ప్రేమా నిరీక్షణల పునరాగమనంతో
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యౌవనస్థులతో వ్యవహరించే ఇతరులు, తాముగానీ, యౌవనస్థులు గానీ, మరి ఇతరులెవరైనాగానీ ప్రపంచాన్ని మార్చలేరని గుర్తిస్తారు. ఎవరూ ఆపలేని ఉత్తుంగ తరంగంలాంటి శక్తులు పనిచేస్తున్నాయి. అయినప్పటికీ, యౌవనస్థులు సంతోషంగా, ఆరోగ్యంగా, సామరస్యంగా ఉండేలా దోహదపడేందుకు మనమందరం చేయగలిగింది ఎంతో ఉంది.
చికిత్స కన్నా నివారణ మిన్న గనుక, తల్లిదండ్రులు తమ జీవనశైలీ మరియు తమ ప్రాధాన్యతలూ తమ పిల్లల దృక్పథాలను ప్రవర్తనను ఎలా మంచగలవనే దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంట్లో ప్రేమపూర్వకమైన ఆదరణపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పడం స్వయం-నాశక ప్రవర్తనను నివారించగల భద్రతను ఇస్తుంది. యౌవనస్థులకుండే అత్యంత ప్రాముఖ్యమైన అవసరత ఏమిటంటే, తాము చెప్పేది వినేవారెవరైనా ఉండడమే. వాళ్లు చెప్పేది తల్లిదండ్రులు వినకపోతే, వినకూడనివారు వింటారు.
నేడు తల్లిదండ్రుల విషయంలో దాని భావం ఏమిటి? పిల్లలకు అవసరమైనప్పుడు, వారు ఇంకా లేతప్రాయంలో ఉన్నప్పుడే వారితో సమయం గడపండి. ఇలా చేయడం అనేక కుటుంబాలకు అంత సులభం కాదు. తల్లిదండ్రులిద్దరూ జీవనోపాధికోసం తప్పనిసరిగా పనిచేయవలసిన పరిస్థితులు ఉండవచ్చు. తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి త్యాగాలు చేసేందుకు సుముఖత చూపిస్తున్నవారు, అలా త్యాగాలు చేయగలిగిన వారు తరచూ తమ కుమారులు కుమార్తెలు జీవితంలో మరింత సాఫల్యాన్ని పొందడాన్ని చూసే ప్రతిఫలాన్ని పొందారు. అయితే, మునుపు పేర్కొన్నట్లుగా, కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ వైపు నుండి ఎంత తీవ్రంగా కృషిచేసినప్పటికీ, తమ పిల్లలతో గంభీరమైన సమస్యలు తలెత్తవచ్చు.
స్నేహితులు, ఇతర పెద్దలు సహాయం చేయవచ్చు
యుద్ధాలు, మానభంగం, యౌవనస్థుల పట్ల నిరాదరణ వంటివి సంభవించినప్పుడు, జరిగిన ఆ హానిని పూడ్చడానికి యౌవనస్థుల విషయంలో నిజమైన శ్రద్ధ చూపించేవారు మామూలుకన్నా ఎక్కువగా కృషి చేయవలసి ఉంటుంది. అలాంటి ప్రతికూల అనుభవాలను ఎదుర్కొని ఉద్వేగఘాతానికి గురైన యౌవనస్థులు వారికి సహాయం చేయాలని చేస్తున్న ప్రయత్నాలకు కూడా సరిగ్గా ప్రతిస్పందించకపోవచ్చు. దానికోసం మీరు ఎంతో సమయాన్ని వెచ్చించి, ఎంతగానో కృషి చేయవలసి రావచ్చు. వారిని తక్కువ చేయడం లేక నిరాకరించడం కచ్చితంగా జ్ఞానయుక్తమైన లేక ప్రేమపూర్వకమైన చర్యకాదు. ఆత్మహత్య చేసుకునే అపాయంలో ఉన్నవారి హృదయాలను చేరుకునేందుకు మనం మన భావోద్వేగాలను మరింత లోతుగా పరిశీలించుకుని, అవసరమైన సానుభూతిని ప్రేమను చూపించగలమా?
బలహీనమైన మరియు బహుశ సమతుల్యతలేని మానసిక స్థితిని సూచించే ధోరణులు యౌవనస్థుల్లో ఉంటే వాటిని గమనించడంలో తల్లిదండ్రులే కాదుగాని స్నేహితులు తోడబుట్టిన వారు కూడా ప్రత్యేకమైన అప్రమత్తతను కల్గివుండాలి. (“యోగ్యమైన సహాయం అవసరం” అనే బాక్సు చూడండి, పేజీ 8.) అలాంటి సూచనలు కనిపిస్తుంటే, వాళ్ళు చెబుతున్నది వినడానికి వేగిరపడండి. సాధ్యమైతే, మీ యథార్థమైన స్నేహాన్ని గురించి వారికి హామీ ఇచ్చేందుకు దయగల ప్రశ్నల ద్వారా, కలితచెందివున్న యౌవనస్థుల నుండి వారి మనస్సులో ఉన్నది రాబట్టడానికి ప్రయత్నించండి. కష్టతరమైన పరిస్థితులతో వ్యవహరించడానికి నమ్మకమైన స్నేహితులు బంధువులు తల్లిదండ్రులకు మద్దతునివ్వగల్గుతారు; కాని, తల్లిదండ్రుల పాత్రను తాము వహించకుండా వారు జాగ్రత్తపడాలి. యౌవనస్థులు ఆత్మహత్య చేసుకోవడానికి మ్రొగ్గు చూపుతున్నారంటే తరచూ దానర్థం వాళ్ళు అవధానం కోసం—తల్లిదండ్రుల అవధానం కోసం అభ్యర్థిస్తున్నారనే.
ఎవరైనా యౌవనస్థులకు ఇవ్వగల శ్రేష్టమైన బహుమానాల్లో ఒకటేమిటంటే, సంతోషకరమైన భవిష్యత్తును గురించిన గట్టి నిరీక్షణ, జీవించడానిక ప్రేరకం. త్వరలో రానైయున్న మెరుగైన లోక విధానాన్ని గూర్చిన బైబిలు వాగ్దానాలు నిజత్వాన్ని అనేక మంది యౌవనస్థులు గుర్తించగలిగారు.
ఆత్మహత్య చేసుకోగల సాధ్యత నుండి తప్పించబడ్డారు
ఆత్మహత్య చేసుకోవడాన్ని గురించి తరచూ ఆలోచించిన జపానుకు చెందిన ఒక యువతి ఇలా చెబుతోంది: “ఆత్మహత్య చేసుకోవాలని నేను ఎన్నిసార్లు ప్రయత్నించానో, నా చిన్నప్పుడు నేనెంతగానో నమ్మిన ఒక వ్యక్తి చేతుల్లో లైంగిక అత్యాచారానికి గురయ్యాను. . . . గతంలో, ‘నాకు చనిపోవాలని ఉంది’ అని నేను ఎన్నిసార్లు వ్రాసి పెట్టాన్నో నాకే గుర్తులేదు. ఆ తర్వాత నేను ఒక యెహోవాసాక్షినయ్యాను, ఇప్పుడు పూర్తికాల సువార్తికురాలిగా సేవ చేస్తున్నాను, కాని అప్పుడప్పుడూ నాకు ఆ ప్రేరణ కల్గుతూనే ఉంటుంది. . . . కాని యెహోవా నేను సజీవంగా ఉండేందుకు అనుమతించాడు, ‘జీవిస్తూ ఉండు’ అని ఆయన నాకు మెల్లిగా చెబుతున్నట్లుగా ఉంటుంది.”
రష్యాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి ఇలా వివరించింది: “నాకు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు, నేను ఎవరికీ అవసరం లేదని భావించడం మొదలు పెట్టాను. నాతో మాట్లాడేందుకు నా తల్లిదండ్రులకు సమయం ఉండేది కాదు, నా సమస్యల్ని నా అంతట నేనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాను. నలుగురితో కలిసేదాన్ని కాను. మా బంధువులతో ఎప్పుడూ పోట్లాడుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఆత్మహత్యా తలంపు నా మనస్సులో మెదిలింది. యెహోవాసాక్షులను కలవగలిగినందుకు నేనెంతో సంతోషించాను!
నిజంగా నిరాశ నిరీక్షణగా మారగలదని చూపించే ఈ వ్యాఖ్య ఆస్ట్రేలియాకు చెందిన, తన 30వ పడి తుదికాలంలో ఉన్న కేథీది, ఆమె ఈ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలు చేస్తోంది: “నా జీవితాన్ని అంతం చేసుకునే వివిధ పద్ధతుల గురించి నేను ఎడతెగక కలలు కనేదాన్ని, చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాను. హాని, కోపం, యథార్థతారాహిత్యం వంటివాటితో నిండివున్న ఈ లోకాన్ని తప్పించుకోవాలని నేను ఆశించాను. నేను ఇరుక్కుపోయి ఉన్నానని నేను భావించిన ‘సాలెగూడు’ లోనుండి బయటికి రాకుండా కృంగుదల మరింత కష్టతరం చేసింది. కాబట్టి ఆ సమయంలో ఆత్మహత్య ఒక్కటే సమస్యకు పరిష్కారమనిపించింది.
“అందరికీ శాంతిసంతోషాలు నిండిన జీవితం లభించే పరదైసుగా ఈ భూమి మారే అవకాశం ఉందని నేను మొట్టమొదటిసారి విన్నప్పుడు, నేను నిజంగా దానికోసం పరితపించిపోయాను. కాని అది అసాధ్యమైన కల మాత్రమే అనిపించింది. అయితే, జీవాన్ని గురించి యెహోవాకున్న దృక్పథాన్ని బట్టి, ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరం ఎంత అమూల్యమైనవారమో నేను నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలెట్టాను. భవిష్యత్తు కోసం నిరీక్షణ ఉందని నాకు నమ్మకం ఏర్పడనారంభించింది. చివరికి, ఆ ‘సాలెగూటి’లో నుండి బయటికి వచ్చే మార్గం నాకు కనిపించింది. కాని దానిలో నుండి బయటికి రావడం కష్టమయ్యింది. కొన్నిసార్లు నన్ను నిరాశ చుట్టుముట్టేది, నాకు మరీ గందరగోళంగా ఉండేది. అయినప్పటికీ, యెహోవా దేవుడ్ని నా కేంద్రబిందువుగా చేసుకోవడం నన్ను ఆయనకు సన్నిహితురాలిగా చేసి, నేను సురక్షితంగా ఉన్నట్లు భావించేలా చేసింది. యెహోవా నాకోసం చేసినదానంతటిని బట్టి నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.”
యౌవనస్థుల మరణాలు ఇక ఉండవు
బైబిలు చదవడం ద్వారా ఒక యౌవనస్థుడు ఎదురు చూడడానికి శ్రేష్ఠమైనదొకటి ఉందని గ్రహించగల్గుతాడు, దాన్నే క్రైస్తవ అపొస్తలుడైన పౌలు “వాస్తవమైన జీవము” అని పిలుస్తున్నాడు. యౌవనస్థుడైన తిమోతికి ఆయనిలా ఉపదేశించాడు: “ఇహమందు ధనవంతులైనవారు . . . అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు . . . మేలు చేయువారును, సత్‌క్రియలు అను ధనము గలవారును . . . [అయ్యుండ]వలెనని వారికి ఆజ్ఞాపించుము.”—1 తిమోతి 6:17-19.
పౌలు ఇస్తున్న ఉపదేశ భావమేమిటంటే, మనం ఇతరుల గురించి శ్రద్ధ కల్గివుంటూ, భవిష్యత్తు గురించి గట్టి నిరీక్షణ కల్గివుండేందుకు వారికి సహాయం చేస్తూ ఉండాలి. “వాస్తవమైన జీవము” అంటే యెహోవా వాగ్దానం చేసిన ‘క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి’ ఉండే నూతనలోకం.—1 పేతురు 3:13.
ఒకప్పుడు మత్తుపదార్థాలు దుర్వినియోగం అనైతిక జీవన విధానం వంటివాటికి బానిసలై ఉన్న అనేకమంది యౌవనస్థులు, అలాంటి జీవితం కేవలం మరణానికి నడిపే సుదీర్ఘమైన, మెలికలు తిరిగిన మార్గమనీ, అయితే ఆత్మహత్య దానికి దగ్గరి దారే తప్ప మరేమీ కాదనీ అర్థం చేసుకుంటున్నారు. యుద్ధాలు, ద్వేషం, చెడు ప్రవర్తన, ప్రేమరాహిత్యం నిండివున్న ఈ లోక విధానం విమోచించబడలేనిదని వారు తెలుసుకున్నారు. దేవుని రాజ్యమే ఏకైక నిజమైన నిరీక్షణ అనీ, అది మాత్రమే యౌవనస్థులే కాక విధేయులైన మానవజాతి అంతా ఎన్నడూ మరణించని, చివరికి మరణించాలని కూడా కోరుకోని నూతన లోకాన్ని తీసుకు వస్తుందని వాళ్లు బలంగా విశ్వసిస్తున్నారు.—ప్రకటన 21:1-4.
[8వ పేజీలోని బాక్సు]
యోగ్యమైన సహాయం అవసరం
ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఎన్‌సైక్లోపిడియ ఆఫ్ మెడిసిన్ ఇలా చెబుతుంది, “90 శాతం కంటే ఎక్కువ ఆత్మహత్యలు మానసిక రుగ్మత మూలంగానే సంభవిస్తాయి.” అది ఈ క్రింది విధమైన రుగ్మతల పట్టికను ఇస్తుంది, తీవ్రమైన కృంగుదల (దాదాపు 15 శాతం), ఒక రకమైన మతిభ్రమణం (దాదాపు 10 శాతం), మద్యాన్ని ఆశ్రయించడం (దాదాపు 7 శాతం), సమాజ వ్యతిరేక వ్యక్తిత్వ రుగ్మత (దాదాపు 5 శాతం), ఒకవిధమైన నాడీ రుగ్మత (5 శాతం కన్నా తక్కువ). అదిలా ఉపదేశిస్తుంది: “ఆత్మహత్యా ప్రయత్నాలన్నింటినీ గంభీరంగా ఎంచాలి. ఆత్మ హత్యా ప్రయత్నం చేసేవారిలో 20 నుండి 30 శాతంమంది ప్రజలు ఒక సంవత్సరం లోపలే మళ్లీ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు.” డా. జాన్‌ఫోసెట్ ఇలా వ్రాస్తున్నాడు: “(అమెరికాలో) 50 శాతం కన్నా ఎక్కువ ఆత్మహత్యలను, మానసికారోగ్య నిపుణుడితో ఏ విధమైన సంప్రదింపులు లేని వ్యక్తులే చేసుకుంటారు.” మరో పుస్తకం ఇలా తెలియజేస్తుంది: “ఒక వ్యక్తి తనలో నిక్షిప్తంగా ఉన్న కృంగుదలను పోగొట్టుకోవడానికి సహాయం పొందేందుకు వీలైనంత త్వరగా మానసిక వైద్య నిపుణుడి దగ్గరకు వెళ్లడమే చికిత్సలోని అత్యంత ప్రాముఖ్యమైన అంశం.”