కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 1/8 పేజీలు 3-5
  • మన అమూల్యమైన వాతావరణం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన అమూల్యమైన వాతావరణం
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవాన్ని నిలిపేది
  • అద్భుతమైన ఒక మిశ్రమము
  • గందరగోళపు వాతావరణం
    తేజరిల్లు!—1998
  • మన వాతావరణమెలా కాపాడబడుతుంది
    తేజరిల్లు!—1995
  • మన వాతావరణానికి హాని కలిగినప్పుడు
    తేజరిల్లు!—1995
తేజరిల్లు!—1995
g95 1/8 పేజీలు 3-5

మన అమూల్యమైన వాతావరణం

మే 4, 1961న మాల్కమ్‌ రాస్‌ మరియు విక్‌ ప్రాథర్‌ 34.6 కిలోమీటర్ల ఎత్తుకు ఎత్తబడ్డారు. ఆ సమయంలో, క్రొత్త రికార్డు స్థాపించడం రాస్‌ను ముగ్ధుడ్ని చేయలేదు. కాని, తానున్న వ్రేలాడు తొట్టె గుండా ఆయన కిటికీ కొయ్య తెరను జాగ్రత్తగా పైకెత్తి, మొదటిసారిగా బయటకు చూసినప్పటి దృశ్యము అతడ్ని ముగ్ధుడ్ని చేసింది.

అతడు యీ విధంగా గుర్తుచేసుకుంటున్నాడు, “మేము 30,500 మీటర్ల ఎత్తున ఉన్నప్పటి దృశ్యము ఎంతో మనోహరంగా ఉంది.” వాతావరణంలోని వివిధ పొరలను సూచించే వర్ణాలను చూసి రాస్‌ ఆశ్చర్యపోయాడు. భూమి ఉపరితలం నుండి 16 కిలో మీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్న ట్రొపొస్ఫియర్‌ మొదట “ప్రకాశవంతమైన ధవళనీల” వర్ణంలో ఉంది. తర్వాత, ముదురు నీలవర్ణంలోని స్ట్రాటొస్ఫియర్‌ మరింత మసకగా మారుతూ, పైకి వెళ్తున్నకొలది అంతరిక్షం అంధకారంగా ఉంటుంది. నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో రాస్‌ యీ విధంగా వ్రాశాడు, “మేము సంభ్రమాశ్చర్యంతో నిశ్శబ్దంగా వాతావరణంలోని ఊర్ధ్వ సౌందర్యాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉండిపోయాము.”

నిజంగా మన మనోహరమైన వాతావరణం ఆలోచింపదగి నది.

జీవాన్ని నిలిపేది

వాస్తవంగా, భూమిపైన 80 కిలోమీటర్ల ఎత్తువరకు ఆవరించివున్న వాయు రూపమే వాతావరణము. అది 50,000 ఖరబ్‌ (50 కోట్ల కోట్ల) టన్నుల బరువుంటుంది, సముద్ర మట్టమున చదరపు సెంటీమీటరుకు 1.03 కిలోగ్రాముల పీడనంతో అది మన తలలపై వత్తిడి చేస్తుంది. ఆ వాయు పీడనం మన శరీరంలోని ద్రావకాలు ఆవిరైపోకుండా అరికడుతుంది కాబట్టి, అది లేకుండా మనం జీవించలేము. మానవ జీవితాన్ని నిలబెట్టే వాయుపీడనం పైవాతావరణంలో లేదు. ఆ కారణాన్నిబట్టి రాస్‌ మరియు ప్రాథర్‌ వాతావరణ పీడనాన్ని నింపిన అంతరిక్ష దుస్తులను ధరించవలసి వచ్చింది. “కృత్రిమ వాయు పీడనం లేకపోతే, మా రక్తం కాగిపోయేదే, మా రక్త ధమనులు మరియు యితర అవయవాలు చిట్లిపోయేవే,” అని రాస్‌ వివరించాడు.

నిజమే, మనం శ్వాసిస్తూ ఉండాలంటే కూడా యీ వాయు రూపం అవసరము. అయినప్పటికీ, మనం దాన్ని చూడలేము కాబట్టి మనలో అనేకులు దాని గురించి అంత పట్టించుకోరు. ప్రాచీన కాలాల్లోని మత నిష్ఠగల ఒక వ్యక్తి మెప్పుదలతో యీ విధంగా చెప్పాడు: “[దేవుడు] అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు.”—అపొస్తలుల కార్యములు 17:24, 25.

మన వాతావరణం లేకపోతే, ధూళిని, దాని చుట్టూ ఏర్పడే నీటి బిందువులను పైకి తీసుకువెళ్ళే మరో వాహక పదార్థం ఉండేది కాదు. అలా వాన కురిసేది కాదు. మన వాతావరణం లేకపోతే, సూర్యకిరణాలు నేరుగా తగిలి మనం కమలిపోయేవాళ్ళం, రాత్రివేళ మనం చలికి బిగుసుకుపోయేవాళ్ళం. రాత్రి వేళలు మరీ చల్లగా ఉండకుండా, సూర్యుని కొంత వేడిమిని అంటిపెట్టుకుని మన వాతావరణం ఒక కంబళిలా పనిచేస్తున్నందుకు కృతజ్ఞులము.

అంతేకాక, భూనివాసులకు హాని కలిగించే ఉల్కలు లోపలికి ప్రవేశించకుండా వాతావరణం కాపాడుతుంది. “అంతరిక్షం నుండి వాతావరణ బాహ్య పరిమితిలోనికి ప్రతిరోజు మొత్తం మీద కొన్ని వేల టన్నుల ఘనపదార్థాలు పడిపోతున్నాయని అంచనా వేయబడింది” అని ఇన్‌ట్రొడక్షన్‌ టు ది అట్మోస్ఫియర్‌ అనే తన పుస్తకంలో హెర్‌బెర్ట్‌ రీల్‌ వివరిస్తున్నాడు. అయినప్పటికీ, ఎక్కువ ఘనపదార్థాలు భూమి ఉపరితలంపైకి చేరకముందే వాతావరణంలోనే విచ్ఛిన్నమవుతాయి.

వాతావరణం మన జీవితాన్ని ఆనందంగా అనుభవించడాన్ని అధికం చేస్తుంది. అది రమణీయమైన మన నీలాకాశాలను, గాలితో నిండిన తెల్లని మేఘాలను, ఉల్లాసం కలిగించే వర్షాన్ని, మనోహరమైన సూర్యోదయాలను, సూర్యాస్తమయాలను మనకిస్తుంది. అంతేకాక, వాతావరణం లేకుండా, మన ప్రియమైనవారి స్వరాలను వినలేకపోయేవారం, మనకిష్టమైన సంగీతాన్ని వినలేకపోయేవారం. ఎందుకని? ఎందుకంటే శబ్దతరంగాలు ప్రయాణం చేయడానికి ఒక పదార్థం అవసరము. శబ్దాన్ని అందజేయడానికి వాయువు మంచి వాహకపదార్థం, అయితే అంతరిక్షంలో శబ్దం వినపడదు.

అద్భుతమైన ఒక మిశ్రమము

ప్రాచీన కాలంలో మానవులు వాతావరణాన్ని కేవలమొక పదార్థంగా దృష్టించారు. తర్వాత, 18వ శతాబ్దపు అంతంలో, ఇందులో ముఖ్యంగా నత్రజని మరియు ఆమ్లజని అనే రెండు పూరక వాయువులు చేరివున్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వాతావరణంలో దాదాపు 78 శాతం నత్రజని, 21 శాతం ఆమ్లజని, మిగిలిన 1 శాతంలో ఆర్గాన్‌, నీటిఆవిరి, బొగ్గుపులుసు వాయువు, నియోన్‌, హీలియమ్‌, క్రిప్టాన్‌, హైడ్రోజన్‌, క్సేనాన్‌ మరియు ఓజోన్‌వంటి వాయువులు చేరి ఉన్నాయి.

శ్వాసిస్తూ మన శరీరం తీసుకునే ఆమ్లజని నిజంగా జీవాన్ని నిలిపే వాయువే. మన వాతావరణంలో ఉన్న ఆమ్లజని పరిమాణం భూమిపై మనుగడకు కావలసినంత ఉంది. అది మరీ తక్కువై ఉంటే మనం నిద్రమత్తులమై, చివరికి స్పృహను కోల్పోయేవారం. అది మరీ ఎక్కువగా ఉన్నట్లయితే, అడవిలోని పచ్చని కొమ్మలు, గడ్డి సహితం కాలిపోయేవని చెప్పబడుతుంది.

ఆమ్లజనిని సరైన విధంగా పలచన చేసే వాయువు నత్రజని, అయితే ప్రాణాన్ని నిలబెట్టడంలో దాని పాత్ర చిన్నదేమీ కాదు. సకల ప్రాణులు జీవించడానికి అది తప్పనిసరిగా అవసరము. మెరుపు మరియు ప్రత్యేక రకపు సూక్ష్మజీవుల సహాయంతో మొక్కలు వాతావరణం నుండి నత్రజనిని పొందుతాయి. ఆ విధంగా మనం భుజించే ఆహారం నుండి మనం నత్రజనిని పొందుతాము.

మన వాతావరణం సరైన నిష్పత్తిలో ఆమ్లజనిని, నత్రజనిని నిల్వ ఉంచుకుంటుందనేది అద్భుతం. నత్రజని వాతావరణానికి తిరిగి అందజేయబడుతుంది, సూక్ష్మజీవుల విలువైన పనికి కృతజ్ఞతలు. ఆమ్లజని విషయమేమిటి? దహనంలోను, మానవులు, జంతువులు శ్వాసించడంలోను ఆమ్లజని చాలా ఎక్కువ పరిమాణాల్లో ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ వాతావరణం, 21 శాతం ఆమ్లజని ఉండాలనే తన లెక్కను కాపాడుకుంటుంది. ఎలా? పచ్చని ఆకుల్లోని మరియు నాచులోని కిరణజన్య సంయోగక్రియ అనే రసాయన ప్రక్రియ, ప్రతిరోజు వాతావరణంలోనికి వంద కోట్ల టన్నుల ఆమ్లజనిని విడుదల చేయడం ద్వారా అది సాధ్యమవుతుంది.

కిరణజన్య సంయోగ క్రియ అనేది వాతావరణంలో 0.03 శాతం మాత్రమే ఉండే అల్పవాయువైన బొగ్గుపులుసు వాయువు లేకుండా జరుగదు. మొక్కలు వెలుతురు సహాయంతో పెరిగి, పండ్లను, గింజలను, ధాన్యాలను, కూరగాయలను ఫలించడానికి బొగ్గుపులుసు వాయువుపై ఆధారపడతాయి. బొగ్గుపులుసు వాయువు, మన గ్రహాన్ని వేడిగా ఉంచేందుకు భూమిపై కాంతిని మళ్ళీ ప్రసరించే పనిని కూడా చేస్తుంది. కట్టెలను, బొగ్గును, గ్యాస్‌ను మరియు చమురును అమితంగా కాల్చడం ద్వారా బొగ్గుపులుసు వాయువు పరిమాణం అధికమైతే, జీవం ఆగిపోయేంతగా భూమిపై ఉష్ణోగ్రత అధికమైపోతుంది. మరొకవైపు, బొగ్గుపులుసు వాయువు మరీ తక్కువగా ఉంటే, కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోయి, మనం ఆకలితో నకనకలాడవలసి వచ్చేది.

ఓజోన్‌ అనేది మరో అల్ప వాయువు, దానిపై భూమిమీది మనుగడ ఆధారపడి ఉంటుంది. వాతావరణంలోని పై భాగంలో ఉండే ఓజోన్‌, స్ట్రాటొస్ఫియర్‌ అని పిలువబడుతుంది, అది సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలను పీల్చుకుంటుంది. అలా భూమిపై ఉన్న మనం ఈ హానికరమైన అతినీలలోహిత కిరణాలనుండి కాపాడబడుతున్నాము.

నిజానికి, మనం ఎంత ఎక్కువగా వాతావరణాన్ని గూర్చి తెలుసుకుంటే, అంత ఎక్కువగా ఆశ్చర్యపోయే కారణముంది. దానిలోని నత్రజని, ఆమ్లజని మరితర అల్ప వాయువుల కూర్పు ఎంతో సరైనది. భూమి పరిమాణం కూడా సమతుల్యతను కాపాడే విధంగా సరిగ్గా ఉంది. భూమి యింకా చిన్నగా ఉండి, బరువు తక్కువగా ఉంటే, గురుత్వాకర్షణ శక్తి చాలా బలహీనంగా ఉండి, మన అమూల్యమైన వాతావరణంలోని అధిక భాగం అంతరిక్షంలోనికి ఎగిరిపోయేదే.

ఎన్‌విరాన్‌మెంట్‌ ఆఫ్‌ లైఫ్‌ అనే విజ్ఞానశాస్త్ర పాఠ్యపుస్తకం యిలా చెబుతుంది, “అలా కాక, భూమి యింకా కొంచెం పెద్దగా ఉంటే అమితమైన గురుత్వాకర్షణ శక్తి వలన వాయువులు ఎక్కువ పరిమాణాల్లో ఉండేవే. . . . వాతావరణంలోని వాయువుల మధ్యవున్న సూక్ష్మ సమతుల్యత నిజంగా తారుమారయ్యేదే.”

అయితే, విచారకరమైనదేమంటే, “సూక్ష్మ సమతుల్యత” అనేది మానవుని ఆధునిక జీవిత విధానాల ద్వారా తారుమారయ్యింది. పరిస్థితి ఎంత విచారకరంగా ఉంది, మన అమూల్య వాతావరణం నాశనం నుండి కాపాడబడగలదనడానికి ఏం నమ్మకము ఉంది?

[5వ పేజీలోని బాక్సు]

సూర్యాస్తమయాలు మరింత అందంగా కనిపించేటప్పుడు

ఆకాశానికి ఆకర్షణీయమైన నీలిరంగునిచ్చే విధంగా, వాతావరణం సూర్య కిరణాలను ప్రతిబింబిస్తుంది. సూర్యుడు చక్రవాళంవైపుకు వస్తుండగా, దాని కిరణాలు మరింత ఎక్కువ వాతావరణంలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది నగర వాసులు ఎన్నడూ చూడలేని విభిన్న వర్ణాల వైవిధ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది.

పారిశ్రామిక నగరాల్లో సాధారణంగా సూర్యాస్తమయాలు మసకగానుండి, ఎఱ్ఱని ఛాయలు తప్ప వేరే వర్ణాలు కనిపించవు. న్యూ సైంటిస్ట్‌ అనే పత్రిక పరిశీలించేదేమంటే, ఆ ప్రదేశం ఎక్కువగా కలుషితమైతే, “సూర్యుడు ప్రకాశంలేని ఎఱ్ఱని గుండ్రని ఫలకంగా కనిపించి, చక్రవాళానికి చేరక మునుపే కాంతివిహీనం కావచ్చు.”

“అసాధారణంగా నిర్మలంగా, కలుషితం కాని వాతావరణంలో సూర్యాస్తమయంలోని వర్ణాలు ముఖ్యంగా ఎంతో విభిన్నంగా ఉంటాయి. సూర్యుడు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటాడు, ప్రక్కనున్న ఆకాశంలో నారింజ, పసుపు వర్ణాల ఛాయలు కనిపిస్తాయి. సూర్యుడు చక్రవాళం క్రిందకు వెళ్ళినప్పుడు, క్రమంగా నారింజ వర్ణము నీలి వర్ణంగా మారుతుంది. క్రిందనున్న మేఘాలు సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా దాని ప్రకాశాన్ని పరావర్తనం చేస్తూనే ఉంటాయి,” అని పైన పేర్కొన్న పత్రిక వివరిస్తుంది.

కాలుష్యం లేని లోకంలో మనోహరమైన సూర్యాస్తమయాల వైవిధ్యాన్ని చూసి ఆనందించడాన్ని గూర్చి ఒక్కసారి ఊహించుకోండి!—ప్రకటన 21:3-5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి