ఎస్ప్రెస్సో కాఫీ సారం
‘కాఫీ రుచికన్నా దాని వాసనే బాగుంటుంది!’ మీరెప్పుడైనా అలా అన్నారా? అయితే “కెఫే ఎస్ప్రెస్సో”ని మీరు రుచిచూడాలనుకోవచ్చు. నిపుణులు దానిని “శ్రేష్టమైన కాఫీ” అనియు “చాలా రుచికరమైన కాఫీ” అనియు పిలిచారు.
బహుశ మీరు ఎస్ప్రెస్సో కాఫీని ఇంతకు ముందే రుచి చూసివుండవచ్చు. దాని శుచికి మరియు దాని అత్యంత రుచికి మీరు ఆకర్షింపబడియుండవచ్చు. మరోవైపు, మీరు ఇలా నిర్ణయించుకొని ఉండవచ్చు: ‘శ్రేష్టమైన కాఫీ అంటే ఇలా ఉంటుందని నేను అనుకోవడం లేదు. దాన్ని అతిచిన్న కప్పుల్లో ఇస్తారనడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే కొన్ని గుటకలకంటే ఎక్కువ తాగలేనంత చిక్కగా, చేదుగా ఉంటుంది. అంతేగాక, అందులో నిశ్చయంగా అనారోగ్యకరమైన కెఫేన్ కలిగి ఉంటుంది!’
అయినప్పటికీ, మంచిగా తయారుచేసిన ఎస్ప్రెస్సో చేదుగా ఉంటుందా? మరియు రోజూ తాగే కాఫీ కంటే ఎస్ప్రెస్సో కాఫీలో ఎక్కువ కెఫేన్ ఉంటుందా? వీటి జవాబులు మిమ్మల్ని ఆశ్చర్యపర్చవచ్చు.
అది ఎస్ప్రెస్సో ఎలా అవుతుంది?
వివిధ దేశాలు మరియు వివిధ సంస్కృతులు దానిని తయారుచేయడంలో వారి సొంత విధానాలు కలిగివున్నప్పటికీ, ఎస్ప్రెస్సో ఇటలీలో ఆరంభమైంది. దాని రుచి ఎలా ఉంటుంది? సువాసన గలదని, సారవంతమైనదని, షర్బత్తులాంటిదని, మృదువైనదని, చేదుచేదుగా తీయతీయగా ఉంటుందని ఎస్ప్రెస్సో ప్రియులు వర్ణిస్తారు. చక్కగా కాచిన కప్పుడు ఎస్ప్రెస్సో పైభాగాన్ని క్రెమా—బంగారపురంగు నురుగు—అంటారు, అది మృదువుగా కొంత సువాసనను కలిగివుంటుంది గానీ కష్టంగా తయారవుతుంది.
ఒక్క కప్పులో 30 నుండి 40 మిల్లీలీటర్లు ఉంటుంది. సాధారణంగా కాచిన వెంటనే చక్కెరతో కప్పులో పోయబడుతుంది—చాలా తాజాగా ఉంటుంది!
దాన్నెలా చేస్తారు? ఎస్ప్రెస్సో తయారీ ప్రత్యేకంగా సూత్రీకరించిన కాఫీ గింజలను, ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి (కాని నల్లగా కాదు) మరియు మామూలు కాఫీలా కాకుండా చాలా మెత్తగా పొడి చేయడం ద్వారా ప్రారంభమవుతుంది. అయినా, ఎస్ప్రెస్సోని తయారుచేయడానికి వేయించడం లేక పొడిచేయడం ముఖ్యం కాదు—కాచడం ఏకైక పద్ధతి, ఎందుకంటే ఇక్కడ గురుత్వాకర్షణకు బదులు ఒత్తిడి ఉపయోగిస్తారు. ఒక్క కప్పులో ఉపయోగించిన కొంచెం కాఫీ దగ్గరదగ్గరగా డ్రిప్ కాఫీలో ఉపయోగించిన మూడింట రెండొంతులు ఉంటుంది, కాని చాలా కొంచెం నీళ్లతో. ఈ కాచే విధానం కాఫీ గింజల సువాసనను బయటకు తెస్తుంది.
రెస్టారెంట్లలో గాని కాఫీ షాపుల్లో గాని ఒకటి లేక రెండు కప్పుల కాఫీని మీరు కోరవచ్చు. అయినా ఒక హెచ్చరిక, అజాగ్రత్తతో తయారుచేసిన ఎస్ప్రెస్సో చేదుగా ఉంటుంది. కాబట్టి రెస్టారెంట్లలో లేక కాఫీ హోటళ్లలో ఎస్ప్రెస్సో మీకు ఇవ్వబడినప్పుడు దానిని పరీక్షించండి. ఒకవేళ మీ కప్పు నిండుగా ఉండి లేక కాఫీ పై భాగం క్రెమాతో లేనట్లయితే, మీకు ఎక్కువగా మరగ కాచిన, ఘాటైన కాఫీ ఇచ్చారన్నమాటే.
ఎస్ప్రెస్సోలో ఒక్క కాఫీనే కాకుండా ఇతర పానీయాలు కూడా ఉన్నాయి. ఎస్ప్రెస్సో ఎక్కువ ఘాటుగా ఉన్నట్లు మీరు కనుగొంటే, కమ్మని కాపుసినొ లేక మీగడలాంటి కెఫె లేట్టెనో ఎందుకు ఉపయోగించకూడదు?
గృహ ఎస్ప్రెస్సో కొరకు పరికరాలు
గృహంలో ఎస్ప్రెస్సో పానీయాలు తయారుచేసుకోవాలని మీరు ఇష్టపడుతున్నారా? కమ్మని, తీయని కాఫీ కావాలనుకుంటే ప్రతీ వివరానికి అవధానమివ్వాలి.
ఎటువంటి ఎస్ప్రెస్సో యంత్రాన్ని మీరు కొంటారు? వేయించి, పొడిచేసి డ్రిప్పు పద్ధతిలో చేసే కాఫీ కూడా నిజమైన ఎస్ప్రెస్సోని తయారుచేయలేదు. ప్రత్యేకంగా రూపొందించబడిన పరికరం మీకు అవసరం.
స్టౌ-టాప్ బ్రీవర్స్ రకం తక్కువ ఖరీదైనవి. దీనివల్ల కాఫీ పల్చగా తయారై క్రెమా లేకపోయినప్పటికీ కూడా ఇంట్లో స్టౌ-టాప్ ఎస్ప్రెస్సో ఉండడంవల్ల ప్రజలు తృప్తిపడ్డారు. రిజర్వాయరులో జాగ్రత్తగా కొంచెం నీళ్లు పోయడం ద్వారా లేక మూత తీసిపెట్టడం ద్వారా, మరుగుతున్నప్పుడు మంట ఆర్పివేసి పాత్ర తీసివేయడం ద్వారా మంచి ఎస్ప్రెస్సో మీరు పొందవచ్చు.
కాఫీగుండా నీటిని పంపడానికి ఎలక్ట్రిక్ స్టీమ్ మెషిన్ల స్టీమ్‌ను ఉపయోగించుకుంటారు. మంచి ఫలితాలు మీరు ఎలా పొందవచ్చు? మొదట 30 నుండి 60 మిల్లీలీటర్ల కాఫీ బయటకు వచ్చిన తరువాత దాని ధారను ఆపివేయడం ద్వారా, ఎక్కువ మరగకుండా చేయొచ్చు మరియు పాలు నురుగు వచ్చేంతవరకు కాయడానికి కావలసిన ఆవిరిని నిలువచేయొచ్చు. కాబట్టి, కాఫీ ధారను ఆపుజేయడానికి స్విచ్ లేక వేరే సాధనం ఉన్న మెషీన్ల కోసం చూడండి. స్టీమ్ మెషీన్లు మంచి కాపుసినొస్ మరియు లేట్టెలనబడే కాఫీను తయారుచేస్తుంది కాని, స్టౌవ్-టాప్ బ్రూవర్స్ వలె సూటిగా శ్రేష్టమైన ఎస్ప్రెస్సోని తయారుచేయలేవు.
పిస్టన్ మెషిన్లు సాధారణంగా ఎక్కువ ఖరీదైనవి, కాని శ్రేష్ఠమైన ఎస్ప్రెస్సోను తయారుచేయడానికి సమర్థమైనవి. పిస్టన్ మెషిన్‌ను ప్రయోగించడానికి, హాండిల్‌ను నొక్కిపట్టుకోవడం ద్వారా ఒత్తిడిని పెంచవచ్చు, స్ప్రింగ్-లోడెడ్ పిస్టన్ నొక్కుకొని వేడి నీటి తీవ్రతకు కాఫీ వస్తుంది. కాబట్టి కొంతమంది ప్రజలు పిస్టన్ మిషన్లు ఎంచుకుంటారు, ఎందుకంటే చేతితో అదుపుచేసుకోవడానికి వీలుగా ఉంటాయి, చూడడానికి ఆకర్షణగా ఉంటాయి. అయితే ఉపయోగించడానికి అవి కష్టతరంగా ఉన్నట్లు, చాలా నెమ్మదిగా వేడి అవుతున్నట్లు చాలామంది కనుగొన్నారు.
పంప్ మెషిన్స్ కూడా శ్రేష్ఠమైన ఎస్ప్రెస్సో తయారుచేయుటకు చాలినంత ఒత్తిడిని ఉత్పత్తిచేస్తాయి. పిస్టన్ మెషిన్ల కంటే వాటిని సులభంగా మరియు వేగంగా ఉపయోగించవచ్చు. కాబట్టి, ఎవరికైతే శ్రేష్టమైన ఎస్ప్రెస్సో కావాలో వారు సాధారణంగా పంప్ మెషిన్లనే ఎన్నుకుంటున్నారు. ఈ మెషిన్లకి వేర్వేరు గుణాలుంటాయి, ముఖ్యంగా కొన్ని పంప్ మెషిన్లు ఇతర వాటికంటే ఎక్కువ మన్నికగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుచేసే ముందు వివిధ దుకాణాలు తిరగండి. వారి మెషిన్లను ప్రదర్శించే కొట్లు మంచి ఆచరణలో ఉన్నవాటిని ఎన్నుకొనుటకు మీకు సాధ్యమవుతుంది.
మీరు కొనుగోలు చేసే కాఫీ
తాజాగా వేయించిన గింజలతో చేసే ఎస్ప్రెస్సోను ఎన్నుకోండి. సూపర్‌బజార్లలో అమ్మబడే కాఫీ తాజాది కాదు, కాబట్టి ప్రత్యేకమైన కాఫీ కొట్టును వెదకండి—కొట్టులోనే వేయించేస్తే మంచిది. పొడిచేసిన కాఫీ రోజుల్లోనే పాడైపోతుంది, కాని కాఫీ గింజలు కొన్ని వారాల వరకు నిలిచి ఉంటాయి. కాబట్టి, సాధ్యమైతే, కాఫీ గింజలను కొనుక్కోండి, అవసరానికి తగ్గట్లుగా ఇంట్లో వాటిని పొడిచేసుకోండి. సరిగా పొడిచేసుకోవడం మంచిది, కాని మరీ పిండిలా కాదు. పొడిచేసిన కాఫీ మీరు కొనవలసివస్తే, కొద్ది మొత్తాన్ని కొని దాన్ని తొందరగా వాడండి.
మీ కాఫీని తాజాగా ఉంచడానికి, చిన్న బాక్సులో పోసి గాలి వెళ్లకుండా గట్టిగా మూత పెట్టండి. మీరు దాన్ని రెండు వారాల్లో వాడేటట్లయితే, ఆ చిన్నబాక్సును చల్లగా ఉండే, వెలుతురు లేని స్థలంలో పెట్టండి. లేకపోతే ఫ్రీజర్‌లో పెట్టండి.
కాచడంలో ఉన్న కళ
మంచి పరికరాలు మరియు కాఫీ ఉన్నప్పటికీ, ఎస్ప్రెస్సో తయారుచేసే కళను కొనుక్కోలేము, గానీ నేర్చుకోవాలి. మీరు ఉపయోగించే మెషిన్ ఆధారంగా కాచే పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి, కాబట్టి దానితో వచ్చే నిర్దేశకాలు అనుసరించండి. సరిపడినంత కాఫీ పొడిని ఉపయోగించండి. ఫిల్టర్‌లో కాఫీ గింజలు అంతట అలుముకునేందుకై కొంత స్థలం వదిలి సరిపోయినంత మాత్రమే వేయండి. ఫిల్టర్‌లో కాఫీ పూర్తిగా నింపి, గట్టిగా మూయడం కొంత అనుభవంతోకూడినది, గింజల అడుగు భాగం నుండి నీరు మెల్లగా, సమానంగా ప్రవహిస్తూ, రుచిని పూర్తిగా భద్రం చేస్తుంది.
చేయకూడని ఒక పొరపాటేమిటి? కాఫీ గింజలను ఎక్కువగా కాచడం. ఒక చిన్న కప్పు 60 నుండి 90 మిల్లీలీటర్ల ఎస్ప్రెస్సోని మరగ కాచితే, అది నిస్సారంగా, చేదుగా అవుతుంది. ఎస్ప్రెస్సోని పొందడానికి బదులు, చిక్కటి డ్రిప్ కాఫీని పోలిన దానిని మీరు పొందవచ్చు గాని—మీరు ఆశించింది కాదు.
కాబట్టి, ముఖ్యంగా కాచడం ఎప్పుడు ఆపివేయాలన్నదే తెలుసుకోవాలి. ఎస్ప్రెస్సో 30 నుండి 40 మిల్లీలీటర్ల ద్రవాన్ని 20 నుండి 25 సెకండ్లలో కాచగలదు అని నిపుణులు సూచించారు. ఈ స్థానంలో గింజల సారాన్ని సమగ్రంగా తీయాలి మరియు వాటిని పారవేయాలి.
రెట్టింపు ఎస్ప్రెస్సోని మీరు కాచేటప్పుడు కూడా “కొంచెం సేపు కాచినా అది ఎక్కువే.” కాఫీని ఎంత కొంచెం కాస్తే తాగడానికి అంత తీయగా ఉంటుంది. రెండుమార్లు ఇవ్వడం విభిన్నంగా ఉండవచ్చు, కాని దాదాపు ఒక కప్పుతోనే రెట్టింపు కాఫీ ఇవ్వడానికి కాఫీ గింజలను రెండుసార్లు ఉపయోగించాలి.
కెఫెనే సంగతి ఏమిటి?
రోజూ తాగే ఓ కప్పు కాఫీ కంటే ఒక్క కప్పు ఎస్ప్రెస్సోలో తక్కువ కెఫెనే ఉండవచ్చు. అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందా? ఎస్ప్రెస్సోకు అత్యధికమైన అవధానం ఎలా ఇవ్వబడుతుంది?
ఒక కారణం ముదురు రంగులో వేయించడం. ముదురుగా వేపిన దానిలో తక్కువ కెఫెన్ ఉంటుంది. అంతేకాకుండా, కాఫీ సూపర్ బజార్లలో రేకుడబ్బాల్లో వేసి ఉపయోగించే రోబుస్టా గింజల్లో ఉన్నదానికంటే గుర్తించదగిన ప్రత్యేక అరాబికా అనబడే కాఫీ గింజల్లో తక్కువ కెఫెన్ ఉంటుంది.
కాని ముఖ్య విషయమేమంటే అందులోని మొత్తం. రోజూ తాగే కాఫీ కంటే ఒక మిల్లీలీటరు ఎస్ప్రెస్సో కాఫీలో ఎక్కువ కెఫేన్ ఉంటుంది, వాస్తవానికి కప్పులో కొంచెం ద్రవం కూడా ఉంటుంది. కాబట్టి, రోజూ తాగే 180 మిల్లీలీటర్ల కాఫీలో 100 లేక కొంచెం ఎక్కువ మిల్లీగ్రాముల కెఫేన్ ఉంటుంది, అయితే ఒక కప్పు ఎస్ప్రెస్సోలో అంతకంటే తక్కువే కెఫేన్ ఉంటుందని కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి.
అయినప్పటికీ, వివిధ పరిశోధనా ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి. కెఫేన్ యొక్క పరిమాణం అనేది ఉపయోగించబడిన గింజలపైనా, కాచేపద్దతిపైనా ఆధారపడివుంటుంది. ఒకే దానిలో కంటే రెండింతల ఎస్ప్రెస్సోలో ఎక్కువ కెఫేన్ ఉండవచ్చు. కెఫేన్ ఎంత మట్టం ఉందని నిర్ణయించుకోవడానికి మీకు మంచి మార్గదర్శకం ఏమిటంటే బహుశా మీరు తాగిన తరువాత మీరు గ్రహించే పద్ధతే. ఎస్ప్రెస్సోలో ఉన్న కెఫేన్ శాతం తగ్గించాలని మీరు కోరుకున్నట్లయితే, మీరు కోరినంత కెఫేన్ మోతాదు ప్రకారం, మామూలు ఎస్ప్రెస్సో రోస్ట్‌ని గాని లేక కెఫేన్ని తీసివేసే ఎస్ప్రెస్సో రోస్ట్‌ని గాని ఉపయోగించండి.
ఎస్ప్రెస్సోని మీ సొంత వంటగదిలో కాచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పట్టుదల ఉంటే మంచి ఫలితాలు వస్తాయి, కాబట్టి మీ సొంత ప్రయోగాన్ని చేయండి—మీ స్నేహితులకి ఇవ్వకముందు మీకైమీరు రుచిచూడండి. పాలను మరగపెట్టడానికి మరియు క్రెమాను ఉత్పత్తిచేయడానికి మీకు అనుభవం కావాలి. మీ పట్టుదల, స్థానిక కాఫీ షాపుల్లో కంటే మంచి రుచికరమైన ఎస్ప్రెస్సో పానీయాలతో మీ స్నేహితుల్ని మీరు సంతోషపరచాలనే కోరిక మంచి ఫలితాన్నిస్తుంది. ఎస్ప్రెస్సో ఎంతో సారంగలదని మీరు అంగీకారానికి వస్తారు.
[21వ పేజీలోని బాక్సు]
పాలను కాచడానికి నిర్దేశకాలు
కాపుసినోస్ మరియు లేట్టెల కోసం పాలను కాచడానికి మరియు/లేక పాలను ఆవిరిపట్టడానికి, ఒక స్టీల్‌పిచరు, చల్లని పాలు, మరియు ఒక పాల స్టీమరు మీకు అవసరం. పాలను ఆవిరిపట్టడానికి ఎస్ప్రెస్సో పరికరంలో పొడవైన సన్నని చువ్వ లేనట్లయితే, స్టాండ్-ఎలోన్ అనే సాధనాన్ని కొనండి.
1. సగం వరకు స్టీల్‌పిచర్ని చల్లటి పాలతో నింపండి.
2. పాల ఉపరితలంపై స్టీమ్‌చేసే పరికరాన్ని పెట్టి, స్టీమ్ వాల్వ్‌ని తెరవండి.
3. స్టీమ్ పరికరపు కొన పైభాగాన్ని వారగా పెట్టండి, పిట్చర్‌ను కిందికి దింపడం ద్వారా కాచడానికి ఎక్కువ గాలిని మీరు చేర్చవచ్చు.
4. పట్టుకోవడానికి పిచర్ చాలా వేడి అయినప్పుడు అది సరైన ఉష్ణోగ్రతకి చేరుకున్నట్టు.
5. స్టీమ్ వాల్వ్‌ని మూసి, దాని క్రింద నుండి పిచర్‌ను తొలగించండి. తరువాత స్టీమ్ వాల్వ్‌ని తెరిచి పాలు మిగిలి ఉంటే శుభ్రంచేసి, తడి బట్టతో తుడిచివేయండి.
[22వ పేజీలోని చిత్రం]
పొడి చేసిన కాఫీ కంటే కాఫీ గింజలు చాలా కాలం తాజాగా ఉంటాయి.
స్టీమ్ ఎస్ప్రెస్సో పరికరం