కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 4/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • లైమ్‌ వ్యాధి—మీరు ప్రమాదంలో ఉన్నారా?
    తేజరిల్లు!—1996
  • కార్నివల్‌ వేడుకలు—తప్పా ఒప్పా?
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1997
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 4/8 పేజీ 30

మా పాఠకుల నుండి

టెలిఫోను మర్యాదలు “మీ టెలిఫోను మర్యాదలు ఎలా ఉన్నాయి?” (జూలై 8, 1996) అనే చక్కని శీర్షికను బట్టి మీకు కృతజ్ఞతలు. ఫోను ద్వారా వినియోగదారులకు సేవలనందించే బ్యాంకులో నేను పనిచేస్తున్నాను. నేను ఆ శీర్షికను మా సూపర్‌వైజర్‌కు ఇచ్చాను, ఆ శీర్షిక ప్రయోజనకరంగాను, సమయోచితంగాను, ఆచరణాత్మకంగాను ఉందని తాను భావిస్తున్నాడని ఆయన చెప్పాడు. ఒకరి తర్వాత ఒకరికి, ఆలా 32 మంది టెలిఫోన్‌ ఆపరేటర్లకూ ఈ శీర్షికను అందజేయాలని ఆయన నన్ను కోరాడు.

ఎన్‌. జె. ఎస్‌., బ్రెజీల్‌

నేరాలు చేసే ఉద్దేశంతో ఫోన్‌చేసే అనవసరమైన వారితో గతంలో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చినందువల్ల, మూడు సార్లు వినయంగా అడిగిన తర్వాత కూడా ఎవరైనా తామెవరో తెలుపడానికి నిరాకరిస్తున్నట్లయితే ఫోన్‌ పెట్టేయాలన్న టెలిఫోను కంపెనీ సిఫారసును ఎడతెగక అనుసరించేవాళ్ళం. కొన్నిసార్లు స్నేహితుడే ఫోన్‌ చేసి, శీర్షికలో చెప్పినట్లు ఎవరో ఊహించు అని తమాషాలాడినప్పుడు నొప్పించడం జరిగింది. ఇలాంటి శీర్షికలు దయను, చాలా స్వల్పమైన విషయాలని అనిపించే వాటిలో కూడా అవగాహనను పెంపొందిస్తాయి.

జి. ఎ., అమెరికా

లైమ్‌ వ్యాధి “లైమ్‌ వ్యాధి—మీరు అపాయంలో ఉన్నారా?” (జూలై 8, 1996) అనే శీర్షికకు కృతజ్ఞతలు. ఒక వైద్యురాలుగా, నేను ఈ వ్యాధి గల చాలా మంది రోగులను ఇటీవల చూశాను, మీరు పేర్కొన్న ముందుజాగ్రత్తలను నేను ధ్రువీకరించగలను. చాలా వరకు రోగులు లక్షణాలను గంభీరంగా తీసుకోలేదు, చాలా కాలంగా వాటివల్ల బాధపడుతున్నారు. అమెరికాలో ప్రబలంగా ఉన్న కీళ్ళవాపుకు సంబంధించినటువంటి వ్యాధిని గూర్చి తేజరిల్లు! చర్చించింది. పారంపర్య లెబారటరీ టెస్టులు కనుగొనలేని మరో రెండు వైరసులు యూరప్‌లో కనుగొనబడ్డాయి. లైమ్‌ వ్యాధికి యాంటిబయోటిక్స్‌ ఆరంభ దశల్లో మాత్రమే ఫలకరంగా ఉంటాయి. తర్వాతి దశల్లో తరచూ ఫలకరంగా ఉండవు.

ఐ. ఎస్‌., జర్మనీ

నేనొక లైమ్‌ రోగిగా, ఈ అద్భుతమైన శీర్షిక చాలా ప్రోత్సాహకరమైనదని కనుగొన్నాను. దీనిని చదివినవారందరూ ఈ వ్యాధిని గంభీరంగా తీసుకుని అన్ని ముందు జాగ్రత్తలను తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.

డి. పి., అమెరికా

నేర్చుకోలేకపోవడమనే రుగ్మతలు “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేనెందుకు నేర్చుకోలేను?” (జూలై 8, 1996) అనే శీర్షికను నేను నిజంగా ప్రశంసిస్తాను. శీర్షికలో పేర్కొనబడిన కొన్ని కారణాలతో నేను పాఠశాలలో పోరాడుతున్నాను. నేను మీ సలహాలను అన్వయించుకోబోతున్నాను. మీకు చాలా కృతజ్ఞతలు.

ఆర్‌. సి., అమెరికా

నేను పాఠాలు నేర్చుకోవడంలో పూర్తిగా ఆసక్తిని కోల్పోయాను, పాఠశాలలో పాఠాలమీద శ్రద్ధ ఉంచలేకపోయేవాడ్ని. ఈ శీర్షికలో ఇవ్వబడిన సలహాలను ఆచరణలో పెట్టడం ద్వారా నేను నేర్చుకునే అలవాట్లను మెరుగుపరచుకుంటానని ఆశిస్తున్నాను.

ఎమ్‌. ఇ. ఓ., ఉగాండా

నాకు నేర్చుకోలేకపోవడమనే రుగ్మతలు లేవు, కానీ నాకు చదవడమంటే ఇష్టముండదంతే. గణాంక ఫార్ములాలను గుర్తించుకోవడం నాకు కష్టంగా ఉంటుంది కూడా. సరే, పునరుక్తి చేయడం, పదాలను పలకడం జ్ఞాపకశక్తి సంబంధ స్వల్పకాల సమస్యలను పరిష్కరించేందుకు సహాయకాలుగా ఉంటాయని ఈ శీర్షిక పేర్కొంది. నాకు నేను బిగ్గరగా చదవడమంటే అదో తెలివి తక్కువ పని అని భావించాను, కానీ నేనలా చేసినప్పుడు చాలా సరదాగా ఉంది!

ఎన్‌. ఐ., జపాన్‌

న్యాయ బహిష్కృతుడు “నేనొక న్యాయ బహిష్కృతుడినిగా ఉండేవాడిని” (జూలై 8, 1996) అనే శీర్షికలో ఫ్రాంక్‌ మాన్నినో అనుభవాన్ని ప్రచురించినందుకు చాలా కృతజ్ఞతలు. అది నన్ను బాగా ప్రభావితం చేసింది, మన సృష్టికర్తయైన యెహోవా ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమపూర్వకమైనవాడో అర్థంచేసుకునేలా అది చేసింది. నేను 30 సంవత్సరాలుగా ఆయనను సేవిస్తున్నాను, నేను ప్రకటనా పని చేసేందుకు స్వాతంత్ర్యమున్నప్పుడే ఆ పనిలో సాధ్యమైనదంతా చేసేందుకు ఈ అనుభవం నన్ను ప్రోత్సాహించింది.

ఇ. బి., ఇటలీ

క్రైస్తవ కూటాలకు హాజరయ్యే ఆధిక్యతను ప్రశంసించేందుకు ఈ శీర్షిక నాకు సహాయపడింది. నేను వ్యక్తిగతంగా సరిగ్గా సంస్థీకరించుకోనందువల్ల నేను అలవాటుగా కూటాలకు ఆలస్యంగా వెళ్ళవలసివచ్చింది. ఫ్రాంక్‌ మాన్నినోకు జైలులో స్వాతంత్ర్యం ఉండేదే కాదు, అయినా ఆయన జీవితం ఎంతో ఫలవంతంగా ఉండేది.

డి. డబ్ల్యు., అమెరికా

తను చెరసాలలో వేయబడినప్పుడు కూడా ఆసక్తిగా ఉన్న ఫ్రాంక్‌ మాన్నినో చేత నేను పురికొల్పబడ్డాను. ఆయన జీవితం చెడు మార్గంలో ఆరంభించబడినప్పటికీ, ఆయన ఇప్పుడు శ్రేష్ఠమైన మాదిరిగా ఉన్నాడు.

సి. ఆర్‌., అమెరికా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి