కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 12/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఐక్యరాజ్య సమితి పరాజయం
  • మానవ వివరణ లేదు
  • పక్షులు అంతరించిపోవడం హెచ్చరికలను ఇస్తుంది
  • కౌమారదశలోని తల్లులు
  • బధిరులకు కంప్యూటర్‌ సహాయం
  • అమ్మమ్మ తాతయ్యల పాత్ర ఎక్కువవుతుంది
  • పిల్లల పదజాలం
  • వెనిజ్యులా హమ్మింగ్‌బర్డ్‌ అపాయంలో ఉంది
  • హానికరమైన అలవాటును చట్టం బహిష్కరించింది
  • ప్రయోజనకరమైన పాత పెట్టెలు
  • పెరిగిపోతున్న శరణార్థుల సంఖ్య
    తేజరిల్లు!—1996
  • ‘సంతోషంతో యెహోవాను సేవించేలా’ పరదేశులకు సహాయం చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • పరిష్కారం ఏమిటి?
    తేజరిల్లు!—1996
  • సంవత్సరాల నిరాశాయుత ప్రయత్నాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 12/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

ఐక్యరాజ్య సమితి పరాజయం

“అది ఐక్యరాజ్యసమితికి మాత్రమే పరాజయం కాదు; అది అంతర్జాతీయ సమాజానికే పరాజయం. ఈ పరాజయానికి మనమందరం బాధ్యులమే,” అని రువాండాలోని నరమేధాన్ని గూర్చి మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బూట్రోస్‌ బూట్రోస్‌ ఘాలీ బాధపడ్డారు. “జరిగినది ఒక జాతి నిర్మూలము. అక్కడ 2,00,000 కన్నా ఎక్కువ మంది ప్రజలు చంపబడ్డారు, మరియు అంతర్జాతీయ సమాజం ఏమి చేయాలా అని యిప్పటికీ చర్చిస్తూనే ఉంది.” మే 26న నివేదించబడినట్లు, సెక్రటరీ జనరల్‌ 30 కన్నా ఎక్కువ దేశాలకు రాశాడని, సైన్యాలను పంపమని వారిని అభ్యర్థించాడని, ఒక పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలో విభిన్నమైన సంస్థలతో ప్రయత్నం చేశాడని చెప్పాడు. ఆయన యింకా యిలా చెప్పాడు, “దురదృష్టవశాత్తు, నేను ఓడిపోయాను. ఇదొక కళంకము. నేనే దాన్ని మొదట ఒప్పుకుంటున్నాను.” తన స్వంత ఆర్థిక ఇబ్బందులవల్ల ఐక్యరాజ్యసమితి తిరిగి చెల్లించడానికి ఆలస్యం చేసినప్పటి నుండి ఆఫ్రికా దేశాలు సైన్యాలను పంపే ఖర్చును భరించలేకపోయాయి. అనేక పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకోవడానికి నిరాకరించాయి, ఉద్దేశాలు అమలు కాకపోవడం వలన అమెరికా సైనిక శక్తిని ఉపయోగించడం న్యాయంకాదని అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ పేర్కొన్నాడు. ది న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రకారం, బూట్రోస్‌ ఘాలి “విరాళాలను” నిందించాడు, ఎందుకంటే సిబ్బందిని, డబ్బును సరఫరా చేసే దేశాలు, 17 విభిన్నమైన ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలను నిర్వహించే నిమిత్తం అలాగే విరాళాలు యివ్వాలని కోరబడ్డాయి. (g94 11/22)

మానవ వివరణ లేదు

“రువాండాలో, అకస్మాత్తుగా కలిగిన భయానకమైన రక్తదాహాన్ని ఏదైనా వివరించగలదా?” అని లండన్‌లోని ది ఎకానమిస్ట్‌ అడుగుతుంది. “ఎంతోకాలంగా ఉన్న వైరం కూడా నిర్ధాక్షిణ్యమైన హత్యను వివరించలేదు.” టుట్సీ ప్రజలు, అలాగే హుటు ప్రజలు కొంత భిన్నంగా ఉండవచ్చు. వారు శతాబ్దాలుగా కలిసి జీవించారు, ఒకే భాషను, ఒకే సంస్కృతిని పంచుకున్నారు. ఆ వ్యాసం స్కాట్లాండు దేశస్థులు మరియు, ఆంగ్లేయుల మధ్య జాతి వ్యత్యాసాలతో యీ తెగల మధ్య తేడాను పోల్చుతుంది. “అయితే, యిప్పుడు వారు వైరము గలవారై, యాంత్రికమైన ఫిరంగులతోనో లేదా లాంగ్‌-రేంజ్‌ రైఫిళ్ళతోనో కాదు గాని, పెద్ద కత్తులతోను, పారలతోను, దుడ్డుకర్రలతోను మరియు వట్టి చేతులతోను ఒకరికొకరు శత్రువులయ్యారు. పొరుగువారు తమ పొరుగువారిని చంపారు, చిన్ననాటి స్నేహితులు కూడా ఒకరినొకరు చంపుకున్నారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు విచక్షణా రహితంగా చంపబడ్డారు. ఎందుకని? జవాబు చెప్పగలవారు ఎవరూ లేరు.” (g94 11/22)

పక్షులు అంతరించిపోవడం హెచ్చరికలను ఇస్తుంది

తట్టుకొనగల్గే పక్షిజాతులు, అంటే పిచ్చుకలు, గోరింకలు, కాకులు కఠినమైన పరిస్థితుల్లోను వృద్ధిచెందుతున్నను, ప్రపంచంలోని అనేక పక్షులు జీవించలేక పోతున్నాయి. పక్షులలోని 9,600 రకాల్లో, 70 శాతం తగ్గిపోతున్నాయి అలాగే వాటిలో 1,000 రకాలు సమీప భవిష్యత్తులో అంతరించిపోవచ్చు. “నేరుగా నష్టం జరగడమే కాకుండా, భయపెట్టే మరొక సంగతేమంటే, యితర రకాల ప్రాణుల్లా కాకుండా, అవి యితర ప్రాణుల ఆరోగ్యానికి మరియు పర్యావరణ పరిస్థితికి చక్కని సూచకాలు,” అని వర్ల్‌డ్‌ వాచ్‌ పత్రిక చెబుతుంది. “మనం చూస్తున్నది, కలుగబోవు క్షీణతను గూర్చి హెచ్చరించడమే కాక, దాని తరుగుదలలో భాగాన్ని—అంటే భూగోళమును సమతుల్యంగా ఉంచే పర్యావరణ పొర చినిగిపోవడాన్ని సూచిస్తుంది.” పక్షులు వినాశకరవైన మృగములను, కీటకాలను అరికడతాయి, మొక్కల్లో పరాగసంపర్కానికి దోహదపడతాయి, వాటి రెట్టల్లో మొక్కల విత్తనాలను వదిలిపెట్టడంద్వారా అడవుల పెరుగుదలకు తోడ్పడుతాయి. కాని వాటి జీవితాలు ప్రమాదానికి గురయ్యాయి, వాటి నివాస స్థలాలు నిర్మూలం చేయబడ్డాయి, ఎలాగంటే, మానవులు అడవులను నరికివేయడం ద్వారా ప్రకృతి దృశ్యాలను మార్చివేస్తున్నారు, పశువులను మేపడానికి, వ్యవసాయం చేయడానికి పచ్చికమైదానాలను మార్చివేస్తున్నారు, చిత్తడినేలలను, ఎండజేస్తున్నారు, విస్తారమైన ప్రాంతాలను పెద్ద ఆనకట్ట పద్ధతులతో వినాశనం చేస్తున్నారు, అంతేకాకుండా, వేటాడడం వలన, రసాయనాలను, విషపూరితమైన వ్యర్థ పదార్థాలను, చమురు తూములను అమితంగా ఉపయోగించడం వలన వాటిని చంపుతున్నారు. “మృగాలు, మొక్కలతోపాటు పక్షులు అంతరించిపోయే తీరు అతి త్వరగా వేగాన్ని పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తుందని,” ఆ వ్యాసం చెబుతుంది. (g94 11/22)

కౌమారదశలోని తల్లులు

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 20 ఏండ్ల లోపు ప్రాయమున్న ఒకటిన్నర కోట్ల కన్నా ఎక్కువమంది స్త్రీలు జన్మనిస్తున్నారని ఐక్యరాజ్యసమితి జనాభానిధి పత్రికైన పోప్యులై అంచనా వేస్తుంది. ఈ సంఖ్యలో 15 ఏండ్ల కన్నా తక్కువ ప్రాయమున్నవారిని గాని, గర్భవిచ్ఛిత్తినిగాని, గర్భస్రావాలనుగాని యిమడ్చలేదు. ఆఫ్రికాలోనే స్త్రీలందరిలో దాదాపు 28 శాతం మంది స్త్రీలు 18 ఏండ్లకు ముందే ప్రసవిస్తారు. లైంగిక విషయాలను గూర్చిన జ్ఞానం లేకపోవడం, త్వరగా వివాహాలు జరగడం, ధనికులైన పెద్దవయస్సుగల పురుషులతో సంబంధం కలిగి ఉండడానికి కారణమయ్యే ఆర్థిక యిబ్బందులు ఆ ఖండంలో కౌమారదశలోని అమ్మాయిల గర్భధారణ ఎక్కువ కావడానికి కారణాలని పరిశోధకులు చెబుతున్నారు. పోప్యులై యీ విధంగా చెబుతుంది, “సగటున 20-34 ఏండ్ల ప్రాయంగల స్త్రీలకన్నా 19 ఏండ్లలోపు ప్రాయంగల స్త్రీలు గర్భంతోనున్న సమయంలోను, ప్రసవ సమయంలోను చనిపోయే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉండడమే కాక, కౌమారదశలోని తల్లులకు జన్మించిన పిల్లలు కూడా మరణించే సాధ్యత మరీ ఎక్కువగా ఉంది.” (g94 11/22)

బధిరులకు కంప్యూటర్‌ సహాయం

కొత్తగా రూపించబడిన కంప్యూటర్‌ పద్ధతి బధిరులు సహజంగా మాట్లాడడం నేర్చుకోడానికి త్వరలోనే సహాయపడుతుంది. బధిరులు మాట్లాడడం నేర్చుకోవడం అనేది దాదాపుగా విదేశీ భాష నేర్చుకుంటున్నట్లే. ఈ వాస్తవము, స్కాట్లాండ్‌లోని, యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌లో రిసర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ లాంగ్వేజ్‌ టెక్నాలజీస్‌ యిటువంటి ప్రోగ్రామును రూపొందించడానికి ప్రోత్సహించింది. ఏజెన్స్‌ ఫ్రాన్స్‌-ప్రెస్‌ న్యూస్‌ సర్వీస్‌ నివేదిక చెప్పేదేమంటే, ఆ కంప్యూటర్‌ పద్ధతి, విద్యార్థి మాటలను విశ్లేషించి, సరైన ఉచ్ఛారణకు అవసరమైన దిద్దుబాటులను, సర్దుబాట్లను ఎలా చేసుకోవాలో వెంటనే సూచిస్తుంది. అంతేకాకుండా, ఆ కార్యక్రమంలో తమ మాటలను భావానుగుణంగా, లయబద్ధంగా క్రమేణ అభివృద్ధి చేసుకునేందుకు పాఠాల పరంపర కూడా యిమిడి ఉంటుంది. బధిర విద్యార్థులకు విదేశీ భాషను నేర్పేందుకు అనువుగా కూడా ఆ పద్ధతిని మలచుకోవచ్చు. (g94 11/22)

అమ్మమ్మ తాతయ్యల పాత్ర ఎక్కువవుతుంది

అమెరికాలోని అధ్యయనాలు చూపించేదేమంటే, అమ్మమ్మలు తాతయ్యలు, ముఖ్యంగా అమ్మమ్మలు తమ మనమళ్ళ జీవితాల్లో అధిక పాత్రను నిర్వహిస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ ఏజింగ్‌ నడుపుతున్న అధ్యయనం కనుగొన్నదేమంటే, 1931కి మరియు 1941కి మధ్య పుట్టిన వారిలో 69 శాతంమంది, అమ్మమ్మలు తాతయ్యలు అయ్యారు; వారిలో 44 శాతంమంది ఒకరు లేదా యిద్దరు మనమళ్ళను చూసుకోడానికి ఒక సంవత్సరంలో 100 కన్నా ఎక్కువ గంటలు గడుపుతున్నారు. సగటున, యీ అమ్మమ్మలు తాతయ్యలు పిల్లలతో రోజుకు ఎనిమిది-గంటల చొప్పున 82 రోజులకు సమానమైన 659 గంటలు గడుపుతున్నారని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ చెబుతుంది. స్త్రీలు వారానికి సగటున 15 నుండి 20 గంటల వరకు పిల్లలను చూసుకోడానికి ఉపయోగించారు, పురుషులకన్నా 2.5 రెట్లు ఎక్కువగా వారే శ్రద్ధచూపించారు అని ఆ అధ్యయనం తెల్పింది. (g94 12/8)

పిల్లల పదజాలం

ఇటలీలోని ఒక అధ్యయనం వెల్లడిచేసినదేమంటే, పెద్దలు తమకు తెలుసునని అనుకుంటున్న ఆధునిక ప్రపంచంలోని అసంతోషకరమగు నిజాలు, వారికంటే పిల్లలకే ఎక్కువ తెలుసు. ఇటలీలోని జాతీయ పరిశోధనా కేంద్రంలోని ఒక సంఘం ఆరు నుండి పదేండ్ల ప్రాయమున్న పిల్లలు రాసిన 5,000కన్నా ఎక్కువ వ్యాసాలను పరిశోధించింది. లా రిపబ్లికా అనే వార్తాపత్రిక ప్రకారం, పిల్లల 6,000 మాటల పదజాలంతో, పిల్లలు చదవడం కోసం పెద్దలు రాసిన దానిని పోల్చిచూసినప్పుడు, వారికి చూపించబడిన “దాదాపు అవాస్తవమైన, సమస్యలు లేని ప్రశాంత లోకం, వాళ్ళను మోసం చేయలేదు” అని వెల్లడైంది. ఆ పత్రిక యింకా యిలా చెబుతుంది: “‘మాదక ద్రవ్యాలు,’ ‘ఎయిడ్స్‌’ ‘అత్యాచారం’ అంటే ఏమిటో వారికి కచ్ఛితంగా తెలుసు.” పరిశోధకులు చెప్పేదేమంటే, “పిల్లల రచనా ప్రపంచం, పెద్దలు వ్రాసిన వారి పఠన విషయానికన్నా ఎంతో ఆధునికంగా, కాలానుగుణంగా ఉన్నట్లు కనిపిస్తుంది,” అని కొరీయెరె డెల్లా సెరా చెబుతుంది. (g94 12/8)

వెనిజ్యులా హమ్మింగ్‌బర్డ్‌ అపాయంలో ఉంది

వెనిజ్యులాలోని హమ్మింగ్‌బర్డ్స్‌ యొక్క ఇరవై ఎనిమిది విభిన్న రకాలు అంతరించే అపాయంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రపంచంలో మరెక్కడా కన్పించవు. అలాస్కానుండి అర్జెంటీనా మరియు చిలీవరకు గల అమెరికా ప్రాంతాలు హమ్మింగ్‌బర్డ్‌ జన్మస్థలాలు. హమ్మింగ్‌బర్డ్‌ జాతికి చెందిన కీటకము చిన్నగా ఉండి, రెండు నుండి తొమ్మిది గ్రాముల బరువుంటుంది. అది ఐదు సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటుంది, మరియు పెద్ద హమ్మింగ్‌బర్డ్‌ 21 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. వెనిజ్యులాలో హమ్మింగ్‌బర్డ్‌ను నిర్మూలం చేసేదేమిటి? రోగమా లేక మాంసాహారులా? కాదు. లెగొవెన్‌ చమురు కంపెనీ ప్రచురించిన కార్టా ఎకొలాహెకా అనే వార్తాలేఖ తెల్పేదేమంటే, పక్షుల నివాసస్థలాన్ని క్రమంగా నాశనం చేయడం—అడవులను నరికివేయడం నేరంగా పరిగణించబడింది. ఈ చిన్న, ఆసక్తికరమైన, రంగురంగుల ప్రాణి, మానవుడు వర్షపాత అడవులను నిర్దాక్షిణ్యంగా నాశనం చేసేటప్పుడు అంతరించేవాటిలో ఒకటి మాత్రమే. (g94 12/8)

హానికరమైన అలవాటును చట్టం బహిష్కరించింది

ఏసియావీక్‌ పత్రిక నివేదించేదేమంటే, సిగరెట్‌ ప్యాకెట్లపై ఉండే హెచ్చరికల్లాగే తమలపాకు ఒక్కల ప్యాకెట్లపై హెచ్చరికలు ఉండాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేసింది. ఆ పత్రిక చెప్పేదేమంటే దక్షిణ ఆసియాలోని లక్షలాదిమంది వక్క మరియు యితర మిశ్రమాలు తమలపాకులో పెట్టి చుట్టిన పాన్‌ మసాలాకు దాసులుగా ఉన్నారు. దీన్ని నములుతారు. ఇప్పటికే వక్కకు నోటి క్యాన్సర్‌కు సంబంధం ఉన్నందున, ఇండియా యిప్పటికే వాటి ప్యాకెట్లపై హెచ్చరికలను ఉంచింది. వక్క వలన పిల్లలు ఊపిరి ఆడకుండా చనిపోయినట్లు తెలిసింది. పాకిస్తాన్‌లోని కొత్త చట్టాలు, ఐదేండ్లకు తక్కువ ప్రాయమున్న పిల్లలకు వక్కలను అమ్మడాన్ని నిషేధిస్తున్నాయి. (g94 12/8)

ప్రయోజనకరమైన పాత పెట్టెలు

ఎగుమతి చేయడానికి ఉపయోగించే పాత పెట్టెలను పనికిరావని పారవేసే బదులు, అవి యిక పెద్ద సామానులను రవాణా చేయడానికి ఉపయోగించలేనంతగా మరీ పాతబడినప్పుడు వాటిని యుక్తిగా ఉపయోగించవచ్చని దక్షిణాఫ్రికాలోని ఎగుమతి చేసే ఒక కంపెనీ తెలుసుకుంది. ఈ లోహపు పెద్ద పెట్టెలను రెండింటిని కలిపినప్పుడు, అవసరమైనంత విశాలమైన ఒక తరగతి గది తయారయ్యింది. నిజమే, పెట్టె యొక్క ఒక భాగం తీసివేయవలసి ఉంటుంది, మిగిలిన భాగాల్లో తలుపులు, కిటికీలు చేర్చవలసి ఉంటుంది. పాత పెట్టెలు యిండ్లుగాను, అంగళ్ళుగాను, క్లినిక్‌లుగాను, గ్రంథాలయాలుగాను ఉపయోగపడవచ్చు. ఆఫ్రికన్‌ పనోరమా అనే పత్రిక ప్రకారం ఒక సారి, “16 పెట్టెలను యీ విధంగా మార్చినప్పుడు, 1,000 మంది విద్యార్థులకు సరిపడే 8 విశాలమైన తరగతి గదులు తయారయ్యాయి.” అలా, 1,000 కన్నా ఎక్కువ పెట్టెలను దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలకు అందజేశారు. అయితే యిలా నడుపుతున్న కంపెనీలో పాత డబ్బాలు లేకపోవడంతో, పాత డబ్బాలను యిచ్చి సహాయంచేయమని యితర అంతర్జాతీయ ఎగుమతి కంపెనీలను అది కోరింది. (g94 12/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి