కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 9/8 పేజీలు 26-27
  • ఒత్తిడిని ఎదుర్కోడానికి మీకేది సహాయపడగలదు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒత్తిడిని ఎదుర్కోడానికి మీకేది సహాయపడగలదు?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహేతుకం కాని కోరికలను విడిచిపెట్టండి
  • లక్ష్యాలను సాధించడంలో కలిగే ఒత్తిడిని నియంత్రించండి
  • మీరు చేయగలిగినవి
  • ఒత్తిడి నుండి ఎలా బయటపడవచ్చు?
    తేజరిల్లు!—2020
  • ప్రయోజనకరమైన ఒత్తిడి, హానికరమైన ఒత్తిడి
    తేజరిల్లు!—1998
  • ఒత్తిడిని ఎదుర్కోవచ్చు!
    తేజరిల్లు!—1998
  • ఒత్తిడి అంటే ఏంటి?
    తేజరిల్లు!—2020
తేజరిల్లు!—1994
g94 9/8 పేజీలు 26-27

బైబిలు ఉద్దేశము

ఒత్తిడిని ఎదుర్కోడానికి మీకేది సహాయపడగలదు?

మీరు ఒత్తిడికి గురయ్యారా? అలాగైతే, మీలాంటివారు చాలామంది ఉన్నారు. ఈ ‘అపాయకరమైన కాలములలో,’ అన్ని వయస్సుల్లోని, అన్ని రకాల ప్రజలు ఒత్తిడిని అనుభవిస్తున్నారు. (2 తిమోతి 3:1) కొందరు నిపుణులు చెప్పేదేమంటే, డాక్టరు దగ్గరికి వచ్చే వారందరిలో సగం కన్నా ఎక్కువ మంది ఒత్తిడి వలన కలిగే సమస్యలున్నందువల్లే వస్తున్నారు.

ఒత్తిడి అనేది తప్పనిసరిగా చెడ్డదేమీ కాదు. సెస్‌ క్లినిక్‌ డైరెక్టరు యీ విధంగా అంటున్నాడు, “నిజానికి, అది మనం జీవించడానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది, లక్ష్యాలను సాధించడానికి శక్తినిస్తుంది. ఒకవేళ మనం దానిని తాళుకొనగల్గితే దానిని అనుభవించగలము.”

మరొకవైపు, ఒత్తిడి వినాశకారిణిగా, నాశనహేతువుగా ఉండగలదు. ఒత్తిడి మీకు సమస్యలను సృష్టిస్తున్నట్లయితే, దాని మాటేమిటి? దాని వినాశకరమైన ఫలితాలను తగ్గించడానికి, బైబిలు జ్ఞానముపై ఆధారపడిన కొన్ని సలహాలు యిక్కడ యివ్వబడ్డాయి.

సహేతుకం కాని కోరికలను విడిచిపెట్టండి

బైబిలు యీ విధంగా చెబుతుంది, “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును.” (సామెతలు 13:12) కోరికలు ఎన్నటికీ తీరనప్పుడు, ఒత్తిడి కృంగదీయగలదు. దాదాపు వాస్తవం కాని పెద్ద కోరికలు మనం పెట్టుకున్నప్పుడు నిశితంగా అదే జరుగుతుంది.

ఉదాహరణకు, సంతోషమనేది వస్తువులను స్వంతం చేసుకోడంపై ఆధారపడి ఉంటుందని ప్రజలు నమ్మేలా ప్రకటనా సాధనాలు మోసం చేస్తున్నాయి. ఒకడు తాను కొనలేని వస్తువులను కోరుకున్నప్పుడు, దాని ఫలితాలు ఒత్తిడి, నిరాశ కాగలవు. కాబట్టి బైబిలు యిలా సలహా యిస్తుంది: “అన్నవస్త్రములు గలవారైయుండి వాటితో తృప్తిపొందియుందము.” (1 తిమోతి 6:8) నిజమే, మీకు స్వంతంగా కారు, యిల్లు, సామాన్లు కావాలనుకున్నా లేకపోవచ్చు. అయినా, మీకున్న దానితో తృప్తి పడండి. వస్తువులను గూర్చిన కోరికను మితంగా ఉంచుకోండి.

మనుష్యుల మీద నిర్హేతుకంగా ఆశలు పెట్టుకోడం కూడా ఒత్తిళ్ళను తేగలదు. ఉదాహరణకు యజమాని లేదా పైవిచారణకర్త తన పర్యవేక్షణ క్రిందవున్న వాళ్ళు యుక్తమైన రీతిలో పనిచేయడాన్ని అపేక్షించవచ్చు. వాళ్ళనుండి పరిపూర్ణతను అపేక్షించడం అవివేకంగా ఉంటుంది. బ్రెజిల్‌లోని కర్మాగార పైవిచారణకర్తయైన కార్లోస్‌ యీ విధంగా చెబుతున్నాడు: “ప్రజలను వాళ్ళున్న రీతిగానే అంగీకరించాలి, వాళ్ళు చేయగలిగే దానికన్నా ఎక్కువగా మీరు అపేక్షిస్తున్నట్లయితే, అది అందరిని అసంతోషపరుస్తూ ఒత్తిడి పెంచుతుంది.”—యిర్మీయా 17:5-8 పోల్చండి.

లక్ష్యాలను సాధించడంలో కలిగే ఒత్తిడిని నియంత్రించండి

ఒత్తిడికి గల మరో కారణాన్నిగూర్చి చెబుతూ, లాటిన్‌ అమెరికన్‌ డెయిలీ పోస్ట్‌ ‘సాధనకు సంబంధించిన, పోటీ స్వభావము హృద్రోగానికి ముఖ్యమైన కారణం,’ అని పేర్కొంటుంది. యువకుడైన అకౌంటెంట్‌ యిలా ఒప్పుకుంటున్నాడు: “ఆఫీసులో ఏ బలహీనతనైనా బయటపెట్టాలంటే నాకు ఎంతో కంగారుగాను, భయంగాను ఉంటుంది. నేను అత్యధికంగా పని చేస్తాను, యితరుల నుండి గుర్తింపును పొందకపోవడం వలన నాకు నిరాశ కలుగుతుంది.”

గుర్తింపు కావాలి, లక్ష్యాలను సాధించాలి అని ప్రయత్నించడాన్ని గూర్చి సొలొమోను యీ విధంగా చెప్పాడు: “కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలి పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది.”—ప్రసంగి 4:4.

ఉద్యోగ స్థానంలో ఉన్నతి, గుర్తింపు విషయాలకొస్తే, ‘వడిగలవారు పరుగులో గెలువరు’ అనేది నిజం. (ప్రసంగి 9:11) ఆఫీసులో పనిచేస్తున్న బ్రెజిల్‌ దేశస్థురాలు యీ విధంగా అంటుంది: “ఒక వ్యక్తికి సామర్థ్యముండవచ్చు, కాని, పరిస్థితులు, పక్షపాతము ప్రమోషన్‌ను ఆటంకపర్చవచ్చు.”—ప్రసంగి 2:21; 10:6 పోల్చండి.

మీ నిరీక్షణలను మితంగా ఉంచండి, మీ పరిమితులను గుర్తించండి. ఉద్యోగస్థానంలో ఎదగడం కోసం మాత్రమే పని చేసే బదులు, అది యిచ్చే సంతోషాన్ని బట్టి పని చేయండి. (ప్రసంగి 2:24) నిజంగా, అభివృద్ధి సాధించాలన్న మనస్సు గల వ్యక్తి జీవితంలోని సంతోషాన్నంతా కోల్పోవడమే కాక, సఫలత కొరకైన తన స్వంత ప్రయత్నాలు కూడా విఫలమయ్యేలా ఒత్తిడి కలుగవచ్చు. డా. అర్నోల్డ్‌ ఫాక్స్‌ యీ విధంగా సలహా యిచ్చాడు: “మీ పనిని మీరు శ్రేష్ఠంగా చేయాలనుకోవడం ప్రశంసించదగిన లక్ష్యమే, కాని ఆ తలంపు మీ జీవితాన్ని నడిపించడానికి అనుమతించవద్దు. మీరు ప్రేమ, నవ్వు, జీవితాస్వాదనం వంటి తలంపులను నిర్లక్ష్యం చేస్తే, లేదా జీవితాన్ని అనుభవించడాన్ని మరిచేంతగా విజయంపైనే మనస్సు నిలుపుతే మీకు మీరే ఒత్తిడి కలుగజేసుకుంటున్నారు.”

మీరు చేయగలిగినవి

దైనందిన జీవితంలోని కష్టాల వలన కలిగే ఒత్తిళ్ళను ఎదుర్కోడానికి మరొక మార్గం, హాస్యభావాన్ని అలవరచుకోవడమే. (ప్రసంగి 3:4) సంతోషకరమైన దృక్పథం కలిగి ఉండడానికి మీరు హాస్యగాడు కానవసరం లేదు. “సంతోషము గల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.”—సామెతలు 17:22.

మరుసటి రోజుకు పనిని మిగిల్చే అలవాటు మీకుందా? చివరికి, ఆలస్యంగా పని చేయడం దానిని తగ్గించే బదులు, ఒత్తిడిని పెంచేస్తుంది. బైబిలిలా సలహా యిస్తుంది: ‘మాంద్యులు కావద్దు.’ (రోమీయులు 12:11) మీరు చేయవలసిన పనులను గూర్చిన పట్టికను వ్రాతపూర్వకంగా, లేదా మనస్సులో తయారు చేసుకోండి. (సామెతలు 21:5) తర్వాత ఏ పనులు మొదట చేయాలో తీర్మానించుకోండి,—వాటిని చేయడం మొదలు పెట్టండి.

మీరు బాగా ప్రయత్నం చేసినప్పటికీ, మీరు యింకా కలత చెందుతున్నట్లయితే లేదా ఒత్తిడిని అనుభవిస్తున్నట్లయితే అప్పటి మాటేమిటి? మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోడానికి కలిసికట్టుగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండవచ్చు. పాత తప్పులను గూర్చే తలుస్తూ ఉండవద్దు. అది ప్రస్తుతమున్న ఒత్తిడిని అధికం చేస్తుంది. ఒక 19వ శతాబ్దపు మనస్తత్వవేత్త యిలా రాశాడు: “గతాన్ని గూర్చి తలంచినప్పుడే జీవితమంటే ఏమిటో అర్థం చేసుకోగలం; కాని, భవిష్యత్తును మనస్సులో ఉంచుకొని జీవించాలి.” పరాజయాల నుండి నేర్చుకోగల్గినప్పటికీ, ప్రస్తుత చర్యలు మన భవిష్యత్తును రూపు దిద్దుతాయి.

రాజైన దావీదు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, ఒత్తిడికి శ్రేష్ఠమైన పరిష్కారాన్ని చూపించాడు: “నా హృదయ వేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.” (కీర్తన 25:17) అవును దావీదు యీ వ్యాకులతల నుండి విడుదల పొందడానికి యెహోవా తట్టు చూశాడు. మీరు దేవుని వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి సమయం తీసుకున్నట్లయితే, మీరు కూడా అలాగే దేవునికి సన్నిహితులుగా ఉన్నట్లు భావించగలరు. మీరు దేవుని సంకల్పాలను గుణగ్రహిస్తుండగా, ఆయన కోరేవాటిని మీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచడానికి మీరు పురికొల్పబడతారు, అది మిమ్మల్ని అనవసరమైన అనేక వ్యాకులతల నుండి విడిపిస్తుంది. (మత్తయి 6:31, 33) రోజుకొక్కసారైనా ధ్యానించడం నేర్చుకోండి. రేపటి వ్యాకులతలను గూర్చి నేడు తలంచడం ఎందుకు? యేసు యీ విధంగా చెప్పాడు: “రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటి కీడు ఆ నాటికి చాలును.”—మత్తయి 6:34. (g94 9/8)

[27వ పేజీలోని చిత్రం]

“ఒక వ్యక్తికి సామర్థ్యముండవచ్చు, కాని పరిస్థితులు, పక్షపాతము, ప్రమోషన్‌ను ఆటంకపర్చవచ్చు”

[Picture Credit Line on page 26]

The Metropolitan Museum of Art, Funds given by the Josephine Bay Paul and C. Michael Paul Foundation, Inc., and the Charles Ulrick and Josephine Bay Foundation, Inc., and the Fletcher Fund, 1967.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి