పొగాకు కంపెనీలు అగ్నిజ్వాలల్లో చిక్కుకున్నాయి
ది న్యూయార్క్ టైమ్స్‌లో జూలై 26, 1995 న కనిపించిన ఒక నివేదిక ప్రకారం, “పొగాకు కంపెనీలు సిగరెట్ల లోపల ఉండే పదార్థాలను గూర్చి, వాటి చెడు ఫలితాలను గూర్చి ఫెడరల్ రెగులేటర్లకు తప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నాయేమో అని అన్వేషించడానికి న్యూయార్క్‌లో ఒక న్యాయ నిర్ణయ సంఘ సమావేశానికి న్యాయనిర్ణయ శాఖ ఏర్పాటు చేసింది. కంపెనీ అధికారులు పొగాకు ఉత్పత్తులను గూర్చి సభకు అబద్ధం చెప్పారేమోనని అన్వేషించడానికి ఆ శాఖ బహుశ రెండవ సంఘాన్ని ఏర్పాటు చేసింది.”
దీనికి ఆధారం? ఆ నివేదిక దీనిని స్పష్టం చేసింది. “నికోటిన్ వ్యసనపరులను చేసిందని గానీ ఆ సిగరెట్లు వ్యాధులకు కారణమయ్యాయని గానీ లేదా తమ కంపెనీలు నేర్పుగా పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ మోతాదు ఉండేలా చేశాయనిగానీ తాము తలంచలేదు” అని అమెరికాలోని ఏడు ముఖ్య పొగాకు కంపెనీల ఉన్నతాధికారులు ఏప్రిల్ 1994 లో ఒక సభా కమిటీ సమక్షంలో ప్రమాణం చేస్తూ సాక్ష్యమిచ్చారు.
ఆ తర్వాత మిన్ను విరిగి వారిమీద పడింది—జూన్ 1995 లో రెండు వేల నేరనిరూపణా పత్రాలు వెలుగులోకి రావడంతో నిరపరాధులమనే వారి వాదన వీగి పోయింది. పొగత్రాగేవారి శరీరంపై, మెదడుపై మరియు ప్రవర్తనపై నికోటిన్ చూపే “ఔషధసంబంధ” ప్రభావాలను గూర్చి అధ్యయనం చేస్తూ పొగాకు పరిశోధకులు 15 సంవత్సరాలు గడిపారని ఈ పత్రాలు చూపాయి. ఈ కంపెనీల్లో ఒకదానియందలి మాజీ పరిశోధనా శాస్త్రజ్ఞుడైన డా. విక్టర్ డినోబుల్ పరిశోధనలో ముఖ్యంగా కనుగొన్న దానిని గూర్చి ఈ విధంగా వర్ణిస్తున్నాడు: “తాము తారు మోతాదును తగ్గించి, నికోటిన్‌ను పెంచగలమని, అప్పుడు కూడా పొగత్రాగేవారు సిగరెట్టును ఇష్టంగానే త్రాగుతారని కంపెనీ గ్రహించడం మొదలెట్టింది. తమ పరిశోధనా పనంతా ముగిసిన తరువాత, నికోటిన్ అనేది కేవలం నెమ్మదినిచ్చేది లేక పురికొల్పేది కాదు, కాని దాని ప్రభావం ముఖ్యంగా మెదడుపైనే ఉంటుంది, మరి మెదడుపై ప్రభావం కలిగేందుకే ప్రజలు పొగత్రాగుతారు అని వారు గ్రహించారు.”
ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, “ప్రజలు ఏ బ్రాండు త్రాగినా, వారు మరింత గాఢంగా పీల్చుకోవడం ద్వారా పొగను నోట్లో ఎక్కువ సేపు అట్టిపెట్టుకొని ఉంటూ లేదా మరిన్ని సిగరెట్లను త్రాగడం ద్వారా కావలసినంత నికోటిన్‌ను పొందడానికి మొగ్గు చూపుతారు” అని కంపెనీ అధ్యయనాలు చూపాయి. కంపెనీ పరిశోధకులు తక్కువ తారుతోను మరియు ఎక్కువ నికోటిన్తోను పొగత్రాగేవారికి సంతృప్తినిచ్చేందుకు ప్రయత్నం చేశారు.
పొగాకు కంపెనీ తన వినియోగదారుల్లో అమిత శ్రద్ధను కనబరచిందని అధికార పత్రాలు ఇంకనూ వెల్లడి చేశాయి. కాలేజీ విద్యార్థులు 15 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా దాని పరిశోధనా అంశంగా ఉండేవారు. ఐయోవాలోని ఒక పట్టణంలోని ప్రజలు 14 ఏండ్ల వయస్సుగల పొగత్రాగేవారితో సహా తమ పొగత్రాగే అలవాటును గూర్చి ప్రశ్నించబడ్డారు.
ఏడు పొగాకు కంపెనీలకు వ్యతిరేకంగా అఖిలపక్షాల న్యాయవాదులు చట్టపరంగా చర్య గైకొనేలా కేసు పెట్టేందుకు వెలువడిన ఈ పరిశోధనా పత్రాలు ఒక వరంగా మారాయి. వ్యసనపరులనుగా చేసే నికోటిన్ యొక్క సత్వాలను గూర్చిన విషయాన్ని పొగాకు కంపెనీలు మరుగు చేస్తున్నాయని, వ్యసనాన్ని పెంచేందుకు నికోటిన్ మోతాదును కపటంతో నేర్పుగా ఉపయోగిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీలు అలవాటుగా ఈ పరిశోధనను జరుపుతున్నాయన్న విషయాన్ని ప్రపంచంలోని ఏ న్యాయ సభ నమ్మదని ఒక న్యాయవాది చెబుతున్నాడు.
అభివృద్ధిచెందుతున్న దేశాల్లో అగ్నిజ్వాల మరింత ఉద్ధృతమౌతుండగా పొగాకు పొగ అభివృద్ధిచెందుతున్న దేశాలకు మరింతగా వ్యాపిస్తుంది. నలభై సంవత్సరాల క్రితం, దక్షిణాన లేదా అభివృద్ధిచెందుతున్న దేశాల్లో స్త్రీలెవరూ పొగత్రాగేవారు కాదు, దాదాపు 20 శాతం మంది పురుషులు మాత్రమే పొగత్రాగేవారు. కాని నేడు, అభివృద్ధిచెందుతున్న దేశాల్లోని 8 శాతం మంది స్త్రీలు, 50 శాతం మంది పురుషులు పొగత్రాగుతారు—ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. “పొగ దక్షిణానికి వ్యాపిస్తుంది” అని పరిశోధకులు చెబుతున్నారు.
తేజరిల్లు! విలేఖరి సాధారణ ధోరణిని గూర్చి నివేదిస్తున్నాడు
బ్రెజిల్లో నియమించబడిన మన లేఖికుడు దక్షిణ భాగంలోని పరిస్థితులను గూర్చి కొన్ని సాధారణ వ్యాఖ్యానాలను చేస్తున్నాడు. పారిశ్రామిక ప్రపంచంలోని పరిశోధన పొగత్రాగేవారిని గూర్చి మరింత ప్రాణాంతకమైన చిత్రాన్ని గీస్తుంది. దానికి దానిదైన ప్రభావముంది. “ప్రజలకు సమాచారాన్ని అందించవలసిన అత్యంత ప్రాముఖ్యతను గుర్తించిన దేశాలు పొగాకు ఉపయోగం తగ్గనారంభించడాన్ని ఇప్పుడు చూస్తున్నాయి” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిస్తుంది. “ఉత్తరాన, సాంఘికంగా అనేక కుటుంబాల్లోను బహిరంగ స్థలాల్లోను మరియు ఉద్యోగ స్థలాల్లోను పొగత్రాగడం ఇక ఏ మాత్రం అంగీకరించబడడం లేదు, పొగత్రాగడం తమను చంపగలదని” చాలా మంది ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారని పానోస్ అనే లండన్ ఆధారిత సమాచార సంస్థ చెప్పింది. “పొగాకు పరిశ్రమ దక్షిణానికి కదులుతుంది.”
దానికి భిన్నంగా, దక్షిణాన, ఒక క్రొత్త మార్కెట్‌ను తెరవడం సిగరెట్ పాకెట్లను తెరిచే అంత సులభమని నిరూపించబడుతుంది. అభివృద్ధిచెందుతున్న దేశాల్లోని పరిస్థితులు పొగాకు పరిశ్రమకు ఆశ కలిగించేవిగా ఉన్నాయి. అభివృద్ధిచెందుతున్న ప్రతి నాలుగు దేశాల్లో మూడింటిలో వ్యాపార ప్రకటనలపై ఏ నిర్బంధమూ లేదు, అదే సమయంలో పొగాకు త్రాగడం వలన కలిగే అపాయాలను గూర్చి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. “అపాయాలను గూర్చి ప్రజలకు చెప్పబడలేదు, గనుక వారికి అవి తెలియదు” అని పానోస్ పేర్కొంటుంది.
పరిశ్రమ యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా తమ మొదటి సిగరెట్లను వెలిగించేందుకు యువతులను పురికొల్పాలని ప్రకటనలు “పొగత్రాగడాన్ని స్వతంత్ర వనితలు చేసే ఓ చక్కని ఉల్లాసకరమైన పనిగా వర్ణిస్తాయి.” పొగాకు ప్రకటనలు యాభై ఏండ్ల క్రితం పారిశ్రామికం చేయబడిన ప్రపంచంలో ఉపయోగించబడిన ప్రకటనలను పోలినవేనా అన్నట్లు ఉంటాయి. అప్పట్లో ప్రకటనలు ఫలితాన్ని సాధించాయి. చాలా కాలం క్రితం ప్రతి ముగ్గురు స్త్రీల్లోని ఒకరు “పురుషుల వంటి ఉత్సాహంతో సిగరెట్లను వెలిగించేవారు” అని ఒక సమాచార మూలం చెబుతుంది.
నేడు, అభివృద్ధిచెందుతున్న దేశాల్లోని అమాయక స్త్రీలను లక్ష్యంగా చేసుకున్న తీవ్రరూపం దాల్చిన అక్రమ వ్యాపార విధానం 1920 లలోని మరియు 1930 లలోని ఈ ప్రకటన “సాఫల్యం” పునరావృతం చేయబడనున్నదని నమ్మిస్తుంది. కనుక, విషమపరిస్థితి ఏమిటంటే, ప్రపంచంలోని మరీ పేద దేశాల్లోని లక్షలకొలది యువతులు ఒక పరిశీలకుడు చెబుతున్నట్లు “తొలి నికోటిన్‌లో ఉన్న అందమైన యువతులు” అయ్యే అపాయంలో ప్రస్తుతం ఉన్నారు.
ప్రధాన లక్ష్యం
స్త్రీలు పొగాకు పరిశ్రమ యొక్క ముఖ్య లక్ష్యాల్లో ఒకటైతే, యౌవనస్థులు దాని ప్రధాన లక్ష్యం. వ్యంగ్య చిత్ర రీతిలోని ప్రకటనలు మరియు ఆటబొమ్మలపైని ప్రకటనలు లాభాన్ని సంపాదించి పెడుతున్నాయి, ఆటల ప్రాయోజితం వల్ల కూడా లాభం గడించబడుతుంది.
చైనాలోని యౌవనస్థుల్లో “చాలా ఎక్కువ మంది సిగరెట్లను త్రాగుతున్నారు” అని పానోస్కోప్ అనే పత్రిక చెబుతుంది. 12 నుండి 15 ఏండ్ల వయస్సుగల వారిలో దాదాపు 35 శాతం మంది, 9 నుండి 12 ఏండ్ల వయస్సుగల వారిలో దాదాపు 10 శాతం మంది పొగత్రాగుతున్నారు. బ్రెజిల్‌లోని ఓ అంచనా ప్రకారం ఒక కోటి మంది యౌవనస్థులు పొగత్రాగుతారు అని ఫోల్హా డి ఎస్. పాలో అనే దిన పత్రిక నివేదించింది. వారికి అపాయాలను గూర్చి తెలియదా? “సిగరెట్లను త్రాగడం హానికరమని నాకు తెలుసు, కాని అది చాలా బాగుంటుంది” అని రోజుకు ఒకటిన్నర ప్యాకెట్ల సిగరెట్లను త్రాగే బ్రెజిల్ దేశస్థుడైన 15 ఏండ్ల రాఫేల్ చెబుతున్నాడు. అలక్ష్యమైన ఈ తర్క ఫలితమేమిటి? “ప్రతి రోజు కనీసం మరో 4,000 మంది యౌవనస్థులు పొగత్రాగనారంభిస్తున్నారని” పానోస్ నివేదిస్తుంది.
పొగాకు పరిశ్రమ ఉత్తరాన అమ్మబడే బ్రాండ్లలో కన్నా ఎక్కువ మోతాదులో తారు మరియు నికోటిన్ ఉన్న కొన్ని ఉత్పత్తులను దక్షిణానికి ఎగుమతి చేస్తుంది. కారణం సువ్యక్తమే. “నేను నికోటిన్ విషయంలో క్షమాపణను అడగను. అది వ్యాపారాన్ని రెండింతలు చేస్తుంది. ప్రజలు మళ్ళీ కొనుక్కునేలా అది చేస్తుంది.” అది ప్రభావవంతంగా ఉంటుంది అని ఒక పొగాకు పరిశ్రమ అధికారి కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు. “నికోటిన్ అమిత మోతాదుల్లో ఉన్నందువల్ల సిగరెట్లపై ఆశ్రయించడమనేది త్వరగా జరుగుతుంది, నికోటిన్ యొక్క ఆ మోతాదును క్రమేణా తగ్గించడం వినియోగాన్ని, అమ్మకాన్ని పెంచే అవకాశాలను తెరచింది” అని రోకెన్ వెల్బషౌడ్ (పొగ త్రాగడం—అన్ని విషయాలు పరిగణించబడ్డాయి) అనే డచ్ ప్రచురణ రూఢిపరుస్తుంది.
“దక్షిణ భాగం పరిశ్రమను వ్యాపారంలో రాణింపజేసే మార్కెట్‌గా పొగాకు పరిశ్రమ దృష్టిస్తుంది” అనే అభిప్రాయానికి పానోస్ వచ్చింది.
వెలిగిస్తారా లేదా జీవిస్తారా?
మీరు అభివృద్ధిచెందుతున్న దేశంలో జీవిస్తున్నట్లయితే మీరేమి చేస్తారు? వాస్తవాలు స్పష్టమే. 1950 వరకు, పొగత్రాగడం వల్ల వచ్చే వ్యాధుల వల్ల మరణాలు అంత ఎక్కువగా కలిగేవి కావు, కాని నేడు దక్షిణంలోని పది లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరం పొగత్రాగడం వలన కలిగే వ్యాధుల వల్ల చనిపోతున్నారు. అయినప్పటికీ, అభివృద్ధిచెందుతున్న దేశాల్లో ప్రతి సంవత్సరం పొగత్రాగడం వల్ల కలిగే మరణాల సంఖ్య మూడు దశాబ్దాల్లో 70 లక్షలకు పెరుగుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. పొగాకు ప్రకటనలు మీకు చెబుతున్న దానికి విరుద్ధంగా, సిగరెట్లు తుదకు ప్రాణాంతకాలే.
అపాయాల గురించి మీకు తెలుసని మీరంటున్నారా? మంచిది, కాని ఆ జ్ఞానంతో మీరేమి చేస్తారు? పొగత్రాగడం వల్ల కలిగే ఎన్నో భయంకరమైన విషయాలను గూర్చి చదివి, ఇక చదవడం మానేయాలని తీర్మానించుకున్న పొగత్రాగే ఒక వ్యక్తిలా మీరు ఉంటారా? పొగాకు తెరలో నుంచి పొగాకు ప్రకటనలు చూసి కూడా పొగత్రాగ వద్దు అనేంత సూక్ష్మబుద్ధిగలవారై ఉంటారా? నిజమే, పొగాకు పొగ దక్షిణానికి వ్యాపించింది—కాని అది మీ దారిని వ్యాపించనవసరం లేదు!
[16వ పేజీలోని బాక్సు]
చైనా—మొదటిది
జాంగ్ హాన్మిన్ అనే 35 ఏండ్ల చైనీయుడైన కార్మికుడు నోటి దగ్గర రెండు చేతులను ఉంచుకొని సిగరెట్టును వెలిగిస్తాడు. “నిజం చెప్పాలంటే, ఏ వస్తువు లేకున్నా నేనుండగలను కాని, సిగరెట్లు లేకుండా ఉండలేను” అని అతడు చెబుతాడు. జాంగ్ స్వదేశస్థుల్లోనే 30 కోట్లమంది ఇతరులను గూర్చి కూడా అదే చెప్పవచ్చు. 1980 ల నుండి చైనా “మరే దేశం కన్నా ఎక్కువ సిగరెట్లను ఉత్పత్తి చేసింది, ఎక్కువ అమ్మింది, ఎక్కువ త్రాగింది.” చైనా గత సంవత్సరం “కోట్లకొలది సిగరెట్లను స్థిరంగా పొగత్రాగుతున్న జనాబాకు అమ్మి, ప్రపంచంలోని ప్రథమ పొగాకు దేశంగా” మారింది.—పాస్కోప్ పత్రిక.
[17వ పేజీలోని బాక్సు]
సిగరెట్లు “వారంటీ”తోనా?
పొగాకు త్రాగడం వలన కలిగే వ్యాధుల వల్ల ప్రతి సంవత్సరం 30 లక్షల మంది ప్రజలు చనిపోతున్నప్పటికీ, ప్రకటనలు పొగత్రాగేవారితో వారి అలవాటు సురక్షితమైనదని చెబుతూనే ఉన్నాయి. ఉదాహరణకు, బ్రెజిలియన్ పత్రికలోని ఇటీవలి ఒక ప్రకటన “కర్మాగార వారంటీతో వస్తున్న” ఒక సిగరెట్ బ్రాండ్ రాక గురించి ప్రకటించింది. ఆ ప్రకటన ఈ విధంగా అభయమిచ్చింది: “మీ కారుకు వారంటీ ఉంది; మీ టి.వి.కి వారంటీ ఉంది; మీ వాచ్‌కు వారంటీ ఉంది. మరి మీ సిగరెట్‌కు కూడా ఉంది.” అయినప్పటికీ, అనేక ప్రకటనలు సూచిస్తున్నట్లు మరియు దీర్ఘ కాలంగా పిచ్చిగా త్రాగుతున్నవారు సాక్ష్యమివ్వగలుగుతున్నట్లు, ఒకే ఒక వారంటీ “పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం” అన్నదే.
[16వ పేజీలోని చిత్రం]
ఒక ముఖ్యమైన లక్ష్యం—అభివృద్ధిచెందుతున్న దేశాల్లోని స్త్రీలు
[క్రెడిట్ లైను]
WHO photo by L. Taylor
[17వ పేజీలోని చిత్రం]
అపాయాలను గూర్చి తెలియదా?
[క్రెడిట్ లైను]
WHO