కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 1/8 పేజీలు 22-24
  • నా తల్లిదండ్రులకు నేనెందుకు లోబడాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా తల్లిదండ్రులకు నేనెందుకు లోబడాలి?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్లు ఎందుకు ఎదురుతిరుగుతారు
  • ఎదురుతిరగడం ఎందుకు అవివేకమైనది
  • “స్వాతంత్ర్యం” యొక్క అధిక మూల్యం
  • మీ తలిదండ్రుల హృదయాలను ఉల్లసింపజేయుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • యౌవనులారా—మీరు వెంబడించేదేమిటి?
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • యౌవనులారా, యెహోవాకు తగినట్టు నడుచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
తేజరిల్లు!—1995
g95 1/8 పేజీలు 22-24

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

నా తల్లిదండ్రులకు నేనెందుకు లోబడాలి?

స్టాన్‌ను దైవభయంగల తల్లిదండ్రులు పెంచారు. అయితే 16 సంవత్సరాలు వచ్చేసరికి అతడు ఎదురు తిరిగాడు. “నేను ప్రజలతో కలిసిపోవాలని మరియు వాళ్లచేత అంగీకరించబడాలని కోరుకున్నాను. అలాగే యితర ప్రజలకున్న వస్తువులన్నీ నాకు కావాలని కోరుకున్నాను” అని స్టాన్‌ వివరిస్తున్నాడు. ఈ లక్ష్యాలను సాధించటానికి స్టాన్‌కున్న సంకల్పం మాదకద్రవ్యాల ఒక ఏజెంటుగా మారడమే. సహజంగా, అతను యింటికి వచ్చేది, వెళ్లేది, యింటికి తెచ్చే డబ్బును గూర్చికూడా అబద్ధమాడవలసి వచ్చేది. “నా మనస్సాక్షి చచ్చిపోయింది,” అని స్టాన్‌ గుర్తు చేసుకుంటున్నాడు.

జాన్‌ 11 సంవత్సరాల వయస్సులోవున్నప్పుడు ఒక క్రైస్తవునిగా బాప్తిస్మం తీసుకున్నాడు. “నిజానికి సత్యం ఎంతమాత్రం నా హృదయంలో లేదు.” “నేను బాప్తిస్మం తీసుకోవాలని మా కుటుంబం అపేక్షించింది కాబట్టి నేను తీసుకొన్నాను. నేను ఉన్నత పాఠశాలకు వచ్చేసరికి, నేను అదుపు తప్పటం ప్రారంభించాను. రాక్‌ సంగీతంకూడ నాపై చెడు ప్రభావాన్ని కలిగి ఉండినది. నేను సర్ఫింగ్‌ ఆటలో నిమగ్నమగుటవలన ఎక్కువ సమయాన్ని బీచ్‌లో బైబిలు సూత్రాలచే నడిపించబడని యితర యౌవనస్థులతో గడపడం ప్రారంభించాను. అక్కడ చాల మాదకద్రవ్యాలుండేవి” అని అన్నాడు. కొద్దికాలానికే అతడు తన తల్లిదండ్రుల యింటినుండి బయటకు వెళ్లిపోయాడు మరియు తనకు బోధింపబడిన సూత్రాలకు వ్యతిరేకమైన జీవిత విధానాన్ని అవలంభించాడు.

వాళ్లు ఎందుకు ఎదురుతిరుగుతారు

యౌవనస్థులు తమ పరిమితులను పరీక్షించుకోవటానికి, అలాగే తమకు ఎక్కువ స్వాతంత్ర్యం కావాలని ప్రయత్నించటం సహజం. అయితే తిరుగుబాటుతనం, దౌర్జన్యంగా వ్యవహరించటం, స్వయం నాశనకరమైన ప్రవర్తన పూర్తిగా వేరే విషయము. దాన్ని రేపేదేమిటి? అనేక వేర్వేరు కారణాలు ఉన్నాయి. “మీరు యౌవనస్థులుగా ఉన్నప్పుడు సరదాగా ఉండాలనుకుంటారు. మీరు హాయిగా కాలక్షేపం చేయాలని యిష్టపడతారు,” అని జాన్‌ వివరిస్తున్నాడు. అయితే, వాళ్లకు జీవితంలో అనుభవం తక్కువ గనుక, యౌవనస్థులు ఎప్పుడుకూడ మంచి తీర్మానాలను చేయలేరు. (హెబ్రీయులు 5:14) వివేకంగల తల్లిదండ్రులు వాళ్ల పిల్లలపై సహేతుకమైన కట్టుబాటులను పెడతారు—అట్టి కట్టుబాటులను కొంతమంది యౌవనులు తీవ్రంగా ఆగ్రహిస్తారు.

విచారకర విషయమేమనగా, కొంతమంది యౌవనులు దైవిక భయంగల తల్లిదండ్రులనుండి పొందిన తర్ఫీదును తిరస్కరిస్తున్నారు. (ఎఫెసీయులు 6:1-4) క్రైస్తవత్వం “ఇరుకును,” “సంకుచితమునైన,” జీవితమార్గమని యేసు చెప్పాడు. (మత్తయి 7:13, 14) గనుక అప్పుడప్పుడు క్రైస్తవ యౌవనస్థులు పాఠశాలలోని తమ తోటివారు చేసిన పనులను చేయలేరు. చాలామంది దైవిక సూత్రాలు భారమైనవి కావని గుణగ్రహిస్తూ, కట్టుబాట్లకు లోబడతారు. (1 యోహాను 5:3) వాస్తవానికి, యీ సూత్రాలు వివాహం కాకుండానే గర్భం ధరించడం, మాదకద్రవ్యాలకు బానిసలవ్వడం, లైంగిక సంబంధమైన వ్యాధులకు గురికావడంవంటి సమస్యలనుండి యౌవనస్థులను కాపాడతాయి. (1 కొరింథీయులు 6:9, 10) అయితే కొంతమంది యౌవనస్థులు ఆ విధంగా పరిస్థితులను దృష్టించడానికి నిరాకరిస్తారు; బైబిలు నియమాలు తమ జీవితవిధానాన్ని సంకుచితం చేస్తున్నట్లుగా వాళ్లు భావిస్తారు.

ఉల్లాసకార్యక్రమాలు మరియు వినోదంవంటి విషయాలు వచ్చినప్పుడు తన తల్లిదండ్రుల క్రమశిక్షణ మరీ ఎక్కువ కఠినంగా ఉన్నట్లుగా ఒక యౌవనస్థుడు భావిస్తే, అతనికి విపరీతమైన చికాకు అనిపిస్తుంది. “నా తల్లిదండ్రులు మాతో చాల ఖండితంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది,” అని ఒక యౌవనబాలిక ప్రలాపించింది. నిజమే, యితర క్రైస్తవ తల్లిదండ్రులు అనుమతిస్తున్నట్లుగా, కొన్ని విషయాలపై అనుమతి లభించనందుకు మీకు నిరుత్సాహంగా ఉండవచ్చు. (కొలొస్సయులు 3:21) కొంతమంది యౌవనస్థులు అవిధేయత చూపడంద్వారా కలతను కనపర్చుతారు.

మరోవైపు, కొంతమంది యౌవనస్థులు తమ తల్లిదండ్రులు దైవిక నియమాలయెడల సరియైన గౌరవాన్ని చూపకపోవటంచేత కూడ తమ దారి తప్పిపోతున్నారు. “నా తండ్రి ఒక త్రాగుబోతు,” అని జాన్‌ జ్ఞాపకం చేసుకొంటున్నాడు. “ఆయన ఎక్కువగా త్రాగుతాడు గనుక మా అమ్మ ఆయన వాదించుకొనేవారు. ఆయనను తప్పించుకోడానికి మేము అనేకసార్లు యిల్లు మారేవాళ్లం.” త్రాగుబోతులు లేదా యితర వ్యసనాలకు బానిసలైనవారు సరియైన విధంగా తమ పిల్లల అవసరాలను తీర్చలేకపోతుంటారు. అటువంటి గృహాలలో, దెబ్బలాడుకోడాన్ని, నిందించుకోడాన్ని ఒక యౌవనస్థుడు ప్రతిరోజు చూస్తుండవచ్చు.

ఇతర యౌవనస్థులు తమ తల్లిదండ్రులు తమను విడిచిపెట్టడం లేక నిర్లక్ష్యం చేయడం వలన ఎదురుతిరుగుతారు. తిరుగుబాటు అనేది తల్లిదండ్రుల అవధానాన్ని పొందడానికి—లేదా వాళ్లను గాయపర్చడానికి ఒక మార్గంలా అనిపించవచ్చు. “నాకు జ్ఞాపకమున్నంతవరకు, నా తల్లిదండ్రులు ఎప్పుడూ నాతో ఉండేవాళ్లుకాదు, నేను ఒకే ఒక కుమార్తెను, పైగా ఎప్పుడూ నాకు కావలసినంత డబ్బును యిస్తుండేవారని,” ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చిన టైలర్‌ అనే ఒక యౌవనబాలిక చెబుతుంది. పర్యవేక్షణ కొరవడుటవలన, టైలర్‌ నైట్‌క్లబ్బులకు హాజరవుతూ త్రాగడం ప్రారంభించింది. చివరికి ఆమె ఎక్కువగా త్రాగి డ్రైవింగ్‌ చేస్తుండటంవలన ఆమెను అరెస్టు చేసేవరకు ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆ సమస్య ఉన్నదని గుర్తించలేకపోయారు.

దానికితోడు, ఒక క్రైస్తవగుంపును అపొస్తలుడైన పౌలు యిలా అడిగినప్పుడు ఆయన సూచించిన పరిస్థితి ఉంది: “మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను?” (గలతీయులు 5:7) తరచూ చెడు సహవాసంకూడ సమస్య అవుతుంది. (1 కొరింథీయులు 15:33) “నేను చెడ్డ వారితో కలిసి ఉండేదాన్ని,” అని ఎలిజబెత్‌ అనే ఒక యౌవనస్థురాలు అంటూంది. తనతోటి వారి ఒత్తిడి ఫలితంగా “ప్రొగతాగడం, మాదకద్రవ్యాలను ఎక్కువగా సేవించడం ప్రారంభించిందని,” ఆమె ఒప్పుకొంటూంది. ఆమె ఇంకా చెబుతూ: “వ్యభిచారం అనేది ప్రతిదిన చర్య అయ్యింది.”

ఎదురుతిరగడం ఎందుకు అవివేకమైనది

మీరుకూడా విసుగు కలిగించే—లేదా అణిచివేసే పరిస్థితిలో ఉన్నట్లు కనుగొనవచ్చు. మీ తల్లిదండ్రులను తిరస్కరించి మీకు యిష్టమైనది చేయాలని మీరు శోధింపబడుతున్నట్లు అన్పించవచ్చు. అయితే నీతిమంతుడైన యోబు హెచ్చరింపబడినట్లు, “నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము. జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము.”—యోబు 36:18-21.

పగతో, దౌర్జన్యంతో కూడిన ప్రవర్తన మీ తల్లిదండ్రులు ప్రతిస్పందించేలా చేయవచ్చు. కానీ అది ఒక మంచి ప్రతిస్పందన కాకపోవచ్చు. అటువంటిది ఏదైనా జరిగితే, వాళ్లు మీపై మరీ ఎక్కువ ఆంక్షలు విధించవచ్చు. అంతేకాకుండా, అవమానకరమైన ప్రవర్తన మీ తల్లిదండ్రులకు చాలా బాధనుకూడా కలిగించవచ్చు. (సామెతలు 10:1) అది ప్రేమించడమా? అది మీ పరిస్థితిని నిజంగా మెరుగుపర్చుతుందా? మీకు న్యాయమైన ఫిర్యాదులున్నాయని మీరు భావిస్తే, సంగతులను అన్నింటినిగూర్చి వాళ్లతో మాట్లాడడం వివేకమైన పని.a మీతో వ్యవహరించే పద్ధతిలో కొన్ని సర్దుబాట్లు చేసుకోడానికి వాళ్లు సిద్ధపడవచ్చు.

గమనించవలసిన మరొక విషయమేమంటే, మీ క్రియలు దేవునిపై చూపించగల ప్రభావం. ‘దేవునిపైనా?’ అని మీరు ఆశ్చర్యపడవచ్చు. నిజమే, తల్లిదండ్రులకు ఎదురు తిరగడం అనేది మొత్తంమీద దేవునిపై తిరుగుబాటునే సూచిస్తుంది, ఎందుకంటే తల్లిదండ్రులకు లోబడమని ఆయనే మీకు ఆజ్ఞను యిచ్చాడు. (ఎఫెసీయులు 6:2) ఈ విధమైన అవిధేయత దేవుడు ఎలా భావించేలా చేయగలదు? ఇశ్రాయేలీయుల జనాంగాన్నిగూర్చి బైబిలు యిలా చెబుతుంది: “అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి.” ఎలాంటి ఫలితాన్ని చూపింది? “ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.” (కీర్తన 78:40) వాస్తవమే, వాళ్లు చాలా ఆంక్షలను విధించినట్లుగా అనిపించి మీ తల్లిదండ్రులవలన మీకు నిరాశకల్గవచ్చు. అయితే మీరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ, మీరు నిత్యం జీవించాలని కోరుకునే యెహోవాదేవుని హృదయానికి బాధను కలిగించాలని కోరుకుంటారా?—యోహాను 17:3; 1 తిమోతి 2:4.

“స్వాతంత్ర్యం” యొక్క అధిక మూల్యం

కావున, మంచి కారణంతో, మనము మన ప్రేమపూర్వకమైన పరలోక తండ్రి చెప్పింది వినవలసిన అవసరం ఉంది. “స్వాతంత్ర్యము”ను గూర్చిన అబద్ధ వాగ్దానాలవల్ల మోసపోకుడి. (2 పేతురు 2:9 పోల్చండి.) కొంతమంది యౌవనస్థులు తమ చెడునడతనుబట్టి శిక్షింపబడటం లేదని అనిపించవచ్చు. కాని కీర్తనల గ్రంథకర్త యిలా హెచ్చరించాడు: “చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు.” (కీర్తనలు 37:1, 2) ఎదురుతిరుగు యౌవనస్థులు తమ స్వాతంత్ర్యం అని చెబుతున్న దానికొరకు తరచూ అధిక మూల్యం చెల్లిస్తారు. గలతీయులు 6:7నందు బైబిలు యిలా చెబుతుంది: “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.”

ముందు చెప్పబడిన స్టాన్‌ను గమనించండి. అతడు ఆశించినట్లుగానే, అతడు అనైతికతకు నడిపించే స్నేహితులతో పేరుగాంచాడు. “నన్ను వాళ్లు అంగీకరించినట్లుగానే నేను భావించాను,” అని అతడు జ్ఞాపకం చేసుకొంటున్నాడు. ఏమైనప్పటికీ, పరిస్థితులు విషమకరంగా మారిపోవటం ప్రారంభించాయి. “నన్ను తుపాకీతో కాల్చారు, కస్టడీలో ఉంచారు, యిప్పుడు జైలుకు వెళ్తున్నాను. ఇవన్నీ చూసి ‘యిది తగిన మూల్యమా?’ అని నన్ను నేను ప్రశ్నించుకొంటున్నాను,” అని అతడు చెబుతున్నాడు.

అయితే “స్వాతంత్ర్యం” కొరకైన జాన్‌ అన్వేషణ సంగతేమిటి? ఆయనవద్ద మాదకద్రవ్యాలు ఉన్నందుకు అతడ్ని ఆరెస్టు చేసిన తరువాత, అతడు క్రైస్తవ సంఘంనుండి బహిష్కరించబడ్డాడు. అక్కడనుండి అతడు మరీ ఎక్కువ చెడుతనానికి దిగజారిపోయాడు. “నేను డబ్బుకొరకు కార్లను దొంగతనం చేస్తుండేవాడ్ని,” అని జాన్‌ ఒప్పుకొంటున్నాడు. “నేను మరి ఉగ్రునిగా మారిపోయాను.” నేరాలద్వారా జాన్‌ అధికంగా ధనం సంపాదించేవాడు. అయితే అతడు యిలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నేను ఆ డబ్బు అంతటినీ ఖర్చు చేసేవాడ్ని. మేము నమ్మశక్యంకానంత ఎక్కువగా మాదకద్రవ్యాలను ఉపయోగించేవాళ్లము.” జాన్‌ పోలీసులనుండి తప్పించుకొని పారిపోతున్నప్పుడు మాత్రమే కొట్లాడడు, దొంగతనం చేయడు, లేక త్రాగడు. “నేను దాదాపు 50సార్లు అరెస్టు చేయబడ్డాను. సాధారణంగా వాళ్లు నాపై మోపబడిన ఎటువంటి చార్జీలను నిరూపించలేక పోయేవారు, కాని ఒకసారి మాత్రము నేను ఒక సంవత్సరమంతా జైలులో ఉంచబడ్డాను.” అవును, స్వేచ్ఛగల మానవునిగా ఉండడానికి బదులుగా, జాన్‌ “సాతానుయొక్క గూఢమైన సంగతుల” బురదలో మునిగిపోయినట్లుగా తనను తాను కనుగొన్నాడు.—ప్రకటన 2:24.

ఎలిజబెత్‌ విషయంలో కూడా అలాగే చెప్పవచ్చు. ఆమె ఏ కట్టుబాట్లు లేక లోక స్నేహితులతో కలవడం ఆమెను జైలుపాలు చేసింది. “నేను గర్భవతినికూడా అయ్యాను—నేను మాదకద్రవ్యాలను వాడుతుంటాను కాబట్టి నేను ఆ బిడ్డను కోల్పోయాను. మాదకద్రవ్యాలే నా జీవితం అయ్యాయి—నేను ప్రతిసారి తర్వాత లభించే అధిక మోతాదు మత్తుకొరకే జీవిస్తున్నట్లు అన్పించేది. తుదకు నేను నా అపార్టుమెంట్‌ను కూడ పోగొట్టుకున్నాను. నేను యింటికి తిరిగి వెళ్లలేను, యెహోవాను సహాయంకొరకు అడగడానికికూడ నేను సిగ్గుపడుతున్నాను,” అని ఆమె ఒప్పుకొంటుంది.

కేవలం విషాదకర పర్యవసానాలను అనుభవించడానికే దైవిక నియమాలను నిరాకరించిన యౌవనస్థుల యిలాంటి అనేక మాదిరులను చెప్పవచ్చు. బైబిలు యిలా హెచ్చరిస్తుంది: “నీవు సరైనదని తలంచిన మార్గం మరణానికి దారితీయవచ్చు.” (సామెతలు 14:12, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌) జ్ఞానయుక్తమైన పని ఏమనగా, మీకు ఏమైన కట్టుబాట్లు అన్యాయంగా అన్పిస్తే, మీ తల్లిదండ్రులకు ఎదురు తిరిగే బదులు వారితో చర్చించడం ద్వారా మంచి సంబంధాలను కలిగివుండటమే.

[అధస్సూచీలు]

a ఈ విషయంపై కొన్ని శీర్షికలు సహాయకరమైన సమాచారాన్ని అందించాయి. ఉదాహరణకు, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ” అనే శీర్షిక క్రింద మా జనవరి 8, 1985, ఆగస్టు 8, 1992, మరియు నవంబరు 8, 1992 తేజరిల్లు! సంచికలను చూడండి.

[23వ పేజీలోని చిత్రం]

మీ తల్లిదండ్రులకు ఎదురు తిరగటమనేది మీకు అధిక “స్వాతంత్ర్యం” యివ్వవచ్చు, కాని మీరు వాటి పర్యవసానాలను గమనించారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి