కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 9/8 పేజీలు 10-11
  • పరిష్కారం ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిష్కారం ఏమిటి?
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • శరణార్థులు లేని లోకం
  • ‘సంతోషంతో యెహోవాను సేవించేలా’ పరదేశులకు సహాయం చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • పెరిగిపోతున్న శరణార్థుల సంఖ్య
    తేజరిల్లు!—1996
  • శరణార్థుల ఆటుపోట్లు—లక్షలమంది యుక్రెయిన్‌ను వదిలి వెళ్లిపోయారు
    అదనపు అంశాలు
  • బ్రతుకు చితికి, గూడు చెదిరిన వాళ్లలో దేవుడు నింపుతున్న ఆశ
    అదనపు అంశాలు
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 9/8 పేజీలు 10-11

పరిష్కారం ఏమిటి?

శరణార్థుల పరిస్థితి పూర్తి దుర్భరంగాలేదు. ప్రపంచమంతటా, యుద్ధం మరియు ఇతర సమస్యల కారణంగా నివాస స్థలాన్ని పోగొట్టుకున్న వారికి సహాయం చేసేందుకు మానవహిత సంస్థలు కృషి చేస్తున్నాయి. శరణార్థులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు తోడ్పడటం ద్వారా వారు ప్రాముఖ్యంగా సహాయం చేస్తున్నారు.

తాము హత్యకు గురౌతామని, హింసింపబడతామని, అత్యాచారానికి గురౌతామని, జైలులో వేయబడతామని, బానిసలుగా చేయబడతామని, దోచుకోబడతామని లేక పస్తులుండ వలసి వస్తుందని శరణార్థులు భయపడతారు గనుక వారు తమ గృహాన్ని, సమాజాన్ని మరియు తమ దేశాన్ని కూడా వదలి వెళ్లిపోతారు. కాబట్టి, శరణార్థులు ఇంటికి తిరిగి క్షేమంగా రాగలిగే ముందు, వారు పారిపోయేందుకు కారణమైన సమస్యలు పరిష్కరింపబడాలి. సాయుధ పోరాటాలు తుదకు అంతమొందినప్పుడు కూడా, శాంతిభద్రతలు లోపించడం ప్రజలు తిరిగి ఇంటికి వెళ్లకుండా వారిని నిరుత్సాహపరుస్తుంది. ఆరుగురు పిల్లల తల్లి మరియు ఓ రువాండా శరణార్థియైన ఆగ్నస్‌ ఇలా చెప్పింది: “మమ్మల్ని రువాండాకు [వెనక్కి] తీసుకెళ్లడం మమ్మల్ని మా సమాధుల్లోకి తీసుకెళ్లినట్టు ఉంటుంది.”

అయినప్పటికీ, 1989 నుండి 90 లక్షలకంటే ఎక్కువమంది శరణార్థులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. వీరిలోనుండి దాదాపు 36 లక్షలమంది ఇరాన్‌ మరియు పాకిస్తాన్‌ల నుండి ఆఫ్‌ఘనిస్థాన్‌కు వచ్చారు. ఆరు దేశాల్లో ఉండిన మరో 16 లక్షలమంది శరణార్థులు, 16 సంవత్సరాల అంతర్యుద్ధం వలన ధ్వంసమైన దేశమగు మొజాంబిక్‌కు తిరిగి వచ్చారు.

తిరిగి రావడం సులభం కాదు. శరణార్థులు ఏ దేశానికి తిరిగి వస్తారో అవి తరచూ శిథిలమై ఉంటాయి, దానిలోని గ్రామాలు నాశనమై, వంతెనలు కూలిపోయి, దారులు మరియు పొలాలు మందుపాతరల్లా ఉంటాయి. అలా, తిరిగి వచ్చిన శరణార్థులు ఆ చెత్తాచెదారంలో నుండి తమ జీవితాలను మాత్రమే కాక తమ ఇళ్లను, పాఠశాలలను, ఆరోగ్య కేంద్రాలను, అన్నింటినీ పునఃనిర్మించుకోవలసి ఉంటుంది.

అయిననూ, శరణార్థులు తిరిగి వచ్చేందుకు వీలు కలిగిస్తూ పోరాట జ్వాలలు ఒక స్థలంలో ఆరిపోతే, శరణార్థుల క్రొత్త ధారను సృష్టిస్తూ మరోచోట అవి రగులుకుంటాయి. కాబట్టి, శరణార్థి సంక్షోభాన్ని పరిష్కరించడమంటే, దాని సంబంధిత సమస్యలైన యుద్ధం, అణచివేత, ద్వేషం, హింస మరియు తమ జీవితాలను కాపాడుకునేందుకు ప్రజలు పారిపోయేలా చేసే ఇతర కారకాలను పరిష్కరించడమని అర్థం.

ప్రపంచ శరణార్థుల పరిస్థితి 1995 (ఆంగ్లం) ఇలా అంగీకరిస్తుంది: “చేదు నిజం . . . ఏమిటంటే, [శరణార్థి సంక్షోభానికున్న] పరిష్కారాలు ఏ మానవహిత సంస్థ అదుపులోను లేని రాజకీయ, సైనిక మరియు ఆర్థిక కారకాలపై పూర్తిగా ఆధారపడివున్నాయి.” బైబిలు ప్రకారం, ఆ పరిష్కారాలు ఏ భూసంబంధ సంస్థ అదుపులోనూ అంటే అది మానవహిత సంస్థ అయినా కాకపోయినా దాని అదుపులో లేవు.

శరణార్థులు లేని లోకం

అయితే, ఒక పరిష్కారం ఉంది. తమ గృహాలకు, కుటుంబాలకు దూరమైన వారి ఎడల యెహోవా శ్రద్ధ కలిగి ఉన్నాడని బైబిలు చూపుతుంది. ఈ భూమిపైనున్న ప్రభుత్వాలవలె కాక, మానవజాతి ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలన్నింటినీ పరిష్కరించగల శక్తి మరియు జ్ఞానం ఆయనకు ఉన్నాయి. ఆయన తన రాజ్యం ద్వారా అంటే భూమి యొక్క పరిస్థితులను అన్నింటినీ త్వరలో నియంత్రించే పరలోక ప్రభుత్వం ద్వారా అలా చేస్తాడు.

దేవుని రాజ్యం అన్ని మానవ ప్రభుత్వాల స్థానాన్ని ఆక్రమిస్తుంది. మనకు ప్రస్తుతం ఉన్నట్లు భూమిపై అనేక ప్రభుత్వాలు ఉండే బదులు, పూర్తి గ్రహాన్ని అంతటినీ పరిపాలించే ఒకే ప్రభుత్వం ఉంటుంది. బైబిలు ఇలా ప్రవచిస్తోంది: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.

బైబిలులో మత్తయి 6:9-13 నందు కనుగొనబడే మాదిరి ప్రార్థన మీకు సుపరిచితమే అయ్యుండవచ్చు. ఆ ప్రార్థనలోని కొంతభాగం ఇలా చెబుతుంది: “నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” ఆ ప్రార్థనకు సమన్వయంగా, భూమి కొరకు దేవుడు కలిగివున్న సంకల్పాన్ని నెరవేర్చేందుకు దేవుని రాజ్యం త్వరలో ‘వస్తుంది.’

దేవుని రాజ్యం యొక్క ప్రేమపూర్వక పరిపాలన క్రింద, విశ్వశాంతి భద్రతలు విలసిల్లుతాయి. భూమిపైనున్న ప్రజల మధ్య మరియు దేశాల మధ్య ద్వేషం, పోరాటం ఇక ఎంతమాత్రం ఉండవు. (కీర్తన 46:9) ఇక మళ్లీ ఎప్పుడూ కోట్లాది మంది శరణార్థులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోరు లేక శిబిరాల్లో మగ్గిపోరు.

దేవుని రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు “దరిద్రులు మొఱ్ఱపెట్టగా . . . వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును” అని దేవుని వాక్యం వాగ్దానం చేస్తుంది.—కీర్తన 72:12-14.

[10వ పేజీలోని చిత్రం]

త్వరలో అందరూ ఒకరితో ఒకరు నిజమైన సహోదరసహోదరీలవలె వ్యవహరిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి