విశ్వాసమును—సవాలుచేయు వైద్యపరిస్థితిని ఎదుర్కొనుటకు నీవు సిద్ధముగా యున్నావా?
1 ఈరోజో లేక రేపో ఆసుపత్రిలో యుండాలని ఎవరూ తలంచరు. అయినను ‘సమయము మరియు ఎదురుచూడని సంఘటన మనలనందరిని పడవేయును.’ (ప్రసం. 9:11, NW) ఒకవేళ వైద్యచికిత్స విధానమును నీవు నీకు ఎంపిక చేసికొనిన ఆరోగ్య శ్రద్ధగా అంగీకరించకపోయినప్పటికిని, ఒక ప్రమాదము నిన్ను అపస్మారక స్థితిలోకి తెచ్చి, ఆసుపత్రికి తరలించబడినట్లయిన నీవు కోరుకొనని రక్తమార్పడి జరగకుండునట్లు నిన్ను నీవు రక్షించుకొనుటకు ఏమి చేయుదువు? ఔను, ఒక ప్రమాదము, లేక ఆకస్మికముగా క్షీణించిపోయిన నీ ఆరోగ్యపరిస్థితి అనుకొనని రీతిగా నీ విశ్వాసపు సవాలును ముఖాముఖిగా ఎదుర్కొనునట్లు చేయగలదు.
2 ఏ కారణముచేతనైన నీవు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చి, అక్కడొకరు రక్తమార్పిడి లేకుంటే నీవు చనిపోతావని చెప్పినట్లయిన నీ యథార్థతను కాపాడుకొనుటకు నీవేమి చేయుదువు? ఈ మాట నిజంగా నీ ఆరోగ్య పరిస్థితిని సూచిస్తున్నదని తొందపాటుతో దానిని అంగీకరిస్తావా? రక్తమును నీవు కోరుకొనవని పూర్తిగా ఒప్పింపబడియున్నావా? నీ విశ్వాసమునకు సవాలుయైన దీనిని ఎదుర్కొనుటకు సిద్ధముగాయుండి, ‘రక్తమును విసర్జింతువా?’—అ. కార్య. 15:28, 29.
3 కోరుకొననట్టి మరియు ఆత్మీయముగా కలుషితపూరితమైన రక్తమార్పిడిని విజయవంతముగా తిరస్కరించుట స్థిరమైన ఒప్పుదలతో ప్రారంభమగును. అట్టి ఒప్పుదల రక్తమునుగూర్చి బైబిలు చెప్పుదానిపైగల స్పష్టమైన గ్రహింపుపై ఆధారపడియుండవలెను. లేనియెడల ఆ ఘడియలో ఉత్పన్నమగు భావోద్రేకంలో ఆ పరిస్థితి నీకంటె బాగుగా తెలుసునని చెప్పుకొను ఒకరివలన నీవు సులభంగా బెదిరించబడగలవు. రక్తమును గూర్చి దేవునికంటె వైద్యులకు ఎక్కువ తెలియవచ్చునేమో అను ఆలోచనలోకి నీవు తప్పుగా నడిపింపబడుదువా? నిశ్చయముగా ఈ పరిస్థితులందు మానవమాత్రులు ఏమి చెప్పినను “స్థిరముగా తీర్మానించుకొని” యెహోవా దృష్టికి “యుక్తమైన దానిని” నీవు చేయగోరుదువు. (ద్వితీ. 12:23-25) అయితే ఈ సవాలునంతటిని నీమట్టుకు నీవే ఎదుర్కొనవలెనా?—ప్రసం. 4:9-12.
ఆసుపత్రి సమాచార సేవలు మరియు ఆసుపత్రి అనుసంధాన కమిటీలు
4 రక్తమార్పిడి సమస్యను ఎదుర్కొన్నప్పుడు సహాయమవసరమైన వారికి తోడ్పడుటకు, సొసైటి ఆసుపత్రి సమాచార సేవలు అను దానిని బ్రూక్లిన్‌లో ఏర్పాటు చేసినది. మరియు యు. ఎస్. లోని 100 పెద్ద పట్టణములలో ఆసుపత్రి అనుసంధాన కమిటీలను కూడా స్థాపించినది. ఈ కమిటీలు ఈ పనికొరకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన 600 మంది పెద్దలతో కూర్చబడియున్నవి.
5 ఆసుపత్రి సమాచార సేవలు రక్తములేకుండా చేయు వివిధ సర్జరీ మరియు చికిత్సల యొక్క లభ్యత మరియు దాని ఫలితమునుగూర్చిన సమాచారమును తెలుసుకొనుటకు ప్రపంచవ్యాప్తంగా 3,600 వైద్యపత్రికలందు పరిశోధన చేయకలదు. తదుపరి ఇది ఆసుపత్రి అనుసంధాన కమిటీలకు, ఆరోగ్యకేంద్రాలకు, మరియు కొంతమంది వైద్యులకు ఈ వైద్య ప్రగతికి సంబంధించిన కొంత సమాచారమును అందజేయును. (కొన్నిసార్లు ఆసుపత్రి సమాచార సేవలు రక్తములేకుండ చేయుటకు ఏమి చేయవచ్చునో చూపు వైద్య శీర్షికలను పంపి ఆసుపత్రిలో కొనసాగుచున్న వివాదమును విజయవంతముగా పరిష్కరించినవి) మన కేసులను న్యాయాధిపతులు ఎక్కువ వివేకముతో చూచునట్లు సహాయపడగల అనుకూలమైన కోర్టు తీర్మానములను అది కమిటీలకు అందించుచుండును. అంతేగాక సహకరించగల 7,000 మంది వైద్యుల రికార్డులను కాపాడుతూ, రక్తమార్పిడి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు కమిటీలు సరిక్రొత్త ఫైల్‌లను ఉపయోగించులాగున అది చూచును.
6 ఆసుపత్రి సమాచార సేవలు ఆసుపత్రి అనుసంధాన కమిటీల పనిని మరియు శిక్షణను కూడా పర్యవేక్షించుచుండును. అనుసంధాన కమిటీలు అవి నెలకొనియున్న పట్టణములందు ఆసుపత్రి వర్గముతో సంబంధాలను వృద్ధి చేసుకొను నిమిత్తమై వారికి క్రమముగా మంచిసమాచారముతో నిండిన వాటిని అందించుచుండును. అంతేగాక, మనకు రక్తములేకుండా చికిత్స చేయగల అదనపు వైద్యులను కనుగొనుమనియు ఈ వర్గమును కోరుదురు. ఈ సహోదరులు మీకు సహాయము చేయుటకై సిద్ధముగా యుందురు. అయితే దానిని ఎక్కువ ఫలవంతముగా వారు చేయునట్లు పునాది వేయునట్టి పనిగా మీరు తప్పక తీసుకొనవలసి అతి ప్రధానమైన ముందు చర్యలు గలవు.
అతి ప్రధానమైన ముందు చర్యలు—ఇప్పటికే వాటిని తీసికొనియున్నావా?
7 మొదట నీ కుటుంబములోని వారందరు వారి వ్యక్తిగత వైద్య నడిపింపు పత్రమును సంపూర్తిగా—తారీఖు, సంతకము, సాక్ష్యముతో పూరించుకొనియుండునట్లు నిశ్చయపరచుకొనుము. కొందరు సహోదరులు ఆసుపత్రికి తారీఖు వేయబడని/లేక సాక్ష్యములేని పత్రముతో వచ్చి దాని విలువ సవాలు చేయబడుటను ఎదుర్కొనిరి. బాప్తిస్మము పొందని మన పిల్లలందరు వారి గుర్తింపుకార్డులను పూరించుకొనియున్నారా? అట్లు చేయునట్లయిన మీ బిడ్డకు సంబంధించిన అత్యవసర పరిస్థితిలో రక్తముయెడల మీ స్థానమును మరియు ఎవరిని పిలవాలో ఆసుపత్రి సిబ్బింది ఎలా తెలుసుకుంటారు?
8 తదుపరి అన్ని సమయములందును ఈ పత్రములను ప్రతి ఒక్కరు కలిగియుండునట్లు చూడుము. ప్రతిదినము పాఠశాలకు వెళ్లుటకు ముందు, ఆట స్థలమునకు లేక వినోద ప్రాంతములకు వెళ్లుటకు ముందు మీ పిల్లలు వారియొద్ద దీనిని కలిగియుండునట్లు పరిశీలించుము. మనలో ప్రతి ఒక్కరము పనియొద్ద, సెలవులోనున్నప్పుడు, లేక క్రైస్తవ సమావేశమందును ఈ పత్రములు మనతో ఉండునట్లు నిశ్చయత కలిగియుండవలెను. అవిలేకుండా ఎప్పుడూ యుండవద్దు!
9 తీవ్రమైన పరిస్థితిలో ఆసుపత్రియొక్క అత్యవసర గదిలోకి, అపస్మారక స్థితిలో మరియు/లేక నీకై నీవు మాట్లాడలేని స్థితిలో తేబడవలసి వచ్చినట్లయిన ఏమి జరుగగలదో తలంచుము. ఆ పత్రము నీతో లేకున్నట్లయిన, నీ కొరకు మాట్లాడుటకు అప్పటికి ఇంకా పెద్దో లేక బంధువో ఆసుపత్రిలో లేనట్లయిన, నీకు రక్తము అవసరమను ముగింపుకొస్తే బహుశా నీవు రక్తమార్పిడిని పొందుతావు. ఊహించనిరీతిగా కొంతమందికి ఇది సంభవించింది. అయితే ఈ పత్రమును మనయొద్ద కలిగియున్నట్లయిన మన నిమిత్తము అది మాట్లాడి మన యిష్టమును తెలియజేయును.
10 అందుకొరకే వైద్యసంబంధమైన అభిప్రాయమును తెలుపు కడియము, లేక కంఠహారముకన్న వైద్యపత్రము చాలా శ్రేష్టము. ఎందుకనగా మొదటిది మన స్థానమునకు బైబిలు ఆధారమును కల్గిన కారణములను గాని లేక మనము తెలిపినదానిని దృఢపరచు సంతకములనుగాని కలిగియుండదు. ఒక సహోదరియొక్క పత్రమునుగూర్చి కెనడా న్యాయస్థానము ఇలా చెప్పినది: “[రోగి] తాను అపస్మారక స్థితిలోయున్నప్పుడు, లేక తన యిష్టమునుగూర్చి మాట్లాడలేనప్పుడు రక్తమార్పిడిని అంగీకరించలేనని ఆరోగ్యకేంద్రమునకేగాని లేక వైద్యులకేగాని తెలియపరచగల ఒకే ఒక సాధ్యమైన మార్గమును ఎన్నుకొనినది.” కాబట్టి ఎప్పుడును అది లేకుండా ఉండకుము.
11 మన వైద్య నడిపింపు ముఖ్యముగా అత్యవసర పరిస్థితులతో వ్యవహరించుటకు రూపించబడియున్నది కావున, ముందుగానే నిర్ణయించుకొని చేసుకొనే శస్త్రచికిత్స విషయములో మీ స్వంతగా వ్యక్తిగతమైన సంపూర్ణమైన వైద్య నడిపింపును (మన వైద్యనడిపింపుపై ఆధారపడి) వ్రాసియిచ్చుట జ్ఞానయుక్తముగా నుండును. అందు వివరములను అనగా శస్త్రచికిత్స విధానమును, వైద్యుల పేర్లను, ఆసుపత్రి పేరును చేర్చవచ్చును. ఇట్లు వ్రాసి నీయొక్క చికిత్స విధానమును నిశ్చయపరచుకొనుట నీ హక్కైయున్నది. నీవుగాని లేక వైద్యుడుగాని తీవ్రమైన సమస్యలను ఎదురుచూడనప్పటికిని అనుకొనని పరిస్థితులు ఉత్పన్నమైన సమయంలో ఈ నడిపింపును అనుసరించవలెనని వివరించుము.—సామె. 22:3.
12 ముందుగా ఎంపిక చేసుకొనుదానితోయైన లేక అత్యవసర చికిత్సతోనైన వ్యవహరించునప్పుడు తీసుకొనవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన మెట్టు ఏమనగా అవసరమైన వైద్యసిబ్బందితో మాట్లాడుట. ప్రత్యేకముగా ఎవరితో నీవు మాట్లాడవలెను?
వైద్యసిబ్బందితో మాట్లాడుము
13 వైద్యబృందము: ఇది మానవభయము ఆవరించకూడని సమయము. (సామె. 29:25) నీవు అనిశ్చయతగా ఉన్నట్లు కనిపించిన, వేరొకరు నీవు యథార్థముగా లేవని నిర్ణయించవచ్చును. శస్త్రచికిత్స అవసరమైనప్పుడు నిర్ణయించుకొన్నదేగాని లేక అత్యవసరమైనదేగాని నీవు లేక అత్యంత కుటుంబ సభ్యుడు శస్త్రచికిత్స బృందపు అధిపతితో తీర్మానపూర్వకముగా సూటియైన ప్రశ్నలను అడుగవలెను. ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమనగా ఆ బృందము రోగియొక్క కోరికలను గౌరవించి, అన్ని పరిస్థితులలోను రక్తములేకుండా చికిత్సచేయునా? ఈ అభయము లేకుండా నీవు బాగుగా కాపాడబడవు.
14 నీ కోరికలు ఏమైయున్నవో స్పష్టముగాను మరియు హుందాతో కూడిన ఒప్పుదలతో తెలియజేయును. నీ సమస్యకు రక్తములేని వైద్య నిర్వాహణను ప్రత్యామ్నయముగా నీవు కోరుచున్నావని స్పష్టపరచుము. ముందుగానే యిచ్చు నీ స్వంత వైద్య నడిపింపును మరియు బాధ్యతను నీపై వేసికొను ఫారములో ఆసుపత్రి విడుదల చేసినదానిని నెమ్మదిగా మరియు నమ్మకముతో చర్చించుము. సర్జను నీ యిష్టప్రకారముగా పనిచేయుటకు అయిష్టతను కలిగియుంటే ఆసుపత్రి పరిపాలనా అధికారిని నీకు ఇంకొక వైద్యుని చూపించమని కోరుకున్నట్లయిన సమయమును నీవు వృధా చేయకుందువు. ఇది ఆయన పనిలో భాగమైయున్నది.
15 రోగిమత్తును పర్యవేక్షించు వైద్యుడు: శస్త్రచికిత్సకి ముందు నీవు మాట్లాడవలసిన వైద్యబృందమంతటిలో ఈ వైద్యునితో మాట్లాడుటకు నీవు తప్పిపోకూడదు. శస్త్రవైద్యుడు ఆపరేషన్ చేయుచుండగా నిన్ను సజీవముగా ఉంచు బాధ్యత అప్పగింపబడుటయేగాక ఈ మత్తిచ్చు వైద్యుడే రక్తమును ఉపయోగించాలా లేదా అను తత్సంబంధ నిర్ణయములను చేయువాడు. కాబట్టి, కేవలము శస్త్రవైద్యునితో మాట్లాడినంత మాత్రాన నీవు పూర్తిగా సంరక్షించబడవు. మత్తిచ్చు వైద్యునితో నీ స్థానమును గూర్చి మాట్లాడి, ఒప్పింపజేసి దానిని గౌరవిస్తాడా లేదాయని నిర్ణయించుకొనవలెను.—లూకా 18:3-5 పోల్చుము.
16 మత్తిచ్చు వైద్యుని సాధారణ అలవాటు రోగిని బాగా రాత్రియైన తరువాతనో లేక శస్త్రచికిత్సకు కొంచెము ముందుగానో ఏదో కొద్దిగా చూచుటవలె కనిపించుచున్నది. అతను రక్తముయెడల నీ స్థానమును వ్యతిరేకించువాడైనట్లయిన అది చాలా ఆలస్యమౌవుతుంది. ముందుగానే నిర్ణయించుకొను శస్త్రచికిత్సతో సహకరించు మత్తు వైద్యుని ముందుగానే ఎన్నుకొని, ఆయనతో నీవు చాలా ముందుగానే మాట్లాడవలెనని శస్త్రవైద్యుడిని ఒత్తిడి చేయుము. అప్పుడు ఒకవేళ మొదటి వ్యక్తి నీ కోరికలకు అయిష్టముగానున్నట్లయిన ఇంకొకరిని చూచుకొనుటకు నీకు సమయముండును. నీ శస్త్రచికిత్సలో పాల్గొను మత్తిచ్చు వైద్యుని గూర్చి కూడా సంతృప్తి కలిగియుండు ఈ హక్కుకు వేరుగా ఎవరిని మాట్లాడనీయకుము.
17 దీనంతటికి, సంధికుదరని నీ స్థానమును నీవు స్పష్టము చేయవలెను. రక్తము కూడదు. నీ విషయమునకు రక్తములేని ప్రత్యామ్నయ వైద్య నిర్వహణను అడుగుము. నీ పరిస్థితికి నీకు తెలిసిన రక్తప్రత్యామ్నయములు ఏమైన ఉన్న తెలుపుము. వైద్య బృందము నీ విషయములో ఇవి ప్రయోజనకరముకాదని భావిస్తే వైద్య సాహిత్యములో ఇతర సాధ్యతలకొరకు పరిశోధించుమని అడుగుము. వారు కోరినట్లయిన లోనవ్ల బ్రాంచి ఆఫీసులోని ఆసుపత్రి సమాచార సేవలతో సంప్రదించమని నీ పెద్దలను అడుగుట ద్వారా వారికి కొంత సమాచారమును అందించగలనని అభయమివ్వుము.
నీ హక్కులను ప్రయోగించుట
18 బాధ్యతను నీపైన వేసుకొను ఫారమందలి మాటలను మరియు ప్రవేశించునప్పుడు ఆసుపత్రి నీ సమ్మతిని తెలుపుతు సంతకము చేయుమని కోరు ఫారమ్‌ను జాగ్రత్తగా పరిశీలించుము. కొన్నిసార్లు నీ కోరికలను గౌరవించుదుమని చెప్పిన వెంటనే ఆ తరువాతి పేరాగ్రాఫ్నందు సంతకము చేయు వ్యక్తి సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఆసుపత్రి “ప్రాణమును రక్షించు” చికిత్సను చేయుటకు అంగీకరిస్తున్నాడని తెలుపును. అందులో రక్తము కూడా చేరగలదు. అటువంటి ఏ వాక్యములనైనను మార్చి రక్తము తప్ప అని చేర్చుటకు లేక ఆ మాటను కొట్టి వేయుటకు నీవు హక్కు కల్గియున్నావు. నర్సులు నీవు అట్లు చేయుటకు వీలులేదని చెప్పుటకు ప్రయత్నించవచ్చును. కాని నీవు చేయవచ్చును! అటువంటి ఫారము వారితో ఒక ఒప్పందమనియు, నీవు అంగీకరించని ఒప్పందముపై నీవు సంతకము చేయలేవనియు వివరించుము. ఎవరైన మీ యిష్టానికి వ్యతిరేకంగా మిమ్ములను సంతకము చేయమని బలవంతపెట్టిన ఆసుపత్రి పరిపాలన అధికారితోగాని లేక ఆ ఆరోగ్యకేంద్రమందలి రోగియొక్క ప్రతినిధితోగాని మాట్లాడవలెనని అడుగుము.
19 అటువంటి వాటిని నీవు చేయవచ్చునా? ఔను, నీవు చేయవచ్చును. కాబట్టి రోగిగా నీ హక్కులనుగూర్చి తెలిసికొనియుండుము. ఈ మానవ హక్కులు ఆసుపత్రిలో నీవు ప్రవేశించుటతోడనే పోవటంలేదు. చికిత్స పొందు నిమిత్తము నీవు వాటిని వదలివేయనవసరంలేదు. ఎవరిని నీకు వేరుగా చెప్పనియ్యవద్దు.
20 అటువంటి హక్కును తెలుసుకొని అంగీకరించే హక్కు అని అంటారు. అనగా దాని భావము నీ అనుమతి లేనిదే ఏ విధమైన చికిత్సను నీపే ప్రయోగించకూడదు. కోరినట్లయితే చికిత్సనంతటిని నీవు తిరస్కరించవచ్చును. వైద్యబృందము ఏమి చెయ్యాలనుకుంటున్నది, దాని వలన తలెత్తు క్లిష్టమైన పరిణామములన్నిటిని స్పష్టముగా వివరించిన తరువాతనో చికిత్సకు నీ అంగీకారముండవలెను. తరువాత ఏవైన ప్రత్యామ్నయాలు వుంటే వాటిని వారు నీకు తెలియజేయవలెను. అవన్ని నీకు తెలియపరచబడిన తరువాత, ఏ విధమైన చికిత్స నీకు అవసరమో నీవు ఎన్నుకొనవచ్చును.
21 నీవు దేనిని ఒప్పుకొనుచున్నావో నిశ్చయత కలిగియుండుటకు నీవు అర్థము చేసుకొనలేని దేనిని గురించియైనను నీవు మంచి ప్రశ్నలను తప్పక అడుగవలెను. ప్రత్యేకంగా దీర్ఘపదములు, లేక ఆసుపత్రి సిబ్బందిచే వాడబడు వైద్య సంబంధమగు పదముల విషయములో, ఉదాహరణకు డాక్టరు ఒకవేళ “ప్లాస్మ” ఉపయోగించాలనుకుంటున్నానని అన్నట్లయిన, ఏమీ తెలియకయే, “ప్లాస్మ వాల్యూమ్ ఎక్స్పేండర్” అని నీవు అనుకొనవచ్చును. అందుకు అంగీకరించుటకు ముందు ఇట్లడుగుము: “అది రక్తము కలిసియున్న మిశ్రమమా?” తాను తెల్పు దేనిగూర్చియైనను, ఇట్లడుగుము: “ఆ చికిత్సలో రక్త ఉత్పత్తులను ఉపయోగించుట ఉన్నదా?” తాను ఉపయోగించగల ఒక పద్ధతిని తాను వివరించిన ఇట్లడుగుము: “ఈ పద్ధతిని ఉపయోగించు ఏ సమయమందైనను నా రక్తము ఎక్కడైన నిలువ ఉంటుందా?”
22 పైన చెప్పిన వాటన్నిటిని నీవు చేసినను ఇంకా నీతో అకౌంట్సు లేనట్లయిన లేక నీ స్థానమునకు ఇంకా వ్యతిరేకతయున్న నీవు ఏమి చేయవలెను? సహాయము నడుగుటకు వెనుకాడవద్దు. కొందరు సహాయమునడుగుటకు ఎక్కువ దీర్ఘకాలము వేచియుండి తమ స్వంత ప్రాణములనే అపాయములో పడవేసుకొనిరి.
అవసరమైన సమయములో విలువగల సహాయము
23 అవసరమైన సహాయమును పొందుటలో క్రింది పద్ధతులను గమనించుము: (1) నీవుకాని లేక నీకు ప్రియమైన వారు కాని ముందుగా నిర్ణయించుకొను శస్త్రచికిత్సనేగాని లేక అత్యవసర శస్త్రచికిత్సనేగాని ఎదుర్కొని, ఆసుపత్రిలో రక్తము కావాలంటున్నందున వివాదమేర్పడిన; లేక (2) నీ ఆరోగ్య పరిస్థితి లేక నీకు ప్రియమైన వారి పరిస్థితి తీవ్రముగా క్షీణించిపోయినట్లయిన; లేక (3) బిడ్డ (లేక పెద్దవారి) విషయములో వైద్యుడుగాని, నర్సుగాని లేక పరిపాలన అధికారిగాని కోర్టు ఆర్డరు తేబోతున్నామని తెలిపిన, అప్పుడు:
24 అప్పటివరకు నీవు చేయునట్లయిన స్థానిక పెద్దలను పిలువుము. (నిజమునకు, రక్తముయెడల మనకున్న స్థానమును బట్టి ఆరోగ్యకేంద్రమునకు వెళ్లవలసివచ్చిన ఏ సమయమందైనను పెద్దలను జాగరూకులను చేయుట వివేకయుక్తమైన విధానము.) తరువాత తప్పక అవసరమనిపించిన లోనవ్ల బ్రాంచి ఆఫీసునందలి ఆసుపత్రి సమాచారసేవలను పెద్దలు సంప్రదించుదురు.—యెషయా 32:1, 2.
25 ఆసుపత్రి సమాచార సేవలకు మీ ప్రాంతములో సహకరించగల వైద్యుడు తెలిసియుండవచ్చును. లేక నీకు అతిసమీపముగా నున్న వారితో మీకు సంబంధమేర్పడునట్లు చూడగలగవచ్చును. లభ్యముకాగల రక్తములేని వైద్యనిర్వహణకు తగు ప్రత్యామ్నయమును వారు సూచించవచ్చును. అయినను ఈ సహోదరులు నీ కొరకు తీర్మానములు చేయలేరు. కాని ఈ విషయములందు సొసైటి దృక్పథమును పరిశీలించుటకు మీకు సహాయపడి వైద్యపరంగా మరియు చట్టపరంగా మీరు ఎన్నుకొను విషయములో మిమ్ములను మేల్పొల్పగలరు.
26 వైద్యబృందము ఇంకా సహకరించుటకు సుముఖంగా లేనట్లయిన ఆసుపత్రి పరిపాలనాధికారితో వారి స్థానములో నీ కోరికలను గౌరవించగల బృందమును ఏర్పరచుమని మాట్లాడుము. పరిపాలనాధికారి అట్లు చేయుటకు వెనుకాడినట్లయిన, వేరొకచోట సిద్ధముగానున్న ఇంకొక సర్జన్ నీకు ఖచ్చితముగా ఉండి, అచ్చటికి మారగలిగి నప్పుడే, ఆ పరిపాలనాధికారికి నీకు సహకరించని వైద్యుల పేర్లు తెలుపుతూ వారిని మీకు చికిత్స చేయుట నుండి తొలగించుతున్నానని వ్రాస్తూ, సంతకము మరియు తారీఖు వేసి ఇవ్వవచ్చును.
27 దానిని నీవు చేయగలవా? ఔను, ఆ హక్కును నీవు కలిగియున్నావు. విషయము తరువాత న్యాయాధిపతి ఎదుటికి తేబడవలసి వస్తే నీవు వ్రాసి యిచ్చినది నీ కోరికలను తాను గుర్తించు విషయములో ఎంతో ఉపయోగపడగలదు. నైతికముగా ఇతర సర్జన్లును మీ విషయములో ముందుకు వచ్చి వారి సేవలను మీకందించుటకు వీలు కల్గించును. అతి ప్రాముఖ్యముగా అట్లు చేయుట నీ పరిస్థితి అపాయకరంగా క్షీణించి పోవకముందే అవసరమైన వైద్య శ్రద్ధను నీకందించును. అంత దీర్ఘకాలము వేచియుండవద్దు!
28 ఆరోగ్యభీమాను పొందమని ఎవరికిని మేము చెప్పలేకపోయినప్పటికిని, తరచు వైద్యఖర్చుల నిమిత్తము తగినంతలేని వారి చికిత్సకు సాధారణంగా సహకరించగల ఒక వైద్యుని పొందటంలో తరచు మనము గంభీరమైన సమస్యలను కలిగియున్నామని మీకు తప్పక తెలియపరచవలసివస్తుంది.
కనిపెట్టవలసిన భారమైన ప్రశ్నలు
29 వైద్యులు మరియు ఇతరులవలన ఎప్పుడూ మంచి ఉద్దేశ్యముతోనే అడగబడని కొన్ని ప్రశ్నలుండునని నీవు తెలుసుకొనవలెను. వైద్యులవలన (మరియు కొందరు న్యాయాధిపతులవలన) ఎక్కువ తరచుగా అడగబడేది ఒకటేమిటంటే:
• ‘ప్రాణమును రక్షించు రక్తమార్పిడిని’ అంగీకరించకుండా నీవు చనిపోతావా? (నీ బిడ్డను చనిపోనిస్తావా?)
30 దానికి ఔను అని నీవు జవాబిస్తే, మతసంబంధమైన భావములో అది సరియే. అయితే, ఆ జవాబు తరచు తప్పుగా అర్థము చేసుకొనబడి కొన్నిసార్లు చివరకు విరుద్ధమైన కోర్టు తీర్పులకు దారితీస్తుంది. ఈ సమయములో నీవు పరిచర్యయందులేవని గుర్తుంచుకొనవలెను. బదులుగా అవసరమైన వైద్యచికిత్సను గురించి ఇక్కడ మాట్లాడుతున్నావు. కాబట్టి నీవు మాట్లాడువారికి తగినట్లు అది వైద్యపరంగా, లేక చట్టపరంగా ఉండవలెను.—కీర్త. 39:1; కొలొ. 4:5, 6.
31 ఒక వైద్యుడు, న్యాయాధిపతి, లేక ఆసుపత్రి పరిపాలనాధికారికి “ఔను” అనునది నీవు ప్రాణత్యాగము చేయువానిగాను, నీ విశ్వాసము నిమిత్తమై నీ బిడ్డను బలిచ్చువానివిగాను అర్థమివ్వగలదు. పునరుత్థానము యెడల నీకున్న బలమైన విశ్వాసమును తెలియజేయుట ఈ పరిస్థితిలో అక్కరకు రాదు. ప్రాణము అపాయములో నున్నప్పుడు కారణసహితమైన తీర్మానములను చేసికొనలేని మతోన్మాదిగా వారు నిన్ను ముద్రించుదురు. పిల్లల విషయములోనైతే పైకి “ప్రాణమును రక్షించు” దానిగా కనపడు వైద్య చికిత్సను తృణీకరించు నిర్లక్ష్యమైన తండ్రి లేక తల్లిగా చూతురు.
32 అయితే నీవు వైద్యచికిత్సను తిరస్కరించుట లేదు. కేవలము చికిత్స విధానమందు వైద్యునికి భిన్నముగా ఉన్నావు. ఈ స్థానము తరచు వారికిని మరియు నీకును సంపూర్ణ రూపమును మార్చును. అంతేగాక రక్తము సురక్షితమైనదని, అదియే “ప్రాణమును రక్షించునదని” అనిపించునట్లు చూపుట వారి భాగమందు తప్పుదారిని పట్టించుటైయున్నది. (హౌ కెన్ బ్లడ్ సేవ్ యువర్ లైఫ్?, పేజీలు 7-22ను చూడుము.) కాబట్టి ఆ అంశమును నీవు బహుగా స్పష్టము చేయవలెను. దానినెట్లు చేయగలవు? నీవిట్లు సమాధానమివ్వవచ్చును:
• “నేను (నా బిడ్డ) చనిపోవుటకు యిష్టపడటంలేదు. నేను (నా బిడ్డ) చనిపోవాలనుకున్నట్లయిన, యింటియొద్దే యుందును. నా విషయంలో ప్రత్యామ్నయముగా రక్తములేని వైద్య నిర్వహణను జరిపించమనియే నేను కావాలంటున్నది. లభ్యముకాగల ప్రత్యామ్నయాలు ఉన్నవి.”
33 న్యాయాధిపతులవలన మరియు వైద్యులవలన అడుగబడు అనేక ఇతర ప్రశ్నలేమనగా?
• “కోర్టు ఆర్డరు ద్వారా మార్పిడి బలవంతముగా చేయబడితే నీ పరిస్థితి ఏమి? అందుకు నీవు బాధ్యుడవవుతావా?”
• “నీపై బలవంతపరచబడిన మార్పును అంగీకరించుటద్వారా లేక కలిగియుండుట ద్వారా మీ మతము నుండి నీవు వెలివేయబడతావా లేక నిత్యజీవము పోతుందా? మీ సంఘమువలన నీవెట్లు చూడబడతావు?
34 అందుకు ఒక సహోదరి అటువంటి పరిస్థితిలో ఆయన చేసిన తీర్మానానికి తాను బాధ్యురాలిని కానని న్యాయాధిపతికి ఉత్తరమిచ్చెను. ఒక విధమైన దృక్పథంలో అది సరియేయైనను, దానిని న్యాయాధిపతి ఆమె అందుకు బాధ్యురాలు కావటంలేదు గనుక ఆ బాధ్యతను తాను తనపై వేసుకొనవచ్చునని తలంచి మార్పిడిని ఆజ్ఞాపించెను.
35 ఈ ప్రశ్నలను అడుగుటలో నీవు రక్తమును అంగీకరించకపోవటంలో ఏదైన వారికి మార్గం దొరుకుతుందాయనియే వారి ఉద్దేశ్యమని నీవు అర్థం చేసుకొనవలెను. అనాలోచనగా దానిని వారిచేతిలోకి వదలివేయవద్దు. అట్టి తప్పు గ్రహింపును మనమెట్లు నిరోధించగలము? నీవు ఈ విధంగా జవాబివ్వవచ్చును:
• “రక్తము నాకు బలవంతముగా యివ్వబడితే, అది నాకు నేను లైంగికముగా బలాత్కారమునకు గురియైతే ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. నేను కోరని అట్టిముట్టడి నాపై జరిగినందుకు నేను భావోద్రేకంగా మరియు ఆత్మీయంగా దాని ఫలతములను తదుపరి నా జీవితమంతా అనుభవిస్తాను. ఆ విధంగా నా అంగీకారము లేకుండా నా శరీరమును చెరుపుటను నా శక్తి కొలది నేను ప్రతిఘటిస్తాను. లైంగిక బలాత్కారము విషయములో చేయునట్లే నాపై ముట్టడించినవారిని చట్టపరంగా శిక్షించుటకు ప్రతివిధమైన ప్రయత్నము చేస్తాను.”
36 బలవంతముగా మార్పిడిని చేయుట అత్యంత తీవ్రముగా మన శరీరములను చెరుపుటయేనను బలమైన మరియు స్పష్టమైన వివరణను యివ్వవలెను. అది ఎంతమాత్రము సామాన్య విషయము కాదు. నీ ఆధారమును గట్టిగా పట్టుకొనుము. ప్రత్యామ్నయముగా రక్తములేని వైద్య నిర్వాహణను నీవు కోరుతున్నావని స్పష్టము చేయుము.
సిద్ధముగా యుండుటకు నీవేమి చేయుదువు?
37 నిన్ను మరియు నీ కుటుంబమును కోరబడని రక్తమార్పడినుండి రక్షించుకొనుటకు నీవు చేయవలసిన కొన్ని విషయములను మనము పునఃపరిశీలించాము. (తరువాత శిశువులు మరియు పిల్లల రక్తమార్పిడి విషయములో బెదిరించబడినప్పుడు తలెత్తు సమస్యలను పరిష్కరించుటలో వివరమైన సమాచారమును అందిస్తామని మేము నిరీక్షిస్తున్నాము.) అవసరమైన సమయములో సహాయమునందించుటకు సొసైటి ఏమి చేసినదో కూడా మనము చూశాము. విశ్వాసమును సవాలు చేయు వైద్యపరిస్థితిని ఎదుర్కొనుటకు నీవు సిద్ధముగాయున్నావని నిశ్చయపరచుకొనుటకు ఈ సమాచారముతో నీవు ఏమి చేయవలెను?
మొదట: ఈ విషయములను ప్రత్యేకముగా అత్యవసర పరిస్థితిలో ఏమి చెప్పాలి, చెయ్యాలి అను వాటి కొరకు పదేపదే అభ్యసించి చూచుకొనుటకు కుటుంబ చర్చను కలిగియుండుము.
తరువాత: మీకందరికి కావలసిన పత్రములు ఉండులాగున చూచుకొనుము.
ఆ తరువాత: “రక్తమును విసర్జించుడి” అను దానిపై స్థిరముగా నిలువబడి యుండుటకు నీకు తోడ్పడుమని యెహోవాకు చేయు ప్రార్థనలో దానిని ఒక తీవ్రమైన విషయముగా చేయుము. రక్తము విషయములో ఆయన ఆజ్ఞకు లోబడుట నిరంతర జీవితముకొరకు ఆయన దయను పొందు అభయమివ్వగలదు.—అ. కార్య. 15:29; సామె. 27:11, 12.
[9వ పేజీలోని బాక్సు]
ఏదైన వైద్య పరిస్థితి నీవు మార్పిడిని బెదరించుబడునంత తీవ్రముగా క్షీణించినట్లయితే, నీవు చేయవలసిన దానికొరకు ఈ బాక్స్‌ను పరిశీలించుము:
1. నీకు సహాయము చేయుటకై మీ సంఘములోని పెద్దలను పిలువుము.
2. అవసరమైనట్లయిన పెద్దలు లోనవ్ల బ్రాంచి ఆఫీసులోని ఆసుపత్రి సమాచార సేవలను పిలుచునట్లు చూడుము.
3. వైద్యులతోను మరియు ఇతరులతోను మాట్లాడుటయందు పెద్దలు మీకు సహాయపడగలరు.
4. ప్రస్తుత సర్జన్లకు ప్రత్యామ్నయముగా ఇతర వైద్యులకు సంప్రదించుటలో పెద్దలు నీకు సహాయపడగలరు.
5. అవసరమైన చికిత్సకై గౌరవప్రదమైన సౌకర్యమునకు మారుటలో కూడా పెద్దలు నీకు సహాయపడగలరు.
[7వ పేజీలోని బ్లర్బ్]
అవసరమైనప్పుడు ఈ సమాచారమును వెంటనే కనుగొనగల చోట ఉంచుము.