ఆస్ట్రేలియాలోని “పాడే గోపురం”
ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! విలేఖరి
కళ, సాంకేతికత మరియు విజ్ఞానమూ తరచు సంగీత రంగంతో కలపబడి, విశిష్టమైన నాణ్యతగల విభిన్న వాద్యపరికరాల ఉత్పత్తికి కారణమయ్యాయి. అయితే, అంటోనియస్ స్ట్రాడివేరియస్ యొక్క వయోలిన్‌లు మరియు థియోబాల్డ బెహిమ్ యొక్క పిల్లనగ్రోవులు బాగా పరిచయమున్నవైనప్పటికీ, మత్తరమైన కారిల్లన్ (వాద్యగంటల శ్రేణినిని) గూర్చి చాలా తక్కువే తెలుసు.
అయితే ఈ కారిల్లన్ ఏమిటి, మరి దాన్ని ఎలా వాయిస్తారు? ప్రపంచంలోని ముఖ్యమైన కారిల్లన్ను దర్శించడం జ్ఞానదాయకంగా ఉంటుంది, మరి ఈ విశేషమైన సంగీతానికిగల మన మెప్పుదల అది మరింత పెంచుతుంది.
ఓ భారీ వాద్య పరికరం
కారిల్లన్ ప్రపంచంలోని అతి పెద్ద సంగీత వాద్యపరికరాల్లో ఒకటి మరియు అది ఎంతో పురాతనమైనది. సాధారణంగా దాన్ని గంటల గోపురంలో అమరుస్తారు కనుక సమంజసంగానే అది “పాడే గోపురము” అని పిలువబడుతోంది. ఆస్ట్రేలియా రాజధానియైన కానిబెర్రాలో ఉన్న ఈ కారిల్లన్ మరియు గంటల గోపురం, 50 సంవత్సరాల క్రితం ఆ పట్టణాన్ని స్థాపించి దానికి పేరు పెట్టిన సంఘటనను పురస్కరించుకుని 1963లో జరిపిన వేడుకల్లో గ్రేట్ బ్రిటన్ ప్రభుత్వంవారు దానికి ఇచ్చిన సునాద బహుమతి. అది బర్లే గ్రిఫిన్ సరస్సు మధ్య ఉన్న అందమైన ద్వీపం మధ్యలోని ఆస్పెన్‌పై ఉంది.
ఈ 50 మీటర్ల ఎత్తున్న గంటల గోపురంలో మూడు త్రిభుజాకార గొట్టాలున్నాయి, మరి దానిలోని ప్రతిదీ మధ్య సమ బాహు త్రిభుజాకారంలో నిలుపబడ్డాయి. ఈ మూడు గొట్టాల మధ్యలో మరియు పైభాగంలో అంతస్తులున్నాయి, అందులోనే కారిల్లన్ వ్రేలాడదీయబడివుంటుంది.
ఆ గోపురంలోని లిఫ్టు మనల్ని మొదటి అంతస్తు మీదికి తీసుకెళుతుంది, అక్కడ ఆర్గన్లకు పోలిన రెండు పెద్ద క్లేవియర్లు లేక కీబోర్డులు మనల్ని ఆహ్వానిస్తూ కనిపిస్తాయి. మొదటిది గంటల వాద్యకారుడు అని పిలువబడే ప్రదర్శకుడు ప్రాక్టీసు చేసుకునేందుకు మాత్రమే. ఈ కీబోర్డులోని సమ్మెటలు కేవలం శృతి కలిపే గొట్టాలపై కొడతాయి.
ప్రాక్టీసుకు కీబోర్టుకు సరిగ్గా వెనకాలే అసలు కారిల్లన్ క్లేవియర్ ఉంది. అయితే అది ఓ సాధారణ కీబోర్డుకాదు, ఎందుకంటే అది పెద్దగా, సుమారు రెండు సెంటీమీటర్ల వ్యాసముండే గుండ్రని కీలు అందులో ఉన్నాయి. పైవరుసలోనున్న కీలు, పరిచయమున్న ఓ పియానో లేక ఆర్గన్ వంటి వాద్యపరికరాల నల్లని కీలను సూచిస్తాయి. అవి సుమారు తొమ్మిది సెంటీమీటర్లు పైకివుంటాయి కానీ క్రిందివరుసలో ఉన్నవి (పియానాలోని తెల్లటి కీలకు పోలినవి) సుమారు 17 సెంటీమీటర్లు ముందుకువుంటాయి. అయితే ఓ పియోనా వాయిద్యకారుడు లేక ఆర్గనిస్టుకు భిన్నంగా గంటల వాయిద్యకారుడు తన వ్రేళ్లను ఉపయోగించడు కానీ ముడుచుకున్న తన చేతులను ఉపయోగిస్తాడు. అందుకనే ఆ కీలు అంత విశాలంగా అమర్చబడ్డాయి, ఆ విధంగా దాన్ని వాయించేటప్పుడు ఇతర కీలను ఆ వాయిద్యకారుడు ముట్టుకోకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
ఎంతో గొప్ప యాంత్రిక ఏర్పాటు
ముఖ్యమైన క్లేవియర్ పైన్నుండి తీగలు పై అంతస్తుకు వెళ్తాయి మరియు నాలుగున్నర విభిన్న స్వరాలుగల ప్రతి కీ పైనా అనువైన విధంగా వాటి బిగింపును సవరించేందుకు అనువైన ఓ స్టీల్ తీగ ఉంటుంది. ఈ తీగలన్నీ ఎక్కడికి వెళుతున్నాయో కనుగొనేందుకు మనం లిఫ్టును మరో అంతస్తుకు తీసుకువెళదాం. ఇక్కడ రెండు పెద్ద గంటలు ఒక్కొక్కటీ సుమారు ఆరు టన్నుల బరువున్నవి గంభీరంగా వ్రేలాడుతూ ఉండడం కనిపిస్తాయి. ఈ గంటల మధ్య నుండి చూస్తే, వరుసగా మరో 51 గంటలు వివిధ బరువులతో కూడి ఉంటాయి వాటిలో అతి చిన్నగంట కేవలం ఏడు కిలోల బరువుంటుంది.
అప్పుడప్పుడు కొన్ని గంటల అధిష్టాన పైస్థాయిస్వరాల అపస్వరాలేవీ ఆటంకపర్చకుండా ఆ గంటలు క్రమంగా అమర్చబడ్డాయి. మెత్తటి లోహ లోలకం సహాయంతో క్లావియర్ క్రింద ఉన్న ప్రతి కీకి అమర్చబడిన స్టీల్ తీగవల్ల ప్రతి గంట మ్రోగించబడుతుంది. గంటవాయిద్యకారుడు మీటే ప్రతి సారికి, అదే విధంగా అక్కడున్న వాతావరణ పరిస్థితులకు సరిపడేందుకుగాను తీగల బిగింపు తగిన విధంగా సవరింపబడుతుంది.
కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు
కాన్బెర్రా కారిల్లన్‌లోని గంటలు, ఇంగ్లాండుకు చెందిన జాన్ టెయిలర్ అండ్ కంపెనీలో పోతపోయబడ్డాయి, ఇవి పురాతన కళకు 20వ శతాబ్దంలోని చక్కని నమూనాలు. ఈ గంటలు తమ రాగాలను ఆ సరస్సు నీటిపైనను, సమీపంలోని ఉద్యానవనం మరియు తోటలకుపైగా 300 మీటర్ల పరిధి వరకూ వినిపిస్తాయి.
ఈ కారిల్లన్ ప్రపంచంలోని అతి పెద్ద కారిల్లన్ కాదు, కానీ 53 గంటలుకలిగిన అది వాటి లిస్టులో మొదటిదౌతుంది, ఎందుకంటే అనేక కారిల్లన్‌లలో 23 నుండి 48 గంటలు మాత్రమే ఉన్నాయి. అయితే, అతి పెద్ద కారిల్లన్ న్యూయార్క్ పట్టణంలో ఉంది. దానిలో 74 గంటలున్నాయి. దానిలో కూడా ప్రపంచంలోని అతి పెద్ద రాగాల గంట ఉంది. ఈ గంట బరువు 18 టన్నులకు పైగా ఉంటుంది మరియు మధ్యమ ఎఫ్ రాగమున్న కాన్బెర్రాకు పోలిస్తే మధ్యమ సి రాగాన్ని ఇది కల్గివుంది.
కనుక గంటవాయిద్యకారుడు అందించే ఓ కచేరీని మనమిప్పుడు ఆనందిద్దాము. క్రింద ఉన్న ఉద్యానవనంలో మనం కూర్చుందామా? ఇక్కడ “పాడే గోపురపు” సంగీతమేకాకుండా అదే సమయంలో మన చుట్టూ ఉన్న సృష్టి అద్భుతాలను కూడా మనం చూసి ఉల్లసించి ఆనందిద్దాం. సంధ్యవేళ నెమ్మదిగా వీచే గాలి అంత ఎత్తులోవున్న గంటల చప్పుడు కలసి ఉత్పన్నమైన సన్నని సంగీతాన్ని వినడం దైవ వరమైన ఈ సంగీతం విషయంలో కృతజ్ఞతతో మన హృదయాలు నిండుతాయి.
[25వ పేజీలోని చిత్రం]
గోపురంలోని గంటలు