కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 1/8 పేజీ 21
  • “పొగత్రాగడం అసహ్యకరమైనది”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “పొగత్రాగడం అసహ్యకరమైనది”
  • తేజరిల్లు!—1995
తేజరిల్లు!—1995
g95 1/8 పేజీ 21

“పొగత్రాగడం అసహ్యకరమైనది”

ఇటీవల సంవత్సరాల్లో కాలిఫోర్నియా ఆరోగ్యసేవా శాఖ పొగత్రాగుటకు వ్యతిరేకంగా తీవ్రమైన విద్యాపరమైన ప్రచారం చేసింది. ఆ సమాచారం సంక్షిప్తంగా నిర్మొహమాటంగా ఉంది, దేశంలోని పోస్టర్లన్నింటిపై కనబడింది. వాటిలోని కొన్ని సమాచారాలేమిటి? “పొగత్రాగువారు వ్యసనపరులు. పొగాకు కంపెనీలు పురికొల్పువారు. పొగత్రాగడం అసహ్యకరమైనది.” “వారు వదలిన పొగ యీ సంవత్సరం 50,000 మంది పొగత్రాగనివాళ్లను చంపింది. పొగత్రాగడం అసహ్యకరమైనది.” మరొక పోస్టరు పైన ఒక సిగరెట్టు ప్యాకెట్టు చిహ్నం క్రింద యిలా ఉంది, “ఈరోజు కొనండి, తర్వాత చెల్లించండి.” ఏమైతేనేమి, నష్టపోయేది మీ జీవితమే. స్పానిష్‌లోని ఒక చిహ్నం తెలియజేయునదేమంటే: “మీ మ్యూరో ఫోర్‌ ఫ్యూమార్‌.” మాటల గారడి యిలా చెబుతుంది, “నేను పొగత్రాగాలని పడి చస్తున్నాను,” లేదా “పొగత్రాగటంవలన నేను చనిపోతున్నాను.” సగం కపాలం, సగం ముఖం కలిగివున్న చిత్రం విషయాన్ని స్పష్టపరుస్తుంది.

పొగాకును మరియు నికోటిన్‌ను వాడకుండా ప్రజలను నివారించడానికి ఉపయోగించబడిన మరొక ఉపాయమేమంటే “మరణం” అనే పేరుగల సిగరెట్టు బ్రాండు. ఈ నల్ల ప్యాకేజీపై కపాలం-మరియు-అడ్డంగా యెముకల గుర్తు, దాని సమాచారం యిలా చెబుతుంది: “సిగరెట్టులు వ్యసనమే కాకుండా బలాన్ని పొగొడుతాయి. మీరు పొగత్రాగకపోతే, ఆరంభించనే వద్దు. మీరు పొగత్రాగుతున్నట్లయితే, వెంటనే మానేయ్యండి.”

ఆ పోస్టరు నినాదాలద్వారా షాక్‌ తగిలించే ఈ పద్ధతిలోని ఎత్తులు, ఇప్పటికే పొగత్రాగే వారిపై ఏమైనా ప్రభావాన్ని చూపాయో లేదో చెప్పడం కష్టం. అయితే గత ఆరు సంవత్సరాలుగా, “కాలిఫోర్నియాలో పొగాకు త్రాగడం 27 శాతానికి తగ్గిపోయింది, దేశానికి సగటున మూడురెట్లు తగ్గిందన్నమాట.” (ది వాషింగ్‌టన్‌ పోస్టు నేషనల్‌ వీక్లీ ఎడిషన్‌) ఏమైనప్పటికీ, ఈ పోస్టరు ప్రచారం ఎక్కువగా పొగత్రాగేవారుకూడ ఈ ప్రమాదకరమైన అలవాటు మానేలా శక్తివంతంగా పనిచేసింది. కచ్చితంగా క్రైస్తవులమని చెప్పుకొనే వాళ్లు యీ అపవిత్రమైన, స్వార్థంతోకూడిన దుష్టస్వభావాన్ని విడిచిపెట్టాలి. అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.”—2 కొరింథీయులు 7:1.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి