పర్వతాలు—సృష్టిలో ఉత్కృష్టమైనవి
అండీస్, కాస్కేడ్స్, హిమాలయాలు, రాకీస్, ఆల్ప్‌స్, మరియు యూర్లాస్—యివి భూగ్రహంపైనున్న కొన్ని పర్వతాలు మాత్రమే. ఈ పర్వతాల విస్తృతమైన పరిమాణాన్ని చూస్తే వాటి ఔన్నత్యానికి మీకు శ్వాస అగిపోయినంతపని అవుతుంది.
ఎవరెస్ట్ పర్వతము ముందు నిలబడినట్లుగా ఊహించుకోండి. అది భూమిపైనున్న అందమైన శిఖరము, 8,848 మీటర్లు—అంటే తొమ్మిది కిలోమీటర్ల ఎత్తైన స్మారకం! ఈ పర్వతశిఖరము దివ్యమైన హిమాలయాల్లోని ఒక చిన్నభాగము మాత్రమే. 70 పర్వతశిఖరాలతో ఒక్కొక్కటి ఆశ్చర్యంగా 6,400 మీటర్లతో, హిమాలయ పర్వతాలు యూరప్‌లోని ఆల్ప్‌స్ పరిమాణమునకు రెండింతలు పెద్దవి!
సాటిలేని వివిధ జీవాలు
అధికంగా ప్రతి 300 మీటర్ల ఎత్తుకు వాటి ఉష్ణోగ్రత ఇంచుమించుగా 1.8 డిగ్రీల సేల్సియస్‌కు తగ్గుతుంది కాబట్టి అనేక పర్వతాల్లో వివిధ జీవమండలాలు లేదా వాతావరణాలుంటాయి. వర్షపాతములో, నేలలో మరియు గాలిలో విచలనాలున్నప్పటికి ప్రతి మండలము సాటిలేనిది.
అమెరికానందలి అరిజోనాలోని శాన్‌ఫ్రాన్సిస్కో పర్వతశ్రేణి యిటువంటి విభిన్నమైన పరిసరాలకు ఒక ఉదాహరణగా వున్నాయి. ఆ రాష్ట్రములోనే అవి ఎత్తైన పర్వతాలు. కోకోనినో ప్లాటోనుండి పర్వతాల పునాది ప్రాంతమునుండి మీరు మొదలుపెట్టి పైకి ఎక్కుతూ శాన్‌ఫ్రాన్సిస్కో పర్వతశ్రేణి కొనకు చేరుకున్నట్లైతే, మీరు మొదటిగా పర్యావరణశాస్త్ర సంఘంలో మిళితమైన, ఎడారి పరిస్థితుల్లో పెరిగే చెట్లను, బల్లులను, ముండ్లజాతి చెట్లను చూస్తారు. పైకిపోయేకొలది మీరు శీతలమైన జీవనము కలిగిన ప్రాంతాలను, పర్వతలేళ్లకు నిలయమైన ప్రాంతాన్ని మరియు స్పౄస్ చెట్లను చూస్తారు. చివరకు మీరు ఉత్తర ధృవమువంటి పరిస్థితులుగల ఆల్ప్‌స్ శిఖరమునకు చేరుకుంటారు. కేవలం ఒక్కసారి పైకి ఎక్కితే చాలు మీరు విభిన్నమైన జీవరాసులను, పరిసరాలను చూస్తారు, అలాంటివి నేలపై మెక్సికో సముద్రమట్టమునుండి కెనడాకు ప్రయాణిస్తే చూస్తారు!
పర్వతాలపైవచ్చే స్వచ్ఛమైన గాలిని, ఉల్లాసంతో ఊపిరిపీల్చుకొనే అనుభూతిని మీరు ఎప్పుడైనా అనుభవించారా? యీ అనుభూతి గాలిలో తక్కువ ఉష్ణోగ్రతని వివరిస్తుంది. కాని దగ్గరలో పట్టణాలేవి లేకపోతే, పర్వతాలపైవచ్చే గాలి యింకా స్వచ్ఛమైనదిగా మరియు శుద్ధమైనదిగా వుంటుంది. ప్రతి 2,000 మీటర్ల ఎత్తులో ఒక క్యూబిక్ సెంటీమీటరు గాలిలో, 2,500 చిన్న ధూళి అణువులు, పుప్పొడి మొదలగునవి ఉంటాయి. పెద్ద పట్టణాల్లో గాలితో పోల్చిచూస్తే, అదే పరిమాణపు వ్యాపించియున్న గాలిలో 1,50,000 ఈ అణువులుంటాయి! ఆధునిక నక్షత్రగణితశాలలను ఎందుకు పర్వతాలపై కడతారో యిది వివరిస్తుంది, అక్కడ గాలి స్వచ్ఛంగా, తడిలేకుండా వుండి ఖగోళశాస్త్ర పరిశోధనకు సరైన పరిస్థితులను కలిగిస్తుంది.
నిజమే, పర్వతశ్రేణులు ఉన్నతస్థానాలలో పరిస్థితులు అంత ఆమోదయోగ్యమైనవిగా వుండవు అక్కడ వాతావరణ పీడనాలు, ప్రాణవాయువు సమస్థితి తగ్గిపోవటం, సౌర కిరణప్రసారాలు పెరిగిపోవటం, తుపానుగాలి ప్రభావాల కారణంగా ఉష్ణోగ్రత తగ్గిపోవటం జరుగుతుంది. ఆశ్చర్యంగా, అటువంటి పరిస్థితులందుకూడ, కొన్ని జీవరాసులు గట్టిపట్టుదలతో వృద్ధిపొందుతూనే వున్నాయి. ఉదాహరణకు ఆలోచిస్తే, ఒక చిన్న సాలెపురుగైన సాల్‌టీసీడ్ లేదా గెంతే సాలెపురుగు. యీ పర్వతశ్రేణి ప్రాణి యిల్లు హిమాలయాల్లో 6,000 మీటర్ల ఎత్తునవుంది! ఈ ప్రాణి ఎలా చావకుండ బ్రతుకుతుందో వైజ్ఞానికులకు స్పష్టంగా అర్థము కావటంలేదు.
మానవునిపై ప్రభావాలు
పర్వతాలు మానవజాతంతటిపై ప్రభావము కలిగివున్నాయి. ఉదాహరణకు, ప్రపంచపటాన్ని ఒకసారి చూడండి. పైరనీస్‌ను గమనించండి, 3,000 మీటర్ల ఎత్తైన శిఖరాలు, స్పెయిన్‌నుండి ఫ్రాన్స్‌ను, మిగిలిన యూరప్‌ను వేరుచేస్తుంది. అదే విధంగా అతిస్థూల పర్వతాల పంక్తితో చాలా రాజకీయ సరిహద్దులున్నట్లుగా మీరు గమనించేవుంటారు. ఈ కదిలింపబడని సరిహద్దులు వివిధ భాషలు లేక సాంప్రదాయాల జనుల మధ్య ప్రయాణాలను, వ్యాపారాన్ని ప్రతిబంధకము చేసాయి. అయినప్పటికీ, ఈ పర్వతశ్రేణుల ఉనికి మీరు నివసించే దేశపరిమాణంపై, దాని ఆకృతిపై, మీరు మాట్లాడేభాషపై, మీ ప్రాంతంలో సాంప్రదాయాలపై పరివర్తించు ప్రభావాన్ని కలిగివుంది.
ఎత్తైన పర్వతాలు వచ్చిపోయే గాలి ప్రవాహాన్నికూడ ఆవరోధించగలవు. అవి వర్షపాత చక్రముపై, మంచుపై, పెద్దగాలులపై మరియు ఉష్ణోగ్రతపై తాకిడిని కలిగివున్నాయి. అవి తిరిగి మీరు ఆనందించే వివిధరకాల ఆహారంపై, మీరు ధరించే వస్త్రాలపై, బహుశా మీ యింటి భవననిర్మాణపు నమూనాపై కూడ ప్రభావాన్ని చూపగలవు.
ఉదాహరణకు, కున్‌లున్, టైన్ షాన్, హిందూ కూష్, హిమాలయాలు మరియితర పర్వతాల పంక్తులు మధ్య ఆసియాలో తూర్పునుండి పడమరకు వ్యాపించివున్నాయి. ఈ పర్వతశ్రేణులు సైబీరియానుండి తోసుకొనివచ్చే చల్లని పొడిగాలులను ఆపుతూ, హిందూ మహాసముద్రమునుండి వచ్చే తడిగాలుల ప్రభావాన్ని, ఉష్ణాన్నికూడ ఆపగలవు. అందుకే, ఈ పర్వతాల ఉనికి దక్షిణాదిలోవున్న పరిస్థితులకన్న, ఉత్తరాదిలో వ్యత్యాసము కలిగించి, లక్షలాదిమంది జీవితాలపై ప్రభావాన్ని చూపగలదు.
ప్రమాదములోవున్న ఒక పర్యావరణమా?
ఆశ్చర్యకరంగా, పర్వతశ్రేణుల వైభవానికి, అందానికి మానవజాతి నష్టాన్ని కలిగిస్తుంది. లింక్స్ మరియు ఎలుగుబంట్లు ఒకప్పుడు ఆల్ప్‌స్ ప్రాంతంలో తిరుగుతుండేవి కాని నిర్బంధములేని విధంగా వేటాడుటవలన అవి అంతరించిపోయాయి. అడవులను నరుకుట ఫలితంగా విలువగల శ్రేష్ఠమైన మట్టి ఏటవాలుగా కొట్టుకొనిపోయింది. పరిశ్రమల కాలుష్యం, అధిక పరిమాణంలో జరిగే యాత్రలవల్లకూడ, సున్నితమైన పర్యావరణాన్ని కలిగున్న కొన్ని పర్వతశ్రేణుల ప్రాంతాలుకూడ తీవ్రముగా ప్రభావితమయ్యాయి.
సంతోషదాయకంగా, పర్వతాలు భూతల ప్రకృతిలో దృశ్యాలుగా శాశ్వతమైన చిహ్నాలుగా నిలిచిపోతాయి. (ఆదికాండము 49:26 పోల్చండి.) రాబోయే నూతనలోక ప్రభుత్వముకూడ బైబిలులో ఒక పర్వతముగా పోల్చి చెప్పటం గుర్తించదగినది. భూవ్యాప్తంగా, పర్వతమును పోలిన ఈ ప్రభుత్వము ఈ గ్రహమునకు కలిగిన నష్టాన్ని సరిచేస్తుంది. (దానియేలు 2:35, 44, 45) మనము సృష్టిలోని ఈ ఉత్కృష్టమైన వాటిని నిరంతరము ఆనందించు సాధ్యతకలదు. (g94 10/8)
[20,21వ పేజీలోని చిత్రం]
ఫ్రాన్స్‌లోని బ్లాంక్ పర్వతము, 4,810 మీటర్లు
[క్రెడిట్ లైను]
M. Thonig/H. Armstrong Roberts
[22వ పేజీలోని చిత్రం]
జపాన్‌లోని ఫూజి పర్వతం, 3,778 మీటర్లు
[క్రెడిట్ లైను]
A. Tovy/H. Armstrong Roberts