కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 12/8 పేజీలు 23-27
  • ఆర్‌.హెచ్‌. కారకము మరియు మీరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆర్‌.హెచ్‌. కారకము మరియు మీరు
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆర్‌హెచ్‌ సమస్యయొక్క చరిత్ర
  • ఆర్‌హెచ్‌, వంశపారంపర్యము మరియు రోగపీడితులైన శిశువులు
  • నిరోధించే క్రియలోని గొప్పతనం
  • రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • సంతానం కలిగియుండుట—ఒక బాధ్యత, ఒక బహుమానం
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • రక్తమార్పిడి–ఎంత వరకు సురక్షితము?
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
తేజరిల్లు!—1994
g94 12/8 పేజీలు 23-27

ఆర్‌.హెచ్‌. కారకము మరియు మీరు

ఒక తండ్రి సగర్వంగా, అప్పుడే క్రొత్తగా పుట్టిన శిశువు తల్లి చేతిలో నిశ్శబ్దముగా నిద్రించటాన్ని సంతోషముతో చూస్తాడు. ప్రసూతిగదిలో అది సుదీర్ఘ కాలం, అయితే యిప్పుడు అదంతాకూడ గతించిన కాలం. వైద్యుడు తల్లిని పిల్లను పరీక్షించటానికి వచ్చి అందరికీ అభినందనలు చెప్తాడు. “నిజానికి అంతా క్రమముగానే జరిగిపోయింది, ఒక విషయం మాత్రం చెప్పాలి,” అని చెప్పాడు.

తల్లి రక్తములో ఆర్‌హెచ్‌-నెగెటివ్‌, శిశువు రక్తంలో ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ ఉన్నట్లుగా పరీక్షలో తేలింది, కాబట్టి తల్లికి అంటువ్యాధులు రాకుండా ఇంజక్షన్‌ యివ్వవలసిన అవసరముంది. “ఈ చిన్న ఇంజక్షన్‌లో మనిషిలోనున్న ప్రతిరక్షకాలు ఉంటాయి అయితే అది నిశ్చయంగా అవశ్యకము,” “ఇది భవిష్యత్తులో రాబోయే గర్భాలకు క్రొత్త వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోడానికి” అని ఆ డాక్టరు స్థిరముగా చెప్తాడు.

ఆ డాక్టరు ఆ ఇంజక్షన్‌ను నియమిత పద్ధతి ప్రకారంగా యిచ్చినప్పటికీ, అలా చెప్పడమూ, “చిక్కులు” అనే మాటల విషయానికొచ్చేసరికి కొన్ని ప్రశ్నల పరంపరలు రోగుల మనస్సుల్లో మెదలుతాయి. ఈ ఇంజక్షన్‌ వాస్తవానికి ఏమి చేస్తుంది? ఇదెంత అవశ్యమైయున్నది? తల్లిదండ్రులు దానిని అవసరములేదని అంటే ఏమి సంభవిస్తుంది? క్రైస్తవునికి అత్యవసరముగా మరొక ప్రశ్నవస్తుంది. ‘రక్తమును విసర్జించవలెను,’ అని బైబిలు చెబుతున్నప్పుడు, క్రైస్తవుడు మరొకవ్యక్తి రక్తములోని మానవ ప్రతిరక్షకాలను కలిగివున్న ఆ ఇంజక్షన్‌ను మంచి మనస్సాక్షితో స్వీకరించగలడా?—అపొస్తలుల కార్యములు 15:20, 29.

ఆర్‌హెచ్‌ సమస్యయొక్క చరిత్ర

దశాబ్దాల క్రితం శాస్త్రజ్ఞులు మానవ రక్తం కలిగివున్న అనేక కారకాలను, లేదా మాంసకృత్తులను, ప్రతివ్యక్తిలోని రక్తాన్ని సాటిలేనిదిగా చేసేవాటిని కనుగొన్నారు. ఈ సమయంలోనే వాళ్లు ఒక వ్యక్తి రక్తమును మరొక వ్యక్తి రక్తముతో సంబంధమేర్పడితే ఆ రెండు రకాల కారకాలు వైద్య సమస్యలకు కారణమౌతాయి. ప్రతిరక్షకాల్లో ఒక పదము “ఎబిఓ”; మరొక పదము “ఆర్‌హెచ్‌.” ఆర్‌హెచ్‌ పద్ధతినిగూర్చి కొంత క్లుప్త సమీక్ష దానిని కలిగివున్న తల్లిదండ్రుల ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను మీకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.

ఇరవై అయిదు సంవత్సరాల స్త్రీకి తన రెండవ బిడ్డ గర్భంలోవుండగానే మరణించిన కేసును 1939లో వైద్యులను కలవరపెట్టినట్లుగా వారు ప్రకటించారు. చనిపోయిన బిడ్డ ప్రసూతి సమయంలోనే, ఆ స్త్రీకి రక్తమార్పిడి జరిగింది, ఆమె రక్తం స్పష్టంగా ఎబిఓకు సంబంధించిన అనువైన ప్రతిరక్షకాలను కలిగివున్నది, ఆ రక్తం ఆమె భర్తనుండి యిచ్చినప్పటికీ తీవ్రమైన ప్రతిఘాతాలు ఉత్పన్నమైన్నాయి. వైద్యులు తరువాత అనుమానించిందేమంటే తన మొదటి బిడ్డ రక్తములోని ఏదో తెలియని కారకం ఆమె రక్తములో కలిసిపోయి, అదే “శీఘ్రగ్రాహకము”గా ఆమె రక్తములో మారి, ఆమె ప్రతిఘాతాలకు దారితీస్తూ తన భర్త రక్తంలో కలిసి తన రెండవ బిడ్డను పోగొట్టింది.

ఈ తెలియని కారకమే తరువాత పరీక్షలద్వార రీసస్‌ అనే కోతుల్లోకూడా ఉంటుందని, దానినే “ఆర్‌హెచ్‌” కారకం అన్నారు. వైద్యులు ఆర్‌హెచ్‌ కారకమునుగూర్చి, రోగమునుగూర్చి అధ్యయనాన్ని చేసిన తరువాత, వింతైన వైద్యకథ ముడి విప్పబడింది.

ఆర్‌హెచ్‌, వంశపారంపర్యము మరియు రోగపీడితులైన శిశువులు

క్రొత్తగా పుట్టిన శిశువు తీవ్రమైన అనారోగ్యానికి గురైనా లేక మరణించినా ఆనేకమంది ప్రజలు విచారం వెలిబుచ్చుతారు. సాధారణంగా శిశువు అనారోగ్యముతో లేక బాధతో ఉండడాన్ని చూడడం, అది చాలామందికి కష్టముగావుంటుంది, వైద్యులకుకూడా ఏమి వ్యత్యాసములేదు. మరి రెండు యితర కారణాలమూలంగా ఆర్‌హెచ్‌ కారకంపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధనిస్తున్నారు.

మొదట వైద్యులు రోగపద్ధతిని, ఆర్‌హెచ్‌ కారకం ఎలా అనారోగ్యముతోను మరణముతోను సంబంధము కల్గివున్నదో అర్థము చేసుకొనుటకు ప్రయత్నించారు. ఎనభై అయిదు లేక 95 శాతము ప్రజలల్లో స్త్రీ పురుషుల్లోకూడా, ఎర్రని రక్తములో ఆర్‌హెచ్‌ కారకము వున్నదని, దానికి “ఆర్‌హెచ్‌-పాజిటివ్‌” అన్నారు. అదిలేని 5 లేక 15 శాతము మందిని “ఆర్‌హెచ్‌-నెగెటివ్‌” అని ముద్రించారు. ఆర్‌హెచ్‌-నెగెటివ్‌ వ్యక్తి రక్తాన్ని ఆర్‌హెచ్‌-పాజిటివ్‌వున్న వ్యక్తికి ఎక్కించినట్లయితే, అతడు లేక ఆమె ప్రతికారకం ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ రక్తాన్ని పాడుచేస్తాయి.

శరీరములోని రక్షిత పద్ధతి బయటనుంచి వాటితో దండెత్తి పోరాడుతున్నప్పుడు ఇది సర్వసాధారణమే, సహాజమే. సమస్య ఏమిటంటే, ఆర్‌హెచ్‌-నెగెటివ్‌ తల్లి ఆర్‌హెచ్‌-పాజిటివ్‌వున్న తండ్రినుండి రక్తాన్ని పుట్టబోయే శిశువు పొందగలదు. జరాయువు సరైన విధానములో పనిచేసినట్లయితే బిడ్డ రక్తమునుండి తల్లి రక్తము వేరుగా వుంచబడుతుంది, ఏ సమస్యను తీసుకొనిరాదు. (కీర్తన 139:13 పోల్చండి.) అయితే మన శరీరాలు అపరిపూర్ణమైనవి, బిడ్డ రక్తము ఏదో ఒక విధముగా కారి తల్లి రక్తముతో కలిసిపోవచ్చు. అప్పుడపుడు, యిది వైద్యపద్ధతి మూలముగాకూడా అంటే ఉల్బంనుండి ద్రవం కారుటవల్లకూడా జరగవచ్చు. లేదా ప్రసూతి సమయంలో బిడ్డ రక్తము తల్లిలో కలిసే అవకాశమున్నది. ఏ కారణము చేతనైతేనేమి, తల్లిలోని ప్రతికారకాలు ప్రేరేపించబడి ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ రక్తముతో పోరాడతాయి.

ఈ సమస్య ఎలా ఉందో ఊహించండి: ఒకసారి తల్లి యిటువంటి ప్రతికారకాలను వృద్ధిచేస్తే, తండ్రినుండి ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ రక్తమును సంక్రమించుకుని తరువాత పుట్టబోయే పిల్లలందరూ సంకటంలో పడతారు. ఎందుకంటే యిప్పుడు తల్లిలో ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ రక్తముతోపోరాడే ప్రతికారకాలు ఆమెలో ఉన్నాయి.

మీరు గమనించండి, సాధారణముగా కొన్ని ప్రతికారకాలు జరాయువుగుండా ప్రవేశిస్తాయి. ఇది ఒక మంచి విషయమే, బిడ్డలందరూ తల్లులద్వారా కొంత స్థాయిలో తాత్కాలికమైన సహాజ రక్షిత శక్తిని పంచుకొని పుడతారు. ఏమైనప్పటికీ, ఆర్‌హెచ్‌ వ్యాధి, శీఘ్రగ్రాహ్యకమైన తల్లిలోని ఆర్‌హెచ్‌ ప్రతికారకాలు జరాయువుగుండా ప్రవేశించి బిడ్డలోని ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ రక్తముపైన దాడిచేస్తాయి. ఇది అరుదుగా మొదటిబిడ్డపై ప్రభావమును చూపుతుంది, అయితే తరువాత పుట్టే పిల్లలందరికీ సాధారణముగానే వస్తుంది. శిశువులకు వచ్చే ఆర్‌హెచ్‌ హెమోలిటిక్‌ వ్యాధి అని పిలువబడే అనారోగ్యాన్ని అది కలిగిస్తుంది (హాని తీవ్రమైనదైతే ఎరిత్రోబ్లాస్టాసిస్‌ ఫిటాలిస్‌ను కలిగిస్తుంది.)

ఈ వ్యాధిని అనేక మార్గాల్లోను సంభాళించవచ్చు, అయినప్పటికీ, అవి కొంత పరిమితమైన విజయాలుగానే మీరు చూడగలరు. ఇప్పుడు వైద్యరీతిగావున్న సమస్యపై మన దృష్టిని కేంద్రీకరించవచ్చు—అదే నిరోధించగల్గే సాధ్యత.

నిరోధించే క్రియలోని గొప్పతనం

ఈ వ్యాధికి వైద్యులకు ఆసక్తి కల్గించే రెండు కారణాలున్నాయని మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి. మొదటిది ఈ రోగములోనున్న తీరుతెన్నులు తెలిసాయి, గ్రహించగలిగే రీతిగా ఉన్నాయి. మరి రెండవది ఏది?

రెండవదే 1968లో కనుగొనటం జరిగింది. కొన్ని సంవత్సరాలు పరిశోధన జరిపిన తరువాత, వైద్యుల విఫల ప్రయత్నముతో ఈ రోగముగల బిడ్డలను, పరిమితమైన సఫలతతో చికిత్స చేసిన తర్వాత, బిడ్డలకున్న సమస్యను నిరోధించే ఒక ఇమ్యునైజేషన్‌ కనిపెట్టబడింది. ఇది ఒక శుభవార్తే. అయితే యిది ఎలా పనిచేస్తుంది?

ఆర్‌హెచ్‌ (రెండవ బిడ్డకుకాని లేదా తరువాత పుట్టబోయే ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ బిడ్డలకుగాని) ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ బిడ్డలోని రక్తము “కారి” ఆర్‌హెచ్‌-నెగెటివ్‌గావున్న తల్లి రక్తకణాలలో కలిసిపోయి, అవి వృద్ధిపొందుతూ ఆమెలో ప్రతికారకాలను ఉత్పత్తి చేసినప్పుడు ఆర్‌హెచ్‌ సమస్య ఉత్పన్నమైందని జ్ఞాపకముంచుకోండి. బిడ్డలోని ఎఱ్ఱ రక్తకణాలు బయటకు వచ్చి తల్లి రక్తంలో కలిసి ప్రతికూలంగా పనిచేయక ముందే వాటిని ఆపు చేయడానికి అవకాశమున్నదా?

తల్లికి యిచ్చే ఇంజక్షన్‌ పద్ధతినే ఆర్‌హెచ్‌ రక్షిత గ్లోబిన్‌ అని అంటారు లేదా ఆర్‌హెచ్‌ఐజి, దానికే కొన్ని దేశాలల్లో రోగామ్‌ అనియు మరియు రెసోనేటివ్‌ అని పేరుంది. ఇది ప్రతిరక్షితాల మిశ్రమము, ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ మాంసకృత్తులతో పోరాడుతుంది. ఇది కచ్చితముగా ఎలా పనిచేస్తుందో అంతుపట్టడం లేదు, కాని ప్రాముఖ్యముగా యిలా పనిచేస్తుండవచ్చు:

ఆర్‌హెచ్‌-నెగెటివ్‌గల తల్లి ఆర్‌హెచ్‌-పాజిటివ్‌గల రక్తానికి అంటే ఆర్‌హెచ్‌-పాజిటివ్‌గల బిడ్డ ప్రసూతి జరిగిన తరువాత ఆ రక్తానికి గురౌతు ఆర్‌హెచ్‌ఐజి ఇంజక్షన్‌ను యివ్వవచ్చు. ఏ ప్రతికారకాలైన త్వరగా బిడ్డనుండి కారిన ఆర్‌హెచ్‌-పాజిటివ్‌గల ఎఱ్ఱరక్తకణాలను తల్లిలో ప్రతికూల ప్రభావం చూపకముందే నాశనము చేస్తాయి. ఈ ప్రభావమంతా తరువాత బిడ్డకు అపాయము రాకుండా చేస్తుంది, ఎందుకంటే అప్పటికే తల్లిలో ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ రక్తము ఎటువంటి ప్రతికారకాలను కలుగజేయలేదు. అది పెరిగినాక చికిత్స చేసేకన్నా ఈ స్థితిలో వైద్యులు గుర్తించే వాస్తవమైన ప్రయోజనమేమనగా వ్యాధి రాకుండా చేయడమే.

ఇది మాటల్లో బాగానే ఉంది, గానీ అది పనిచేస్తుందా? పని చేస్తుంది. అమెరికాలోని ఒక రాష్ట్రంలో, 1970వ దశకములో ఆర్‌హెచ్‌ హెమోలీటిక్‌ వ్యాధి 65 శాతము తగ్గినట్లు తెలిసింది. దీనికి వివిధ విషయాలు తోడ్పడినప్పటికీ, యిలా 60 లేక 70 శాతము తగ్గడానికి ఆర్‌హెచ్‌ఐజిను ఉపయోగించుటవలననే అని తెలింది. కెనాడా శాఖలో, ఆర్‌హెచ్‌ హెమోగ్లోటిక్‌ వ్యాధి 1964లో 29 మంది బిడ్డలకు సోకి చనిపోగా, 1974 నుండి 1975కు మధ్యకాలంలో ఈ వ్యాధి తగ్గి ఒక్కరికే సోకింది. ఈ వెనుకటి వృత్తాంతమునుబట్టి, మనము ఆర్‌హెచ్‌ వ్యాధినిగూర్చి కొన్ని ప్రధానమైన ప్రశ్నలను పరిశీలించుటకు అవకాశముకలదు.

నేను గర్భం ధరించివుండగా ఆర్‌హెచ్‌ వ్యాధివలనవచ్చే అపాయాలేమిటి?

తల్లిదండ్రుల ఆర్‌హెచ్‌ రక్తము యొక్క రకమేమిటో తెలుసుకోవడానికి ఒక చిన్న రక్త పరీక్షచాలు; సుమారుగా 7 వివాహ జతల్లో ఒక్కరికే ఆర్‌హెచ్‌-నెగెటివ్‌గల స్త్రీకి, ఆర్‌హెచ్‌-పాజిటివ్‌గల పురుషుడున్నారు. తండ్రి జన్యు వ్యవస్థ యొక్క అంశాలు ముప్పును 10 శాతం తగ్గిస్తాయి.a

ఏమైనప్పటికీ, మొత్తం జనసంఖ్యంతటిలోనున్నది. మీరే ఆర్‌హెచ్‌-నెగెటివ్‌గల స్త్రీ అయి ఆర్‌హెచ్‌-పాజిటివ్‌గల పురుషుని వివాహము చేసికొన్నట్లయితే, మీకు 50 నుండి 100 శాతము వరకు ఆర్‌హెచ్‌-పాజిటివ్‌గల బిడ్డను పొందటానికి అవకాశాలున్నాయి, అదికూడా మీ భర్తయొక్క జన్యుసంబంధమైన వాటిపై ఆధారపడివుంటాయి.b (మీ భర్తయొక్క జన్యుసంబంధ నిర్మాణము జరుగుతుందని నిశ్చయముగా తీర్మానించలేము, గర్భంలో బిడ్డ ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ను కలిగివున్నదని ఊరికినే చెప్పడానికి అవకాశములేదు.)

ఆర్‌హెచ్‌-నెగెటివ్‌గల తల్లి ఆర్‌హెచ్‌-పాజిటివ్‌గల బిడ్డను గర్భం ధరించివుంటే, ప్రతిసారి గర్భంలో 16 శాతము ఆమెకు సంక్రమిస్తుంది, అంతేకాక తరువాత గర్భధారణలోకూడా ఆ అపాయాన్ని ఎదుర్కొనవలసివస్తుంది. అది నిజమే, అవి కేవలం సరాసరి మాత్రమే. ముందు ఏమైనా రక్తమార్పిడి జరుగక లేదా ఏవిధముగానైన తల్లి రక్తము బహిర్గతము చేయబడకుండా ఉంటే, మొదటి బిడ్డ సర్వసాధారణముగా ఆర్‌హెచ్‌ వ్యాధియొక్క అపాయంనుండి తప్పించబడుతుంది. మొదటి బిడ్డ పుట్టిన తరువాత, ఎటువంటి అపాయాన్ని కలిగివుండదని నిజంగా ముందే చెప్పలేము. ఒక స్త్రీ ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ను కలిగివున్న తన మొదటిబిడ్డతో ఆమెకు అది సోకవచ్చు. మరొక స్త్రీ అయితే అయిదుకంటే ఎక్కువ మంది ఆర్‌హెచ్‌-పాజిటివ్‌గల బిడ్డలు పుట్టిన తరువాతకూడా ఆమెకు ఆ రోగంరాదు. తల్లి గనుక ప్రతికూల ప్రభావాన్ని పొందితే కలుగబోవు ప్రతి పిండములోకూడా 30 శాతము ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ను కలిగి మరణాపాయములో పడవేస్తుంది, గర్భధారణ మధ్య వ్యవధి ఉన్నా యిది తప్పదు. ఈ విషయాన్ని చిన్నదిగా పరిగణించడానికి వీలులేదు.

నాలో పెరుగుతున్న బిడ్డ అపాయంలో ఉన్నదని లాబొరేటరీ పరీక్ష ఏమైనా చెప్పగలదా?

అవును, కొంతమేరకు చెప్పవచ్చు. ప్రతికారక స్థాయిల్లోనే తల్లి రక్తాన్ని గర్భం ధరించివుండగానే అంచనా వేసి చూస్తే, బిడ్డ రక్తానికి వ్యతిరేకంగా ఆమె ప్రతి కారకములను ఉత్పత్తి చేయగలదా లేదాయని చెప్పగలవు. అంతేకాకుండా, బిడ్డలోని రక్తం పాడైపోయిందా లేక బిడ్డ ప్రమాదంలోనున్నదా అనేది చెప్పటానికి ఉల్భంలోని ద్రవంకూడా సహాయపడగలదు. అయినప్పటికీ, ఉల్భంలోని ద్రవం సేకరణలో అనేకమైన చిక్కులున్నాయి, కాబట్టి దానిని సేకరించేటప్పుడు జాగ్రత్తవహించాలి.

ఆర్‌హెచ్‌ఐజి ఇంజక్షన్‌ ఏమైన ఇతర ప్రతికూల ప్రభావాలను కల్గివున్నదా?

పెరిగే పిండంపై ఇమోనోలాజిక్‌ వల్ల కలిగే నష్టము పెరుగుతున్నందువల్ల గర్భధారణలో ఏమి ఉపయోగించాలో యింకా సందిగ్ధతలోన్నది. అయినప్పటికీ, కొంత మంది పరిశీలకులు అంటువ్యాధులనుండి రక్షణనొసగు ఇంజక్షన్‌ తల్లి మరియు ఆమెలో పెరుగుతున్న శిశువుకు సురక్షితముగా ఉండగలదన్న ముగింపుకు వచ్చారు.

వైద్యులు చెప్పేవిధముగా, ఎంత తరుచుగా ఆ ఇంజక్షన్‌ను నేను తీసుకోవాలి?

అధికారులు చెప్పినట్లుగా ఈ ఇంజక్షన్‌ ఏ సందర్భం తరువాత యిచ్చినప్పటికీ అది ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ రక్తం ఆర్‌హెచ్‌-నెగెటివ్‌గల స్త్రీ రక్తప్రసరణ వ్యవస్థలో ప్రవేశించే అవకాశము కలదు. అందుచేత, ప్రస్తుత సిఫారసుల ప్రకారం ఈ ఇంజక్షన్‌ను శిశువు రక్తం ఆర్‌హెచ్‌-పాజిటివ్‌గావున్నట్లు కనుగొన్నట్లయితే, ప్రసూతి జరిగిన 72 గంటల్లో ఇవ్వటము జరగాలి. ఈ సిఫారసు ఉల్భంలోని ద్రవ సేకరణకు లేదా గర్భస్రావానికి వర్తించగలదు.

మరింకా ఎక్కువగా, కొన్ని పరిశోధనల ప్రకారంగా తల్లి గర్భంతో ఉన్నప్పుడే బిడ్డ రక్తం కొంతైనా తల్లి రక్తనాళాల్లో ప్రవేశించే అవకాశమున్నందున, గర్భం ధరించిన 28 వారాల తరువాత తల్లికి ప్రతికూలంగా జరుగకుండా రక్షించుటకు ఈ ఇంజక్షన్‌ను యివ్వాలని కొంతమంది వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనైతే శిశువు పుట్టిన తరువాతకూడా ఈ ఇంజక్షన్‌ను యివ్వటానికి సిఫారసు చేయబడింది.

శిశువుకు ఆర్‌హెచ్‌ వ్యాధి ఒక్కసారి వచ్చిన తరువాత ఏమైనా చికిత్స ఉన్నదా?

అవును. హెమోగ్లోటిక్‌ వ్యాధి క్రొత్తగాపుట్టినవారికి వస్తే అది ఒక తీవ్రమైన వ్యాధి, బిడ్డకు రక్తమార్పిడులు చేయకుండానే చికిత్సలు చేయడానికి మంచి నిరూపణవుంది. ఈ వ్యాధిలో భయంకరమైన చిక్కులను మిళితమైనది ఏమనగా రక్తంలోని ఎర్రకణములు పనిచేయక పోవడం మూలంగా యిందులో బిలిరూబిన్‌ అనే రసాయనికము పుడుతుంది. ఇదే పచ్చకామెర్లను మరియు కొన్ని కేసుల్లోనైతే శిశువు అంగాలకు నష్టము కలుగవచ్చు. (అనుకొననివిధంగా, నెమ్మదిగా తల్లి రక్తములోని మరియు శిశువులోని రక్తంలో ఎబిఓతో పొసగనప్పుడు యీ పచ్చకామెర్లు వస్తాయి, కాని యిది సాధారణముగా పెద్ద ప్రమాదముకాదు.)

కొన్ని సంవత్సరాలవరకు వైద్యులు పిల్లలకు రక్తమార్పిడి చేయడంవల్లనే పచ్చకామెర్లు విశేషమైన స్థాయివరకు వస్తున్నాయని అనుకున్నారు, అయితే మరి కొంత పరిశోధన జరిపిన తరువాత వివిధ రకాల ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నట్టుగా బయలుపడింది. త్వరగానే ప్రసూతి జరగటం లేదా సిజేరియన్‌ సెక్షన్‌, ఫోటోథెరఫీ, మరియు ఫినోబార్‌బిటాల్‌, బొగ్గుతో శోషణ శక్తిని పెంపొందించునట్లు చేయుట, మరి యితర చికిత్సలు సహాయపడినట్లుగా నిరూపణయై, రక్తమార్పిడికి ప్రత్యామ్యాయ మార్గాలను చూపింది. నిజానికి, యిటీవల వచ్చిన నివేదికలద్వారా ఆర్‌హెచ్‌ వ్యాధితోవున్న పిల్లలకు రక్తమార్పిడి చేయటం ప్రమాదకరమనియు, అవి వ్యర్థమనియు ఉన్నతపర్చటం జరిగింది.—26వ పేజీలోని బాక్స్‌ను చూడండి.

ఏమైనప్పటికీ, తీవ్రమైన కేసుల్లో చికిత్సను అంగీకరిస్తేనే వైద్యులు యింకా రక్తమార్పిడి అవసరమని నొక్కి చెబుతున్నారు. అందుచేత, కొంతమంది తల్లిదండ్రులు ఈ ఇంజక్షన్‌తో వ్యాధి రాకుండా సంరక్షించుకొనుటతో పాటు పచ్చకామెర్లను మొదలగు వ్యాధులతోకూడిన మొత్తం సమస్యను తప్పించుకొనుటకు ఈ ఇంజక్షన్‌ను తీసుకొనుటయే శ్రేష్ఠంగా భావిస్తారు.

ఆర్‌హెచ్‌ఐజి ఇంజక్షన్‌ రక్తంతో తయారుచేయబడిందా?

అవును. ఆర్‌హెచ్‌ కారకమునకు గురైన లేక సోకిన వారి రక్తం నుండి తీయబడిన ప్రతికారకములతో తయారు చేయబడినదే యీ ఇంజక్షన్‌. వంశపారంపర్యము-కల్పించిన ఆర్‌హెచ్‌ఐజి కాదు రక్తమునుండి ఉత్పాదించబడిన ఏమైన భవిష్యత్తులో అందుబాటులో ఉండవచ్చు.

ఆర్‌హెచ్‌ఐజిను క్రైస్తవుడు మనస్సాక్షిపూర్వకముగా తీసుకొన వచ్చునా?

ఈ విషయంలో రక్తాన్ని దుర్వినియోగముచేసేదికూడా యిమిడివున్నది. లేఖనాలు తరుచుగా రక్తాన్ని తిండి రూపంలోనుగాని లేదా యితర విధాల్లో దుర్వినియోగము చేయటాన్ని నిషేధిస్తున్నాయి. (లేవీయకాండము 17:11, 12; అపొస్తలుల కార్యములు 15:28, 29) ఆర్‌హెచ్‌ఐజి రక్తమునుండి ఉత్పత్తి చేయబడినప్పుడు, క్రైస్తవ స్త్రీ యిటువంటి ఇంజక్షన్‌ను అంగీకరిస్తే, బైబిలు ఆజ్ఞాపించిన రక్తమును విసర్జించండి అనే దానిని భంగపర్చినట్లు కాదా?

ఈ పత్రికతోపాటు దీని తోటిపత్రికయైన కావలికోట, ఈ విషయాన్ని గూర్చి నిక్కచ్చిగా వ్యాఖ్యానము చేసింది.c అన్ని గర్భస్థ కేసుల్లో జరాయువుగుండా ప్రతికారకాలు స్వేచ్ఛగా తల్లినుండి బిడ్డకు అందుతున్నట్లు మేము పరిశీలించటము జరిగింది. అందుకే యీ విధానం సహజంగా జరిగే దానిని పోలివుంది గనుక యీ ప్రతికారకములుగల ఆర్‌హెచ్‌ఐజిని తీసుకోవడంలో బైబిలు చట్టాన్ని ఉల్లంఘించినట్లేమీ కాదని కొందరు క్రైస్తవులు తీర్మానించుకున్నారు.

ఆర్‌హెచ్‌ఐజిను తీసుకోవాలా వద్దా అనేది, ప్రతి క్రైస్తవ దంపతులు చివరికి తామే ఈ విషయముపై మనస్సాక్షికి సమ్మతముగా తీర్మానించుకోవాలి. ఏమైనప్పటికీ, ఒక భర్త మరియు భార్య ఆర్‌హెచ్‌ విషయాన్ని ఎదుర్కొనప్పుడు ఆర్‌హెచ్‌ఐజిను వైద్యపరముగా సిఫారసు చేసి తీసుకొనకుండా ఉండాలని నిర్ణయించుకుంటే, లేకపోతే పుట్టబోవు బిడ్డ తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రతికూలతను కూడా ఎదుర్కోగల్గి ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో జ్ఞాన యుక్తముగా ప్రత్యేక ముందు జాగ్రత్తలు తీసుకోవటము మంచిది ఎక్కువమంది పిల్లలు కలగకుండాను, తద్వారా యింటి అపాయం కలుగకుండా చేసే అవకాశముంటుంది. ఇట్టి బరువైన నిర్ణయాలను తీసుకొనేటప్పుడు క్రైస్తవ తల్లిదండ్రులు అన్ని విధాలుగా ప్రార్థనాపూర్వకముగా పరిశీలించటము మంచిది.

[అధస్సూచీలు]

a వివిధ జాతుల్లో వివిధ రీతుల్లో వీటి సంఖ్యవుంటుంది. తెల్లవాళ్లల్లో ఆర్‌హెచ్‌-నెగెటివిటీ 15 శాతముంటుంది; అమెరికాలోనున్న నల్లజాతివాళ్లలో 7 నుండి 8 శాతమువరకు ఉంటుంది; ఇండో యూరసీన్స్‌లో 2 శాతము వరకు ఉంటుంది; ఆసియా నివాసుల్లోను చైనీయుల్లోను మరియు జపానీయుల్లోను చాలవరకు ఏమీ ఉండదు.—ట్రాన్స్‌ఫ్యూషన్స్‌ మెడిసిన్‌ రీవ్యూస్‌, సెప్టెంబరు 1988, పేజీ 130ను చూడండి.

b ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది స్త్రీలు అనేకమంది పిల్లలనుకన్నారు వాళ్లందరూకూడా ఆర్‌హెచ్‌-నెగెటివ్‌ను కలిగివున్నారు గనుక తల్లికి ప్రతికూలత జరుగలేదు. మరియు యితర కేసుల్లో, మొదటి బిడ్డ ఆర్‌హెచ్‌-పాజిటివ్‌ను కలిగివుంటే అది తల్లికి సంక్రమించింది.

c జూన్‌ 1, 1990, కావలికోటలోని 30, 31 పేజీలను చూడండి; జూన్‌ 15, 1978, 30, 31 పేజీలు; మరియు రక్తము మీ జీవమునెట్లు సంరక్షించగలదు?, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌ ఇంకార్పొరేటెడ్‌చే ప్రచురింపబడింది.

[26వ పేజీలోని బాక్సు]

ఉన్నతపర్చబడిన బిలిరూబిన్‌—రక్తమార్పిడికి కారణమా?

వైద్యులు ఉన్నతపర్చిన బిలిరూబిన్‌గల పిల్లల్లో వచ్చే పర్యవసానాలను బట్టి చాలాకాలం భయం కలిగివున్నారు, ఎందుకంటే బిలిరూబిన్‌ పెరగటం ప్రారంభించిదంటే—ప్రాముఖ్యముగా 20 మి. గ్రా. నుండి 100 మి. గ్రా. కు పెరిగితే—వైద్యులు అప్పుడు “మెదడుకు నష్టము రాకుండా కాపాడేందుకు” రక్తమార్పిడి చేసుకొమ్మని బలవంతము చేస్తూంటారు. రక్తమార్పిడియొక్క విలువ న్యాయసమ్మతమేనా అన్నదే వారి భయం?

డా. ఆతోంని డిక్సన్‌: “వేర్వేరు పరిశోధనలు శిశువులపై జరిపిన తరువాత ఎటువంటి పర్యవసానాలు వచ్చినవి కనిపెట్టుటకు సాధ్యముకావటము లేదు, అవి స్వల్పకాలమైనవైనా లేదా దీర్ఘకాలమైనవైనా, బిలిరూబిన్‌ స్థాయి 100 మి. లీ.కు 18 మి. గ్రా. _51 మి. గ్రా ఉన్నపుడు సంభవిస్తాయి.” డా. డిక్సన్‌ దానిని కొనసాగిస్తూ యిలా వివరిస్తున్నాడు “విజిన్‌టిఫోబియా: 20ని గూర్చిన భయం.” ఉన్నతపర్చిన బిలిరూబిన్‌ స్థాయిలను చికిత్సచేయగా ఎటువంటి ప్రయోజనాలు లేవని నిరూపించినట్లుగా దానినే డా. డిక్సన్‌ ముగిస్తూ: “ఈ సందిగ్ధావస్థ చాల స్పష్టమైనది. ఉన్నతపర్చిన బిలిరూబిన్‌ రసి స్థాయిలపై శక్తివంతమైన చికిత్సయే యిపుడు ప్రమాణమైన ప్రయోగమైంది. ప్రమాణమైన ప్రయోగం తప్పు అని నిరూపణ జరిపేవరకు అది సవాలు చేయబడదు అయినప్పటికీ ఏ ప్రయత్నమైన తప్పుగా ప్రదర్శించబడితే అది అనీతిశాస్త్రమే!”—కనెడియన్‌ ఫామిలీ ఫిజీషియన్‌, అక్టోబరు 1984, పేజీ 1981.

మరొక ప్రక్క, ఇటాలియన్‌ అధికారి, డాక్టరు. ఇర్స్‌లీయా గార్‌బాగ్నాటీ, బిలిరూబీన్‌యొక్క రక్షక పాత్రనుగూర్చి మరియు “తగని సెరం బిలిరూబీన్‌ అతి తక్కువ స్థాయిలనుండి సంభవించే అనుకోని ప్రమాదాలను గూర్చి రాశాడు.” (ఐటాలిక్కులు మావి) (పేడియాట్రిక్స్‌, మార్చి 1990, పేజి 380) మరొక అడుగు ముందుకువేసి, డాక్టరు, జోన్‌ హోడ్జోమాన్‌ వెస్టన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు వ్రాస్తూ; “రక్తమార్పిడి బిలిరూబీన్‌ మాలిన్యము మెదడుకు అంటకుండ సంరక్షించదు పైన వివరించబడిన ప్రయోగాత్మకమైన పనిని దృష్టియందు వుంచుకొని, వాస్తవంగా అది హానికరమైనదికూడా.”—జూన్‌ 1984, పేజీ 933.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి