యెహోవాసాక్షులు మరియు వైద్య సిబ్బంది సహకరిస్తున్నారు
రక్త మార్పిడి అనేది రక్తాన్ని లేఖన విరుద్ధంగా ఉపయోగించడమని యెహోవాసాక్షులు 1945లో గ్రహించారు. ఆ నిషేధం మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడింది, మరి అది క్రైస్తవగ్రీకు లేఖనాల్లోకి కూడ తీసుకురాబడింది. అపొస్తలుల కార్యములు 15:28, 29 యిలా చెబుతుంది: “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగునుగాక.” (లేవీయకాండము 17:10-12 చూడండి.) సాక్షులు రక్తమార్పిడిని నిరాకరించడం వైద్య రంగంలోని కొంతమంది సిబ్బందితో గొడవలకు దారితీసింది.
ఆసుపత్రి అనుసంధాన కమిటీలు
సాక్షులు రక్తం తీసుకోడానికి నిరాకరించడంలో మద్దతునివ్వడానికి, వైద్యులకు, ఆసుపత్రులకు ఉన్న దురభిప్రాయాన్ని తొలగించడానికి, సాక్షి రోగులకు వైద్య సంస్థలకు మధ్య మంచి సహాయకరమైన స్ఫూర్తిని పెంపొందించడానికి, యెహోవాసాక్షుల పరిపాలక సభచే ఆసుపత్రి అనుసంధాన కమిటీలు నెలకొల్పబడ్డాయి. వైద్యులు మరియు ఆసుపత్రులతో అర్థవంతంగా ప్రవర్తించడానికి తర్ఫీదు ఇవ్వబడిన పరిపక్వత చెందిన సాక్షులైన ఈ కమిటీలు గొడవలను తొలగించారు, మరి వారు మంచి సహాయ స్వభావాన్ని నెలకొల్పుతున్నారు. మొదట 1979లో కొద్దిమంది మాత్రమే ఉన్నారు, వారి సంఖ్య ఇప్పుడు 65 దేశాల్లో 850 మందికి పెరిగింది. అంటే వీరి సహాయకరమైన సేవ ఇప్పుడు 35 లక్షలమంది యెహోవాసాక్షులకు అందుబాటులో ఉందని అర్థము.
యెహోవాసాక్షుల సంఘాల్లోని 4,500 కంటె ఎక్కువమంది పెద్దలకు వైద్యులతో మాట్లాడటానికి తర్ఫీదు నిచ్చారు. రక్త మార్పిళ్ల జోలికి వెళ్లకుండా ఏమి చేయబడగలదో ఆ విషయాలను వైద్య ప్రచురణల్లోనే కనుగొనడానికి వారు వైద్యులకు సహాయం చేస్తారు. కొంత ప్రత్యేక అవసరం ఉన్న సందర్భాల్లో, వైద్యులు సాక్షులకు రక్తం ఉపయోగించకుండా వైద్యం చేయడానికి సరాసరి ఆసుపత్రికే అవసరమైన శీర్షికలను ప్యాక్స్ ద్వారా పంపారు. లేక సహాయపడే ఇతర వైద్యులను సందర్శించడానికి కమిటీలను ఏర్పాటుచేస్తారు. ఆ ఇతర వైద్యులు రక్తం లేకుండా వైద్యం చేయడానికి లేక శస్త్ర చికిత్స చేయడానికి కృషి చేస్తారు.
ఉదాహరణకు, రక్తం పోవడం వలన తీవ్రమైన అనేమియాకు దారితీసిన అనేక సందర్భాల్లో, ఎర్ర కణాల సంఖ్య పెంచడానికి రక్తం అవసరమని వైద్యులు చెప్పిన అనేక సందర్భాల్లో, ఆసుపత్రి అనుసంధాన కమిటీ సభ్యులు, అదే పనిని చేయడానికి పునఃస్సంయోజక ఎరిత్రోపాయటిన్ (EPO) యొక్క పనితనాన్ని చూపే శీర్షికలను వైద్య ప్రచురణలనుండి సూచించారు. ఈ కృత్రిమ హార్మోను మన మూత్రపిండాల్లో కనుగొనబడే ప్రకృతి సిద్ధమైన ఎరిత్రోపాయటిన్లానే పనిచేస్తుంది, అది రక్తప్రవాహంలోకి క్రొత్త, తాజా ఎర్ర కణాలను పంపడానికి ఎముక మూలుగును ప్రభావితం చేస్తుంది.
ఎరిత్రోపాయటిన్ (EPO) అవసరానికి తగినట్లు త్వరగా పనిచేయదని కొందరు వైద్యులు తలంచారు. కానీ అది ఎంత త్వరగా ఫలితాన్నిస్తుంది అన్న విషయం అనేకమంది యెహోవా సాక్షుల కేసుల్లో నిరూపించబడింది. ఒక సందర్భంలో, ఎరిత్రోపాయటిన్ (EPO) వాడడం మొదలుపెట్టిన రోజే, క్రొత్త ఎర్ర కణాల సంఖ్య అప్పటికే సాధారణంగా ఉండవలసిన దానికంటే నాలుగింతలు ఎక్కువ అయ్యింది! ఇంకో రోజులో రోగి నిలదొక్కుకున్నాడు, మరి నాల్గవ దినానికి పరిపక్వం చెందిన ఎర్ర కణాల సంఖ్య పెరగడం మొదలైంది. మరికొన్ని రోజుల్లో, అది చాలా ఎక్కువగా పెరగసాగింది. రోగి బ్రతికాడు. ఈ విధంగా ఆసుపత్రి అనుసంధాన కమిటీల పని ద్వారా అటు వైద్యులు ఇటు రోగి కూడ లాభం పొందారు.
ఒక అరుదైన ఉష్ణమండల వ్యాధిని నయం చేయడానికి రక్తం ఉపయోగించకపోతే సాక్షియైన ఒక రోగి యొక్క ప్రాణాన్ని తాము రక్షించలేమని ఆస్ట్రేలియాలోని వైద్యులు చెప్పినప్పుడు, రక్తం లేకుండా చికిత్స చేయడానికి నడిపింపునిచ్చే సమాచారం ఏదైనా కనుగొనడానికి వారు ప్రాంతీయ ఆసుపత్రి అనుసంధాన కమిటీని అడిగారు. ఆ అవసరం విషయమై యెహోవాసాక్షుల ఆస్ట్రేలియా బ్రాంచి కార్యాలయానికి తెలుపబడింది. వారు బ్రూక్లిన్, న్యూయార్క్‌లోని యెహోవాసాక్షుల అంతర్జాతీయ హెడ్‌క్వార్టర్స్‌లో ఉండే ఆసుపత్రి సమాచార సేవలతో సంప్రదించారు. వారు కంప్యూటరు సహాయంతో వైద్య సంబంధిత విషయాలను పరిశోధించారు. సహాయకరమైన శీర్షికలు ఫ్యాక్స్ ద్వారా ఆస్ట్రేలియాకు పంపబడ్డాయి. వైద్యుని కార్యాలయాన్ని వదలిన 11 గంటల తరువాత, ఆస్ట్రేలియాలోని ఆసుపత్రి అనుసంధాన కమిటీ సభ్యులు అవసరమైన శీర్షికలతో తిరిగి వచ్చారు. అవి చాలా ప్రభావవంతంగా పని చేశాయి, మరి రోగి కోలుకున్నాడు. ఫ్యాక్స్ చేయబడిన వైద్య సంబంధ సమాచారం న్యూయార్క్ నుండి నేపాల్ అంతటి దూర ప్రాంతానికి కూడ పంపబడ్డాయి.
విలువైన పరిశోధనా మరియు సహాయము
వైద్య ప్రచురణల్లో యెహోవాసాక్షులు చేసిన పరిశోధనా నాణ్యత చాలా మంచిది, తాజాది. అమెరికా, ఒరిగన్లోని ఒక ఆసుపత్రిలో శస్త్ర చికిత్స సేవలకు సహసంచాలకురాలైన ఒక రిజిస్టరు చేయబడిన నర్సు, ఆపరేషన్-గది నిర్వాహకుల కొరకైన ఒక వైద్య ప్రచురణలోని ఒక శీర్షికలో యిలా చెప్పింది: “యెహోవాసాక్షు[లకు] . . . మనకంటే ఎక్కువ తెలుసు. రక్తానికి, రక్త ఉత్పత్తులకు ఉన్న ప్రత్యామ్నాయాలను గూర్చి వారికే ఎక్కువ తెలుసు మరి వారు తరచూ మనము దానిని గూర్చి ఇంకా వినక ముందే ఆ ప్రచురణలను మనకు అందజేస్తున్నారు.”—OR మ్యానేజర్, జనవరి 1993, 12వ పేజి.
సమధర్మ రక్తాన్ని ఉపయోగించకుండా చికిత్స చేసే కొందరు ప్రముఖులైన వైద్యులు మరియు వైద్య కేంద్రాలు తమ పని మరియు పద్ధతుల విషయమై తమను సందర్శించడానికి తమ్మును తాము అందుబాటులో ఉంచుకున్నారు. ఈ అవసరానికి వారు ఇచ్చిన ఉదారమైన ప్రతిస్పందన, లుకేమియా మరియు అనేక రకాలైన శస్త్ర చికిత్సల విషయంలో విజయవంతంగా చికిత్స చేయబడిన సందర్భాలలో చూడబడినట్లు ప్రాణాలను రక్షించడానికి దోహదపడింది. ఈ వైద్య సందర్శనాలు తరచూ అంతర్జాతీయ టెలిఫోన్ పిలుపుల ద్వారా నిర్వహింపబడ్డాయి.
విశ్వాసాన్ని సవాలు చేసే వైద్య పరిస్థితిని ఎవరైనా ఎదుర్కొన్నప్పుడు వారికి అవసరంలో సహాయపడటానికి యెహోవాసాక్షులు ఎంతగా ప్రయత్నిస్తున్నారంటే రోగిని ఒక ఆసుపత్రి నుండి మరొక దానికి, దేశంలోని ఒక భాగం నుండి మరోభాగానికి, చివరకు ఒక దేశం నుండి మరో దేశానికి తరలించే ఏర్పాట్లు చేశారు. కొన్ని ఉదాహరణలు: ఒక రోగియైన స్త్రీ సురినామ్ నుండి ప్యూర్టోరికోకు విమానంలో తీసుకువెళ్లబడింది; ఇంకొక వ్యక్తి సమోవా నుండి హవాయికి విమానంలో తీసుకువెళ్లబడ్డాడు; ఒక శిశువు, ఆస్ట్రియా నుండి అమెరికా, ఫ్లోరిడాకు తీసుకువెళ్లబడింది.
ఎక్కువమంది వైద్యులు సహకరిస్తున్నారు
ఈ విషయంలో సహకరించడానికి సుముఖత చూపిస్తున్న వైద్యుల సంఖ్య ఐదు సంవత్సరాల క్రితం 5,000 మంది నుండి ఇప్పుడు 65 దేశాల్లో 30,000 మందికి పెరగడంతో యెహోవాసాక్షుల కొరకు పరిస్థితి మెరుగు పడిందన్న విషయాన్ని చూడవచ్చు. యోగ్యతగల వైద్యుల ఆ సంఖ్య ఇంకొక అనుకూలమైన అభివృద్ధిని సాధ్యపరిచింది—పలు దేశాల్లో రక్తం లేకుండా చికిత్స జరపబడే వైద్య మరియు శస్త్ర చికిత్సా కేంద్రాలు 30 కంటే ఎక్కువ రూపుదిద్దుకొనడమే.
కావున, ప్రస్తుతం, కనీసం ఉత్తర అమెరికాలో, రక్తమార్పిడి విషయమై ఒక పెద్ద వయస్కున్ని ఒత్తిడి చేయాలన్న ప్రయత్నాలను గూర్చి ఒకరు చాలా అరుదుగా వింటారు, మరి అనేక ఇతర దేశాలు కూడ ఆ స్థాయికి అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడున్న అనేక సమస్యలు క్రొత్తగా జన్మించిన శిశువులకు మరి ప్రాముఖ్యంగా నెలలు నిండక మునుపు జన్మించిన వారికి సంబంధించినవే. ఈ నెలలు నిండని శిశువులు, సరిగ్గా అభివృద్ధి చెందని అవయవాలతో పుడతారు. అవి ఊపిరి తిత్తులు మరియు మూత్రపిండాలే కావచ్చు. ఆ అవయవాలు మామూలుగా పని చేయనందువలన వచ్చే సమస్యలను వారు ఎదుర్కొంటారు. కానీ వైద్యులు ఈ పరిస్థితుల్లో రక్త మార్పిడి లేకుండా చికిత్స చేయడానికి మార్గాలను కనుగొంటున్నారు. ఉదాహరణకు కష్టంగా శ్వాస పీల్చుకోవడాన్ని నయంచేయడానికి ఒక కృత్రిమ సర్ఫాక్టెంటు అందుబాటులో ఉంది. పరిపక్వతకు ముందే జన్మించిన వారికుండే అనేమియాను ఎదుర్కొనడానికి ఎరిత్రోపాయటిన్ (EPO) ఉపయోగం చాలా ఎక్కువగా అంగీకరించ బడుతుంది.
వైద్య సిబ్బందికి మరియు అధికారులకు సహాయము
యెహోవాసాక్షుల పిల్లలకు రక్తమార్పిడి లేకుండా చికిత్స చేయడానికి శిశువైద్యులు, మరియు శిశు చికిత్సా నిపుణుల సహాయార్థం, ఆసుపత్రి సమాచార సేవలు మూడు సూచికలుండే ఒక 55 శీర్షికల గ్రంథాన్ని రూపొందించారు. అప్పుడే జన్మించిన శిశువుకు వచ్చే అనేక సమస్యలకు రక్తం లేకుండా ఏమి చేయవచ్చనే దానిని ప్రదర్శించే వైద్య ప్రచురణలనుండి ఆ శీర్షికలు తీసుకొనబడ్డాయి.
రక్తం లేకుండా ఉపయోగించగల వైద్య ప్రత్యామ్నాయాలు లభ్యమౌతున్న వాటిని గూర్చిన సమాచారాన్ని న్యాయమూర్తులు, సంఘ సేవకులు, పిల్లల ఆసుపత్రులు, శిశుచికిత్సా నిపుణులు, మరియు శిశువైద్యులకు అందించడానికి యెహోవాసాక్షులు ఈ వైద్య సిబ్బంది మరియు అధికారుల కొరకు ప్రత్యేకంగా ఫ్యామిలీ కేర్ అండ్ మెడికల్ మ్యానేజ్మెంట్ ఫర్ జెహోవాస్ విట్నెసెస్ అని పిలువబడే ఒక 260-పేజీల గ్రంథాన్ని రూపొందించారు.a దానిలో ఎప్పటికప్పుడు తాజా సమచారాన్ని పెట్టడానికి వీలగునట్లు ఆ చిన్న పుస్తకం తీసిపెట్టగల్గే విధంగా చేయబడింది. యెహోవాసాక్షుల మధ్య కుటుంబ జీవితాన్ని గూర్చి కొంత తప్పుడు అవగాహన ఉన్నందున, బైబిలు బోధలవలన వచ్చిన జీవన విధానంతో ఉత్పత్తి చేయబడిన తప్పకుండా లాభసాటియైన, శ్రద్ధగల వాతావరణంలో తలిదండ్రులు తమ పిల్లల కొరకు కలిగి ఉండే ప్రేమను అది స్పష్టపరుస్తుంది.
ఆ ప్రచురణకు ఎలాంటి ఆదరణ లభిస్తున్నది? అందులోని విషయాలను పరిశీలించిన తరువాత, అమెరికా, పెన్సిల్వేనియాలోని పిల్లల ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్, తన సంస్థ సభ్యులంతా దాన్ని క్షుణ్ణంగా చదివి, ఉపయోగించాలని తాను ఎదురుచూస్తూ ఉంటానని అతను అన్నారు. అతనింకా యిలా అన్నారు: “అది మళ్లీ నావద్దకు పూర్తిగా నలిగి చాలాసార్లు చదువబడినదన్న గురుతులతో రాకపోతే, అలా ఎందుకు జరిగిందో నేను తెలుసుకుంటాను!” వైద్యులు రక్తాన్ని ఉపయోగించకముందు రక్తానికి ప్రత్యామ్నాయమైన వాటినన్నింటిని వాడి చూడాలని కొంతమంది న్యాయమూర్తులు తమ న్యాయస్థాన ఉత్తరువులను ఇప్పటికే జారీచేశారు. పిల్లలకు రక్తం లేకుండా చికిత్స చేయబడుతుంది మరి చాలామంది చక్కగా కోలుకొని ఇంటికి వెళ్తున్నారు.
అమెరికా, ఒహాయోలో మైనరు పిల్లల విషయాలను చూచే ఒక న్యాయమూర్తి ప్రతిస్పందన మాదిరికరంగా ఉంది. ఫ్యామిలీ కేర్ గ్రంథమును బట్టి ఆయన ఎంతగా ఆనందించాడంటే, అతను తన సహోద్యోగుల కొరకు ఏడు అదనపు ప్రతులు కావాలని కోరాడు. అతను వైద్యుల శ్రద్ధలను తలిదండ్రుల హక్కులతో సమతూకపర్చడానికి తన న్యాయస్థాన ఉత్తరువులను ఇప్పుడు మార్చుకుంటున్నారు. అతను దాన్ని రెండు విధాలుగా చేస్తున్నారు. అతను తన ఉత్తరువులలో (1) వైద్యుడు రక్తం ఉపయోగించక ముందు మొదట ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలనన్నింటిని ఉపయోగించి చూడాలని; మరి (2) తాము ఉపయోగించదలచిన రక్తము పరీక్షింపబడినదని మరి అది ఎయిడ్స్ మరియు హెపటైటెస్ ఏ మాత్రమూ లేనిదని వైద్యుడు తండ్రికి హామి ఇవ్వాలని నొక్కి చెబుతున్నారు. అతను తన ఉత్తరువులను మార్చడం మొదలుపెట్టిన తరువాత ఇవ్వబడిన మూడింటిలోను, ఆ ముగ్గురు పిల్లలకూ రక్త మార్పిడి లేకుండా విజయవంతంగా చికిత్స జరిగింది.
బోస్టన్ కళాశాల న్యాయపాఠశాలలో న్యాయశాస్త్ర ఉపాధ్యాయుడైన డా. చార్ల్స్ హెచ్. బారన్, గత సంవత్సరం ప్యారిస్ విశ్వవిద్యాలయంలో విద్వాంసుల కొరకు జరిగిన సమావేశంలో ఒక కాగితాన్ని అందించారు. అతని అంశమేమంటే “రక్తము, పాపము మరియు మరణము: యెహోవాసాక్షులు మరియు అమెరికా రోగుల హక్కుల ఉద్యమం.” ఆ కాగితంలోనే, సాక్షుల ఆసుపత్రి అనుసంధాన కమిటీల పనిని గురించి క్రింది పేరా యిలా చెప్పింది:
“అమెరికా వైద్యం తన విశ్వాసాల్లో కొన్నింటిని ఇంకాకొంత సాక్ష్యం వెలుగులో పునఃపరిశీలించుకొనేలా కూడ వారు చేయగలిగారు. ఆ ప్రక్రియలో అమెరికా సమాజం మొత్తం లాభం పొందింది. సాక్షుల ఆసుపత్రి అనుసంధాన కమిటీల పని వలన యెహోవాసాక్షులకే కాక, సాధారణ రోగులకు కూడ ఈనాడు అనవసరమైన రక్తమార్పిడులు చాలా తక్కువగా ఇవ్వబడవచ్చు. సాక్షుల పని అందరు రోగుల హక్కుల ఉద్యమంలో ఒక భాగంగా జరుపబడింది గనుక ఇతర రోగులు, ఆరోగ్య సంరక్షణా నిర్ణయాల విషయంలో అనేకమైన వాటిని కలిగి ఉన్నందున ఎక్కువ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారు. తమ మతపర నమ్మకాలకు విరుద్ధంగా చర్యలు గైకొనవలెనని ఒత్తిడి చేయాలన్న ప్రయత్నాలకు సాక్షులు పట్టుదలతో ఎదిరించడంవలన సాధారణమైన స్వాతంత్ర్యానికి కారకాలు మరియు ప్రాముఖ్యంగా మతపర స్వాతంత్ర్యం పురోగమించాయి.”
ఆసుపత్రి అనుసంధాన కమిటీల ఈ కార్యకలాపాలన్నీ కూడ నేరుగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం కాకపోవచ్చు, కానీ మన పవిత్ర సేవకు “అవశ్యమైన” సంగతులలో ఒకటని మొదటి శతాబ్దపు పరిపాలక సభ ద్వారా చెప్పబడిన మన ఆరాధనకు చేయబడిన సూటియైన సవాలుకు ఇది తప్పనిసరిగా జవాబైయున్నది. (అపొస్తలుల కార్యములు 15:28, 29) అయిననూ, సంభాషించాలన్న మన గౌరవప్రదమైన మరి ధైర్యంతో కూడిన ప్రయత్నం కొంతమంది వైద్య సిబ్బంది రాజ్య వర్తమానానికి ప్రతిస్పందించడానికి మార్గం తెరవడం ఆసక్తికరమైన విషయం. ఆసుపత్రి అనుసంధాన కమిటీ సభ్యుల్లో అనేకులు, కమిటీ కార్యకలాపాల ద్వారా కలిసిన వైద్యులతో బైబిలు పఠనాలను ప్రారంభించారు, అట్టి వైద్యుల్లో ఇద్దరు ఈమధ్యే బాప్తిస్మం పొందారు.
కావున, రక్తాన్ని విసర్జించడం విషయంలో యెహోవా యొక్క సంపూర్ణ న్యాయవిధికి లోబడటానికి, తమ విశ్వాసంతో రాజీపడకుండా ఉంటూ అవసరమైన వైద్యాన్ని పొందడానికి ఆసుపత్రి అనుసంధాన కమిటీ ఏర్పాటు వలన యెహోవాసాక్షులు సహాయాన్ని పొందుతున్నారు. (కీర్తన 19:7) ఒకప్పుడు ఉన్న అగాధాన్ని పూడ్చడంలో ఇప్పుడు నిజంగా ఎడతెగని విజయం సాధించబడుతుంది. అందుబాటులో ఉన్న రక్తం లేని వైద్య సదుపాయాలను తామెలా ఇవ్వగలమో ఆ విషయమై కూడ వైద్యులు మరియు ఆసుపత్రులు చక్కగా సమాచారాన్ని పొందారు. రోగులు, బంధువులు, మతపరంగా పరిచయమున్న వారు, మరియు ఆసుపత్రి సిబ్బంది, యిలా అందరూ కోరుకునేది రోగి ఆరోగ్యవంతంగా కోలుకొనడమే.—వాచ్‌టవర్ సంస్థ యొక్క ప్రపంచ కార్యాలయంలోని ఆసుపత్రి సమాచార సేవల ద్వారా అందించబడింది. (g93 11/22)
[అధస్సూచీలు]
a కేవలం ఆంగ్లంలోనే లభ్యమౌతుంది
[27వ పేజీలోని చిత్రం]
అనుసంధాన కమిటీ ఒక వైద్యునితో సమావేశమయ్యారు
[28వ పేజీలోని చిత్రం]
“ఫ్యామిలీ కేర్”