కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 4/8 పేజీ 3
  • ఒత్తిడి—“అదృశ్య హంతకి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒత్తిడి—“అదృశ్య హంతకి”
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రయోజనకరమైన ఒత్తిడి, హానికరమైన ఒత్తిడి
    తేజరిల్లు!—1998
  • ఒత్తిడి అంటే ఏంటి?
    తేజరిల్లు!—2020
  • ఒత్తిడి—“స్లో పాయిజన్‌”
    తేజరిల్లు!—1998
  • మీరు ఒత్తిడికి గురౌతున్నారా?
    తేజరిల్లు!—2020
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 4/8 పేజీ 3

ఒత్తిడి—“అదృశ్య హంతకి”

“నేను గమనించిన మొదటి లక్షణం తీవ్రమైన పీడనం. అది నా ఛాతి ఎముక దగ్గర ప్రారంభమయ్యింది; వెంటనే నా భుజాలు, మెడ, దౌడల్లోకి వ్యాపిస్తూ అది పైకి వెళ్లింది; తర్వాత మళ్ళీ నా రెండు చేతుల్లోకి వ్యాపిస్తూ క్రిందికి దిగింది. నా ఛాతిమీద ఏనుగు వచ్చి పడినట్లుంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. నాకు చెమటలు పట్టేశాయి. కడుపులో దేవినట్లై, విపరీతమైన వికారం పుట్టింది. . . . తర్వాత, నర్సులు నన్ను హాస్పిటల్‌ బెడ్‌ మీదకు మారుస్తుండగా, ‘నాకు గుండె పోటు వస్తోంది’ అని నేను గాభరాగా అనడం నాకు గుర్తుంది. నాకప్పుడు నలభైనాలుగేళ్లు.”

డాక్టర్‌ రాబర్ట్‌ ఎస్‌. ఎలియట్‌ ఫ్రమ్‌ స్ట్రెస్‌ టు స్ట్రెంత్‌ అనే తన పుస్తకంలో, 20 ఏళ్ల క్రితం తాను మరణద్వారం వరకు వెళ్లివచ్చిన తన అనుభవాన్ని అలా వర్ణిస్తున్నాడు. వింతైన విషయం ఏమిటంటే, ఆ ఉదయం ఆయన ఒక కాన్ఫరెన్స్‌కు హాజరై, గుండె పోట్లు అనే అంశం మీద ఒక లెక్చరిచ్చాడు. కార్డియాలజిస్ట్‌ అయిన డాక్టర్‌ ఎలియట్‌, ఆయన మాటల్లోనే చెప్పాలంటే, హఠాత్తుగా తాను “కరొనరి కేర్‌ యూనిట్‌లో వైద్యుని స్థానంలో ఉండాల్సిందిపోయి రోగి స్థానంలో ఉన్నట్లు” కనుగొన్నాడు. ఊహించని తన సంక్షోభానికి కారణమేమిటని ఆయన అంటున్నాడు? డాక్టర్‌ ఎలియట్‌ ఇలా చెప్తున్నాడు, “నా అంతరంగంలో, ఒత్తిడి మూలంగా సంభవిస్తున్న నా సొంత శరీర ప్రక్రియలు నన్ను చంపుతున్నాయి.”a

డాక్టర్‌ ఎలియట్‌ అనుభవం చూపిస్తున్నట్లుగా, ఒత్తిడి జీవితానికి ప్రమాదం కలుగజేసే పరిణామాలను కల్గించగలదు. చెప్పాలంటే, అమెరికాలో, మరణానికి దారితీస్తున్న కొన్ని ప్రముఖ కారకాలతో ఇది జత చేయబడింది. ఒత్తిడి యొక్క ప్రభావాలు కొంత కాలవ్యవధిలో గుప్తంగా పోగై, తర్వాత ఏ హెచ్చరికా లేకుండా బయటపడవచ్చు. కాబట్టి గట్టి కారణంతోనే ఒత్తిడి “అదృశ్య హంతకి” అని పిలువబడింది.

ఆశ్చర్యకరంగా, ఒత్తిడి మూలమైన దుర్ఘటనలకు గురయ్యేది టైప్‌-ఎ వ్యక్తిత్వాలున్న వారు—అసహనం, కఠినత్వం, పోటీతత్త్వం వంటి లక్షణాలున్న వారు—మాత్రమే కాదు. శాంతియుతమైన వ్యక్తిత్వాలున్నట్లు కనిపించేవారు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది, ప్రాముఖ్యంగా వారి ప్రశాంతత ప్రెషర్‌ కుక్కర్‌ పైన బిగుతుగా లేని మూతలా కేవలం పైపై ప్రశాంతతే అయితే వారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. తన విషయంలో ఇదే వాస్తవమయ్యిందని డాక్టర్‌ ఎలియట్‌ భావిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఇతరులనిలా హెచ్చరిస్తున్నాడు: “సంవత్సరాలుగా మీ గుండెకు టైమ్‌ బాంబు పెట్టబడి ఉందని తెలియక మీరు నేడే హఠాత్తుగా మరణించవచ్చు.”

తర్వాతి శీర్షిక చూపుతున్నట్లుగా, ఒత్తిడితో జతచేయబడి ఉన్నది కేవలం గుండె పోటు, ఆకస్మిక మరణం అనే సమస్యలు మాత్రమే కాదు.

[అధస్సూచి]

a గుండెపోటు కేసుల్లో ఎక్కువమటుకు ఒత్తిడి ఒక కారకమే అయినప్పటికీ, ఎథిరోస్‌క్లీరోసిస్‌ (ధమనుల లోపలిపొరలో క్రొవ్వు పదార్థాలు నిల్వవుండి గట్టిపడడం) మూలంగా కరొనరి ధమనులకు చాలా హాని కల్గుతుంది. కాబట్టి, గుండె జబ్బు సంబంధ లక్షణాలను, ఒత్తిడి తగ్గితే అవే తగ్గిపోతాయిలెమ్మని వాటిని తేలిగ్గా తీసుకోవడం జ్ఞానయుక్తం కాదు. తేజరిల్లు! జనవరి 8, 1997 నందలి 3-13 పేజీలను చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి