“కాన్కూ” విమానాశ్రయం కనిపిస్తుంది కాని శబ్దం వినపడదు
జపాన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
పై నుండి కాన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సమీపిస్తుండగా, ఆంగ్లంలో “కాన్సాయి” అని వ్రాసి ఉన్న దీవిని మీరు చూస్తారు.a ఈ జపానీయ దీవి ఓసాకా ఖాతం యొక్క తీరానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం మరియు దానికి సంబంధించిన వసతులు తప్ప మరేవీ కనిపించవు. నిజానికి, ఈ దీవి విమానాశ్రయం కొరకే చేయబడింది. 1994 సెప్టెంబరులో ఈ విమానాశ్రయం ఆరంభించబడింది, కాన్సాయి కాకుసాయి కుకు అనే దీని జపానీయ పేరు యొక్క క్లుప్తరూపంగా కాన్కూ అనే ముద్దుపేరు దీనికి పెట్టబడింది.
బయటకు వెళ్ళే వంతెన 3.75 కిలోమీటర్ల పొడవుంటుంది, అది విమానాశ్రయం దీవిని మరియు ముఖ్యమైన భూబాగాన్ని కలుపుతూ రోడ్డుద్వారాను మరియు రైలు మార్గం ద్వారాను చేరుకోగలిగే విధంగా చేస్తుంది. ఈ దీవి ఓడల కొరకైన పోర్ట్ సేవల కొరకు కావలసిన పడవ సౌకర్యాలతోను సిద్ధం చేయబడింది. కాని ఒక విమానాశ్రయంకోసం పూర్తిగా క్రొత్త దీవిని నిర్మించినదెందుకు?
శబ్దం వినపడని ఓ విమానాశ్రయం
కాన్సాయి ప్రాంతానికి వెళ్ళే వినోదయాత్రికుల మరియు దర్శకుల పెరుగుతున్న సంఖ్య ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుప్రక్కల ఉన్న నివాస స్థలాల్లో అనేక విమానాల శబ్దం అధికం కావడానికి కారణమయ్యింది. అక్కడ జీవిస్తున్న ప్రజలను శబ్ద ఉపద్రవం నుండి విడిపించేందుకు, రాత్రి 9 గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ విధించబడింది. 1974 నుండి అంతర్జాతీయ విమానాలను పెంచేందుకు అనుమతి ఇవ్వబడలేదు. అలా, ఎక్కువ మంది యాత్రికులతోను కేవుతోను వ్యవహరించడం ముఖ్య భూభాగంలోని అత్యవసరతగా మారింది.
ఏ మాత్రం శబ్దం లేకుండా పగలూ రాత్రి ఉపయోగించగల విమానాశ్రయం అన్నది ఆ పథకంలో ఇమిడి ఉన్న వారికి పెద్ద సవాలుగా ఉండేది. ప్రజలు నివసిస్తున్న ప్రాంతం నుండి దూరంగా ఒక దీవిని నిర్మించి దానిని విమానాశ్రయంగా చేయడమే ఒకే ఒక పరిష్కారం. నిజంగా ఓ పెద్ద పథకమే!
స్థానిక వ్యాపారం ప్రపంచంతో కలిసి జాతీయ మరియు ప్రాంతీయ ప్రభుత్వాలు క్రొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, ఆరంభించేందుకు ఒక ప్రైవెట్ కంపెనీని రూపొందిస్తూ, 1500 కోట్ల అమెరికన్ డాలర్ల పథకానికి పెట్టుబడి పెట్టాయి. కాన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయం కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిసు కిమురా గారు తేజరిల్లు! తో ఈ విధంగా చెప్పారు: “ఒక ప్రైవేటు కంపెనీగా, మేము దీవిని సృష్టించడంలో ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోయాము. పని త్వరగా పూర్తి చేయబడవలసి ఉండింది.”
“దీవిని సృష్టించడం”
తీరం వెంబడి ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవడం ఒక ఎత్తు, అయితే తీరం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో దీవిని సృష్టించడం మరొక ఎత్తు. 1,260 ఎకరాల విమానాశ్రయ దీవిని సృష్టించేందుకు, 18 కోట్ల ఘనపు మీటర్ల ఇసుక మరియు మట్టి భూమిగా నింపడానికి ఉపయోగించబడింది. “అది 73 పిరమిడ్లకు సమానం—అంటే రాజైన ఖుఫు నిర్మించిన అతి పెద్ద పిరమిడ్‌కు సమానం” అని కిమురాగారు వివరిస్తున్నారు.
సముద్ర అడుగుభాగాన, 18 మీటర్ల సగటు లోతున, ఓ మెత్తని బంకమంటి పొర ఉంది, దానిలో నుండి నీళ్ళు ఇంకిపోవలసి ఉండింది. “నీళ్ళు లేకుండా చేసేందుకు, పునాదిని దృఢం చేసేందుకు 40 సెంటీమీటర్ల [16 అంగుళాల] చుట్టుకొలత గల పది లక్షల ఇసుక కుప్పలు ఆ పొరలోనికి ప్రవేశపెట్టబడ్డాయి. మట్టి కుప్పల బరువు వల్ల నీళ్ళు 20 మీటర్ల [66 అడుగుల] మెత్తని మట్టి పొర నుండి నెట్టివేయబడి, ఆ మట్టి 14 మీటర్ల [46 అడుగుల] లోతుకు పోయింది. భూమిలోని రెండవ పొరను అంతటా సమానంగా దృఢపరచలేమేమోనని మేము చాలా భయపడ్డాము. దృఢపరచడమనేది సమానంగా ఉండేందుకు మట్టిని సరిగ్గా ఎక్కడ నింపాలో అంచనా వేసేందుకు మేము కంప్యూటర్లను ఉపయోగించాము” అని మట్టిని నింపే పథకం బాధ్యతను వహించిన కెనిచిరో మినామిగారు వివరిస్తున్నారు.
మొత్తం కలిసి నింపిన మట్టి లోతు 10 అంతస్తుల భవనానికి సమానమైన 33 మీటర్లయ్యింది. అయినప్పటికీ, మట్టి భారం వల్ల, సముద్ర అడుగుభాగం కృంగిపోయింది, కృంగిపోతూనే ఉంది. 50 సంవత్సరాల్లో దీవిని సముద్ర మట్టానికి నాలుగు మీటర్ల ఎత్తున ఉంచుతూ సముద్ర అడుగుభాగం మరో 1.5 కిలోమీటర్లు కృంగుతుందని లెక్కవేయబడింది.
1991 లో దీవి అంతా సృష్టించబడడానికి ముందే పాసెంజర్ టెర్మినల్ బిల్డింగ్ మరియు కంట్రోల్ టవర్ ఆరంభించబడ్డాయి. ఏడు సంవత్సరాల కష్టమైన పని తరువాత, దీవి నిర్మాణం, విమానాశ్రయం మరియు దాని సంబంధించిన సౌకర్యాలు పూర్తి చేయబడ్డాయి.
పెద్దదే అయినా చక్కగా అమర్చబడింది
వస్తున్న యాత్రికులందరూ ఆశ్చర్యానందాన్ని పొందుతున్నారు. “బాగేజ్ క్లెయిమ్ స్థలానికి వచ్చేసరికి మా సూట్‌కేసులు అక్కడ చేరుకున్నాయి” అని అమెరికా నుండి వచ్చిన ఒక యాత్రికుడు అంటున్నాడు. అన్నీ అంత చక్కగా జరగడానికి కారణమేమిటి? “పాసెంజర్ టెర్మినల్ బిల్డింగ్ పెద్దదే అయినప్పటికీ, చక్కగా అమర్చబడి ఉంది. యాత్రికులు అంతర్జాతీయ విమానాశ్రయాల్లోలాగే చిక్కు త్రోవలో పోనవసరం లేదు” అని పాసెంజర్ టెర్మినల్ బిల్డింగ్ అధికారియైన కాజుహిటో ఆరావో గారు చెబుతున్నారు.
పాసెంజర్ టెర్మినల్ బిల్డింగ్ యొక్క నిర్మాణం సరళమైనదైనప్పటికీ, సాటిలేనిది. యాత్రికులు అనవసరంగా అటు ఇటు వెళ్ళనవసరం లేని విధంగా మెయిన్ బిల్డింగ్ డిజైన్ చేయబడి ఉంది. స్వదేశ యాత్రికులు రైల్వే స్టేషన్ నుండి నేరుగా తమ టికెట్లను తనిఖీ చేసే కౌంటర్‌కు వెళ్ళవచ్చు, తరువాత మెట్లు ఎక్కడమో దిగడమో చేయకుండా బోర్డింగ్ గేట్‌కు వెళ్ళవచ్చు.
తనిఖీ చేసే కౌంటర్లు, ఇమిగ్రేషన్ ఆఫీసులు, కస్టమ్స్ ఉన్న మెయిన్ బిల్డింగ్ నుండి 700 మీటర్ల వెడల్పు ఉన్న భవనాలు ఉత్తరం మరియు దక్షిణం వరకు వ్యాపించి ఉండి 33 బోర్డింగ్ గేట్లకు నడిపిస్తుంది. మెయిన్ బిల్డింగ్ నుండి దూరంగా ఉన్న గేట్ల గుండా వెళ్ళే యాత్రికులు విన్గ్ షట్టిల్ అని పిలువబడే ఆటోమాటిక్ గైడ్‌వే ట్రాన్సిట్ సిస్టెమ్‌ను ఉపయోగించగలరు. షట్టిల్ కొరకు వేచి ఉండి గడిపే సమయంతో సహా ఐదు నిమిషాల్లో అది వారిని కావలసిన గేట్‌కు తీసుకువెళ్తుంది.
చూడవలసిన విమానాశ్రయం
“పూర్తిగా సముద్రం మీద ఉన్న విమానాశ్రయం కనుక, పూర్తిగా ఆటంకరహితంగా ఉంటుంది” అని అరావో గారు అంటున్నారు. “అవును, దిగడానికి చాలా సులభమైన విమానాశ్రయం అని పైలెట్లు చెప్పడం మేము విన్నాము” అని కిమురా గారు ఒప్పుకుంటున్నారు.
దాని చక్కదనాన్ని ఇతరులు కూడా ప్రశంసిస్తారు. విమానం రెక్కల ఆకారంలో ఉన్న టెర్మినల్ బిల్డింగ్ యొక్క పరిష్కృత డిజైను అనేక మంది యాత్రికులను కాన్కూకు ఆకర్షించింది. ఈ అసాధారణ దీవి విమానాశ్రయం నుండి విమానాలు పైకి ఎగరడాన్ని, ఇక్కడకు వచ్చి వ్రాలడాన్ని కూడా చూసి వారు ఆనందిస్తారు. “విమానాశ్రయానికి వచ్చే సందర్శకుల కొరకు మెయిన్టెనెన్స్ సెంటర్ పైభాగాన ఒక అబ్సర్వేషన్ డెక్‌ను నిర్మించడాన్ని గూర్చి మేము మొదట ఉద్దేశించనప్పటికి, తరువాత నిర్మించవలసి వచ్చింది” అని కిమురా గారు అంటున్నారు. ప్రతి రోజు సరాసరి 30,000 మంది ప్రజలు విమానాశ్రయాన్ని కేవలం దాని పరిసరాలను చూడడానికే సందర్శిస్తారు.
కాన్సాయి ప్రాంతానికి సమీపంలో ఉన్న జపాన్ను మీరు సందర్శిస్తున్నట్లయితే, కాన్కూ—చూడగలదే అయినప్పటికీ దాని చుట్టుప్రక్కల ప్రాంతాలవారు శబ్దం వినని విమానాశ్రయానికి లేదా అక్కడ నుండి విమానంలో ఎందుకు ప్రయాణం చేయకూడదు.
[అధస్సూచి]
a కాన్సాయి అనేది ఒసాకా, కోబ్ మరియు క్యోటో, నారో అనే చరిత్రాత్మక నగరాలు చేరివున్న తూర్పు జపాన్‌లోని సాధారణ స్థలము. కొకుసాయి కుకొ అంటే “అంతర్జాతీయ విమానాశ్రయం” అని భావం.
[Picture Credit Line on page 19]
Kansai International Airport Co., Ltd.