కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 1/8 పేజీ 25
  • లోక సంబంధులు కారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లోక సంబంధులు కారా?
  • తేజరిల్లు!—1995
తేజరిల్లు!—1995
g95 1/8 పేజీ 25

లోక సంబంధులు కారా?

జర్మనీలోని తేజరిల్లు! ప్రతినిధి

“నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:16) ఈ మాటలతో యేసు తన అనుచరులకు రాజకీయ వ్యవహారాలలో సంపూర్ణ తటస్థతను కలిగివుండాలని వివరించాడు. నేడు క్రైస్తవులుగా ఉన్నామని చెప్పుకొనే వారు యీ స్థాయికి సరితూగగలరా?

మునుపటి జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ (జి.డి.ఆర్‌) 1990లో రద్దయ్యేంతవరకు కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం చేత పరిపాలించబడేది, దానిలో క్రైస్తవమత సామ్రాజ్యం మిళితమవ్వటాన్ని గురించి ఈ క్రింద యివ్వబడిన ప్రెస్‌ వివరణలను గమనించండి.

• “ఇప్పుడు లూథరన్‌ చర్చి జి.డి.ఆర్‌లో శాంతియుతమైన విప్లవానికి తల్లిగా కొద్దికాలంపాటు ఘనత వహించింది, దాని ఘనత అతివేగంగా తగ్గిపోతున్నట్లుగా కన్పిస్తుంది. అనేకులకు, పరిపాలనకు ఆధారభూతంగా, స్ఠాసీకి (స్టేట్‌ సెక్యూరిటి కౌన్సిల్‌) కేంద్రస్థానంగా ఉన్నట్లు అన్పించింది.”—డీ ట్సిట్‌, నవంబరు 1991.

• “వివిధమైన మాండలిక లూథరన్‌ చర్చీలు . . . చర్చిలోని పనివాళ్లు మరియు మతగురువులు స్ఠాసీతో మిళితమవ్వడాన్ని చూసి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి.”—ఎవాన్‌జెలిషె కామెన్‌టారా జనవరి 1991.

• మతాధికారులు రాజకీయాలలో ముమ్మరంగా పాల్గొంటున్నారు గనుక, ప్రజలపట్ల వాళ్లు మునుపు శ్రద్ధ వహిస్తున్నట్లు ఇప్పుడు వహించడం లేదన్న ఫిర్యాదులను [లూథరన్‌] చర్చి నాయకులు వింటున్నారు.”—సూడీటిసిచ్‌ జిటుంన్‌, ఫిబ్రవరి 1990.

• “రెండు జర్మనీ ప్రభుత్వాల రాజకీయ సంబంధాల్లో [లూథరన్‌] చర్చి ఎల్లప్పుడూ చాల సహాయకరమైన పాత్రను నిర్వహించిందని విజిస్కార్‌ [ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ జర్మనీయొక్క మాజీ ప్రెసిండెంట్‌] చెప్పారు.”—వెటారావుఎర్‌ జిటూంగ్‌, ఫిబ్రవరి 1992.

రాజకీయాల్లో జోక్యం చేసుకున్నది కేవలం లూథరన్‌ చర్చి ఒకటే కాదు. “దాదాపు ప్రతి [ప్రొటస్టెంటు] చర్చి సంస్థలో స్ఠాసీజీ ఏజెంట్లు జొరబడ్డారని,” ది యూరోపియన్‌ అనే పత్రిక నివేదిస్తుంది. ది యూరోపియన్‌, “కమ్యూనిస్టు అధికారాలకు ప్రొటస్టెంటు చర్చికి ముఖ్య రాయబారి,” అని వర్ణించబడిన మాన్‌ఫ్రెడ్‌ స్టోల్ప్‌ తనను తాను సమర్థించుకొంటూ “మా ఉద్దేశము నెరవేరేటట్లయితే యింకను అపవాదితోకూడా చేతులు కలపటానికి యిష్టపడుతున్నాను” అని అన్నాడు.

లండన్‌లోని గార్డియన్‌ అనే పత్రిక ఇటలీలోని క్రైస్తవ మతాధికారులకు మరియు మాఫీయాకు మధ్య అతి సన్నిహిత సంబంధమున్నదని నివేదిస్తుంది. “చర్చి మరియు కొసా నొస్ట్రా రెండూ చాలా కాలం శాంతియుతంగా సహవసించినందువల్ల చర్చి తరచుగా ఆ చెడుకార్యాన్నిబట్టి నిందింపబడుతుందని,” అది వివరిస్తుంది.

రష్యన్‌ ఆర్థడాక్స్‌ మతాధికారుల్లో కొందరు మునుపటి కే.జీ.బితో సహకారం కలిగివున్న విషయాన్ని టొరొంటో స్టార్‌ అనే పత్రిక ఒక శీర్షికలో ప్రచురించింది. “కమ్యూనిస్టు పరిపాలనాధికారంతో చర్చి సహకారాన్ని గురించిన వెల్లడి చావుదెబ్బను సూచిస్తుంది. . . . విషయాలన్నింటిని కే.జీ.బి. గ్రంథాలయంనుండి తీసుకుంటూ . . . దాని సలహాలను సీనియర్‌ చర్చి అధికారులు తమ సూత్రాలను వదులుకోవటమేకాక, విదేశాల్లోని మతాధికారులు వాటికి రాజీపడుటకు యిష్టపడుతున్నారని,” ఆ నివేదిక పేర్కొంటుంది.

క్రైస్తవమత చర్చీలన్నీకూడా రాజకీయాల్లో జోక్యం చేసుకొంటుండగా, నిజ క్రైస్తవత్వం మాత్రం లోకంతో సంబంధంలేకుండా ఉండాలన్న యేసు ఆజ్ఞను అనుసరిస్తున్నది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి