కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 3/8 పేజీలు 24-25
  • తమాషాగా ఉండే ఆఫ్రికా పంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తమాషాగా ఉండే ఆఫ్రికా పంది
  • తేజరిల్లు!—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • చీతా—శరవేగంతో పరిగెత్తే పిల్లి
    తేజరిల్లు!—1997
  • వేగానికి రాజు
    తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1994
g94 3/8 పేజీలు 24-25

తమాషాగా ఉండే ఆఫ్రికా పంది

ఆఫ్రికా పందుల కుటుంబం మెల్లిగా పరుగెత్తుతూ వెళ్తుండటం ఆఫ్రికా అడవుల్లో అత్యంత సరదాగా ఉండే దృశ్యాల్లో ఒకటి. ఒక చిన్న రేడియో ఏంటినాలా ప్రతి ఒక్కటి తన సన్నటి బొచ్చు తోకను పూర్తిగా నిటారుగా ఉంచి తనదైన పంధాలో కొద్దిగా నెమ్మదిగా పరుగెత్తుతుండటం చూడవచ్చు. అయితే, ఆఫ్రికా పంది ధ్యేయం తనను చూచే వారిని మురిపించాలన్నది కాదు. మేబర్‌లేస్‌ మామల్స్‌ ఆఫ్‌ సౌత్‌ ఆఫ్రికా, అనే పుస్తకం ప్రకారం, “ఈ అలవాటు ఆ జంతువు పారిపోయే సమయాల్లో పొడవైన గడ్డిమధ్యనుండి పరుగెడుతున్నప్పుడు, ప్రాముఖ్యంగా చిన్నవి తమ తక్కువ కనుదృష్టితో తప్పించుకుపోవడానికి ఒకదానిని ఒకటి చూచుకొనడానికి సహాయపడుతుండవచ్చు.”

అవి తమ “యింట్లోకి” ప్రవేశించేటప్పుడు, ప్రాముఖ్యంగా ఎక్కువ వేగంతో వెళ్లేటప్పుడు ఇంకా ఎక్కువ తమాషాగా ఉంటుంది. చీమలను తినే ఎలుగు గొడ్డు, లేక ముండ్లపంది ఉండే భూమిలోని పెద్ద రంధ్రాలే వీటి “యిండ్లు,” మరి ఆఫ్రికా పందులు లోనికి వెళ్లే పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా ఆఫ్రికా పందుల అసలు పద్ధతి నేర్చుకొనని, చిన్నవి, వేరే ఇతర ఆత్మ గౌరవంగల జంతువుల్లానే మొదట తలపెట్టి లోనికి ప్రవేశిస్తాయి. తలిదండ్రులు మాత్రం అలా కాదు! పూర్తి వేగంతో, సైనిక దర్పంతో, అవి తమ గుహలలోకి వెనక్కి నడిచి వెళ్తాయి—వెంటనే తమ యింటిలోని క్షేమమైన ప్రాంతాల్లోకి వెళ్లి కూర్చుంటాయి! అయితే ఈ చిన్ని ప్రయత్నం కేవలం చూస్తున్న వారిని మురిపించడానికి మాత్రమే జరగటం లేదు. ఇప్పుడు చూడండి ఆఫ్రికా పంది తన శత్రువులను సూటిగా ఎదుర్కొని తన ప్రమాదకరమైన కోరలతో రాబోయే ఏ దాడినైనా వారించగలదు.

అయిననూ, ఈ విధంగా త్వరగా లోనకు వెళ్లడంలో కొన్ని అనుకోని అపాయాలు ఉన్నాయి. భూమిలోపల ఉండే ఈ దుమ్ముగల గుహల్లో కేవలం ఆఫ్రికా పందులు మాత్రమే ఉండవు. దుమ్ములగొండ్లు, తేనె తినే నీటికుక్కలు, నక్కలు మరియు ముండ్లపందులు కూడ యి కన్నాల్లో ఉంటాయి. “ఒకవేళ కన్నాలు ముందుగానే ఆక్రమింపబడి ఉంటే, [ఆఫ్రికా పందులు] కొన్నిసార్లు అప్రీతికరమైన అనుభవాల్ని ఎదుర్కొంటాయి,” అని కస్టోస్‌ పత్రిక నివేదిస్తుంది. “కొన్ని సందర్భాల్లో తమ వెనుక భాగానికి [ముండ్లపంది] ముళ్లులు గుచ్చుకొని ఉన్న ఆఫ్రికా పందులు కనిపించాయి.” నిజమే, దురదృష్టవంతురాలైన ఆఫ్రికా పందికి ఇది ఒక మురిపింపజేసే సంగతేమి కాదు.

తన ఆశుభసూచకమగు కోరలతో, ఈ ఆఫ్రికా పంది తన ఆహారం కొరకు దేన్నైనా చంపడానికి వెదుకుతున్న క్రూరమైన జంతువులా కనిపిస్తుంది. కానీ అది అపాయకరమైనది కాదు. ఆఫ్రికా పంది “సాధారణంగా నిరపాయకరమైన జంతువుగా” వర్ణించబడింది. వాస్తవం ఏమిటంటే ఆఫ్రికా పంది గడ్డిని మాత్రమే తింటుంది, అదీ చాలా ఎంపిక చేసుకొని మరీ తింటుంది! అది చాలామట్టుకు చిన్న గడ్డిని, కేవలం గడ్డి కొనలను మాత్రమే తింటుంది; అది గురుగులను, పొడవు గడ్డిని, లేక ఇతర చెట్లను తినదు. “పంది” నిజంగానే తిండిపోతు! అంతే కాకుండా, ఆఫ్రికా పంది తన ఆహారాన్ని కనుగొనడానికి కొన్ని అభ్యంతరకరమైన స్థలాల్లోకి కూడ వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడైనా అది తన ముఖాన్ని ముళ్లచెట్ల క్రింద పెరుగుతున్న రుచికరమైన క్రొత్త గడ్డిని వెదుకుతూ అక్కడ పెడితే, దాని కోరలు ముఖాన్ని రక్షించడానికి సహాయపడతాయి.

దినంలో ఎండ వేడి ఎక్కువగా ఉన్న సమయాల్లో, ఆఫ్రికా పందులు తమ “యిళ్లల్లో” ఉంటాయి. ఒక చీమలను తినే ఎలుగుబంటి వదిలేసిన గుహను తన కోరలతో పెద్దది చేసుకొని దానిలోనే నివసిస్తుంది. ఒకవేళ అవి విశ్రాంతి తీసుకొనకుంటే, దగ్గర్లో ఉన్న నీళ్లలో ఆడుతూ, నీళ్లు త్రాగుతుండటం మీరు చూస్తారు. తినే సమయమైనప్పుడు, అవి గడ్డిగల చదును ప్రాంతంలో చిన్నగా పరుగెడుతూ కనిపిస్తాయి. (అవి బలవంతపెడితే తప్ప వాటంతట అవే పరుగెత్తడానికి ఎప్పుడూ ఉపక్రమించవు.) అవన్నీ తమ సన్నటి తోకలను నిటారుగా ఉంచుకుని—పెద్దవి మొదలుకొని చిన్నవాటి వరకూ—అన్నీ కూడ హుందాగా నడుస్తుంటాయి.

ఆఫ్రికా పందులు పంది కుటుంబానికి చెందిన వాట్లిలో అంత అందమైనవేమి కాదు. అయిననూ, వాటికి చాలా సరియైన పేరు ఉంది, వాటి పొడవైన ముఖాలపై ఉన్న స్పష్టమైన “మొటిమలను” బట్టి వాటికి ఆ పేరు వచ్చింది. అవి నిజమైన మొటిమలు కావుగానీ మందమైన శరీర భాగం బయటికి పెరగడమే, మరి అవి చాలా ప్రయోజనకరంగా ఉండగలవు. ఆఫ్రికా పంది త్రవ్వుతూ తింటున్నప్పుడు అవి కళ్లను రక్షించడానికి సహాయపడగలవు. మగవాటికి గొడవ వచ్చినప్పుడు, విరోధి యొక్క కోరలనుండి తప్పించుకొనడానికి డాలులుగా కూడ అవి ఉపయోగపడగలవు.

ఈ తమాషా అయిన ముఖం వెనుక ఒక భయంకరమైన వీరుడు దాగి ఉన్నాడు. తల్లి ఆఫ్రికా పందులు తమ పిల్లలపట్ల శ్రద్ధ తీసుకుంటాయి, వాటిని పరిరక్షిస్తాయి. తమ ప్రాణాలకు ముప్పు వచ్చినా సరే గుంపులోని ఇతర పెద్ద పందులు కూడా చిన్న వాటిని పరిరక్షిస్తాయి. ఉదాహరణకు, ఒకవేళ ఒక చిరుతపులి ఒక చిన్న ఆఫ్రికా పంది పిల్లను ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తే, పెద్దది ఒకటి పులిపై దాడిచేస్తుంది. సాధారణంగా దాడికి సిద్ధమైన ఈ కోపోద్రేకంతో నిండిన దాన్ని, దాని పదునైన కోరలను చూస్తేనే చిరుత పారిపోతుంది. అంతలో, ఆ పిల్ల తన తల్లి కడుపు క్రింద భద్రంగా ఉండడానికి అటుఇటు పరుగిడుతుంది. ఒకవేళ, అది ఒక సింహము, లేక చిరుతపులి అయితే ఆఫ్రికా పందులు ఇంకా తమ తోకలను నిటారుగానే ఉంచుకుని తెలివిగా వెనుదిరుగుతాయి. అయితే, పెద్దవి పిల్లలు ముందు భద్రత ఉన్న స్థలానికి చేరుకునేటట్టు ముందు వాటిని పంపి అవి వెనక పరుగెడతాయి.

ఏమైననూ, డా. డారిల్‌ మాసన్‌ కస్టోస్‌ పత్రికలో యిలా చెబుతున్నాడు, “పెద్ద ఆఫ్రికా పందులు చిరుతలు, చిరుతపులులకు, దుమ్ములగొండ్లకు మంచి సమ ఉజ్జీలుగా ఉండగలవు.” ఒక ఆడ ఆఫ్రికా పంది తన పిల్లల్లో ఒకదానిని ఒక పెద్ద మగ చిరుతపులి బారినుండి తప్పిస్తున్నప్పుడు కనుగొనబడింది. ఆ పులి త్వరగా ఒక చెట్టుపైకి ఎక్కక మునుపు ఇది దాన్ని 30 మీటర్లు ధైర్యంగా తరిమింది. ఇంకో సందర్భంలో రెండు ఆఫ్రికా పందులు 16 అడవి కుక్కల గుంపును ఎదుర్కొన్నాయి.

ఆఫ్రికా అడవుల్లో ఉండే ఈ దృఢమైన తమాషా జీవి చేష్టలను గమనించడం ఎంత ముచ్చటగా ఉంటుందో! (g93 11/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి