కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 10/8 పేజీలు 9-11
  • ప్రేమించడం నేర్పిన ప్రజలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేమించడం నేర్పిన ప్రజలు
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ప్రేమను ధరించుకొనుడి”
  • ద్వేషం స్థానంలో ప్రేమ
  • త్వరలోనే ద్వేషం ఇక ఎన్నడూ లేకుండా పోతుంది
  • ద్వేషాన్ని నిర్మూలించే ఏకైక మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ప్రేమ యొక్క ఉత్కృష్టమైన విధానం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ప్రేమతో బలపర్చబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 10/8 పేజీలు 9-11

ప్రేమించడం నేర్పిన ప్రజలు

ప్రేమనేది మెప్పుదలపైనా, ఉపకారబుద్ధిపైనా లేక పంచుకొనిన ఆసక్తులపైనా ఆధారపడిన అనురాగం. ప్రేమనేది హృదయపూర్వకమైన సన్నిహితత్వం. అది నిస్వార్థమైనది, యథార్థమైనది, అది ఇతరుల శ్రేయస్సు ఎడల జాలితోకూడిన శ్రద్ధను చూపిస్తుంది. ప్రేమ ద్వేషానికి పూర్తిగా వ్యతిరేకమైనది. ద్వేషంచే ప్రేరేపించబడ్డ ఓ వ్యక్తి తన స్వంత కోపంతో తానే దహించుకుపోతాడు; ప్రేమచే ప్రేరేపించబడ్డవాడు ఇతరులను గూర్చి ఆలోచిస్తాడు.

ప్రేమా లేక ద్వేషమా—మీ జీవితాన్ని ఏది శాసిస్తుంది? దీని జవాబుపై మీ నిత్య భవిష్యత్‌ ఆధారపడివుంది గనుక ఇది ఎంతమాత్రం ఊసుబోని ప్రశ్న కాదు. ద్వేషించమని బోధించిన లోకంలో జీవిస్తుండగా, లక్షలాదిమంది ప్రజలు ప్రేమించడం నేర్చుకుంటున్నారు. దీనిని వాళ్లు నూతన వ్యక్తిత్వాన్ని ధరించడం ద్వారా చేస్తున్నారు. వాళ్లు కేవలం ప్రేమను గురించే మాట్లాడడం లేదు; దాన్ని ఆచరించడానికి తీవ్రంగా కృషిసల్పుతున్నారు.

మీరు ఎప్పుడైనా యెహోవాసాక్షుల కూటానికి గనుక హాజరైవుంటే, మీరక్కడ చూచిన దాన్నిబట్టి బహుశా ముగ్ధులై ఉంటారు. ఏ దేశానికి చెందిన వారైనప్పటికీ, యెహోవాసాక్షులు ఆరాధనలో ఐక్యపర్చబడ్డారు. వాళ్లు నిజంగా అంతర్జాతీయ సహోదరత్వంగా రూపొందారు. దీన్ని వారి స్థానిక సంఘాల్లోనూ, సమావేశాల్లోనూ గమనించవచ్చు, అయినా బేతేలు కుటుంబాలని వాళ్లు పిలిచే వాటిలో ఇది మరి శ్రేష్ఠంగా కనబడవచ్చు. బైబిలు సాహిత్యాల్ని ఉత్పత్తి చేసి, పంపిణీచేస్తూ, కుటుంబంగా కలిసిమెలసి పనిచేసి జీవించే స్వచ్ఛంద సేవక గుంపులే ఇవి. ప్రతీ దేశంలోనూ యెహోవాసాక్షులు చేసే పనిని, వారిలో కొందరు పర్యవేక్షిస్తారు. 1997 నాటికి 233 దేశాల్లో 82,000 సంఘాలకు పైగా ఇందులో చేరివున్నందున ఇది చిన్నపనేమీ కాదు. ఈ అవసరాన్ని తీర్చేందుకు, ప్రపంచ ప్రధాన కార్యాలయాల్లోనూ 103 దేశాల్లో ఉన్న వివిధ చిన్న బ్రాంచ్‌లతోపాటూ, ప్రపంచవ్యాప్తంగా బేతేలు కుటుంబాల్లో 16,000 మందికి పైగా పని చేస్తున్నారు.

ఏ ఏ దేశాల్లో బ్రాంచ్‌ కార్యాలయాలు ఉన్నాయో ఆయా దేశాల పౌరులతోనే ప్రధానంగా బేతేలు కుటుంబాల్లోని అనేకం రూపొందించబడ్డాయి. కానీ పూర్తిగా కాదు. కొన్ని బేతేలు కుటుంబాలు వివిధ దేశాల, జాతుల లేక తెగల నేపథ్యం నుండీ వేర్వేరు మతాల నేపథ్యం నుండీ వచ్చిన సాక్షులతో రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, జర్మనీలోని జల్‌టర్స్‌లో ఉన్న బేతేలు కుటుంబంలో ఇంచుమించు 1,200 మంది ఉన్నారు, వారంతా దాదాపుగా 30 దేశాలకు చెందినవారు. వాళ్లు శాంతి ఐక్యతలతో, ద్వేషరహిత వాతావరణంలో కలిసి మెలసి జీవిస్తూ, పనిచేస్తూ ఆరాధిస్తూ ఉండేలా చేసిందేమిటి? కొలొస్సయులు 3:14 వచనంలో బైబిలు ఇచ్చిన సలహాను వాళ్లు అనుసరిస్తున్నారు. అదిలా చెబుతోంది:

“ప్రేమను ధరించుకొనుడి”

వస్త్రధారణతో ఎవ్వరూ జన్మించరు, దాన్ని గురించి ఊరకే మాట్లాడడం ద్వారా ఎవ్వరూ వస్త్రధారులైపోరు. ఒకడు వస్త్రాల్ని ధరించడం నిర్దిష్టమైన నిర్ణయాల్ని తీసుకునేలా, వాటిని అనుసరించడంలో కృషిసల్పేలా చేస్తుంది. అదే విధంగా, ప్రేమను ధరించుకొని ఎవ్వరూ జన్మించరు. దాన్ని గురించి కేవలం మాట్లాడడమే సరిపోదు. ప్రయత్నం అవసరం.

వస్త్రధారణ అనేక ప్రయోజనాల్ని నెరవేరుస్తుంది. అది శరీరాన్ని కాపాడుతుంది, మర్మావయవాల్నీ లేక శరీర లోపాల్నీ కప్పుతుంది, అలాగే కొంత మేరకు ఓ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్నీ బయల్పరుస్తుంది. ప్రేమ కూడా అంతే. నీతియుక్త సూత్రాల ఎడలా, సరియైన సహవాసం ఎడలా గల ప్రేమ, అపాయకరమైన సహవాసాన్నీ లేక స్థలాల్నీ విడనాడేలా ఒకర్ని ప్రేరేపిస్తుంది గనుక అది ఓ రక్షణగా పనిచేస్తుంది. అది మనకు ప్రియమైనవై ఉండాల్సిన వ్యక్తిగత బాంధవ్యాల్ని కాపాడేందుకు పనిచేస్తుంది. ప్రేమించే వాడు తిరిగి ప్రేమించబడతాడు, ఇతరులకు హాని కల్గించకుండా ఉండేవాడు, తనకు తాను హానిని కల్గించుకోడు.

తోటి మానవులకు కలత కల్గించేవని రుజువయ్యే మన వ్యక్తిత్వం యొక్క అత్యంత సిగ్గుకరమైన లక్షణాల్ని కూడా కప్పుతుంది. గర్విష్టులూ, అహంకారులూ, స్వార్థపరులూ, ప్రేమలేనివారూ అయిన వ్యక్తులలోని చిన్న చిన్న లోపాలకన్నా ప్రేమగల వ్యక్తుల్లోని చిన్న చిన్న లోపాల్ని చూసీచూడనట్టు మనం ఉండమా?

ప్రేమను ధరించుకున్న ప్రజలు, క్రీస్తులాంటి వ్యక్తిత్వపు అందాన్ని కనబరుస్తారు. వారి భౌతిక అందం కేవలం బాహ్యమైనదై ఉండగా, ఆధ్యాత్మిక అందం యావత్తు వ్యక్తిత్వంలో చొచ్చుకుపోతుంది. భౌతిక అందాన్నిబట్టిగాక వారి యథార్థమైన స్నేహపూర్వక వ్యక్తిత్వాన్నిబట్టి సౌందర్యవంతులుగా మీరు పరిగణించిన ప్రజల్ని బహుశా మీరెరిగే ఉంటారు. మరో వైపున, నిజమైన వ్యక్తిత్వం తేటతెల్లమైన వెంటనే, తమ సమ్మోహనశక్తికి సంబంధించిన ప్రతీ జాడనూ మన కళ్లెదుటే కోల్పోయిన అందమైన స్త్రీ పురుషులను మనలో అనేకులం చూశాం. ప్రేమను ధరించుకున్న ప్రజలమధ్య ఉండడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా!

ద్వేషం స్థానంలో ప్రేమ

1994లో జర్మనీలోని 1,45,958 మంది యెహోవాసాక్షులపై జరిపిన సర్వే ద్వారా ఆ ద్వేషం స్థానంలో ప్రేమను ఉంచవచ్చుననే విషయం ఉదాహరించబడింది.

మితిమీరి త్రాగడం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, నేరం, జూదం, సంఘ విద్రోహక లేక హింసాత్మక ప్రవర్తన వంటివన్నీ ఏదో ఒక విధంగా ద్వేషాన్ని సులభంగా రెచ్చగొట్టగల్గే స్వార్థం యొక్క వివిధ రూపాలే. కానీ సాక్షులు ప్రకటించిన బైబిలు ఉన్నత ప్రమాణాల్ని చేరుకునేందుకు తాము ఈ సమస్యల్లో ఒకటో లేక అంతకన్నా ఎక్కువో అధిగమించాల్సి వచ్చిందని ఇంటర్వ్యూ చేయబడిన వారిలో 38.7 శాతం మంది తెలియజేశారు. దేవుని ఎడలా, ఆయన నీతియుక్తమైన ప్రవర్తనా ప్రమాణాల ఎడలా గల ప్రేమ, అలా చేయడానికి వారిని ప్రేరేపించింది. తరచూ వ్యక్తిగత ప్రాతిపదికపైనే యెహోవాసాక్షులు ప్రేమపూర్వక సహాయాన్ని అందించారు. గత ఐదేళ్ల కాలంలో (1992-1996), అన్నిటిని జయించే ప్రేమతో ద్వేషాన్ని లొంగదీసుకుంటూ, మార్పుల్ని చేసుకునేందుకు 233 దేశాల్లో 16,16,894 మంది వ్యక్తులు సహాయాన్ని పొందారు.

తమ వివాహజీవితాల్లో నిస్వార్థపూరితమైన ప్రేమను అన్వయించడం ద్వారా, యెహోవాసాక్షులు స్థిరమైన బాంధవ్యాల్ని సాధిస్తారు. కొన్ని దేశాల్లో ప్రతీ రెండు లేక మూడు వివాహాల్లో ఒకటి విడాకులతో అంతమౌతుంది. కానీ ప్రస్తుతం సాక్షుల్లో 4.9 శాతం మంది మాత్రమే తమ వివాహ జతల నుండి విడాకులు తీసుకున్నారు లేక వేరైపోయారు అని పైన ప్రస్తావించబడిన సర్వే సూచిస్తుంది. అయితే, వీరిలో ఎక్కువమంది, తాము యెహోవాసాక్షులు కాక మునుపే విడాకులు తీసుకున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు.

ప్రేమా స్వరూపియైన దేవుడు తనను ప్రేమించే వారికి తన మార్గాల్ని గురించి బోధించే మహోపదేశకుడై ఉన్నందున, యెహోవాసాక్షులు తమ ప్రేమను మొట్టమొదటగా ఆయన వైపే మళ్లిస్తారు. ‘దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించే’ ఇతర ప్రజల వలెగాక, యెహోవాసాక్షులు దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తారు. (2 తిమోతి 3:4) నైతిక సూత్రాల్లేని ఈ లోక మార్గాలకు భిన్నంగా, సగటు సాక్షి తన మతపరమైన కార్యకలాపాల్లో వారానికి 17.5 గంటలు గడుపుతాడు. సాక్షులు ఆధ్యాత్మిక మనస్సుగల వారనే విషయం సుస్పష్టం. వాళ్లను సంతోషపర్చే విషయమదే. యేసు ఇలా చెప్పాడు: “ఆత్మ [“ఆధ్యాత్మిక,” NW] విషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.”—మత్తయి 5:3.

దేవుని నిజమైన సేవకులు మానవులకు భయపడాల్సిన అవసరం లేదని 118వ కీర్తన రాసిన రచయిత చెబుతున్నాడు. “యెహోవా నా పక్షమున నున్నాడు. నేను భయపడను నరులు నా కేమి చేయగలరు?” (6వ వచనం) దేవునియందలి పూర్ణ నమ్మకం ద్వేషానికీ, ఇతర మానవులకు భయపడడానికీ గల కారణాల్లో ఒకదాన్ని తొలగిస్తుంది.

దేవుడు “దీర్ఘశాంతు[డు] కృపాసత్యములతో నిండినవా[డు]” అని ఎరిగిన క్రైస్తవుడు, ద్వేషానికి అదనపు కారణమైవుండగలిగే కోపాన్ని తన జీవితంలో నుండి తుడిచివేయడానికి కృషి చేస్తాడు. సాత్వికము, ఆశానిగ్రహములతో పాటూ దేవుని ఆత్మఫలాల్ని వృద్ధిచేసుకోవడంవల్ల అతడు దీన్ని సాధిస్తాడు.—కీర్తన 86:15; గలతీయులు 5:22, 23.

నిజమైన క్రైస్తవుడు నమ్రతగా ఉంటాడు, తనను తాను ఎంచుకొనతగిన దానికంటె మరింత ఎక్కువగా ఎంచుకొనడు. (రోమీయులు 12:3) ఇతరులతో తనకుగల వ్యవహారాల్లో ప్రేమను వృద్ధిచేసుకుంటాడు. ద్వేషానికి భిన్నంగా, ప్రేమ “త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.”—1 కొరింథీయులు 13:5.

అవును, భయం, కోపం లేక గాయపడిన భావన ప్రజలు ద్వేషించడానికి కారణం కాగలదు. కానీ ద్వేషానికి మూలకారణమైన దాన్ని తొలగించడం ద్వారా ప్రేమ దానిపై విజయాన్ని సాధిస్తుంది. నిజానికి, “దేవుడు ప్రేమాస్వరూపి” గనుక ప్రేమ విశ్వంలో అత్యంత శక్తివంతమైంది.—1 యోహాను 4:8.

త్వరలోనే ద్వేషం ఇక ఎన్నడూ లేకుండా పోతుంది

స్వార్థమూ, ద్వేషమూ దేవుని వ్యక్తిత్వంలో భాగం కావు గనుక అవి నిరంతరం నిలిచివుండలేవు. నిరంతరం నిలిచే ప్రేమ వాటిని తీసివేసి వాటి స్థానంలో రావాలి. తొలగించబడడం కూడా అవసరం. ద్వేషరాహిత్యంతోనూ, ప్రేమతోనూ నింపబడిన ప్రపంచమే మీరు ఎదురుచూసే ప్రపంచమైతే, ఆ ప్రపంచాన్ని చూసేందుకై జీవించి ఉండడానికి అవసరమైన వాటిని బైబిలులో నుండి మీకు వివరించడానికి యెహోవాసాక్షుల్ని అనుమతించండి.

అవును, ‘ప్రేమా లేక ద్వేషమా—ఏ లక్షణం నా జీవితాన్ని శాసిస్తోంది?’ అని మనలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఇది ఎంతమాత్రం ఊసుబోని ప్రశ్నకాదు. ద్వేషానికి దేవుడైన దేవుని శత్రువును అనుసరించే వ్యక్తి ఎంతో కాలం జీవించడు. ప్రేమామయుడైన దేవుడగు యెహోవాను అనుసరించే వ్యక్తి నిరంతరం జీవిస్తాడు!—1 యోహాను 2:15-17.

[10వ పేజీలోని చిత్రం]

నేడు కూడా ప్రజలు ప్రేమను ధరించుకోగలరు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి