ఎర్రసముద్రపు అలల అడుగునున్న అద్భుతాలు
అందమనేది శరీరంపై కనిపించేది అని ప్రజలు చెబుతారు. కాని నిజమైన అందం తరచు ఉపరిభాగం అడుగున ఉంటుంది—ఇది కేవలం ప్రజలకు మాత్రమే వర్తించేది కాదు. ఎర్రసముద్రము విషయంలో ఇది నిజమని నేను కనుగొన్నాను. నీళ్ల ఉపరిభాగం అడుగును చూసే భాగ్యంగల ఈతగాని కొరకు అద్భుతమైన అందాలు వేచివున్నాయని నిర్జీవమైన ఆ సముద్రతీరమును చూచినప్పుడు నాకు అర్ధం కాలేదు.
నీటిలో నుండు రత్నఖని గట్టు యొక్క అద్భుతాలను అన్వేషించడానికి ఎర్రసముద్రానికి, లోకంలో అత్యాసక్తికరమైన ప్రదేశాలలో ఒకటని పేరుంది. దాని కీర్తి సరియైనదా కాదా అని స్వయంగా చూడాలని ఆసక్తితో బయలుదేరాను.
ఒకసారి నేను నీటి అడుగునున్న లోకాన్ని స్వయంగా చూసిన తరువాత, నేను దానిని మరెక్కువగా అర్థం చేసుకోవాలనుకున్నాను. ఎర్రసముద్రం యొక్క జల ప్రాణుల పై నిపుణుడైన సముద్ర సంబంధ జీవశాస్త్రజ్ఞుడు ఆరొన్ మెరోజ్, నా ప్రశ్నలకు జవాబిచ్చాడు.
ఎర్రసముద్రపు నీరు ఎందుకంత విస్తారంగా ఫలిస్తుంది?
“హిందూ మహాసముద్ర మందలి అనేక చేపలను సమకూర్చే ఒక పెద్ద కిక్కిరిసిన స్థలము వలె ఎర్రసముద్రము కనపడుతుంది మరియు పనిచేస్తుంది. ఇంతేకాకుండ, మన కిక్కడ పగడములు అసామాన్యమైన విస్తారంగా ఉన్నవి. కేవలం ఒక గజము రత్నఖని గట్టుమీద తరచు మీరు 20 విభిన్న రకాల పగడములు పెరగడం చూడగలరు. పగడములు పెరగడానికి సహాయపడు సరియైన నీటి ఉష్ణోగ్రత సంవత్సరమంతటిలో కొద్ది పరిమాణంలోనే మారుతుంది. ఇంతేకాకుండ, స్వల్ప వర్షపాతం ఉన్న ఈ ప్రాంతంలో కొంచెం మురికి సముద్రం లోనికి వెళ్తుంది. ఇది, పరిమాణ కలుషితాలను తగ్గిస్తుంది, అయినప్పటికీ నేను చెప్పడానికి విచారిస్తున్నాను గత 15 సంవత్సరాలనుండి పరిస్థితి దిగజారింది.”
ఈ సముద్రపు నిధిని కాపాడటంలో ఉన్న సమస్యలేమిటి?
“ఇతర స్థలములతో పోల్చినప్పుడు చెరపబడని జీవించే స్థలం సంబంధంగా వ్యవహరించేటప్పుడు, కాలుష్యమనేది ఒక గొప్ప సమస్యగా ఉంటుంది. ఎర్రసముద్రములోనికి, మూడు ముఖ్య మూలముల నుండి కలుశితమనేది వస్తుంది: క్షార పదార్థములు, చేపలు సాగుచేసే ఫారమ్‌లు, మరి సముద్రతీర పట్టణాల నుండి మురికినీళ్ల కాలువలు. నీటి అడుగునకు వెళ్లి ప్రదేశాలను చూడాలనుకునే జనప్రీతి అనేది కూడ సమస్యలకు కారణం కాగలదు. నీటిఅడుగుకు వెళ్లేవారి అశ్రద్ధవలన పెళుసైన రత్నఖని గట్టు సులువుగా చెడిపోగలదు.”
అనేక సంవత్సరాలుగా మీరు ఎర్రసముద్రంలోని రత్నఖని గట్టును గూర్చిన అధ్యయనం చేస్తుండవచ్చు. మీరు నేర్చుకున్న కొన్ని విషయాలు ఏవి?
“చేపలకు ఆహారం తినడానికి వేళలు కలవని మేము కనుగొన్నాము. కొన్ని ఉదయం ఏడు గంటలకు ప్రారంభించి మూడు గంటల పాటు ఆహారం తింటాయి, కొంత విశ్రాంతి తీసుకొని, మరి మధ్యాహ్నం మరో మూడు గంటల పాటు మళ్లీ ఆహారం తింటాయి. కొన్ని రాత్రివేళల్లోనే ఆహారం తింటాయి. ఈ ఆహార వేళలు ప్రాముఖ్యము. చేపలను మ్రింగే పెద్ద చేపల నుండి చిన్న చేపలు దినమంతా ఎడతెగని వత్తిడికి గురైనట్లేతే, అవి ఆహారం తినడానికి కలవర పడతాయి. మరి చేపలు, మనుషుల వలె, ఇష్టమైన ఆహారమును తినగలవు. ఉదాహరణకు, గ్రూపర్‌కు (నీలిచుక్కల పెద్దచేప), ఎర్రసముద్రములో సర్వసాధారణంగా ఉండే అందమైన బాస్‌లెట్స్ చేపలంటే ప్రత్యేక రుచి. నేను పనిచేసే అక్వేరియంలో ఉన్న చేపలకుకూడ వాటి రుచిగల ఆహారము కలదు—కొన్ని టూనా చేపలను ఇష్టపడతాయి, మరికొన్నైతే సార్‌డైన్స్‌ని (చిన్నచేపలు) కోరుతాయి.
“ఒక చేపకు, మనుషులందరు ఒకేలా కనిపిస్తారని మీరు అనుకోవచ్చు, కాని విషయమదికాదు. చేపలు మరి యింకొన్ని వెన్నెముక లేని జంతువులుకూడా ప్రజలను గుర్తించగలవు. మా తోటి పనివాళ్లలో ఒకడు ఒక ఆక్టోపస్ చేపను ఒకసారి సరసముగా అరచేతితో కొట్టినది నాకు గుర్తుంది. అలాకొట్టడాన్ని అది ఇష్టపడలేదు, మరి అది ఇంకెన్నడు ఆ వ్యక్తి నుండి ఆహారమును అంగీకరించలేదు. మేము కనుగొన్నదేమంటే, మృదువైన ప్రజలు చేపలతో బాగా వ్యవహరిస్తారు, అయితే ఒక కోపిష్టి లేక ఓర్పులేని వ్యక్తి వాటిని కలవరపరుస్తాడు.”
క్రొత్తగా నీటి అడుగుకు వెళ్లేవాని మనస్సుకు నచ్చేదేమంటే నానావిధములైన రంగుల అద్భుతమైన అందము.
“నిజంగా రంగురంగుల చేపలు మనస్సును ఆకట్టుకుంటాయి. కాని ఎక్కువ మంది గ్రహించనిది ఏమిటంటే కొన్ని చేపలు, మనము ట్రాఫిక్ లైట్లను వాడునట్లుగానే అవి వాటి రంగులను సూచనలుగా వాడుతాయి. ఉదాహరణకు, ఎర్రని గ్రూపర్ వేటాడున్నప్పుడు తన ప్రాంతంపై దృష్టినిలపడమే కాకుండ, దాని రంగు ఎర్రని ఛాయగా మారుతుంది. గ్రూపర్‌చే వేటాడబడే, క్లౌన్ చేప, అది ఎప్పుడు ‘వేటాడదో’ అని గ్రూపర్ యొక్క రంగును బట్టి చెప్పగలదు. ఈ సురక్షిత వేళల్లో, తన ప్రాంతాన్ని ఆక్రమించుకున్న గ్రూపర్‌ను క్లౌన్ చేప ధైర్యంగా తరుముతుంది.”
నిశ్చయముగా, దేవుని సృష్టి యొక్క అసాధారణమైన అందాన్ని అనేక అసంభావ్యమైన స్థలాల్లో కనుగొనవచ్చును. ఈ అందాన్ని గూర్చిన కొద్దిపాటి అన్వేషణే నా జీవితాన్ని ఉన్నతపరిచింది. అలల అడుగునుండు ప్రదేశమునకు అ చిన్న దర్శనమనేది మన గ్రహము కాపాడే సహజ నిధుల గూర్చి నా మెప్పుదలను హెచ్చించింది.—ఉచిత వ్యాసము. (g94 10/8)
[24వ పేజీలోని చిత్రం]
సింహపు చేప, వేటాడే పెద్దచేపలను గూర్చిన చింతలేకుండ, చుట్టు మెల్లిగా తేలుతుంది. దాని ముళ్లలాంటి రెక్కలకు శక్తివంతమైన విషము కల్గివుండడం వల్ల అవి మరీ దగ్గరకు రాకుండ జాగ్రత్తగా ఉంటాయి
[24వ పేజీలోని చిత్రం]
ఒక పెద్ద గాలిపువ్వు (ఆనెమోన్) స్పర్శకముల మధ్య నుండు క్లౌన్ చేప తన ఇంటికి దూరంగా అరుదుగా వెళుతుంది. తన నివాసమైన గాలిపువ్వును శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది గనుక క్లౌన్ చేప దానినుండి హాని పొందదు
[24వ పేజీలోని చిత్రం]
ఆకుచిలక చేపలు అనేక రంగుల వరసలో వస్తాయి. వెనుకకు ముందుకు ఆడుచుండే వాటి పలుచని ఆకువంటి శరీరాలు, నాకు ఒక ఆకుచిలుకను గుర్తుచేస్తాయి
[24వ పేజీలోని చిత్రం]
ఫికాస్సో చేప, తన సొగసైన చారలతో తేజోవంతమైన పసుపు పచ్చని పెదవులకు రాయు రంగు (లిప్‌స్టిక్) వలే కన్పించింది మరి అది నాకు ఒక ప్రత్యేక చిత్రకారుని యొక్క కళను గుర్తుకు తెచ్చింది
[24వ పేజీలోని చిత్రం]
ఎంపరర్ ఏంజిల్ చేప చర్మంపై అనేక రంగులుగల పొట్టు వుంటుంది మరి అది ఎదుగుతూ ఉన్నప్పుడు దాని రంగు, రూపము మారుతుంది