కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 9/8 పేజీ 25
  • మీరు గురక పెడతారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు గురక పెడతారా?
  • తేజరిల్లు!—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ శరీరానికి నిద్ర ఎందుకవసరం
    తేజరిల్లు!—1995
  • నా రూమ్‌మేట్‌తో కలిసి ఉండడం ఎందుకంత కష్టం?
    తేజరిల్లు!—2002
  • స్వర నాణ్యత
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • నేను నా రూమ్‌మేట్‌తో స్నేహపూర్వకంగా ఎలా ఉండగలను?
    తేజరిల్లు!—2002
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 9/8 పేజీ 25

మీరు గురక పెడతారా?

మీరు ఎక్కువగా గురక పెడతారా? కొంతమంది గురక పెడతారు కానీ తామలా గురక పెడతామని వారికి తెలియదు. కాబట్టి, తాము నిద్రలేచేటప్పుడు బలహీనంగా, అలసిపోయినట్లుగా ఎందుకు భావిస్తారో వాళ్లకు తెలియదు. అది స్లీప్‌ ఆప్నియా అని పిలువబడుతుంది. ఈ విధమైన యిబ్బంది కలిగిన వ్యక్తి నిద్రిస్తుంటే, శ్వాస నాళాలను తెరిచి ఉంచే గొంతు కండరాలు ఎంతగా విశ్రమిస్తాయంటే, గాలి వెళ్లే ద్వారాలను అవి ముసేస్తాయి. ఆ వ్యక్తి ఒక నిమిషంపాటు ఊపిరాడక గాలి కొరకు అవస్తపడి మేలుకుంటాడు. ఆప్నియాతో బాధపడే చాలామందికి తమ నిద్ర భంగమౌతుందని కూడా తెలియదు. గురక వలన మేలుకునే వారి రూమ్‌మేట్‌ ద్వారానే వారికీ విషయం తెలుస్తుంది. కారు మరియు ఉద్యోగంలో దుర్ఘటనలకు ఆప్నియా కారణమౌతుందని మరి యింద్రియ దౌర్బల్యానికి, గుండె పోటుకు మూలం కావచ్చునని నిపుణులు విశ్వసిస్తున్నారు.

దీనికి పరిష్కారముందా? కంప్లీట్‌ హోమ్‌ మెడికల్‌ గైడ్‌ (కొలంబియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌) యిలా సలహా యిస్తుంది: “స్త్రీలకంటే పురుషుల్లో 20 రెట్లు ఎక్కువగా సంభవిస్తుంటుంది. సగంకంటే ఎక్కువమంది బాధితులు స్థూల కాయులు, వారికి గాలి సహజంగా వెళ్లడానికి అది ఎక్కువ అడ్డంకును కలిగిస్తుంది కాబట్టి, బరువు తగ్గించడం చికిత్సలో ప్రాముఖ్యమైన భాగం.” విపరీతమైన కేసుల్లో, గాలి ప్రవాహానికి అడ్డంగా ఉండకుండా తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకోడం మంచిదని కొందరు సలహా యిస్తున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి