కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 3/8 పేజీలు 30-31
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పిల్లల వ్యభిచారం పెరిగిపోతుంది
  • చెత్త యొక్క దీర్ఘాయువు
  • మానవ హక్కులు అర్థంలేనివి
  • పళ్లలో రంధ్రాలు అంటువ్యాధి
  • సరిగ్గా నిలబడండి
  • ఆసియాలో సంతోషము
  • సంభాషించడంలో విఫలమగుట
  • పనిని దాని స్థానంలో ఉంచండి
  • సంభవించడానికి ఎదురుచూస్తున్న ప్రమాదాలు
  • ఒక మరణకరమైన వ్యాపారం మళ్లీ వచ్చింది
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1993
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1999
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1993
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 3/8 పేజీలు 30-31

ప్రపంచ పరిశీలన

పిల్లల వ్యభిచారం పెరిగిపోతుంది

“పిల్లలు ‘క్షేమకరమైన వారని మరియు ఎయిడ్స్‌ లేనివారని పిల్లలను మరియు యౌవనులను లైంగిక సంభోగానికి సహచరులుగా కలిగి ఉండటానికి విటులు ఇష్టపడుతున్నారని వైద్యులు, పోలీసు అధికారులు మరియు సంఘ సేవకులు నివేదిస్తున్నారని” ప్యారిస్‌ యొక్క ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ చెబుతుంది. కన్యలుగా పరిగణింపబడే పిల్లలకు సంభోగికులు చాలా ఎక్కువ ధరను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని “లైంగిక వ్యాపారం మరియు మానవ హక్కుల” పై ఈమధ్యే బ్రసెల్స్‌, బెల్జియంలో జరిగిన యునెస్కో సమావేశంలో నిపుణులు నొక్కిచెప్పారు. దానికి ప్రపంచవ్యాప్త ఎయిడ్స్‌ మహమ్మారి కారణం అని ఒప్పుకుంటూ, అలాగే చాలా లాభప్రదమైన లైంగిక వ్యాపారం యొక్క అనేక దశలు “లైంగిక అనుభూతిని బాహాటంగా కొనడాన్ని, అమ్మడాన్ని సర్వసాధారణం చేశాయని మరియు పిల్లలను లైంగిక విషయాలకు ఉపయోగించడానికి విరుద్ధంగా ఉన్న నిషేధాలను నశింపజేశాయని” కూడా నిపుణులు సూచించారు. ఈ సమస్య ప్రాముఖ్యంగా బెనిన్‌, బ్రెజిల్‌, కొలంబియా, థాయిలాండ్‌, మరియు ఫిలిప్పైన్స్‌లో చాలా ఎక్కువగా ఉన్నట్లు యునెస్కో అధ్యయనాలు చూపిస్తున్నాయి. థాయిలోని 20 లక్షల వ్యభిచారిణుల్లో ఇంచుమించు 8,00,000 మంది చిన్న పిల్లలు మరియు యౌవనులు, మరి శ్రీలంకలో 6 నుండి 14 సంవత్సరాల వయస్సుగల 10,000 మంది మగపిల్లలు వ్యభిచార వృత్తిలో ఉన్నారు. (g93 11/22)

చెత్త యొక్క దీర్ఘాయువు

సామాన్యమైన చెత్త కుళ్లడానికి ఎంత కాలం పడుతుంది? ఫోకస్‌ అనే ఒక ఇటలీ పత్రిక ప్రచురించిన అంకెల ప్రకారం కాగితపు చేతిరుమాళ్లు లేక కూరగాయల వ్యర్థపదార్థం కుళ్లడానికి మూడు నుండి ఆరు నెలలు పట్టవచ్చు, సిగరెట్టు ఫిల్టర్లు కుళ్లిపోవడానికి 1 నుండి 2 సంవత్సరాలు, బబుల్‌ గమ్‌లకు 5 సంవత్సరాలు, మరి అల్యూమినియమ్‌ పీపాలకైతే 10 నుండి 100 సంవత్సరాలు పడుతుందట. కాని కొన్ని ప్లాస్టిక్‌ వస్తువులు “శతాబ్దాల వరకూ చెక్కుచెదరవు . . . అవి నీళ్లకు కరగవు . . . ఏ సూక్ష్మజీవులు సహితం వాటిని తినడానికి సిద్ధంగా లేవు.” ప్యాకేజీలకు, ఆహారం, పానీయాల కొరకైన డబ్బాలను తయారు చేయడానికి ఉపయోగించే పాలీస్టీరిన్‌ బహుశా ఒక వేయి సంవత్సరాలకే విరిగి ముక్కలౌతుంది. మరి గాజు సీసాలు పగిలి ప్రకృతి వలయంలో తమ స్థానానికి చేరక ముందు 4,000 సంవత్సరాలు గడవాలి. (g93 11/22)

మానవ హక్కులు అర్థంలేనివి

స్విట్జర్‌లాండ్‌, జెనీవాలోని మానవ హక్కుల కొరకు ఐక్యరాజ్య సమితి కేంద్రం యిలా అంచనావేస్తుందని జర్మన్‌ వార్తాపత్రికైన సూడియట్‌స్కే జ్యీటంగ్‌ నివేదిస్తుంది: “మానవ హక్కులను విపరీతంగా దుర్వినియోగం చేయడం వలన మానవ జాతిలోని సగంమంది బలౌతున్నారు.” ఈ దుర్వినియోగాలు హింసించడం, మానభంగం, ఆకలి మరియు బానిసత్వం కొరకు చెరపట్టడం, పిల్లలపై అత్యాచారం చేయడం వంటివి. యాభై కంటే ఎక్కువ దేశాల్లో 15 నుండి 20 కోట్ల చిన్నపిల్లలు బాల్యకార్మికులుగా పనిచేయడానికి బలవంతం చేయబడుతున్నారని ఆ కేంద్రం అంచనా వేస్తుంది. దానికి తోడు లక్షల ప్రజలు జాతివైషమ్యాలకు, పరదేశులపట్ల చూపే విరోధానికి గురౌతున్నారు. “పేదరికం, లేమి ఉన్న వాతావరణంలో మానవ హక్కులు అర్థరహితమైనవి. మనము చంద్రునిపైకి మనిషిని పంపామన్నది నిజమే, కానీ మనం జీవిస్తున్న ప్రపంచం మాత్రం కష్టతరంగా, ప్రమాదకరంగా, కొన్నిసార్లు మరణకరంగా కూడ ఉంది.” అని ఆ కేంద్రం అధ్యక్షుడైన ఇబ్రాహిమ్‌ ఫాల్‌ చెప్పారు. (g93 11/22)

పళ్లలో రంధ్రాలు అంటువ్యాధి

“దంత క్షయం అంటువ్యాధి” అని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు స్విస్‌ దంత పాఠశాలచే జరపబడిన అధ్యయనంపై అజ్హాన్స్‌ ఫ్రాన్స్‌-ప్రెస్‌ వార్తా సేవ యొక్క నివేదిక చెబుతుంది. తలిదండ్రులు తమ పిల్లల చంచాలను వాడినప్పుడు లేక పసిపాపకు ఆహారం ఇవ్వకముందు పాప సీసాను రుచి చూసినప్పుడు, దంత క్షయాన్ని కలిగించే సూక్ష్మ జీవులైన, స్ట్రెప్టోకొక్కస్‌ మ్యుటన్‌స్‌ తరచూ కుటుంబ సభ్యుల్లో ఒకరి నుండి ఒకరికి అందింపబడతాయని వారి పరిశోధనలు తెలియజేశాయి. ఒక వ్యక్తి యొక్క లాలాజలంలో ఉన్న సూక్ష్మజీవుల లెక్కనుబట్టి ప్రమాదం పెరుగుతుంది. పిండిపదార్థాన్ని పళ్లపై దాడిచేసే రసాయనంగా మార్చే సూక్ష్మజీవులు ప్రాముఖ్యంగా ఒకటి నుండి నాల్గు సంవత్సరాల వయస్సుగల పిల్లల నోళ్లలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయని కనుగొనబడింది. ఆ వయస్సులోనే పిల్లల పళ్లు దంతక్షయానికి ఎక్కువ బలహీనంగా ఉంటాయి. (g93 11/22)

సరిగ్గా నిలబడండి

తల వంచి నడవండి, మీ వీపు బాధననుభవిస్తుంది. ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌లోని ఒక నివేదిక ప్రకారం, నిలువుగా నిలబడటంకంటే సరిగా లేని అంగవిన్యాసము నడుముపై 15 సార్లు ఎక్కువ ఒత్తిడి తెస్తుంది. తల వంచడంవలన లోతుగా శ్వాస పీల్చుకొనవలసి వస్తుంది, మరి శరీరానికి పుష్టినివ్వడానికి తక్కువ ప్రాణవాయువు లభిస్తుందని దాని అర్థం. అది మీ శక్తిని హరించి, నొప్పులు బాధలకు, ప్రాముఖ్యంగా మెడ, వీపు నొప్పులకు కారణం కావచ్చు. మీరు నిలువుగా నిలబడినప్పటికంటేకూడ, అప్పుడు మీరు పెద్ద వయస్సుగల వారిగా, లావుగా, తక్కువ మనస్థైర్యంగల వారిగా కనిపించవచ్చు. చెవి క్రిందిభాగములు, భుజాలు, పిరుదుల మధ్యభాగం, మోకాలి చిప్పలు, మరియు మడిమ ఎముకలు అన్నీ నిలువుగా ఉంటేనే సరైన అంగవిన్యాసమని నివేదికలు చెబుతున్నాయి. అయితే, కాళ్లు జోడించబడి, తలా భుజాలు వెనక్కు నెట్టబడిన మిలటరీవారి అంగవిన్యాసమని దాని అర్థంకాదు. అది వెన్నెముకపై అధిక ఒత్తిడి వేస్తుంది. సాధారణంగా సరిగ్గాలేని అంగవిన్యాసం సరిచేసుకొనగల ఒక చెడ్డ అలవాటని నిపుణులు చెబుతున్నారు. (g93 12/8)

ఆసియాలో సంతోషము

తైవాన్‌ మరియు కొరియా రిపబ్లిక్‌లోని సంతోషభరితమైన ప్రజలెవరంటే పేదవారు మరి వారు ముప్పైయో పడిలో అలా ఉంటారని సర్వే రిసర్చ్‌ హాంగ్‌కాంగ్‌ లిమిటెడ్‌ వారు నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో కనుగొన్నారు. ఫిలిప్పైన్స్‌లో, GNP (మొత్తం జాతీయ ఉత్పత్తి) తలొక్కింటికి కేవలం 500 డాలర్లు (అమెరికా) మాత్రమే మరి 41 శాతం మంది పేదరికంలో బ్రతుకుతున్నారు, 94 శాతం మంది సంతోషంగా ఉన్నామంటున్నారు. ఆసియాలో ఒక్కటి మినహా మిగతా అన్ని జీవితంపట్ల అటువంటి దృక్పథాన్నే కలిగి ఉన్నారు. “సాధారణంగా ఆనందంతో పొంగిపోయే ప్రాంతంలో,” ఆసియా నందలి అతి గొప్ప దేశం “చాలా తక్కువ సంతోషం అనుభవిస్తున్నట్లు తేలిందని” మైనీచీ డేలీ న్యూస్‌ చెప్పింది. వారి GNP తల ఒక్కింటికి 27,000 డాలర్లు (అమెరికా) అయిననూ, 40 శాతం మంది జపాన్‌ దేశస్థులు తాము సంతోషంగా లేమని అంగీకరిస్తున్నారు. (g93 12/8)

సంభాషించడంలో విఫలమగుట

“జర్మనీలో పెళ్లైన సగటు జంట ఒకరితోనొకరు మాట్లాడుకోడానికి ప్రతిరోజు 10 నిమిషాలు కూడ వెచ్చించరు,” అని జర్మన్‌ వార్తాపత్రికైన నొస్‌వుయిషె నాయియే ప్రెసె నివేదిస్తుంది. కావున అనేక జంటలు తమ సమస్యలకు పరిష్కారం వెదకడానికి చాలాకొద్ది సమయాన్ని మాత్రమే వెచ్చిస్తారు. అంతేకాక, ప్రాముఖ్యంగా యువ జంటలకు తమ అభిప్రాయ భేదాలను ఎలా తీర్చుకోవాలో తెలియదని జర్మనీలోని కుటుంబ సలహాదారులు చెబుతున్నారు. వివాహ భాగస్వామ్యం తొందరగా అంతమొందడానికి ఇదే పెద్ద కారణం; ఐదు వివాహాల్లో రెండు వివాహాలు తొలి నాలుగు సంవత్సరాల్లోనే విచ్ఛినం అవుతున్నాయి. సలహాదారిణి అయిన రోజెమాయీ బ్రయిన్‌డెల్‌ యిలా చెబుతున్నట్లు ఆ పత్రిక తెలియజేసింది: “ఈ తగాదాలను ఎలా తీర్చుకోవాలో ఉదాహరణ ద్వారా చూపించడానికి ఏ ఒక్కరు కూడా లేరు.” ఆ నివేదిక యింకా యిలా చెబుతుంది: “కావున, చాలామంది వివాహ సమస్యలను కేవలం విడిపోవడం ద్వారానే పరిష్కరించుకొనడానికి ఇష్టపడుతున్నారు.” (g93 12/8)

పనిని దాని స్థానంలో ఉంచండి

కురుపులు, గుండె జబ్బులు, నరాల బలహీనత, పనికి వెళ్లడం మానుకొనడం, మరియు ప్రమాదాలు—యివి మరీ ఎక్కువ ఒత్తిడి ఉండడం మూలంగా కలిగే ఫలితాలు. అవి యజమానికి, ఉద్యోగికీ కూడ వ్యయమౌతాయి. ఫ్రెంచ్‌ అంతర్జాతీయ శ్రామిక కార్యాలయం యొక్క నివేదిక ప్రకారం పని సంబంధిత ఒత్తిడి “మన కాలాల్లోని అతి గంభీరమైన సమస్యల్లో ఒకటి అయ్యింది.” ఐరోపాలో, సిబ్బందిని తగ్గించడం, ఉద్యోగుల బాధ్యతలను పెంచడం, దానితోపాటు ఉత్పత్తిని, లాభాలను పెంచాలన్న కోరిక పని స్థలంలో ఒత్తిడిని చాలా అధికం చేశాయని ఫ్రెంచ్‌ వైద్య పత్రికైన లి కొన్‌కోర్‌ మడెకాల్‌ నొక్కి చెబుతుంది. ఫ్రాన్స్‌లో కొందరు అధిక పనివలన చనిపోవడం కూడ జరుగుతుందని ఆ పత్రిక చెబుతోంది. ఆసక్తికరంగా, ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నవారితో ఉత్తేజకరమైన, ప్రేమపూర్వక స్నేహాన్ని పెంపొందించుకున్నప్పుడు ఒత్తిడిని చక్కగా ఎదుర్కొనగలడని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. విశ్రాంతి తీసుకోవాలని, భౌతిక వ్యాయామం చేయాలని, పరిమిత ఆహారాన్ని తీసుకోవాలని, మరియు పనిని దాని స్థానంలోనే ఉంచాలని—కుటుంబం మరియు వినోదం కొరకు కొంత సమయాన్ని ఉంచుకోవాలని వైద్యులు కూడ సలహా యిస్తున్నారు. (g93 12/8)

సంభవించడానికి ఎదురుచూస్తున్న ప్రమాదాలు

ప్రపంచ చమురు ట్యాంకర్లకు “సంభవించడానికి ఎదురుచూస్తున్న తేలే నౌకాదళ విపత్తులని” కొందరు విమర్శకులు పేరుపెట్టారని ఇంటర్నేషనల్‌ ఎన్వైరన్‌మెంటల్‌ అప్‌డేట్‌ చెబుతుంది. “తన అతి ప్రమాదకరమైన ఇంధనాన్ని రవాణా చేయడానికి తుప్పుపట్టి, క్షీణిస్తూ, సరిగ్గా వ్యవస్థీకరించని ట్యాంకర్లు మరియు సరైన తర్ఫీదు పొందని వాటి సిబ్బందితో ఉన్న ఆ వందల నౌకలపైనే ప్రపంచం ఇంకా ఆధారపడి ఉందని” ఆ పత్రిక ఆరోపిస్తుంది. ఒక పెద్ద ట్యాంకరు 15 సంవత్సరాల వరకు ఉండగలదు. కాని ప్రపంచ ట్యాంకర్ల నౌకాదళంలో 65 శాతం అంత వయస్సువే. కొన్ని చమురు పరిశ్రమల అధికారులు ఈ పురాతన ట్యాంకర్ల్‌ను తీసివేయాలని ఒప్పుకున్నారు. ఈ నౌకలు పనికిరావని రద్దుచేయగల అధికారం ఏ ఒక్క సంస్థకూ లేదు. అయితే, సమస్య ఈ నౌకల్లో కంటే ఆ నౌకలను ఉపయోగించే దానిలోనే ఉండవచ్చు. ఒక చమురు కాలుష్య నిపుణుడు ఇలా చెప్పడాన్ని ఆ పత్రిక తెలియజేస్తుంది: “ట్యాంకర్ల ప్రమాదాల్లో అధిక శాతం మానవ పొరపాట్లవల్లనే జరుగుతున్నాయి.” (g93 12/8)

ఒక మరణకరమైన వ్యాపారం మళ్లీ వచ్చింది

ఈమధ్య సంవత్సరాల్లో కొంత విజయం సాధించినా, భారతదేశంలో సంరక్షణా ప్రయత్నాలన్నీ కూడా దొంగవేటగాళ్ల వలన విఫలమౌతున్నాయని ఇండియా టుడే నివేదిస్తుంది. మరి 1988లో భారతీయ అడవుల్లో ఇంచుమించు 4,500 పులులు మిగిలి ఉండేవి. కాని 1992కల్లా ఆ సంఖ్య 1,500కు తగ్గించబడింది. పులిని దాని చర్మం, దాని రక్తం, దాని ఎముకలు (అవి గిరిజనుల మందులో ఉపయోగింపబడతాయి), దాని పాదాలు, చివరకు దాని జననేంద్రియాల కొరకు కూడా అమ్మబడుతుంది. దొంగవేటగాళ్ల ముఠా ద్వారా కేవలం పులి మాత్రమే చంపబడటం లేదు. మరి 1992లో నలభై-ఎనిమిది ఖడ్గమృగాలు, వాటి కొమ్ముల కొరకు హతమార్చబడ్డాయి. అది దశాబ్దంలోకెల్లా అతి పెద్ద సంఖ్య. భారతీయ ఏనుగులు పది సంవత్సరాల క్రితం 5,000 ఉండేవి నేడు 1,500కు తగ్గాయి. అటవీ సంరక్షకులు ఎక్కువ ఆయుధాలను ధరించి ఉండే ఈనాటి దొంగవేటగాళ్లకు ఎంతగా భయపడుతున్నారంటే కొందరు తమ అధికారిక యూనిఫాంలను ఇప్పుడు ఎంత మాత్రం వేసుకొనడం లేదు; ఇతరులు తమనుతాము రక్షించుకొనడానికి సరిగ్గా ఆయుధాలు ఇవ్వబడేంతవరకు తమ ఉద్యోగాలను చేయడానికి బాహాటంగా నిరాకరిస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. (g93 12/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి