కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 6/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కేన్సర్‌ తరచూ తప్పుగా రోగనిర్ధారణ చేయబడుతుంది
  • స్ట్రోక్‌ హెచ్చరికా సూచనలు
  • వివాహం సంతోషాన్ని తీసుకురాగలదు
  • గొలుసు ఉత్తరాలను కాల్చడం
  • దిగబడిపోతున్న నగరం
  • రౌడీ పిల్లలు
  • ప్రాణాంతకమైన మిచ్‌ తుపాను
  • ఏనుగుకున్న హక్కులు
  • సిగ్గును అధిగమించడం
  • ప్రమాదాలు—తలరాత కాదు
  • స్ట్రోక్‌—దాని కారణాలు
    తేజరిల్లు!—1998
  • దాని పర్యవసానాలను తాళుకోవడం
    తేజరిల్లు!—1998
  • సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 6/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

కేన్సర్‌ తరచూ తప్పుగా రోగనిర్ధారణ చేయబడుతుంది

“మరణ కారకాలకు సంబంధించిన అధికారిక గణాంకాలు, కేన్సర్‌ మూలంగా మరణించేవారి సంఖ్యను తక్కువగా అంచనా వేయవచ్చు,” అని న్యూ సైంటిస్ట్‌ పత్రిక తెలియజేసింది. న్యూ ఆర్లియన్స్‌ నందున్న లూసియానా మెడికల్‌ సెంటర్‌కు చెందిన డా. ఎలిజబెత్‌ బుర్టన్‌, రోగలక్షణాలపై ఆధారపడి చేసిన కేన్సర్‌ డయాగ్నోసిస్‌ల రేటును పోస్టుమార్టమ్‌ డయాగ్నోసిస్‌ల రేటుతో పోల్చేందుకు, 1986 నుండి 1995 మధ్య కాలంలో 1,105 మంది మృతరోగులపై నిర్వహించబడిన పోస్టుమార్టమ్‌ డయాగ్నోసిస్‌లను పరిశీలించారు. బుర్టన్‌ ప్రకారం, 44 శాతంమంది రోగుల్లో కేన్సర్‌ను డయాగ్నోస్‌ చేయకపోవడమో లేక రోగం ఏ రకమైన కేన్సర్‌కి చెందినదన్న విషయాన్ని తప్పుగా డయాగ్నోస్‌ చేయడమో జరిగింది. 1960లలో జరుపబడిన దాదాపు 50 శాతం పోస్టుమార్టమ్‌లతో ప్రస్తుతం నిర్వహించబడుతున్న 10 శాతం పోస్టుమార్టమ్‌లను పోల్చితే “జరిగిన అనేక తప్పిదాలను ఎన్నటికీ కనుక్కునే అవకాశం ఉండకపోవచ్చు” అని ఆ పత్రిక చెబుతోంది.

స్ట్రోక్‌ హెచ్చరికా సూచనలు

“చాలామంది ప్రజలు, స్ట్రోక్‌కి సంబంధించిన రోగలక్షణాల్లో కనీసం ఒక్కదాన్నైనా గుర్తించలేకపోవచ్చు” అని ఎఫ్‌డిఎ కన్‌జ్యూమర్‌ రిపోర్టు చేస్తోంది. ఆ పత్రిక ఇంకా ఇలా చెబుతోంది: “సర్వే చేయబడిన వారిలో సగంకన్నా కాస్త ఎక్కువమంది మాత్రమే స్ట్రోక్‌ రోగలక్షణాల్లో కనీసం ఒక్కదాని పేరైనా చెప్పగలిగారు, కేవలం 68 శాతంమంది మాత్రమే స్ట్రోక్‌కి దారితీసే కారణాల్లో ఒకదాని పేరు చెప్పగలిగారు.” పాశ్చాత్య పారిశ్రామిక ప్రపంచంలో మరణానికి దారితీసే ఒక ముఖ్య కారణమూ, అశక్తతకు నడిపించే ప్రధాన కారణమూ స్ట్రోకేనన్న వాస్తవం తెలిసినప్పటికీ పరిస్థితి పైవిధంగా ఉంది. స్ట్రోక్‌ మూలంగా వాటిల్లే నష్టాన్ని తగ్గించేందుకు, దానికి సంబంధించిన మొదటి హెచ్చరికా సూచన కనపడినప్పుడు మీరు వెంటనే వైద్య సహాయాన్ని తీసుకోవడం ప్రాముఖ్యం. ఆకస్మికంగా బలహీనత, చచ్చుబడిపోవడం, లేక ముఖానికి గానీ, చేతికి గానీ, కాలికి గానీ పక్షవాతం రావడం; ఆకస్మికంగా కంటిచూపు మసకబారడం లేక కంటిచూపు తగ్గిపోవడం, ముఖ్యంగా ఒక కంటికే అలా కావడం; మాట్లాడలేకపోవడం లేక మాట్లాడినదాన్ని అర్థం చేసుకోలేకపోవడం, ముఖ్యంగా వేరే రోగ లక్షణాలతో కలిసివున్నప్పుడు, చెప్పనలవికాని రీతిలో తలతిరగడం లేక శరీర సమన్వయాన్ని కోల్పోవడం వంటివి సర్వసాధారణంగా కలిగే స్ట్రోక్‌ లక్షణాలు.

వివాహం సంతోషాన్ని తీసుకురాగలదు

కొంతమంది వివాహాన్ని భారమైనదని నిందిస్తారు, టీ.వీ హాస్య ధారావాహికలు తరచూ వివాహం పూర్తిగా పాతకాలపునాటిదన్నట్టు చిత్రీకరిస్తాయి. కాని వాస్తవాలు ఏమి చూపిస్తున్నాయి? అవివాహితులు మెరుగైన స్థితిలో ఉన్నారని భావమా? ఫిలడెల్ఫియా ఇన్‌క్వైరర్‌లో ఉదహరించబడిన ఒక సమాజ శాస్త్రజ్ఞురాలు దానితో ఏకీభవించడంలేదు. వివాహితులు “సాధారణంగా సంతోషం గలవారు, ఆరోగ్యవంతులు, సంపన్నులు” అయ్యుంటారని ఆమె చెప్తుంది. అంతేగాక, ఒక గుంపుగా, వివాహితులు ఒత్తిడికి ఎక్కువగా గురికారు, నేరాలు ఎక్కువగా చేయరు లేక చట్టవ్యతిరేకమైన మాదకద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించరు, సహాయం కోసం ప్రభుత్వం మీద ఎక్కువగా ఆధారపడకుండా తమ కాళ్లపైతాము నిలబడతారు. వివాహితులు ఎక్కువకాలం పాటూ జీవిస్తారు కూడా అని నిపుణులు చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు.

గొలుసు ఉత్తరాలను కాల్చడం

గొలుసు ఉత్తరాలను వదల్చుకునేందుకు, 1992 నుంచీ జపాన్‌లోని నగోయా నగరంలో ఉత్తరాలను-కాల్చివేసే బౌద్ధుల ఉత్సవం ఏటేటా నిర్వహించబడుతుంది. పోస్టాఫీసు అధికారులు, ఆ నగరమంతటా ఉన్న పోస్టాఫీసుల్లో అక్కరలేని ఉత్తరాలను జమచేయడానికి బాక్సులను ఏర్పాటుచేసి, ఆ ఉత్తరాలను కాల్చివేయడానికి ఒక ఉత్సవాన్ని నిర్వహించమని బౌద్ధ దేవాలయాన్ని కోరారు. దానిని బట్టి, “తమకు వచ్చిన ఉత్తరాలను తృణీకరించడానికిగానీ లేక నాశనం చేయడానికిగానీ భయపడే అతి మూఢనమ్మకస్థుల కోసం” ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అసాహి ఈవినింగ్‌ అనే వార్తాపత్రిక వివరించింది. వారెందుకు భయపడ్డారు? ఆ ఉత్తరాల్లో ఉన్న సూచనలను అనుసరించే వారికి అవి ప్రయోజనాలను మాత్రమే వాగ్దానం చేయటం లేదు. ఆ గొలుసు ఉత్తరాల పరంపర కొనసాగకుండా మధ్యలో నిలిపివేసే వారికి రానైవున్న దుస్థితిని గురించి కూడా అవి బెదిరించాయి. ఉదాహరణకు, ఆ ఉత్తరాల పరంపర కొనసాగటాన్ని మధ్యలో నిలిపివేసిన ఒక వ్యక్తి టోక్యోలో హత్యచేయబడ్డాడని ఒక ఉత్తరం హెచ్చరించింది.

దిగబడిపోతున్న నగరం

“మెక్సికో నగరం దిగబడిపోతోందని” ద న్యూయార్క్‌ టైమ్స్‌ తెలియజేస్తోంది. “నగరప్రాంతంలో నివసిస్తున్న 18 కోట్లమందికి తగినంత నీరును అందించేందుకు దాని అడుగునవున్న జలనిక్షిప్తాల నుంచి అధికంగా నీటిని తోడివేయడం జరిగింది, దానితో భూ ఉపరితల భాగం అసాధారణమైన వేగంతో దిగబడిపోతోంది.” ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్న వాస్తవం ఏమిటంటే, “నీరు అధికంగా లీకయ్యే ప్రపంచనీటి సరఫరా సిస్టమ్‌లలో మెక్సికో నగర నీటి సరఫరా సిస్టమ్‌ ఒకటి. నీటి సరఫరా సిస్టమ్‌నుంచి వచ్చే ప్రతీ లీటరు స్వచ్ఛమైన నీటిలో మూడోవంతు నీరు లీకైపోతుంది.” దీనర్థం ఎక్కువ నీటిని బయటకు పంప్‌చేయాల్సి ఉంటుంది, నగరం ఆ మేరకు దిగబడిపోతుంది. మరమ్మతు సిబ్బంది సంవత్సరానికి 40,000 పగిలిపోయిన పంపుల చొప్పున బాగుచేసినా లీకౌతున్న అనేక పంపుల్ని గురించి రిపోర్టు చేయబడటంలేదు. నిజమే, అలా దిగబడిపోతున్న నగరం మెక్సికో ఒక్కటి మాత్రమే కాదు. ఉదాహరణకు, 20వ శతాబ్దకాలంలో ఇటలీలోని వెనిస్‌ నగరం 23 సెంటీమీటర్ల వరకూ దిగబడిపోయింది. అయితే, మెక్సికో నగరం 9 మీటర్లు దిగబడిపోయింది!

రౌడీ పిల్లలు

అమెరికాలో 16,262 మంది యౌవనస్థులపై జరిపిన ఒక సర్వే, సగటున ప్రతీ 5 గురిలో ఒకరు ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారనీ, ప్రతీ 10 మందిలో ఒకరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారనీ ద న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 151 స్కూళ్ళల్లోని విద్యార్థులు ఆ సర్వేలో ఇమిడి ఉన్నారు. విద్యార్థుల శారీరక, లైంగిక కార్యకలాపాలను గూర్చిన అలాగే మాదకద్రవ్యాలూ, మత్తుపానీయాల, పొగాకు వంటివాటిని ఉపయోగించడాన్ని గూర్చిన సమాచారాన్ని సేకరించేందుకు రహస్య ప్రశ్నావళిలు ఉపయోగించబడ్డాయి. దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టి, ఆరోగ్యాన్ని పెంపొందింపచేసేందుకొరకైన నేషనల్‌ సెంటర్‌లో పనిచేసే లోర కన్‌ ఇలా చెబుతోంది: “ఇక్కడ పాఠం ఏమిటంటే, తమను ప్రస్తుతం గాయపర్చబడటానికో, మరణానికో గురిచేసే, భవిష్యత్తులో దీర్ఘకాల వ్యాధులకు నడిపించే ప్రమాదంలో పడవేసే అలవాట్లలో కొనసాగుతున్నారన్నదే.”

ప్రాణాంతకమైన మిచ్‌ తుపాను

1998 అక్టోబర్‌ 27న ప్రచండమైన మిచ్‌ తుపాను, మధ్య అమెరికాపై విరుచుకుపడి, 11,000కన్నా ఎక్కువమంది ప్రజలను బలితీసుకొంది. అంతేగాక, వేలాదిమంది జాడ తెలియలేదు, వాళ్లు చనిపోయుంటారని అనుకోవడం జరిగింది, దాదాపు 2.3 కోట్లమంది నిరాశ్రయులయ్యారని భోగట్టా. హూండూరాస్‌, నికరాగ్వాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. గ్రామీణ వ్యవసాయ క్షేత్రాల్లో ఒక మీటరు ఎత్తున వర్షం పడింది. అది, ఆ ప్రాంతంలో ఇంతకు ముందు రెండు శతాబ్దాల్లో ఎన్నడూ సంభవించని ప్రకృతి వైపరీత్యాలలో అతి భయంకరమైనదని వర్ణించబడింది. అనేక గ్రామాలు బురదనీటిలో మునిగిపోయాయి లేక వరద నీటిలో కొట్టుకుపోయాయి. హూండూరాస్‌ అధ్యక్షుడైన కార్లోస్‌ ఫ్లోరెస్‌ ఫాకుసా ఇలా అన్నారు: “50 సంవత్సరాలపాటు మేం కొద్దికొద్దిగా కట్టుకున్న వాటిని 72 గంటలలో కోల్పోయాము.” మరణాలూ, జరిగిన నష్టాలకు ఒంటరితనం తోడైంది. తుపానుకు గురైన ప్రాంతాల్లో ఉన్న అనేక చిన్న చిన్న పట్టణాలకు ఉన్న ఎలక్ట్రిక్‌ లైన్లు మరియు ఫోన్‌ లైన్లు తెగిపోయాయి. వందలాది రోడ్లు, బ్రిడ్జిలు తుడిచిపెట్టుకు పోయాయి, తుపాను బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డవాళ్లు ఆహారం, శుభ్రమైన నీరు, వైద్యంలేక అనేక రోజులు బాధపడ్డారు. సహాయక ఏజెన్సీల దగ్గర చాలినంత ఆహారం ఉన్నా దానిని సరఫరాచేసే దారే కానరాలేదు. వస్తుపరమైన నష్టాలతో పాటూ, అనేకమంది ప్రజలు తమ పనులను కోల్పోయారు. అరటిపండ్లు, పుచ్చకాయలు, కాఫీ విత్తనాలు, వరి వంటి ప్రధానమైన పంటల్లో దాదాపు 70 శాతం తుడిచిపెట్టబడ్డాయి. “1974లో వచ్చిన ఫిఫి తుపానుతో దీనిని అసలు పోల్చలేము” అని హూండూరాస్‌ ఉప అధ్యక్షుడయిన విలియమ్‌ హేండెల్‌ చెప్పాడు. “ఫిఫి తుపాను నుంచి కోలుకోవడానికి 12 నుంచి 14 సంవత్సరాలు పట్టింది. ఈ తుపాను నుంచి కోలుకోవడానికి 30 నుంచి 40 సంవత్సరాలు పడుతుంది.”

ఏనుగుకున్న హక్కులు

ఇండియాలోని అనేక ప్రాంతాల్లో, ఏనుగులు కార్మిక బలగాల్లో ఒక ప్రముఖ భాగంగా రూపొందాయి. ద వీక్‌ పత్రిక నమోదు చేసిన దానిని బట్టి ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఏనుగులు, ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో పూర్తికాల ఉద్యోగులుగా నమోదు చేయబడ్డాయి. ఏనుగులు దాదాపు పదేళ్ల వయస్సులో నుండి పని చేయడం మొదలుపెట్టి, 50 ఏళ్ల వయస్సు వచ్చేదాక తన యజమానుల కోసం పనిచేస్తాయి. ఉద్యోగ విరమణ వయస్సులో, ఒక ఏనుగు ఇతర ప్రభుత్వ ఉద్యోగులవలే ఉపకార వేతనాన్ని పొందుతుంది. ఏనుగుకు తర్ఫీదును ఇచ్చి దానిని నడిపించే మావటివాడు, దానికి సరియైన ఆహారం, సంరక్షణ లభ్యమయ్యేలా చూసేందుకు నియమించబడతాడు. ఆడ ఏనుగుల పని జీవితకాలంలో ఒక సంవత్సరం మెటర్నిటీ సెలవులు కూడా చేరివున్నాయి. ఆ కాలంలో అవి, దూలాలను మోయడం, వాటిని ఒకచోట సమకూర్చడం, క్రూరమైన ఏనుగులకు తర్ఫీదివ్వడం, జాతీయ పార్కులలోనూ, రక్షిత అడవి ప్రాంతాల్లోనూ పహారా కాయడం వంటి ప్రాముఖ్యమైన పనిలోనికి తిరిగి రావడానికి ముందు జూలో సుఖజీవనాన్ని గడుపుతాయి.

సిగ్గును అధిగమించడం

కెనడాలోని టోరొంటో స్టార్‌ ప్రకారం, “దాదాపు 13 శాతంమంది యౌవనులు చాలా సిగ్గుతో బాధపడ్తున్నారు.” అది, “జీవితాలను సంపూర్ణంగా అనుభవించకుండా వారిని అడ్డుకుంటోంది” అని ఆ వార్తా పత్రిక నివేదిస్తోంది. సిగ్గును అధిగమించడానికి నిపుణులు కొన్ని పేర్కొన్నారు: “వార్తా సంఘటనలలో, పత్రికా శీర్షికలలో, పుస్తకాలలో, వ్యాసాంగాల్లో లేక సినిమాలలో నుంచి సంభాషణ ప్రారంభక విషయాలను గురించి ఆలోచించండి.” “మాట్లాడుతున్నప్పుడు చూడటం, చురుకుగా వినడంతోపాటు మౌఖిక సంభాషణను, మౌఖికంకాని సంభాషణా నైపుణ్యాల్ని అభ్యసించండి.” “మీరు వేటినైతే చేయడానికి భయపడతారో వాటిని చేసేలా మిమ్మల్ని మీరు బలవంతం చేసుకోండి.” “సిగ్గుపడే పిల్లవానికి మీరు తల్లి/తండ్రి అయితే, మీ పిల్లలు అందరితో కలిసి మెలిసి ఉండేలా అనేక అవకాశాలను కలగచేయడం ప్రాముఖ్యం.” సిగ్గును అధిగమించడానికి ఒకరు ఎంతగా ప్రయత్నిస్తే అంత సులభంగా సిగ్గును పోగొట్టుకుంటారు అని అనుభవం చూపిస్తోంది గనుక విడిచిపెట్టవద్దన్నదే ప్రోత్సాహం.

ప్రమాదాలు—తలరాత కాదు

ప్రతీ సంవత్సరం బ్రెజిల్‌ల్లో ప్రమాదాల ఫలితంగా కనీసం 22,000 మంది పిల్లలూ, వయోజనులూ చనిపోతున్నారని బ్రెజిల్‌ ఆరోగ్యశాఖ రిపోర్టు చేస్తోంది. ట్రాఫిక్‌ ప్రమాదాలు అనేకమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. అయితే, బ్రెజిలియన్‌ సొసైటీ ఆఫ్‌ పెడియాట్రిక్స్‌ అధ్యక్షుడైన లింకన్‌ ఫ్రెరె ఇలా ప్రకటించాడు: “ప్రమాదాలను నివారించవచ్చు, అవి ఇక ఎంతమాత్రం తలరాతగా గుర్తించబడవు.” అంతేగాక, జాతీయ ప్రమాద నివారణ ప్రచారానికి సమన్వయకర్తయైన తరజా కోస్టా ఇలా నొక్కి చెప్పింది, ‘గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విరేచనాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన అంటువ్యాధులు, అంటువ్యాధుల మూలంగా వాటిల్లే ప్రాణ నష్టాన్ని తగ్గించివేశాయి’ గనుక ప్రమాద నివారణ చర్యలు కూడా ప్రాణాల్ని రక్షించవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి