మా పాఠకుల నుండి
వ్యసనములు “వ్యసనములు—వాటి వెనుకున్నదేమిటి?” (మే 8, 1994) అనే శీర్షికల విషయమై చాల కృతజ్ఞతలు. నేను ఆ శీర్షికలన్నింటినికూడా మొదటినుండి చివరవరకు రెండుసార్లు చదివాను. మీకు తెలుసా, నాకు అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లున్నాయి. నేను యిప్పుడు క్లినిక్‌లో చికిత్సను పొందుతున్నాను కావున కొంతవరకు బాగానేవుంది, కాని నేను యిప్పటికీ కొన్నిసార్లు ప్రయాసపడుతుంటాను. ఆ శీర్షిక నాకు తిరిగి బలాన్నిచ్చింది.
టి. ఎస్., జర్మనీ
నేను ఒకనాటి మద్యపానిని, మాదకద్రవ్యాల వ్యసనపరుణ్ణి. మీరిచ్చిన సలహా నిజముగా తగినది. ఆ వ్యసనమనేది ఒక ఆత్మీయతకు అడ్డంకుగావున్నదని గుర్తించి నేనుకూడా కదిలింపబడ్డాను, అయినప్పటికీ, సృష్టికర్త దృష్టిలో ఒక వ్యసనపరుడు పూర్తిగా శుద్ధుడుగా వుండలేడు.
ఎమ్. జి., ఫ్రాన్స్
ఆరున్నర సంవత్సరాల క్రితం, కొకైన్ వ్యసనమువలన నేను నా కుమారుణ్ణి పోగొట్టుకున్నాను. ఆ బాధను భరించి, తప్పించుకొని, నా ఆహారపు వ్యసనముతో పోరాడడానికి నేను సిద్ధముగావున్నాను. మద్యపానీయమును అలవాటుగా కలిగివున్న కుటుంబములో పెంచబడ్డాను, కావున నేను ఆహారాన్ని నాకు ఉపశమనము యిచ్చేదిగాను మరియు నా బాధనుండి దూరము చేసేదిగాను ఉపయోగించడానికి నేర్చుకున్నాను. నేను పథ్యము ఉండాలని ప్రయత్నించి, విఫలుడనయ్యాను. ఏమైనప్పటికీ, యెహోవా ప్రేమను 20 సంవత్సరాల తర్వాత ఒక క్రైస్తవుడుగా రుచి చూసి ఒక గొప్ప సహాయాన్ని పొందాను. ఆ శీర్షికలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
ఎస్. ఇ., అమెరికా
పునర్జన్మ నేను ఒక ముస్లీమ్‌ను అయినప్పటికీ, నేను క్రమముగా తేజరిల్లు!ను చదువుచున్నాను. “మీరు పూర్వం జీవించారా? మీరు మరలా జీవిస్తారా?” (జూన్ 8, 1994) నందు నేను ఎక్కువ సమాచారమును కలిగివున్నదిగా చూశాను, నేను నా సద్భావముతో యిటీవల వచ్చిన శీర్షికలకు కృతజ్ఞతలను వ్యక్తం చేస్తున్నాను. పునర్జన్మ ఉనికిలోవుందని పట్టుదలగా చెప్పే నా స్నేహితుల్లో కొందర్ని ఎంతోకాలముగా నేను వెదుకుచున్న దానిని సరిచేయటానికి ఈ సమాచారము ఉపయోగపడింది. మీరిచ్చిన సమాచారముతో, పునరుత్థానము ఉన్నందున, పునర్జన్మ ఉండదని వారు కచ్చితముగా నమ్ముతారని నేను విశ్వసిస్తున్నాను.
కె. ఎస్., నైజీరియా
విజ్ఞానశాస్త్రపు వంచన? ఇటీవల వచ్చిన శీర్షిక “వైజ్ఞానికులు ప్రజలను మోసగించారు” (జనవరి 8, 1994) నా దృష్టికి వచ్చింది. వైజ్ఞానికులు ఒకచిన్న తప్పు చేసినట్లు కనబడ్డాకూడ తరువాత దాన్ని వాళ్లు సరిచేసుకుంటారు. విజ్ఞానశాస్త్రము పనిచేయవలసిన విధానము యిదే, అయితే మీ శీర్షికయొక్క ముఖ్యాంశము ఏదో కొంతతప్పును సూచిస్తుంది. ప్రశ్నలోని కపాలమండలం ఒక గాడిదది అని బహుశా తేలి ఉండవచ్చు, కానీ ఆ వాస్తవానికి ప్రముఖమైన “లూసీ” అస్తిపంజరం వంటి ఇతర వాటి ప్రమాణీకత్వంతో ఎటువంటి సంబంధం లేదు. ఈ ప్రాణులు జీవించాయని మనకు తెలుసు.
ఎమ్. పి., అమెరికా
ఈ ప్రత్యేక అన్వేషణలో యిమిడివున్న వైజ్ఞానికులు ఉద్దేశపూర్వకంగా అవినీతిపరులని మేము సూచించడంలేదు. నిజానికి, వైజ్ఞానిక సత్యాన్ని అప్పుడప్పుడు స్వార్థానికి, రాజకీయ మరియు జాతీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని దృష్టాంతముగా చెప్పబడింది. వాస్తవానికి, న్యాయపరమైన శిలాజ మచ్చులును కనుగొనటము జరిగింది. కాని వీటిల్లో ఏ జీవికూడ మానవజాతికి నిజంగా పూర్వీకులేనన్న నిదర్శనమేలేదు. ఉదాహరణకు “లూసీ”, మానవునిలో మూడవవంతు మెదడును కలిగివుంది. అది కేవలం ఇప్పుడు అంతరించిపోయిన ఏప్ జాతిది అనే విషయం స్పష్టంగా ఉంది.—ఎడిటర్.