కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g20 No. 1 పేజీలు 5-7
  • ఒత్తిడి అంటే ఏంటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒత్తిడి అంటే ఏంటి?
  • తేజరిల్లు!—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒత్తిడి వల్ల మంచి లేదా చెడు జరగవచ్చు
  • ప్రయోజనకరమైన ఒత్తిడి, హానికరమైన ఒత్తిడి
    తేజరిల్లు!—1998
  • విషయసూచిక
    తేజరిల్లు!—2020
  • ఒత్తిడి—“స్లో పాయిజన్‌”
    తేజరిల్లు!—1998
  • మీరు ఒత్తిడికి గురౌతున్నారా?
    తేజరిల్లు!—2020
మరిన్ని
తేజరిల్లు!—2020
g20 No. 1 పేజీలు 5-7
ఒక నగరంలో, ఒక వ్యాపారస్థుడు పరిగెడుతూ ఆఫీసు మెట్లు ఎక్కుతున్నాడు.

ఒత్తిడి నుండి బయటపడండి

ఒత్తిడి అంటే ఏంటి?

ఏదైనా కష్టమైన పరిస్థితిలో మీ శరీరం స్పందించే తీరును ఒత్తిడి అంటారు. ఆ సమయంలో మీ శరీర భాగాలన్నిటిలో హార్మోన్‌లు విడుదలయ్యేలా మెదడు సంకేతాలు పంపిస్తుంది. ఆ హార్మోన్ల వల్ల మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, బి.పి పెరుగుతుంది లేదా తగ్గుతుంది, మీరు వేగంగా ఊపిరి పీల్చుకుంటారు, మీ కండరాలు బిగుసుకుపోతాయి. లోపల ఏం జరుగుతుందో మీకు పూర్తిగా తెలిసేలోపే మీ శరీరం చర్య తీసుకోవడానికి సిద్ధమౌతుంది. ఆ కష్టమైన పరిస్థితి నుండి బయటపడ్డాక పైన చెప్పిన లక్షణాలన్నీ తగ్గిపోయి, శరీరం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.

ఒత్తిడి వల్ల మంచి లేదా చెడు జరగవచ్చు

కష్టమైన లేదా ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేలా మీ శరీరంలో కలిగే సహజ స్పందనే ఒత్తిడి. ఈ స్పందన మీ మెదడులో మొదలౌతుంది. కొన్నిసార్లు ఒత్తిడి వల్ల మంచి జరుగుతుంది. ఉదాహరణకు మీరు త్వరగా పని చేయగలుగుతారు, వెంటనే స్పందించగలుగుతారు. కొంత ఒత్తిడి వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు, లేదా ఏదైనా పనిని ఇంకా బాగా చేయగలుగుతారు. అంటే పరీక్షలు బాగా రాసేలా, జాబ్‌ ఇంటర్వ్యూ చక్కగా ఇచ్చేలా, ఆటలు బాగా ఆడేలా అది సహాయపడవచ్చు.

అయితే, ఎక్కువకాలంగా లేదా తీవ్రంగా ఉండే ఒత్తిడి వల్ల మీకు చాలా హాని జరుగుతుంది. ఒత్తిడి కలిగినప్పుడు మీ శరీరంలో జరిగే మార్పులు అలానే ఉండిపోతే, లేదా పదేపదే అవి చోటుచేసుకుంటుంటే, మీలో శారీరక, భావోద్వేగ, మానసిక సమస్యలు మొదలౌతాయి. మీ ప్రవర్తన, ఇతరులతో మీరు వ్యవహరించే తీరు కూడా మారిపోవచ్చు. ఎక్కువకాలంగా ఒత్తిడికి గురౌతున్నవాళ్లు మద్యం అతిగా తాగడం, డ్రగ్స్‌ తీసుకోవడం, కొన్నిరకాల మందులకు అలవాటుపడడం, అతిగా తినడం, పొగతాగడం మొదలుపెట్టవచ్చు, అలాగే వేరే చెడ్డ అలవాట్లకు బానిసలు అవ్వవచ్చు. చివరికి అది డిప్రెషన్‌కు, విపరీతమైన అలసటకు, లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు దారితీయవచ్చు.

ఒత్తిడి అందరి మీద ఒకేలా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ఒత్తిడి వల్ల రకరకాల జబ్బులు రావచ్చు. శరీరంలో ఉన్న దాదాపు ప్రతీ భాగం మీద అది ప్రభావం చూపించవచ్చు.

ఒత్తిడి వల్ల మీ శరీరంలో వచ్చే మార్పులు

నాడీ వ్యవస్థ.

ఒత్తిడికి గురైన ఒక వ్యక్తి నుదురు మీద చెయ్యి పెట్టుకొని ఉన్నాడు, ఒత్తిడి ఆయన శరీరంపై రకరకాలుగా ప్రభావం చూపిస్తోంది.

మీ నాడీ వ్యవస్థ అడ్రినలిన్‌, కార్టిసాల్‌ వంటి హార్మోన్‌లను విడుదల చేస్తుంది. అవి మీ గుండె కొట్టుకునే వేగాన్ని, బి.పి.ని, రక్తంలో ఉన్న గ్లూకోస్‌ మోతాదును పెంచుతాయి. దాంతో ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మీరు త్వరగా స్పందించగలుగుతారు. కానీ, ఎక్కువ ఒత్తిడి వల్ల . . .

  • చిరాకు, ఆందోళన, డిప్రెషన్‌, తలనొప్పి, నిద్రలేమి కలగవచ్చు

కండర-అస్థిపంజర వ్యవస్థ.

మీ కండరాలు బిగుసుకున్నప్పుడు దెబ్బ తగలకుండా ఉంటుంది. కానీ, ఎక్కువ ఒత్తిడి వల్ల . . .

  • ఒళ్లు పులిసిపోవడం, నొప్పులు, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు రావచ్చు

శ్వాస వ్యవస్థ.

మరింత ఆక్సిజన్‌ కోసం మీరు వేగంగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ, ఎక్కువ ఒత్తిడి వల్ల . . .

  • వేగంగా ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి అందకపోవడం జరగవచ్చు; అలాగే కొంతమందికి ప్యానిక్‌ అటాక్స్‌ రావచ్చు అంటే గుండెదడ పెరగడం, గాబరా పడడం, చెమటలు పట్టడం వంటివి జరగవచ్చు.

రక్తప్రసరణ వ్యవస్థ.

శరీరమంతటికీ రక్తాన్ని సరఫరా చేయడానికి మీ గుండె మరింత వేగంగా, తీవ్రంగా కొట్టుకుంటుంది. రక్తం ఎక్కువ అవసరమయ్యే శరీర భాగాలకు అంటే కండరాల వంటివాటికి, రక్తాన్ని పంపించడానికి కొన్ని రక్తనాళాలు పెద్దగా అవుతాయి, కొన్ని రక్తనాళాలు చిన్నగా అవుతాయి. కానీ, ఎక్కువ ఒత్తిడి వల్ల . . .

  • హై బి.పి., గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావచ్చు

వినాళ గ్రంథుల వ్యవస్థ (ఎండోక్రైన్‌ సిస్టమ్‌).

మీలో ఉన్న గ్రంథులు అడ్రినలిన్‌, కార్టిసాల్‌ అనే హార్మోన్‌లను విడుదల చేస్తాయి. ఒత్తిడి కలిగినప్పుడు శరీరం సరిగ్గా స్పందించేలా అవి సహాయం చేస్తాయి. మీకు మరింత శక్తిని ఇచ్చేలా కాలేయం మీ రక్తంలో ఉన్న గ్లూకోస్‌ మోతాదును పెంచుతుంది. కానీ, ఎక్కువ ఒత్తిడి వల్ల . . .

  • షుగర్‌ వ్యాధి రావడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, జబ్బులు ఎక్కువ అవ్వడం, అప్పుడే సంతోషంగా అప్పుడే బాధగా అనిపించడం (mood swings), బరువు పెరగడం వంటివి జరగవచ్చు

జీర్ణ వ్యవస్థ.

ఆహారం జీర్ణమవ్వడానికి మీ శరీరం పనిచేసే విధానం దెబ్బతింటుంది. ఎక్కువ ఒత్తిడి వల్ల . . .

  • కడుపులో తిప్పడం, వాంతులు, విరోచనాలు, మలబద్ధకం వంటివి కలగవచ్చు

పునరుత్పత్తి వ్యవస్థ.

ఒత్తిడి వల్ల లైంగిక కోరికలు తగ్గిపోవచ్చు, లైంగిక సంబంధాల్లో పాల్గొనడం కష్టం కావచ్చు. ఎక్కువ ఒత్తిడి వల్ల . . .

  • లైంగిక బలహీనత కలగవచ్చు, ఋతుస్రావం సమయానికి రాకపోవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి