కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 7/8 పేజీలు 21-23
  • లైమ్‌ వ్యాధి—మీరు ప్రమాదంలో ఉన్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లైమ్‌ వ్యాధి—మీరు ప్రమాదంలో ఉన్నారా?
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పురుగులు, దుప్పి, మీరు
  • లక్షణాలు, సమస్యలు
  • చికిత్స, నివారణ
  • ఎందుకు మళ్ళీ ప్రారంభమైంది?
    తేజరిల్లు!—2003
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1997
  • నా ఆరోగ్య సమస్యతో నేనెలా జీవించాలి? (3వ భాగం)
    యువత అడిగే ప్రశ్నలు
  • కీటక సంక్రమిత వ్యాధులు పెరుగుతున్న సమస్య
    తేజరిల్లు!—2003
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 7/8 పేజీలు 21-23

లైమ్‌ వ్యాధి—మీరు ప్రమాదంలో ఉన్నారా?

ఎయిడ్స్‌ పతాక శీర్షికలకెక్కుతుండగా, లైమ్‌ వ్యాధి మాటే వినపడడం లేదు. అయినా, లైమ్‌ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుంది. నిజానికి, కొన్ని సంవత్సరాల క్రితం, ద న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజిన్‌ దాన్ని “ఎయిడ్స్‌ తరువాత [అమెరికా]లో అత్యంత వేగంగా పెరుగుతున్న అంటువ్యాధి” అని పిలిచింది. ఇతర ప్రాంతాలనుండి వస్తున్న నివేదికలు ఈ వ్యాధి ఆసియా, యూరప్‌ దక్షిణ అమెరికాల్లో కూడా వ్యాపిస్తుందని తెలుపుతున్నాయి.

లైమ్‌ వ్యాధి ఏమిటి? అదెలా వ్యాపిస్తుంది? మీరు ప్రమాదంలో ఉన్నారా?

పురుగులు, దుప్పి, మీరు

దాదాపు 20 సంవత్సరాల క్రితం, అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలోవున్న కన్నెక్టికట్‌లోని లైమ్‌ పట్టణంలోను, దాని చుట్టు ప్రక్కల అర్ధ్రైటిస్‌ కేసుల్లో అర్థం కాని పెరుగుదల సంభవించింది. దానిబారిన పడినవారు ఎక్కువగా పిల్లలే. వారి అర్ధ్రైటిస్‌, రాష్‌లు, తలనొప్పులు, కీళ్ల నొప్పులతో మొదలైంది. త్వరలోనే తన “భర్త, ఇద్దరు పిల్లలు ఊతకర్రలకు పరిమితమయ్యారు” అని ఒక నివాసి చెబుతుంది. ఎంతో కాలం కాకముందే, ఆ ప్రాంతంలో 50 మందికి పైగా దానికి గురయ్యారు, కొన్ని సంవత్సరాలలోనే వేలాదిమంది అవే బాధాకరమైన లక్షణాలతో బాధపడుతున్నారు.

పరిశోధకులు ఇతర జబ్బుల కంటే ఇది వేరుగా ఉందని గుర్తించి, దానికి లైమ్‌ వ్యాధి అని నామకరణం చేశారు. దాని కారకం? పురుగుల్లో ఉండే బొర్రీలియా బర్జ్‌డోర్ఫెరి అనే ఒక కార్కుస్క్రూ ఆకారం కలిగివున్న సూక్ష్మజీవి. అదెలా వ్యాపిస్తుంది? అడవిలో అలా వాహ్యాళికి వెళ్లిన ఒక వ్యక్తికి ఇన్ఫెక్ట్‌ అయిన ఒక పురుగు అంటుకోవచ్చు. ఆ పురుగు వాహ్యాళికి వెళ్లిన అభాగ్యుడైన ఆ వ్యక్తి చర్మాన్ని గ్రుచ్చి వ్యాధిని కలుగజేసే సూక్ష్మ క్రిములను లోపలికి పంపిస్తుంది. ఇన్ఫెక్ట్‌ అయిన ఈ పురుగులు తరుచూ ఒక దుప్పినుండి ఇంకొక దుప్పి దగ్గరికి వెళ్తూ, ఆహారానికి వాటిపై ఆధారపడుతూ, వాటిపైనే జతకడతాయి గనుక, దుప్పులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు నివాసం ఏర్పర్చుకుంటున్నారు గనుక లైమ్‌ వ్యాధి పెరుగుతుండడంలో ఆశ్చర్యం లేదు.

లక్షణాలు, సమస్యలు

లైమ్‌ వ్యాధి మొదటి లక్షణం సాధారణంగా ఒక చిన్న ఎర్రని చుక్కతో ప్రారంభమయ్యే స్కిన్‌ రాష్‌ (ఎరిథిమా మైగ్రాన్స్‌, లేక EM అని పిలువబడుతుంది). కొన్ని రోజులు లేక వారాల తరబడి ఈ మచ్చే గుండ్రని, కోణీయ, లేక అండాకార రాష్‌ చిన్న నాణెం పరిమాణంలోకి పెరుగుతుంది లేక వీపు భాగమంతా వ్యాపించవచ్చు. జ్వరం, తలనొప్పి, మెడ పట్టుకోవడం, వళ్లు నొప్పులు, అలుపు కూడా రాష్‌కు తోడు కావచ్చు. సమయానికి చికిత్స చేయకపోతే, సగం కంటే ఎక్కువ మంది బాధితులు కొన్ని నెలలపాటు ఉండే కీళ్లవాపులకు గురి కావచ్చు. చికిత్స చేసుకోని 20 శాతంమంది వరకు దీర్ఘకాలిక అర్ధ్రైటిస్‌కు బలి కావచ్చు. సామాన్యంగా ఇది అరుదైనప్పటికీ, ఈ వ్యాధి నాడీ వ్యవస్థను కూడా దెబ్బ తీసి గుండె జబ్బులను కూడా కలుగజేయవచ్చు.—ఈ శీర్షికలో ఉన్న బాక్సు చూడండి.

అనేకమంది నిపుణులు లైమ్‌ వ్యాధిని నిర్ధారణ చేయడం కష్టమని కనుగొంటారు. ఎందుకంటె దాని ఫ్లూవంటి తొలి లక్షణాలు ఇతర ఇన్‌ఫెక్షన్లను పోలివుంటుంది. దానికి తోడు, ఇన్ఫెక్ట్‌ అయిన 4గురిలో ఒకరికి లైమ్‌ వ్యాధికి మాత్రమే వచ్చినట్లు రాష్‌ రాదు. తమను ఒకవేళ పురుగు కుట్టిందీ లేనిదీ అనేకమంది రోగులు చెప్పలేరు ఎందుకంటే అది కుట్టినప్పుడు నొప్పి తెలియదు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబాడీ రక్త పరీక్షలు నమ్మదగనివి కాబట్టి ఈ వ్యాధి నిర్ధారణను అదింకా కష్టతరం చేస్తుంది. శరీర నిరోధక శక్తి దాడి చేసిన క్రిములను గుర్తించిందని రోగి రక్తంలోని యాంటీబాడీలు చెబుతాయి కానీ కొన్ని పరీక్షలు ఆ క్రిములు లైమ్‌ వ్యాధి సూక్ష్మక్రిములో కాదో చెప్పడంలో విఫలమౌతాయి. కాబట్టి ఒక రోగికి చేయబడిన లైమ్‌ వ్యాధి పరీక్షలో పాజిటివ్‌ అనే రావచ్చు, అయితే నిజానికి ఆ లక్షణాలు ఇతర సూక్ష్మక్రిములవల్ల వచ్చి ఉండవచ్చు. అందువలన, పురుగు కుట్టినట్లు రోగి గుర్తుకు తెచ్చుకోగలడో లేదో అన్నదానిపై, రోగి లక్షణాలపై, అంతేగాక ఆ లక్షణాలను కలుగజేయగల ఇతర రోగాలు లేవన్నట్లు రూఢీ చేసుకోడంపై వారి రోగనిర్ధారణ పద్ధతి ఆధారపడివుండాలని అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (NIH) వైద్యులకు సలహా ఇచ్చింది.

చికిత్స, నివారణ

సరైన సమయంలో నిర్ధారణ చేస్తే, యాంటీబయోటిక్‌లతో రోగులకు విజయవంతంగా చికిత్స చేయవచ్చు. ఎంత త్వరగా చికిత్స మొదలైతే అంత త్వరగా, అంత పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. చికిత్స తరువాత కొన్ని నెలల వరకు అలుపు, నొప్పి ఉందనే భావన ఇంకా ఉండవచ్చు, కానీ ఈ లక్షణాలు మరింత ఎక్కువ యాంటీబయోటిక్‌ చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోతాయి. అయితే, “లైమ్‌ వ్యాధితో ఒకసారి కుస్తీపడినంత మాత్రాన ఆ జబ్బు భవిష్యత్తులో రాకుండా నివారించబడుతుందని గ్యారెంటీగా చెప్పలేము” అని NIH హెచ్చరిస్తుంది.

ఆ కలవరపరిచే ఉత్తరాపేక్ష ఎన్నటికైనా మారుతుందా? లైమ్‌ వ్యాధిని నివారించడానికి పరిశోధకులు ఒక ప్రయోగాత్మక వాక్సిన్‌ను తయారు చేశారని యేల్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ ద యునైటెడ్‌ స్టేట్స్‌ ప్రకటించింది. దాడిచేసిన లైమ్‌ సూక్ష్మజీవులను ఎదుర్కుని చంపేలా మానవునిలోని వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థను ఈ “ద్విచర్యా” వాక్సిన్‌ ప్రేరేపిస్తుంది. అదే సమయంలో, వాక్సిన్‌ చేయబడిన బాధితుడిని కుట్టిన పురుగుల్లో ఉన్న సూక్ష్మక్రిములను కూడా అది నాశనం చేస్తుంది.

“ఈ వాక్సిన్‌ను పరీక్షించడం, లైమ్‌ వ్యాధి యొక్క నిజంగా గంభీరమైన పరిణామాల నుండి ప్రజలను కాపాడడానికి చేసే మా ప్రయత్నాల్లో ఒక గొప్ప అభివృద్ధి” అని 1975లో లైమ్‌ వ్యాధిని కనుగొన్న పరిశోధకులలో ఒకరైన డా. స్టీవెన్‌ ఇ. మాలవిస్ట అన్నాడు. వ్యాధి భయంవల్ల ప్రజలు ఇళ్లలోపలే ఉన్న ప్రాంతాలలో, “ప్రజలు మరలా నిర్భయంగా అటవీ ప్రాంతంలో నడవగలిగేలా ఈ వాక్సిన్‌ సహాయం చేస్తుందని” శాస్త్రజ్ఞులు ఆశిస్తున్నారు అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంటుంది.

అయినా ఈలోపల మీరు మీ స్వంతంగా కొన్ని నివారణా చర్యలను తీసుకోవచ్చు. NIH ఇలా సిఫారసు చేస్తుంది: ఆ పురుగులతో నిండివున్న ప్రాంతాలలో నడుస్తున్నట్లయితే దారికి మధ్యలోనే నడవండి. పొడవైన ప్యాంట్లను, పొడవైన చేతులుగల షర్టులను వేసుకోండి, టోపీ పెట్టుకోండి. ప్యాంట్‌ కాళ్లను సాక్సులలోకి దూర్చండి, పాదాలను ఏమాత్రం కనబడనివ్వని బూట్లను వేసుకోండి. లేత రంగు బట్టలను వేసుకుంటే పురుగులను గుర్తుపట్టడం సులభంగా ఉంటుంది. బట్టలకు, చర్మానికి కీటక నివారణి మందును పూయడం ఎంతో మంచిది, గానీ అవి భయంకరమైన సైడ్‌ ఎఫెక్టులను, ప్రాముఖ్యంగా పిల్లలకు కలుగజేయగలవు. “లైమ్‌ వ్యాధి ఉన్న ప్రాంతాలలో పురుగుల నుండి దూరంగా ఉండడంలో ప్రాముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇన్ఫెక్షన్‌ గర్భస్థ శిశువుకు బదిలీ కాగలదు” అని NIH హెచ్చరిస్తుంది, అంతేగాక గర్భపాతం లేక పుట్టుకతోనే చనిపోయిన శిశువు పుట్టే అవకాశాలు కూడా ఎక్కువ కావచ్చు.

ఒక్కసారి ఇంట్లోకి వచ్చిన తరువాత మీరు మిమ్మల్ని, మీ పిల్లల్ని ప్రాముఖ్యంగా శరీరంలో వెండ్రుకలు గల భాగాలలో పురుగుల కొరకు పరీక్షించుకోండి. దీన్ని జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఇంకా ఎదగని పురుగులు ఈ వాక్యం చివరనున్న చుక్కంత చిన్నవిగా ఉంటాయి, మరి మీరు అదొక ధూళి కణం అని పొరబడే ప్రమాదం ఉంది. మీకు పెంపుడు జంతువులుంటే అవి ఇంట్లోకి వచ్చే ముందు వాటిని పరీక్షించండి—వాటికి కూడా లైమ్‌ వ్యాధి సోకే అవకాశం ఉంది.

పురుగును మీరెలా తీసివేస్తారు? ఉట్టి వ్రేళ్లతో కాదు గాని మొద్దుబారిన ట్వీజర్లతో తీయాలి. చర్మం పైన వాటి పట్టును విడిచిపెట్టేంత వరకు దాని తల దగ్గర సున్నితంగానే అయినా గట్టిగా పట్టుకోండి కానీ దాని శరీరాన్ని నొక్కకండి. యాంటీసెప్టిక్‌తో ఆ ప్రాంతాన్ని బాగా రుద్దండి. పురుగును 24 గంటలలోగా తీసివేయడం లైమ్‌ వ్యాధి ఇన్ఫెక్షన్‌ నుండి మిమ్మల్ని కాపాడుతుంది అని అమెరికాలో అంటువ్యాధుల నిపుణుడు డా. గారీ వర్మ్‌జర్‌ అంటున్నాడు.

పురుగులు మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా, అశక్తులను చేసే లైమ్‌ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నది నిజమే. అయినా, ఆ సులభమైన జాగ్రత్తలు ఆ తక్కువ అవకాశాలను ఇంకా అతి తక్కువ చేస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం యోగ్యమేనా? లైమ్‌ వ్యాధి బారినపడ్డ ఎవరైనా ఒకరిని అడగండి.

[21వ పేజీలోని బాక్సు]

లైమ్‌ వ్యాధి లక్షణాలు

ఇన్ఫెక్షన్‌ తొలిభాగంలో:

○ రాష్‌

○ కండరాలు, కీళ్ల నొప్పులు

○ తలనొప్పి

○ మెడ పట్టడం

○ గుర్తించదగ్గ అలుపు

○ జ్వరము

○ ముఖ పక్షవాతము

○ మెనింజైటిస్‌

○ స్వల్పకాలిక కీళ్ల నొప్పులు, వాపులు

అంత సాధారణం కాని లక్షణాలు:

○ కళ్లు మంటపెట్టడం

○ కళ్లు తిరగడం

○ ఊపిరి అందకపోవడం

ఇన్ఫెక్షన్‌ మలిభాగంలో:

○ దీర్ఘకాలిక లేక అప్పుడప్పుడు వచ్చే అర్ధ్రైటిస్‌

అంత సాధారణం కాని లక్షణాలు:

○ జ్ఞాపకశక్తి తగ్గడం

○ ఏకాగ్రత తగ్గడం

○ మానసిక స్థితి, నిద్ర అలవాట్లలో మార్పు రావడం

ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు వీటిలో ఒకటి లేక ఎక్కువ లక్షణాలు వివిధ సమయాల్లో ఉండవచ్చు.—నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ వారు ప్రచురించిన లైమ్‌ వ్యాధి—వాస్తవాలు, సవాలు.

[22వ పేజీలోని చిత్రం]

అడవిలో వాహ్యాళికి వెళ్లడం మిమ్మల్ని ప్రమాదంలో పెట్టగలదు

[23వ పేజీలోని చిత్రం]

పురుగు (పెద్దగా చూపబడింది)

[క్రెడిట్‌ లైను]

Yale School of Medicine

[23వ పేజీలోని చిత్రం]

పురుగు (అసలు పరిమాణం)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి