కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 2/8 పేజీలు 3-5
  • మన గ్రహాన్ని కాపాడుకునే పోరాటం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన గ్రహాన్ని కాపాడుకునే పోరాటం
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పెరుగుతున్న అపాయం
  • గ్రహాన్ని కాపాడేందుకు పోరాటం
  • మన వాతావరణానికి హాని కలిగినప్పుడు
    తేజరిల్లు!—1995
  • పోరాటం జయించబడుతుందా?
    తేజరిల్లు!—1996
  • సున్నితమైన మన గ్రహం దాని భవిష్యత్‌ విషయమేమిటి?
    తేజరిల్లు!—1996
  • మన వాతావరణమెలా కాపాడబడుతుంది
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 2/8 పేజీలు 3-5

మన గ్రహాన్ని కాపాడుకునే పోరాటం

స్పెయిన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

రష్యా పట్టణమైన కారాబాష్‌లో జీవించే యూరీకి ఇద్దరు పిల్లలున్నారు, మరి వాళ్లిద్దరు జబ్బుపడివున్నారు. దీని వల్ల ఆయన కలత చెందివున్నాడు కానీ ఆయన ఆశ్చర్యపోవడంలేదు. “ఇక్కడ మంచి ఆరోగ్యమున్న పిల్లలు లేనేలేరు” అని ఆయన వివరిస్తున్నాడు. కారాబాష్‌ ప్రజలు విషప్రభావానికి గురౌతున్నారు. ప్రతిసంవత్సరం ఓ స్థానిక కర్మాగారం, 1,62,000 కాలుష్యాలను గాలిలోకి వమనం చేస్తోంది, అంటే ప్రతి పురుషునికీ, స్త్రీకి మరియు బిడ్డకూ 9 టన్నుల చొప్పున వమనం చేస్తోందన్నమాట. ఆర్కిటిక్‌ వలయమందలి ఉత్తర ప్రాంతంలో కోలా ద్వీపకల్పములోని నికెల్‌ మరియు మోన్‌చిగ్రాస్క్‌ వద్ద “ప్రపంచంలోని అతి పెద్ద మరియు అతి పురాతనమైన నీకెల్‌ లోహశుద్ధి కర్మాగారాలు . . . బార లోహాలనూ సల్ఫర్‌ డయాక్సైడ్‌ను, రష్యాలోని అలాంటి మరే ఇతర కర్మాగారాలకన్నా ఎక్కువగా గాలిలోకి వమనం చేస్తున్నాయి.—ది న్యూయార్క్‌ టైమ్స్‌.

మెక్సికో నగరంలోని వాయువు ఏమాత్రం ఆరోగ్యదాయకం కాదు. ఆ నగరమందలి ధనిక ప్రాంతంలో సహితం, పిల్లలు 5 రోజుల్లో 4 రోజులు అనారోగ్యంగానే ఉంటారని డా. మార్గరిటా కాస్టియెహోస్‌ చేసిన సర్వేలో కనుగొనడం జరిగింది. “అస్వస్థంగా ఉండడం వారికి మామూలైపోయింది” అని ఆమె చెప్పింది. దీనికి ముఖ్యాపరాధుల్లో ఒకటి, విపరీతంగా పెరిగిపోయిన వేవేల వాహనాలు విడిచే అంతటా వ్యాపిస్తున్న దట్టమైన పొగ అని ఆమె చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన దానికంటే ఓజోను సాంద్రతలు గరిష్టానికి నాలుగురెట్లు అధికంగా ఉన్నాయి.

ఆస్ట్రేలియానందు ఈ అపాయం కళ్లకు కనిపించదు, కానీ అది కూడా అంతే ప్రాణాంతకంగా ఉంది. పిల్లలు బడిలోని ఆటస్థలంలో ఆడుకునేటప్పుడు టోపీ పెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణార్థగోళంలోని ఓజోను రక్షణ కవచం ఎక్కువభాగం పాడుకావడం ఆస్ట్రేలియా వారు సూర్యున్ని మిత్రునిగాకాక ఓ శత్రువుగా దృష్టించేలా చేసింది. అప్పటికే చర్మ క్యాన్సర్‌ వ్యాధిలో మూడు రెట్లు పెరుగుదలను వారు చూశారు.

ప్రపంచంలోని ఇతర భాగాల్లో, సరిపడా నీటిని పొందడం అనుదిన పోరాటంగా ఉంది. అమల్యాకు 13 ఏండ్లు ఉన్నప్పుడు మొజాంబిక్‌ను అనావృష్టి మొత్తింది. మొదటి సంవత్సరంలో నీరు అంతంతమాత్రమే ఉండేది ఇక ఆ తర్వాతి సంవత్సరం అది కూడా లేకుండాపోయింది. కాయగూరల పంటలు వడలిపోయి నాశనమయ్యాయి. అమల్యా ఆమె కుటుంబం, అడవి పళ్లను తినే పరిస్థితీ మరియు కొంతైన అమూల్యమైన నీటిని కనుగొనేందుకు ఇసుక ఉన్న నదీతలాన్ని త్రవ్వే తప్పనిసరి పరిస్థితీ ఏర్పడింది.

ఇండియాలోని రాజస్థాన్‌ రాష్ట్రం నందు, కనుమరుగయ్యేది మేపు నేలే. ఓ సంచారక తెగకు చెందిన ఫాగు అనే వ్యక్తికి, స్థానిక వ్యవసాయదారులకూ తరచూ వాదోపవాదాలు జరుగుతాయి. తన మేకలూ గొర్రెల కొరకు మేపే స్థలాన్ని ఆయన కనుగొనలేకపోయేవాడు. సారవంతమైన భూమి బొత్తిగా లేకపోవడంవల్ల, వ్యవసాయదారులూ మరియు సంచారకులమధ్య శతాబ్దాలుగా ఉన్న శాంతియుత సహజీవనం తెగిపోయింది.

సహెల్‌లోని పరిస్థితి మరి దారుణంగా ఉంది, ఆఫ్రికాలోని సహారా దక్షిణాది అంచున ఎంతో విశాల పరిధిలోనున్న వర్షాబావ ప్రాంతమది. అడవి నిర్మూలనా ఫలితంగా మరియు వెంటవెంటనే వచ్చే క్షామం వల్ల, మందలన్నీ మటుమాయమయ్యాయి, అంతేకాకుండ చిన్న వ్యవసాయ భూములు పెరిగే ఎడారి క్రింద పూడుకుపోయాయి. తన జొన్న పంట ఏడవసారి నాశనమవ్వడం చూసిన నైజీరియా వ్యవసాయదారుడైన ఫులాని, “నేనిక పంటవేయనే వేయను” అని ఒట్టుపెట్టుకున్నాడు. అప్పటికే, పచ్చగడ్డి లేకపోవడంవల్ల ఆయన పశువులు చచ్చిపోయాయి.

పెరుగుతున్న అపాయం

ఇటీవలి అనావృష్టి పరిస్థితులకు, పంటలు పాడుకావడానికి, ఒక నగరం తర్వాత మరొకదాన్ని ఊపిరి ఆడకుండా చేస్తున్న కలుషిత వాయువులకు అలాంటి ప్రమాదకరమైన విషయాలే ఉన్నాయి. అవి మానవుని విపరీత కోరికల దాహాన్ని ఏమాత్రం తట్టుకోలేని అస్వస్థ గ్రహపు రోగలక్షణాలు.

మనం పీల్చే వాయువూ తినే ఆహారమూ మరియు త్రాగేనీరు కన్నా మనం జీవించేందుకు అవసరమైన వాటిలో అతి ప్రాముఖ్యమైనవి వేరేలేవు. దారుణంగా, మానవుని చేజేతులా, జీవాన్ని కాపాడే ఈ అవసరమైన విషయాలు కలుషితం చేయబడుతున్నాయి మరియు క్రమంగా నాశనం చేయబడుతున్నాయి. కొన్ని దేశాల్లో పర్యావరణ పరిస్థితి ఇప్పటికే జీవానికి అపాయకరంగా ఉంది. మునుపటి సోవియట్‌ అధ్యక్షుడైన మిఖాయేల్‌ గోర్బచేవ్‌ ఆ విషయాన్ని ఇలా స్పష్టంగా వివరించాడు, “జీవావరణశాస్త్రం మన పీకపట్టుకుంది.”

ఈ అపాయం తేలికగా తీసుకోవల్సింది కాదు. ప్రపంచ జనాబా క్రమంగా పెరుగుతోంది మరియు మితంగానే ఉన్న వనరుల అవసరత మరింత పెరుగుతోంది. “మన భవిష్యత్తుపైనున్న అపాయం సైనిక దాడికాదుకానీ ఈ గ్రహంలో సంభవించే పర్యావరణ వినాశనమే” అని వరల్డ్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యక్షుడైన లెస్టర్‌ బ్రౌన్‌ ఇటీవల పేర్కొన్నాడు. ఓ విషాదాంతాన్ని నివారించేందుకు కావలసిన చర్యలను గైకొనడం జరుగుతుందా?

గ్రహాన్ని కాపాడేందుకు పోరాటం

తనకు త్రాగుడు సమస్య లేదని దృఢంగా నమ్మే త్రాగుబోతుకు సహాయం చేయడం కష్టమే. అదే విధంగా, మన గ్రహాన్ని బాగుపర్చే చర్యలో మొదటిది, అది ఎంతగా పాడైందన్న విషయాన్ని గ్రహించడమే. బహుశ ఇటీవలి సంవత్సరాల్లో విద్య పర్యావరణ విజయమైంది. మన భూమి క్షీణింపజేయబడిందని మరియు కలుషితమైందని—మరి అందుకు ఏదోకటి చేయాలని అనేకమంది ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు. అణ్వస్త్ర యుద్ధంకన్నా పర్యావరణ వినాశనమే నేడు అధిక అపాయకరంగా ఉంది.

ప్రపంచ నాయకులకు ఈ సమస్యలు తెలియనివికావు. 1992 లో జరిగిన ఎర్త్‌ సమ్మిట్‌కు సుమారు 118 మంది దేశాధినేతలు హాజరయ్యారు, ఆ సమయంలో వాతావరణాన్నీ తరిగిపోతున్న భూ వనరులనూ కాపాడేందుకు కొన్ని చర్యలు గైకొనబడ్డాయి. అనేక దేశాలు క్లైమేట్‌ ట్రీటీపై సంతకాలు చేశాయి. అందులో, సమీప భవిష్యత్తులో వెలువడిన కార్బన్‌ బయటకు విడిచే మొత్తాన్ని స్థిరీకరింపజేసే లక్ష్యంతో దానిలోని మార్పులను నివేదించే విధానాన్ని స్థాపించేందుకు వారు అంగీకరించారు. మన గ్రహంలోని మొక్కలూ జంతు జాతులన్నింటినీ అంటే, జీవవైవిధ్యాన్ని కాపాడే మార్గాలను పరిగణించారు. ప్రపంచ అడవులను కాపాడే విషయంలో ఒక ఒప్పందానికి రాలేకపోయారు కానీ ఆ సమ్మిట్‌ రెండు పత్రాలను వెలువర్చింది—“రియో ప్రకటన” మరియు “21 వ అజెండా.” “నిలకడగావుండే పురోభివృద్ధిని” దేశాలు ఎలా సాధించగలవన్న దానిపై మార్గదర్శకాలు అందులో ఉన్నాయి.

పర్యావరణ శాస్త్రవేత్తైన అలెన్‌ హమ్మండ్‌ సూచించినట్లుగా, “అక్కడ చేసిన ఒప్పందాలను నిలబెట్టుకుంటారా అంటే, ఈ పెద్ద మాటలు రాబోయే నెలలు మరియు సంవత్సరాల్లో క్రియలౌతాయా లేదా అన్నదే అసలైన పరీక్ష.”

అయితే, దీనిలోని ప్రాముఖ్యమైన పురోగమన మెట్టు ఏమిటంటే, 1987 మాంట్రీయల్‌ ఒడంబడిక. ఒక నియమిత సమయంలో క్లోరోఫ్లోరోకార్బన్ల (CFC లు) ఉత్పాదనను అంచెలంచెలుగా నిలిపివేయాలని అంతర్జాతీయంగా నిర్ణయించడం దీనిలో ఇమిడివుంది.a అంత శ్రద్ధనెందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే CFC లు, భూమి యొక్క రక్షిత కవచమైన ఓజోను పొర ఎంతో త్వరగా పాడైపోయేందుకు దోహదపడుతున్నాయని భావించబడుతోంది. భూమి ఉపరితలానున్న వాతావరణంలో ఉన్న ఓజోను, చర్మ క్యాన్సరునూ కంటి జబ్బునూ కలిగించే సూర్యుని అతినీలలోహిత కిరణాలను వడగట్టడంలో ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది. ఇది కేవలం ఆస్ట్రేలియాలోని సమస్య కాదు. ఇటీవల, సమశీతోష్ణమండలంలోని ఉత్తరార్థగోళంపైని శీతాకాలంలో ఓజోను పొర సాంద్రత 8 శాతం వరకు తగ్గిపోయిందని వైజ్ఞానికులు కనుగొన్నారు. రెండు కోట్ల టన్నుల CFC లు ఇప్పటికే స్ట్రాటో వరణం వైపుకు వెళ్లాయి.

ఈ వాతావరణం నాశనకరమైన విధంగా కలుషితమవ్వడాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ మధ్యనున్న భేదాలను ప్రక్కకునెట్టి నిశ్చిత చర్యలను గైకొన్నాయి. అపాయంలోనున్న జీవసంపదను జంతుజాతులను కాపాడేందుకు, అంటార్కిటికాను సంరక్షించేందుకు మరియు విషపూరితమైన వ్యర్థపదార్థాల ఒరవడిని తగ్గించేందుకు మరో అంతర్జాతీయ చర్య కూడా రాబోతోంది.

నదులను శుభ్రపర్చేందుకు (ఇప్పుడు సాల్మన్‌ చేపలు ఇంగ్లాండ్‌లోని థేమ్స్‌ నదికి తిరిగి వచ్చాయి), వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు (దట్టంగా అలుముకున్న పొగతోవున్న అమెరికాలోని నగరాల్లో ఇది 10 శాతం తగ్గింది), పర్యావరణానికి మంచిని చేసే శక్తి వనరులను కనుగొనేందుకు (ఐస్‌లాండ్‌లోని 80 శాతం ఇళ్లు భూగర్భ థర్మల్‌ విద్యుత్‌ వల్లే వెచ్చగా ఉంటున్నాయి) మరియు తమ వారసత్వ సంపదను సంరక్షించుకునేందుకు (కోస్టారికా మరియు నమీబియా తమ దేశాల 12 శాతం ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనాలుగా చేశారు) అనేక దేశాలు నిశ్చిత చర్యలను గైకొన్నాయి.

మానవజాతి అపాయాన్ని గంభీరంగా తీసుకుంటోందనేందుకు రుజువుగా ఇవి అనుకూల సూచనలేనా? మన గ్రహం మరలా ఒకసారి పౌష్ఠికస్థితికి వచ్చేందుకు ఇక కేవలం కొద్దికాలమే ఉందా? తదుపరి శీర్షికలు ఈ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ప్రయత్నిస్తాయి.

[అధస్సూచి]

a గాలిని తాజాచేసే స్ప్రేలూ, ఫ్రిడ్జిలూ ఎయిర్‌కండీషన్‌ పరికరాలూ శుభ్రపర్చే పదార్థాలూ మరియు ఫోమ్‌ ఇన్సూలిన్లను తయారు చేయడంలో CFC లు విస్తృతంగా ఉపయోగించబడతాయి. జనవరి 8, 1995 నాటి తేజరిల్లు! లో “మన వాతావరణానికి హాని కలిగినప్పుడు” అనే శీర్షికను చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి