కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • hf భాగం 4 పేజీలు 12-14
  • డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి?
  • ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 1 జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి
  • 2 దాపరికంలేకుండా, ఉన్నదున్నట్టుగా మాట్లాడుకోండి
  • డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • జీవితంలో డబ్బుకున్న స్థానం ఏంటి?
    తేజరిల్లు!—2015
  • డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • డబ్బు విషయంలో జ్ఞానయుక్తమైన దృక్పథమేమిటి?
    తేజరిల్లు!—2007
మరిన్ని
ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
hf భాగం 4 పేజీలు 12-14
డబ్బును ఎలా ఖర్చుపెట్టాలో జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటున్న దంపతులు

4వ భాగం

డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి?

‘ఉద్దేశాలు ఆలోచనతో [“సంప్రదింపులతో,” NW] స్థిరపడతాయి.’—సామెతలు 20:18

కుటుంబ అవసరాలు తీర్చాలంటే మనందరికీ డబ్బు అవసరం. (సామెతలు 30:8) అవును, “డబ్బు ఉన్నవారికి అది అండగా ఉంటుంది.” (ప్రసంగి 7:12, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) దంపతులైన మీకు డబ్బు గురించి మాట్లాడుకోవడం కష్టమనిపించవచ్చు. కానీ ఒక్కటి, డబ్బు వల్ల మీ మధ్య సమస్యలు రాకుండా చూసుకోండి. (ఎఫెసీయులు 4:32) భార్యాభర్తలకు డబ్బు వ్యవహారాల్లో ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉండాలి. డబ్బు ఎలా ఖర్చుపెట్టాలో ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాలి.

1 జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” (లూకా 14:28) మీ డబ్బును ఎలా ఉపయోగించాలనుకుంటున్నారో ఇద్దరూ కలిసి ప్రణాళిక వేసుకోవడం ప్రాముఖ్యం. (ఆమోసు 3:3) మీరు ఏమి కొనాలో, దానికోసం ఎంత ఖర్చుపెట్టగలరో నిర్ణయించుకోండి. (సామెతలు 31:16) ఓ వస్తువు కొనడానికి మీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా దాన్ని కొనాలనేమీ లేదు. అప్పు జోలికి వెళ్లకుండా చూసుకోండి, ఉన్న డబ్బునే ఖర్చుపెట్టండి. —సామెతలు 21:5; 22:7.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • నెలాఖరులో డబ్బు మిగిలితే, దాన్ని ఏమి చేయాలో మీరిద్దరు కలిసి నిర్ణయించుకోండి

  • ఒకవేళ డబ్బు తక్కువైతే, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు వెదకండి. ఉదాహరణకు, సరుకుల్ని హోల్‌సేల్‌ షాపుల్లో కొనుక్కోండి

భారీ మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించుకుంటున్న దంపతులు

2 దాపరికంలేకుండా, ఉన్నదున్నట్టుగా మాట్లాడుకోండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . ప్రతీ విషయంలో “ప్రభువు [“యెహోవా,” NW] దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును” నిజాయితీగా శ్రద్ధ తీసుకోండి. (2 కొరింథీయులు 8:21) మీరు ఎంత సంపాదిస్తున్నది, ఎంత ఖర్చుపెడుతున్నది దాచకుండా మీ జీవిత భాగస్వామికి చెప్పండి.

డబ్బుకు సంబంధించి పెద్దపెద్ద నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నా మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. (సామెతలు 13:10) డబ్బు విషయాల గురించి అలా మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. మీ సంపాదన మీ ఒక్కరిదే అన్నట్టు చూడకండి, మీ కుటుంబానిది అన్నట్టు చూడండి.—1 తిమోతి 5:8.

వస్తువులు కొనేముందు, రాసిపెట్టుకున్న లిస్టును చూసుకుంటున్న దంపతులు

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • ఒకరినొకరు సంప్రదించుకోకుండా ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెట్టవచ్చో కలిసి నిర్ణయించుకోండి

  • సమస్య వచ్చిపడేదాకా ఆగే బదులు, ముందునుంచే డబ్బు గురించి మాట్లాడుకోండి

డబ్బును మీరు చూసే తీరు

డబ్బు ముఖ్యమే అయినా, దానివల్ల మీ మధ్య సమస్యలు తలెత్తకుండా లేదా అనవసరమైన ఆందోళనకు గురికాకుండా చూసుకోండి. (మత్తయి 6:25-34) జీవితాన్ని సంతోషంగా గడపడానికి డబ్బుల మూటలు అక్కర్లేదు. బైబిలు ఇలా చెబుతోంది: “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి.” (లూకా 12:15) మీరు డబ్బుతో కొనగల ఏ వస్తువూ మీ వైవాహిక బంధం కన్నా విలువైనది కాదు. మీకున్న దాంతో సరిపెట్టుకోండి, దేవునితో మీకున్న సంబంధాన్ని ఎన్నడూ అశ్రద్ధ చేయకండి. మీరు ఈ సలహాలు పాటిస్తే, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, యెహోవా అనుగ్రహం మీ మీద ఉంటుంది.—హెబ్రీయులు 13:5.

మీరు ఇలా ప్రశ్నించుకోండి:

  • అప్పు జోలికి వెళ్లకుండా ఉండడానికి మేము కుటుంబంగా ఏమి చేయవచ్చు?

  • నేను, నా జీవిత భాగస్వామి కలిసి డబ్బు గురించి చర్చించుకొని ఎంత కాలమైంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి