కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 6/8 పేజీ 20
  • అమెరికా ఆదివాసులు, బైబిలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అమెరికా ఆదివాసులు, బైబిలు
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎవరు నాయకత్వం వహించారు?
  • దేవుని నామము నా జీవితాన్నే మార్చేసింది!
    తేజరిల్లు!—2001
  • న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కృతజ్ఞతాభావంతో ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • బైబిలు మనకు చేరిన విధానం—భాగం మూడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఒత్తిడి—“అదృశ్య హంతకి”
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 6/8 పేజీ 20

అమెరికా ఆదివాసులు, బైబిలు

అమెరికాలను యూరోపియన్‌లు ఆక్రమించినప్పటి నుండీ, అమెరికా ఆదివాసులకు బైబిలును బోధించాలని అనేకమంది ప్రయత్నం చేశారు.

17వ శతాబ్దం నుండీ, ఉత్తర అమెరికాలోని ఆరు అమెరికా ఆదివాసుల భాషల్లోకి పూర్తి బైబిలు అనువదించబడింది. వాటిలో మొదటిది జాన్‌ ఈలియట్‌ బైబిలు, ఇది మస్సాచుసెట్స్‌లోవున్న బోస్టన్‌ మరియు రాక్స్‌బరీల సమీపంలో నివసిస్తున్న మస్సాచుసెట్స్‌ ఆదివాసుల కోసం 1663లో ముద్రించబడింది. హార్వే మార్కోవిట్స్‌, ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ నార్త్‌ అమెరికన్‌ ఇండియన్స్‌లో వ్రాస్తూ ఇలా పేర్కొంటున్నాడు: “అనేకమంది వలసదారులు [“నూతనలోక ‘అనాగరికులను,’ ‘నాగరికులుగా’”చేయాలన్న] [ఒక] ఒప్పందంలోకి ప్రవేశించడం యొక్క యథార్థతను అనేకమంది చరిత్రకారులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నప్పటికీ, ఈలియట్‌ బైబిలును తర్జుమా చేసేందుకు మస్సాచుసెట్స్‌ భాషను నేర్చుకోవడానికీ, దానికి లిపిని రూపొందించడానికీ పదిహేనేళ్లపాటు చేసిన కృషి ఆయనకున్న అంకితభావ గాఢతకు నిదర్శనంగా ఉంది. ఈలియట్‌ ఈ బృహత్కార్యాన్ని ‘భయంతోనూ శ్రద్ధతోనూ పూజ్యభావంతోనూ పరిగణించవలసిన ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన కార్యంగా’ దృష్టించాడు.”

బైబిల్లోని భాగాలు ఇతర అమెరికా ఆదివాసుల భాషల్లోకి అనువదించబడినప్పటికీ, తర్వాతి పూర్తి బైబిలు ప్రచురించబడటానికి 200 సంవత్సరాలు పట్టింది, అది బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటి సహచరులచే పశ్చిమ క్రీ భాషలో (1862) ప్రచురించబడింది. ఇతర తర్జుమాలు త్వరలోనే వెలువడ్డాయి: ఈస్ట్రన్‌ ఆర్కటిక్‌ ఇనూయిట్‌ (1871); డకోటా, లేక ఈస్ట్రన్‌ సీయోక్స్‌ (1880); ఉత్తర ధ్రువప్రాంతానికి సమీపానగల ఆదివాసుల భాషయైన గ్విచిన్‌ (1898).

ఇటీవల పూర్తైన మొత్తం బైబిలు నవాజో భాషలోకి అనువదించబడిన బైబిలు, అది 41 సంవత్సరాల సిద్ధపాటుతో రెండు బైబిలు సంస్థల సహకారంతో 1985లో ప్రచురించబడింది. హెబ్రీ, గ్రీకు లేఖనాల భాగాలు ఇప్పుడు కనీసం 46 ఆదివాసుల భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

ఎవరు నాయకత్వం వహించారు?

“బైబిలును తర్జుమా చేసే పనిలో ప్రొటస్టెంట్‌లే ఎక్కువగా కృషి చేశారన్నది . . . గమనించదగ్గ విషయం,” అని మార్కోవిట్స్‌ చెప్తున్నాడు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌కి (1962) ముందు, క్యాథలిక్‌ చర్చి, “బైబిలు మూలపాఠాల సరియైన అర్థాన్ని గ్రహించడానికి తగిన . . . శిక్షణ సామాన్య ప్రజలకు ఇవ్వబడలేదని విశ్వసిస్తూ, సామాన్య ప్రజలకు బైబిళ్లను పంచిపెట్టడాన్ని నిరుత్సాహపర్చిందని” కూడా అదే రచయిత చెబుతున్నాడు.

ప్రస్తుతం వివిధ బైబిలు సంస్థలు చెయెన్నె, హవసూపై, మిక్‌మాక్‌, జుని భాషలతోసహా ఉత్తర అమెరికాలోని అమెరికా ఆదివాసుల భాషల్లోకి అనువదించే కనీసం 20 పథకాల్లో నిమగ్నమై ఉన్నాయి. నవాజో ప్రజల కోసం గ్రీకు లేఖనాల ఒక క్రొత్త అనువాదం సిద్ధం చేయబడుతోంది. మధ్య, దక్షిణ అమెరికా ఆదివాసుల కోసం ఇతర అనువాదాలు సిద్ధం చేయబడుతున్నాయి.

యెహోవాసాక్షులు ఏ ప్రొటస్టెంటు సంస్థలతోనూ అనుబంధంగా కలిసి పనిచేయరు. అయితే, వారు అమెరికా ఆదివాసులందరి మధ్య చురుగ్గా పనిచేస్తున్నారు, దాని ఫలితంగా అనేకమంది అమెరికా ఆదివాసులు, నీతి నివసించేటటువంటి ‘క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమిని’ గురించిన బైబిలు సత్యాలకు ప్రతిస్పందిస్తున్నారు. (2 పేతురు 3:13) అమెరికాల్లోని స్థానిక భాషల్లో ప్రస్తుతం అందుబాటులోవున్న బైబిళ్ళనే సాక్షులు ఉపయోగిస్తున్నారు. వాచ్‌టవర్‌ సంస్థ ఐమారా, క్రీ, డకోటా, గువరానీ, ఇనుక్టిటుట్‌, ఇరాక్‌వోయిస్‌, నవాజో, క్వెచువా, మరితర తొమ్మిది భాషలతో పాటు అనేక అమెరికా ఆదివాసుల భాషల్లోకి అనువదిస్తున్న బైబిలు సాహిత్యాలను కూడా వారు ఉపయోగిస్తున్నారు.—సెప్టెంబర్‌ 8, 1996 తేజరిల్లు! (ఆంగ్లం) చూడండి.

[20వ పేజీలోని చిత్రం]

“యెహోవా” అన్నది నవాజో బైబిలులో కీర్తన 68:4లో కనబడుతుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి