పటికప్పుడు కొత్తవాటిని మార్కెట్లోకి తెస్తారు. ఇలా ప్రశ్నించుకోండి: ‘కొత్త మోడల్‌ కొనుక్కోవడం నాకు నిజంగా అవసరమా? నా దగ్గర ఉన్న వస్తువును ఇప్పుడే మార్చాలా? ఒకవేళ మార్చాలి అనుకుంటే, మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడలే కావాలా?’

రిపేరు చేసుకోండి, సెకండ్‌ హ్యాండ్‌లో కొనుక్కోండి.

వస్తువులు ఎక్కువ కాలం రావాలంటే అవి మంచిగా మెయింటెయిన్‌ చేస్తూ వాడాలి. ఒకవేళ పాడైతే రిపేరు చేసుకుని వాడుకోవడానికి చూడండి. అలాగే సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల్ని కొనవచ్చేమో చూడండి.

కూరగాయ మొక్కల్ని పెంచండి.

కుదిరితే మీ కూరగాయల్ని మీరే పండించుకోవడానికి చూడండి. అలాచేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు. మీరు పెంచే వాటిలో కొన్నిటిని అమ్మవచ్చు లేదా వేరేవాళ్లకు ఇవ్వవచ్చు.

“శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి.”—సామెతలు 21:5.

క్రెడిట్‌ కార్డులు.

“మేము నిత్యావసరాల ధరల్ని ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉంటాం. అలాగే క్రెడిట్‌ కార్డు వాడుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాం.”—మైల్స్‌, ఇంగ్లాండ్‌.

చిన్న నోటు పుస్తకం, పెన్ను, కారు తాళాలు.

“సరుకులు కొనుక్కోవడానికి వెళ్లే ముందు నేను, మా ఇంట్లోవాళ్లు అందరం కూర్చొని, ఒకమాట అనుకొని లిస్ట్‌ తయారు చేసుకుంటాం.”—జెరిమీ, అమెరికా.

ఒక డైరీ, ఒక కాలిక్యులేటర్‌.

“మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు మా కుటుంబంతో కలిసి ఎప్పటికప్పుడు బడ్జెట్‌ వేసుకుంటాం. అనుకోని పరిస్థితుల్లో ఖర్చు చేయడానికి కాస్త డబ్బుల్ని పక్కన పెడుతుంటాం.”—యాయేల్‌, ఇజ్రాయిల్‌.

ఒక రెంచి, స్ర్కూ డ్రైవర్‌.

“ఏవైనా వస్తువులు పాడైపోతే, వెంటనే కొత్తవి కొనేసే బదులు వాటిని రిపేరు చేసుకోవడం మా పిల్లలకు నేర్పించాం. అది కార్‌ అయినా ఇంట్లో ఉన్న ఇంకే వస్తువైనా అలాగే చేస్తాం. మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్త మోడల్‌ని కొనకుండా నేను, నా భార్య జాగ్రత్తపడతాం.”—జెఫ్రీ, అమెరికా.

“నా కూరగాయల్ని నేనే పండించుకోవడం వల్ల, కోళ్లు పెంచడం వల్ల ఖర్చు తగ్గించుకోగలుగుతున్నాను. అలాగే నేను పండించిన కూరగాయల్ని వేరేవాళ్లకు ఇవ్వగలుగుతున్నాను.”—హోనో, మయన్మార్‌.

ఒకామె తన తోటలో పండించిన రకరకాల కూరగాయల్ని కోస్తుంది.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి