కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 12/8 పేజీలు 23-25
  • పక్షపాతం యెడల నేనెలా వ్యవహరించగలను?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పక్షపాతం యెడల నేనెలా వ్యవహరించగలను?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ నాలుకను అదుపులో ఉంచుకొనండి!
  • కపటమైన విధేయత
  • ఒంటరిగా ఉండడంవల్ల వచ్చే ప్రమాదం
  • ఈర్ష్యలోని ప్రమాదం
  • మా అన్నయ్య మీదే అవధానమంతా ఎందుకు ఉంచబడుతోంది?
    తేజరిల్లు!—1997
  • తోబుట్టువుల అడుగుజాడలను అనుసరించమని చేయబడే ఒత్తిడిని నేనెలా అధిగమించవచ్చు?
    తేజరిల్లు!—2004
  • ఆయన నన్ను ప్రేమించకపోతే నేనేం చేయను?
    తేజరిల్లు!—1998
  • ఎప్పుడూ నేనే నిందించబడ్డాన్ని నేనెలా ఆపగలను?
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 12/8 పేజీలు 23-25

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

పక్షపాతం యెడల నేనెలా వ్యవహరించగలను?

“నా చెల్లెలు నాకంటే రెండు సంవత్సరాలు చిన్నది, ఆమె మీదనే అవధానమంతా ఉంచబడుతుంది. . . . ఇది న్యాయంగా కనబడడం లేదు.”—రిబెకా.a

మీ సహోదరుడు లేక సహోదరిపై ఎంత అవధానం చూపిస్తే మిమ్మల్ని అంత అశ్రద్ధచేస్తున్నారని మీరు భావించవచ్చు. మంచి సామర్థ్యాలు ఉండి కూడా గంభీరమైన సమస్య అనుభవిస్తూ, లేదా మీ తలిదండ్రుల ఆసక్తి లేక వ్యక్తిత్వ లక్షణాలు కలిగియున్న తోబుట్టువు మీకున్నట్లయితే మీ వైపు అవధానాన్ని మళ్లించడానికి మీరు తీవ్రంగా పోరాడవలసి ఉంటుంది. దాని గురించి మీరు ఎంత ఆలోచిస్తే, అంత బాధా కోపం మీకు కలుగవచ్చు.b

అయినప్పటికీ, బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “భయమునొంది పాపముచేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి.” (కీర్తన 4:4) మీరు కలత చెంది కోపంతో ఉన్నప్పుడు, మీరు తరువాత పశ్చాతాపం పొందేటటువంటిదేదో అనాలి లేక ఏదో చేయాలి అని మీకు అనిపించవచ్చు. దేవునితో తన సహోదరుడైన హేబెలు ఆనందించిన అనుగ్రహ స్థానాన్ని బట్టి కయీను ఎంత అసూయపడ్డాడో గుర్తుచేసుకోండి. “వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువని” దేవుడు అతనిని హెచ్చరించాడు. (ఆదికాండము 4:3-16) కయీను తన భావాలను అదుపులో పెట్టుకొనుటలో విఫలుడయ్యాడు, దాని ఫలితం దారుణం!

నిజమే, కయీను వలే మీరు నరహంతకులు కానవసరం లేదు. అయినా పక్షపాతం అసహ్యమైన భావోద్రేకాలను రేపగలదు. అందువల్ల ప్రమాదాలు మీ ద్వారము వద్దనే పొంచి ఉండవచ్చు! వాటిలో కొన్ని ఏమిటి? మరియు ఈ పరిస్థితిని మీరు ఎలా అదుపులో పెట్టుకోగలరు?

మీ నాలుకను అదుపులో ఉంచుకొనండి!

బెత్‌కు 13 ఏండ్లున్నప్పుడు, తన తలిదండ్రులు తన సహోదరుడ్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్లు మరియు తన యెడల అన్యాయముగా ప్రవర్తిస్తున్నట్లు ఆమె భావించింది. ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “నేనూ మా అమ్మా ఎప్పుడూ గొడవపడేవాళ్లం, కాని అది ఎప్పుడూ మంచిని తీసుకురాలేదు. ఆమె ఏమి చెబుతుందో నేను వినేదాన్ని కాదు, మరియు నేను ఏమి చెబుతున్నానో ఆమె వినేది కాదు, కాబట్టి ఏమీ సాధించ లేకపోయాము.” గొడవపడడం కేవలం చెడ్డ పరిస్థితికి దిగజారుస్తుందని కూడా మీరు తెలుసుకొని ఉండవచ్చు. ఎఫెసీయులు 4:31 ఇలా చెబుతుంది: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.”

మీ ఉద్దేశమును తెలియజేయడానికి మీరు అరవనవసరం లేదు. ప్రశాంతంగా సమీపించినట్లయితే శ్రేష్టంగా ఉంటుంది. సామెతలు 25:15 ఇలా చెబుతుంది: “దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక యెముకలను నలగగొట్టును.” కాబట్టి మీ తలిదండ్రులు పక్షపాతం చూపించడంలో అపరాధులైతే, అరుస్తూ నిందారోపణలు చేయవద్దు. తగిన సమయం కొరకు వేచియుండి, తరువాత ప్రశాంతంగా, గౌరవపూర్వకంగా వారితో మాట్లాడండి.—సామెతలు 15:23 పోల్చండి.

మీ తలిదండ్రుల తప్పిదాలపై మీరు కేంద్రీకరిస్తే లేక వారు ఎంత “అన్యాయంగా” ఉన్నారు అని నిందిస్తే, మీరు కేవలం వారిని దూరం చేసుకుంటారు లేక వారు జరుగబోయే దాడిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యేలా చేస్తారు. బదులుగా వారి క్రియలు మిమ్మల్ని ఎలా బాధ పరిచాయో తెలియజేయండి. (ఉదాహరణకు, మీరు వారితో ఇలా చెప్పవచ్చు: ‘మీ నిర్లక్ష్య భావం నన్ను బాధ పెడుతుంది.’) మీ భావాలను గంభీరంగా తీసుకోవడానికి వారు త్వరగా కదిలింపబడవచ్చు. అంతేకాకుండా, “వినుటకు వేగిరపడు” వారై ఉండండి. (యాకోబు 1:19) మీ తోబుట్టువుకు అధిక అవధానం ఇవ్వడంలో మీ తలిదండ్రులకు సరియైన న్యాయసమ్మతమైన కారణాలు ఉండివుండవచ్చు. బహుశా మీకు తెలియని సమస్యలు వారికి ఉండవచ్చు.

కానీ మీరు కోపోద్రేకులై కోపంతో దురుసుగా మాట్లాడినట్లయితే అప్పుడేమిటి? సామెతలు 25:28 “తన మనస్సును అణచుకొనలేని” వాడిని “ప్రాకారము” లేని పురముగా పోల్చుతుంది; అటువంటి వాడు తన సొంత అసంపూర్ణతా ప్రవృత్తి ద్వారా ఓడిపోవచ్చు. మరో వైపు, మీ భావాలను అదుపు చేసుకొనే సామర్థ్యం నిజమైన శక్తికి గుర్తు! (సామెతలు 16:32) మీ భావాలను వ్యక్తీకరించే ముందు మీరు ప్రశాంతంగా ఉండేవరకు, బహుశా మరుసటి రోజు వరకు ఎందుకు వేచియుండకూడదు? పరిస్థితినుండి బయటపడడానికి అలా నడవడం లేక ఏదో వ్యాయామం చేయడం మీకు సహాయకరంగా ఉన్నట్లు మీరు కనుగొనవచ్చు. (సామెతలు 17:14) మీ పెదాలను అదుపులో ఉంచుకున్నట్లయితే, గాయపరచే మాటలను గాని మూర్ఖపు మాటలను గాని అనకుండా తప్పించుకోవచ్చు.—సామెతలు 10:19; 13:3; 17:27.

కపటమైన విధేయత

మనం తప్పించుకోవలసిన మరొక ఉచ్చు అవిధేయత. పదహారు సంవత్సరాల వయసున్న మారి తన చిన్న తమ్ముడు కుటుంబ బైబిలు పఠనానికి భంగం కలిగించినప్పుడు ఎన్నడూ శిక్షింపబడకపోవడం ఆమె గమనించింది. చూపించబడుతున్న ఈ పక్షపాతానికి నిరాశచెంది, ఆమె పఠనంలో పాల్గొనడానికి “నిరాకరిస్తూ” పోయింది. అన్యాయంగా చూడబడుతున్నారని మీరు భావించినప్పుడు మాట్లాడకుండా లేక సహకరించకుండా మీరు ఎప్పుడైనా ఉన్నారా?

అలాగైతే, ఆ కపట క్రియ, మీ తలిదండ్రులను గౌరవించి విధేయులుకండి అనే బైబిలు ఆజ్ఞకు వ్యతిరేకంగా దారి తీస్తుందని తెలుసుకోండి. (ఎఫెసీయులు 6:1, 2) అంతేకాకుండా, అవిధేయత మీ తలిదండ్రులతో ఉన్న మీ సంబంధాన్ని హరించివేస్తుంది. మీ సమస్యలను మీ తలిదండ్రులతో మాట్లాడడం మంచిది. సామెతలు 24:26 ఇలా సూచిస్తుంది “సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చు” వాడు ఇతరుల గౌరవాన్ని పొందుతాడు. మారి, విషయాన్ని తన తల్లితో చర్చించినప్పుడు వారు పరస్పర అవగాహనకు వచ్చారు, నెమ్మదిగా పరిస్థితులు మెరుగుపడడం మొదలయ్యాయి.

ఒంటరిగా ఉండడంవల్ల వచ్చే ప్రమాదం

పక్షపాతంతో వ్యవహరించడం వల్ల వచ్చే మరో ప్రమాదం మీ కుటుంబం నుండి తొలగిపోవడం లేక అవధానం కోసం అవిశ్వాసుల వైపు చూడడం. కెసాండ్ర విషయంలో ఇదే జరిగింది: “నా కుటుంబం నుండి నన్ను నేను వేరుపరుచుకొని, స్కూల్లో నేనేర్పర్చుకున్న లోక స్నేహితుల వైపు తిరిగాను. నాకు బాయ్‌ఫ్రెండ్స్‌ కూడా ఉండేవారు, నా తలిదండ్రులకు అది తెలియదు. తరువాత నేనెంతో కృంగిపోయాను, తప్పుచేస్తున్నాననే భావం నాలో కలిగింది ఎందుకంటే నేను సరియైనది చేయడంలేదని నాకు తెలుసు. ఆ పరిస్థితినుండి బయటకు రావాలనుకున్నాను, కాని నా తలిదండ్రులకు చెప్పడానికి నేను ఏ మార్గం కనుక్కోలేకపోయాను.”

ప్రత్యేకంగా మీరు కలతచెందినప్పుడు, స్పష్టంగా ఆలోచించలేనప్పుడు— కుటుంబంనుండి మరియు తోటి విశ్వాసులనుండి మిమ్మల్ని మీరు వేరుపరుచుకోవడం ప్రమాదకరం. సామెతలు 18:1 ఇలా హెచ్చరిస్తుంది: “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.” ఈ సమయంలో మీ తలిదండ్రులను సమీపించడం కష్టంగా ఉన్నట్లయితే, సామెతలు 17:17లో “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” అని చెప్పినట్లుగా క్రైస్తవ స్నేహితుని కొరకు వెదకండి. సాధారణంగా అలాంటి “నిజమైన స్నేహితు”డ్ని సంఘంలో పరిపక్వత చెందిన సభ్యులలో చాలా సులభంగా కనుగొనవచ్చు.

తన అవసరత సమయంలో కెసాండ్ర “నిజమైన స్నేహితు”డిని కనుగొంది: “ప్రాంతీయ పైవిచారణకర్త [ప్రయాణ కాపరి] మా సంఘాన్ని దర్శించినప్పుడు, ఆయనతో పనిచేయడానికి నా తలిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. ఆయన, ఆయన భార్య ఎంతో నిర్మొహమాటస్థులు, వారు నాపై నిజంగా ఆసక్తి తీసుకున్నారు. వారితో నేను నిజంగా మాట్లాడగలిగాను. వారు నన్ను ఖండిస్తారని నేను భావించలేదు. క్రైస్తవ తలిదండ్రులు పెంచినంత మాత్రాన ఎవరూ పరిపూర్ణులుగా ఉండరని వారు గుర్తించారు.” వారి ప్రోత్సాహం మరియు పరిణతిచెందిన సలహానే కెసాండ్రకి అవసరమైనది!—సామెతలు 13:20.

ఈర్ష్యలోని ప్రమాదం

సామెతలు 27:4 ఇలా హెచ్చరిస్తుంది: “క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము [“అసూయ, NW”] ఎదుట ఎవడు నిలువగలడు?” తోబుట్టువు యెడల ఈర్ష్య మరియు అసూయ కొంతమంది యౌవనస్థులు దురుసు పనులు చేయడానికి ప్రేరేపించాయి. ఒక స్త్రీ ఇలా ఒప్పుకుంది: “నేను చిన్నదానిగా ఉన్నప్పుడు, నాకు సన్నగా, చిన్నగా గోధుమ రంగు జుట్టు ఉండేది, కాని నా సహోదరికి మంచి బంగారు రంగు జుట్టు నడుము వరకు పెరిగి ఉండేది. మా నాన్న ఎప్పుడూ ఆమె జుట్టునే ప్రశంసించేవాడు. ఆయన ఆమెను తన ‘రెపుంజల్‌’ అని పిలిచేవాడు. ఒక రాత్రి ఆమె నిద్రపోతున్నప్పుడు, నేను కత్తెర తీసుకొని, నిశబ్దంగా ఆమె పక్క మీదకు వెళ్లి ఎంత జుట్టు కత్తిరించగలనో అంత కత్తిరించేశాను.”—ఎడల్‌ ఫెబర్‌ మరియు ఎలేన్‌ మజ్లిష్‌ ద్వారా వ్రాయబడిన సిబ్లింగ్స్‌ వితవుట్‌ రైవల్రీ.

తరువాత, ఆ ఈర్ష్య బైబిల్లో దుష్టమైన “శరీరకార్యములు” అని వర్ణించడంలో ఆశ్చర్యం లేదు. (గలతీయులు 5:19-21; రోమా 1:28-32) అయినా, అటువంటి “ఈర్ష్యపడే ధృక్పథం” మనందరిలో ఉంది. (యాకోబు 4:5) కాబట్టి మీ తోబుట్టువుని బాధపెట్టాలని, కించపర్చాలని, లేక వేరే విధంగా తక్కువచేయాలని, మీరు పథకంవేస్తున్నట్లయితే ఈర్ష్య మిమ్మల్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తూ “వాకిట పొంచియుండును!”

అటువంటి హానికరమైన భావాలు మీరు కలిగియున్నట్లయితే మీరు ఏమిచేయాలి? మొదటిగా, ఆయన ఆత్మ కొరకు దేవుడ్ని ప్రార్థించడానికి ప్రయత్నించాలి. “ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.” అని గలతీయులు 5:16 చెబుతుంది. (తీతుకు 3:3-5 పోల్చండి.) మీ తోబుట్టువు ఎడల ఉన్న మీ నిజమైన భావాలను గురించి ఆలోచించడం కూడా మీకు సహాయం చేయవచ్చు. కోపంవున్నప్పటికీ కూడా వారి యెడల కొంచెం కూడా ప్రేమ లేదని మీరు నిజంగా చెప్పగలుగుతారా? సరే, “ప్రేమ మత్సరపడదు” [“అసూయ, NW”] అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. (1 కొరింథీయులు 13:4) కాబట్టి ప్రతికూలమైన, ఈర్ష్యను ప్రోత్సహించే ఆలోచనలను కలిగియుండడానికి నిరాకరించండి. మీ తలిదండ్రుల నుండి ప్రత్యేక అవధానాన్ని అతడు లేక ఆమె పొందుతున్నప్పుడు ఆ తోబుట్టువుతో కలసి ఆనందించడానికి ప్రయత్నించండి.—రోమా 12:15 పోల్చండి.

ఈ విషయంలో మీ తలిదండ్రులతో మీ సంభాషణలు కూడా మీకు సహాయం చేస్తున్నట్లు రుజువుపర్చవచ్చు. మీపై ఎక్కువ అవధానం నిలపాలనే అవసరతను వారు ఒప్పుకున్నట్లయితే, మీ తోబుట్టువు యెడల ఈర్ష్యా భావాలను అధిగమించడానికి మీకు గొప్ప సహాయకరంగా ఉంటుంది. కాని గృహంలో పరిస్థితులు మెరుగుపడకుండా, పక్షపాతం ఇంకా ఉన్నట్లయితే అప్పుడేమిటి? కోపం తెచ్చుకోకండి, అరవకండి, లేక మీ తలిదండ్రులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకండి. విధేయతతో, సహాయకరమైన వైఖరిని కొనసాగించడానికి ప్రయత్నించండి. అవసరమైతే, క్రైస్తవ సంఘంలోని పరిపక్వత చెందిన వారి సహాయం కొరకు వెదకండి. అన్నిటికంటే, యెహోవా దేవునికి దగ్గరవ్వండి. కీర్తనల రచయిత మాటలను గుర్తుంచుకోండి: “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.”—కీర్తన 27:10.

[అధస్సూచీలు]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

b 1997, నవంబరు 8 తేజరిల్లు! సంచికలోని “మా అన్నయ్య మీదే అవధానమంతా ఎందుకు ఉంచబడుతోంది?” అనే శీర్షికను చూడండి.

[24వ పేజీలోని చిత్రం]

చిన్నచూపు చూస్తున్నారనే విషయాన్ని మీరు వివరించడం సమస్యను పరిష్కరించవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి