కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 4/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రభుత్వంపై అపనమ్మకం
  • ప్లేసిబోల శక్తి
  • ఒకన్ని ఆరోగ్యంగా ఉంచటానికి ప్రోత్సాహకరమైన అనుభవాలు సహాయపడతాయి
  • వాన దేవుళ్లు నిరాశ కల్గించారు
  • రాజీ పై రాజీ
  • బ్రిటన్‌లో కనుగొనబడిన రోమన్ల సంపద
  • ప్రపంచ ఆరోగ్య నివేదిక
  • అమెరికాలో పొగత్రాగటానికి సంబంధించిన మరణాలు తగ్గుతున్నాయి
  • సంచార ఆసుపత్రి
  • ఆగే సూచనే లేదు
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1992
  • ప్రపంచ ఆరోగ్య పరిస్థితి—పెరుగుతున్న అగాధం
    తేజరిల్లు!—1995
  • సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?
    తేజరిల్లు!—1996
  • పిల్లలెదుర్కొంటున్న సంక్షోభం
    తేజరిల్లు!—1993
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 4/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

ప్రభుత్వంపై అపనమ్మకం

“ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు,” అని దివాషింగ్టన్‌ పోస్ట్‌ చెబుతూ, యింకనూ యిలా అన్నది, “ప్రతిచోట ప్రభుత్వం అన్నది ఒక రోత పదం అయ్యింది.” ఇటీవలి సంవత్సరాల్లో ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్న అనేక సేకరణలను గురించి వ్యాఖ్యానిస్తూ ఆ వార్తాపత్రిక యిలా నొక్కిచెప్పింది: “కెనడా నుండి జపాన్‌ వరకు అలాగే ఆ మధ్య ప్రాంతాల్లోని వారు, తమ దేశ ప్రభుత్వం నమ్మకూడనిది అని, తమ దేశ ఆర్థిక వ్యవస్థ ఇంచుమించు నాశనం అయ్యిందని మరి పరిస్థితులు క్షీణిస్తాయే తప్ప మెరుగుపడవని, కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగించే సంఖ్యలో ప్రజలు ఎన్నికల సిబ్బందికి చెబుతున్నారు. ఉదాహరణకు, ఫ్రాన్స్‌లో, వోటువేసిన వారిలో 60 శాతం మంది భవిష్యత్తులో పరిస్థితులు క్షీణిస్తాయనే భావించారు, మరి ఇంచుమించు అంతేమంది దేశం పరిపాలించబడుతున్న పద్ధతి విషయమై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రం గతంలో ఐదు లేక పది సంవత్సరాలకు పూర్వం పని చేసినంత మంచిగా పని చేయటం లేదని ఇటలీలో 75 శాతం మంది భావించారు. తమ స్వంతతరం కంటే తరువాతి తరం క్షీణించిన ఆర్థిక పరిస్థితిలో ఉంటుందని కెనడాలోని సగం కంటే ఎక్కువమంది భావించారు. (g94 3/22)

ప్లేసిబోల శక్తి

వాస్తవమైన వైద్యపర విలువలేని వైద్యమైన ప్లేసిబో (ఉపశమనం కొరకు యిచ్చే మందు), ఇవ్వబడినప్పుడు మూడింట ఒక వంతుమంది రోగులు కొద్దిగా కోలుకుంటున్నారని వైద్య పరిశోధకులు చాలా కాలం నుండి నమ్ముతున్నారు. అయితే, ప్లేసిబోలు ఇంకా ఎక్కువ శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉండగలవని ఒక క్రొత్త అధ్యయనం తెలియజేసింది. లా జొల్లా, కాలిఫోర్నియా, అమెరికాలోని వైజ్ఞానికులు, అవి వైద్య పరంగా విలువలేనివని ఆ తరువాత తేలిన కొన్ని క్రొత్త, పరిశోధనాత్మక చికిత్సలు ఇవ్వబడిన 7,000 మంది రోగులపై అధ్యయనం జరిపారని ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఈమధ్యే నివేదించింది. ఈ చికిత్సకు ప్రతిక్రియగా మూడింట రెండు వంతుల మంది రోగులు, కనీసం తాత్కాలికంగానైనా బాగుపడ్డారని ఆ అధ్యయనాలు చూపించాయి. ఈ ప్లేసిబోల ప్రభావం, కొన్ని సందర్భాల్లో, వాస్తవంగా జీవశాస్త్రీయంగా కోలుకోవటం జరిగిననూ, అది కొన్నిసార్లు తనకు నయం అయ్యిందని చెప్పటం వలన వైద్యున్ని ప్రీతిపరచాలనే రోగి యొక్క స్వంత కోరికను అది ప్రతిబింబిస్తుందని వైజ్ఞానికులు హెచ్చరిస్తున్నారు. కావున, కొందరు పరిశోధకులు క్రొత్త మందులను నిశితంగా పరీక్షించవలసిందని ఈ అధ్యయనాన్ని బట్టి సూచిస్తున్నారు. (g94 3/22)

ఒకన్ని ఆరోగ్యంగా ఉంచటానికి ప్రోత్సాహకరమైన అనుభవాలు సహాయపడతాయి

“నీరసింపజేసే ఒత్తిడి మరియు భావోద్రేక సమస్యలు శరీర ఉత్సాహాన్ని తగ్గిస్తే, ఆనందం మరియు సంతోషం రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపర్చి, వ్యాధి నిరోధక శక్తిని బలపరుస్తాయి.” రోగనిరోధక వ్యవస్థపై మానసిక స్థితి యొక్క ప్రభావానికి సంబంధించిన అధ్యయనం యొక్క క్రొత్త విజ్ఞానంచే కూర్చబడిన వాస్తవాలను జర్మన్‌ వార్తాపత్రికైన నసావుస్‌చే నోయి ప్రెసె అలా సంక్షిప్తంగా చెప్పింది. పని స్థలం లేక గృహంలోని ప్రతికూల ప్రభావాలు శరీర నిరోధక శక్తిని క్షీణింపజేస్తాయి. ఇంకోవైపు, ఒక అధ్యాపకుడు మరియు సూక్ష్మజీవ శాస్త్రజ్ఞుడునైన డా. ఎంటన్‌ మెర్‌ ప్రకారం, అనుకూల భావోద్రేకాలు మరియు అనుభవాలు బలపరిచే ప్రభావాన్ని కలిగి ఉండగలవు. ఆయన కొన్ని ఉదాహరణలను సూచించాడు: “విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, నమ్మకము, భద్రత, సంభాషణ, జీవితంలోని అనుకూల ప్రేరణ, వినోదం—మరియు జీవించాలని, ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్ష.” (g94 3/22)

వాన దేవుళ్లు నిరాశ కల్గించారు

తీవ్రమైన క్షామం ఉన్నందుకు, ఆగ్నేయ ఇండియాలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వర్షాన్ని రప్పించటానికి ఒక అస్వాభావికమైన ఎత్తును వేయటానికి ఉపక్రమించింది. ఇండియా టుడే పత్రిక ప్రకారం, ఆ రాష్ట్ర ప్రభుత్వం “వాన దేవుళ్లను సంతుష్టిపరచేందుకు ప్రాచీన వేద సంబంధ ఆచారాలను” చేయటానికి ఆర్థిక సహాయాన్ని అందించింది. రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి యిలా తర్కించాడు: “దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు.” ఎన్నుకొనబడిన 50 దేవాలయాలకు చెందిన పూజారులు 11 దినాలు పూజలు చేశారు. దాని ఫలితం? ఇండియా టుడే యిలా నివేదిస్తుంది: “దేవుళ్లు సంతుష్టి చెందలేదన్నది స్పష్టం. . . . మతం విఫలం అయ్యింది గనుక, ప్రభుత్వం తన వైజ్ఞానిక పద్ధతిని అనుసరించటానికి నిర్ణయించుకుంది. అది మేఘాలలోనికి రసాయనాలను జల్లే ప్రయోగం ద్వారా కృత్రిమ వర్షాలను సృష్టించటానికి చర్యలను గైకొనింది. (g94 3/22)

రాజీ పై రాజీ

అమెరికాలోని లూథరన్లు అలాగే బ్రిటన్‌లోని మెథడిస్టులు కూడ ఈమధ్యే సలింగ సంయోగం వైపు తమ అవధానాన్ని మళ్లించారు. బ్రిటన్‌లో, మెథడిస్టుల సమావేశం ఒక అనిశ్చిత నిర్ణయానికి వచ్చింది. సలింగ సంయోగులైన స్త్రీ, పురుషులను మతగురువులుగా నియమించకుండా ఉండటానికి వారు తీర్మానించారు, అయితే, అదే సమయంలో, చర్చి “లెస్బియనులు మరియు సలింగ సంయోగుల పాల్గొనటాన్ని, పరిచర్యను గుర్తిస్తుంది, ధ్రువపరుస్తుంది మరియు ప్రస్తుతిస్తుంది” అని వారు ప్రకటించారు. అమెరికాలో, లూథరన్‌ చర్చీ యొక్క ప్రత్యేక తాత్కాలిక సైనికదళం ఒక 21 పేజీల నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక చర్చి యొక్క 19,000 మంది మతగురువులకు వారి ప్రతిస్పందన కొరకు పంపబడటానికి రూపొందించబడింది. చర్చికి సంబంధించిన వార్తావిభాగం తెల్పిన ప్రకారం, బైబిలు సలింగ సంయోగ కలయికలను ఆమోదిస్తుందని ఆ నివేదిక నొక్కి చెబుతుంది. హస్తప్రయోగం “మామూలుగా సరైనదేనని మరి ఆరోగ్యకరమైనదని” కూడ ఆ నివేదిక చెబుతోంది. అలా ఉద్ఘాటించి నిశ్చయంగా చెప్పటంలో ఆ నివేదిక ఈ విషయాల్లో బైబిలు కలిగి ఉన్న స్థానాన్ని వ్యతిరేకిస్తుంది.—రోమీయులు 1:26, 27; 1 కొరింథీయులు 6:9, 10; కొలొస్సయులు 3:6, 7. (g94 3/22)

బ్రిటన్‌లో కనుగొనబడిన రోమన్ల సంపద

ఇంగ్లాండ్‌, సఫోల్క్‌లోని ఒక పొలంలో 14,780 బంగారు, వెండి, మరియు కంచు నాణాలు, అలాగే 90 సెంటీమీటర్ల బంగారు గొలుసులు, 15 బంగారు కడియాలు, దాదాపు 100 వెండి చెమ్‌చాలు మున్నగు విస్తారమైన సంపద వెలికి తీయబడింది. ఈ సంపదంతా కూడ ఒక ఉద్యోగ విరమణైన తోటమాలి పోగొట్టుకున్న తన సుత్తి కొరకు మెటల్‌ డిటెక్టర్‌ను ఉపయోగించి వెదుకుతున్నప్పుడు కనుగొనబడింది. ఆ సంపద యొక్క విలువ కనీసం 1.5 కోట్ల డాలర్లు ఉంటుందని ఒక నిపుణుడు అంచనా వేశాడు. ఆ ధనం బ్రిటీష్‌ ప్రభుత్వం యొక్క సంపదని ఒక న్యాయసభ నిర్ణయించింది, అంటే దాని అర్థం, ఆ సంపదను కనుగొన్న 70 సంవత్సరాల ఎరిక్‌ లేవిస్‌, ఆ సంపద యొక్క మార్కెట్‌ విలువకు సరితూగేంత ధనాన్ని అనుగ్రహ చెల్లింపుగా పొందుతాడని దాని అర్థం. ఆ ధనం బ్రిటీష్‌ సంగ్రహశాలలో బహిరంగ ప్రదర్శన కొరకు ఉంచబడిందని గార్డియన్‌ వీక్లీ నివేదిస్తుంది. (g94 4/8)

ప్రపంచ ఆరోగ్య నివేదిక

వ్యాధికి విరుద్ధంగా ప్రపంచమంతటా జరుగుతున్న పోరాటానికి ఒక నిరాధార రూపాన్ని సూచిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రపంచ ఆరోగ్య పరిస్థితిపై ఎనిమిదవ నివేదికలో యిలా చెప్పింది: “ఉష్ణమండల వ్యాధులు విజృంభిస్తున్నాయి, ఈ శతాబ్దంలోనే మొదటిసారిగా కలరా అమెరికా వరకూ పాకింది, యెల్లో ఫీవర్‌ మరియు డెంజు మహమ్మారులు మరీ ఎక్కువ సంఖ్యలో ప్రజలకు సోకుతున్నాయి, మరి మలేరియా విషయమైతే మరీ క్షీణిస్తుంది . . . ఎయిడ్స్‌ వ్యాధి విశ్వమంతటా పాకుతుంది . . . ఊపిరితిత్తుల క్షయ ఎక్కువ అవుతోంది . . . అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, క్యాన్సర్‌ గలవారి సంఖ్య మొదటిసారిగా అభివృద్ధి చెందిన దేశాలలోని సంఖ్యను అధిగమించింది. మధుమేహవ్యాధి ప్రతి చోటా పెరిగిపోతోంది.” గత 1985 నుండి 90 వరకు గడిచిన కాలాలను గమనిస్తూ, ప్రతి సంవత్సరం సంభవించే 5 కోట్ల మరణాల్లో 4 కోట్ల 65 లక్షల మరణాలు అనారోగ్యం మరియు వ్యాధుల వలనేనని మరి ప్రతి సంవత్సరం జన్మిస్తున్న 14 కోట్ల శిశువుల్లో దాదాపు 40 లక్షలమంది జన్మించిన కొన్ని గంటల్లోనే మరణిస్తున్నారని ఆ నివేదిక చూపిస్తుంది. ప్రతి సంవత్సరం డెబ్భై లక్షల క్రొత్త క్యాన్సర్‌ కేసులు సంభవిస్తున్నాయి, మరి ప్రతి సంవత్సరం పది లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు ఎయిడ్స్‌ కల్గించే హెచ్‌ఐవికి గురౌతున్నారు. మరి మంచి విషయాలేమంటే, మశూచి, కోరింత దగ్గు వంటి చిన్ననాటి వ్యాధులు తగ్గుతున్నాయి, మరి జీవన ప్రతీక్ష ఒకటి నుండి రెండు సంవత్సరాల మధ్యకు పెరిగింది. విశ్వ వ్యాప్తంగా ఇప్పుడు సగటు వయస్సు 65 సంవత్సరాలు. (g94 4/8)

అమెరికాలో పొగత్రాగటానికి సంబంధించిన మరణాలు తగ్గుతున్నాయి

గత 1985లో నివేదికలను భద్రపరచటం మొదలు పెట్టినప్పటి నుండి—పొగాకు సంబంధిత మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అమెరికా నందలి సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్‌షన్‌ (సీడిసీ) ప్రకటించింది. ప్రతి సంవత్సరం సిగరెట్టు త్రాగటం వలన మరణించే అమెరికా వాసుల సంఖ్య 1990లో 4,19,000లు ఉండగా ఇప్పుడది 15,000కు పడిపోయింది. పొగవలన వచ్చే హృద్రోగాలు తక్కువ అవ్వడమే ముఖ్య కారణం. మరి 1965లో 42.4 శాతం మంది అమెరికాలోని పెద్ద వయస్కులు పొగ త్రాగేవారు. అది 1990 నాటికల్లా 25.5 శాతం అయ్యింది. అయిననూ, నివారించగల వ్యాధులకు, మరణాలకు పొగ త్రాగటం ఇంకా ఒక ప్రధాన కారణంగానే ఉంది మరి ప్రతి సంవత్సరం అది 2,000 కోట్ల డాలర్ల ఆరోగ్య సంబంధిత ఖర్చులను కలిగిస్తుంది. పొగత్రాగటానికి విరుద్ధంగా వాణిజ్య ప్రకటనలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10 లక్షల డాలర్లు ఖర్చుపెడుతుంటే, పొగాకు పరిశ్రమలు పొగత్రాగటాన్ని ప్రోత్సహిస్తూ చేస్తున్న ప్రకటనలకు 400 కోట్లను వ్యయం చేస్తున్నాయి. పొగత్రాగటం సగటున పొగ త్రాగే ప్రతివానికి ఐదు సంవత్సరాలు చొప్పున నష్టాన్ని కలిగిస్తుంది, అని సీడిసీ నివేదించింది. (g94 4/8)

సంచార ఆసుపత్రి

ఇండియాలోని రోగులకు ఒక అస్వాభావికమైన ఆసుపత్రి సహాయం చేస్తూ ఉండినది: లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ అని పిలువబడే ఒక రైలు. స్వచ్ఛంద వైద్యులచేత నడుపబడుతూ, ఆ రైలు “చక్రాలపైన నడుపబడుతున్న ఒక వాస్తవిక ఆసుపత్రి” అని ఏసియావీక్‌ పత్రిక నివేదిస్తుంది. అది గ్రామాలకు వెళ్లి అక్కడ ఒక నెల నుండి నెలన్నర వరకూ ఆగుతుంది, మరి అది ఇంకొక గ్రామానికి తరలి వెళ్లక ముందు సర్జన్లు కనీసం 600 మంది రోగులకు చికిత్స చేయడానికి తగిన సమయాన్ని ఇస్తుంది. ఇంపాక్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ అని పిలువబడే ఒక స్వచ్ఛంద గుంపుచేత నడుపబడుతూ, ఇది ఇంతవరకు 4,00,000 మంది ప్రజలకు సహాయాన్ని అందించింది. ఇంపాక్ట్‌ ఇండియాకు చెందిన జెల్మా లాజరస్‌ యిలా నివేదిస్తుంది: “ఈ యోజన చాలా త్వరగా ఎంతో పెద్దది అయ్యింది. ఇటువంటి సంచార ఆసుపత్రి వ్యవస్థలను నెలకొల్పమని ఇతర దేశాలు కూడ ఇప్పుడు మమ్మల్ని కోరుతున్నాయి.”

(g94 3/22)

ఆగే సూచనే లేదు

గత 1989లో, ఏడు సంవత్సరాల బ్రిటీష్‌ బాలుడైన క్రెయగ్‌ షెర్‌గోల్డ్‌కు మెదడులో గ్రంథి ఉందని మరి బ్రతకడను విషయం తెలిసింది. ఎక్కువ గెట్‌-వెల్‌ కార్డులను అందుకొనటంలో ప్రపంచ రికార్డు బ్రద్దలు చేయాలన్నది అతని కోరిక. ప్రసార సాధనాలు మరియు అట్లాంటాలోని మరణాంతకమైన వ్యాధి ఉన్న చిన్న పిల్లల కోరికలను తీర్చటానికి కృషిచేసే సంస్థ అయిన చిల్డ్రెన్స్‌ విష్‌ ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ చేత ప్రచారం చేయబడి ఆ రికార్డు నెలల్లోనే అధిగమింపబడింది. మొదటి సంవత్సరంలో 1 కోటి 60 లక్షల గ్రీటింగ్‌ కార్డులు అందుకొనబడ్డాయి, మరి 1992 నాటికల్లా 3 కోట్ల 30 లక్షలు వచ్చాయి. రెండు సంవత్సరాల పూర్వమే ఇక కార్డులను పంపవద్దను విజ్ఞప్తులను చేసిననూ, ఇప్పటికి కూడ అవి వారానికి 3,00,000 కార్డుల చొప్పున వస్తూనే ఉన్నాయి. అవి 6 కోట్లు అందినప్పుడే లెక్కించటం ఆపివేశారు. “ఇంకా తెరవబడని టపా పైకప్పు వరకు ఉన్న ఒక 900 చదరపు మీటర్ల గిడ్డంగి మాకు ఉంది,” అని ఫౌండేషన్‌ అధ్యక్షురాలైన ఆర్థర్‌ స్టేయిన్‌ చెబుతున్నారు. ఒక హితకారి ద్వారా క్రెయగ్‌కు 1991లో శస్త్రచికిత్స చేయబడింది, మరి 90 శాతం గ్రంథి తీసివేయబడింది. (g94 3/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి