కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 1/8 పేజీలు 15-17
  • ఎయిడ్స్‌ రాకుండా నేనెలా కాపాడుకోగలను?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎయిడ్స్‌ రాకుండా నేనెలా కాపాడుకోగలను?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎయిడ్స్‌—వాస్తవంనుండి కట్టుకథను వేరుచేయుట
  • “సురక్షిత సంభోగమా?”
  • ఒత్తిళ్లు
  • కాదని చెప్పడం
  • ఎయిడ్స్‌—నేను అపాయంలో ఉన్నానా?
    తేజరిల్లు!—1993
  • ఎయిడ్స్‌—ఎలా ఎదుర్కోవాలి
    తేజరిల్లు!—1998
  • ఎయిడ్స్‌—యౌవనస్థులకొక క్లిష్టమైన సమస్య
    తేజరిల్లు!—1992
  • ఎయిడ్స్‌—తలిదండ్రులు, పిల్లలు దాన్నిగూర్చి ఏమి తెలుసుకోవాలి
    తేజరిల్లు!—1992
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 1/8 పేజీలు 15-17

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

ఎయిడ్స్‌ రాకుండా నేనెలా కాపాడుకోగలను?

“ఇలా జరగడానికి నాకైనేను అనుమతించినందుకు ఇది నన్నెంతో ఉద్రేకురాల్ని చేసింది,” అని కాయె అనే స్త్రీ చెబుతుంది. “నేనావిధంగా ప్రవర్తించడానికి కోరుకున్నందువల్ల, నేను భవిష్యత్తులో ఉత్తమమైనవాటిని ఎన్నుకొనే అవకాశాలను కోల్పోయాను.” (న్యూస్‌వీక్‌ పత్రిక, ఆగస్టు 3, 1992) కాయె తన 18వ యేటనే ఎయిడ్స్‌ వైరస్‌కు గురైంది.

అమెరికాలో ప్రాణాంతకమైన హెచ్‌ఐవి (మానవ వ్యాధినిరోధకశక్తిని తగ్గించే వైరస్‌) వ్యాధిగ్రస్థులైయున్న పది లక్షలమందిలో కాయె ఒకతి—వైద్యులు చెబుతున్నట్లుగా ఈ వైరస్‌ వల్లనే భయంకరమైన ఎయిడ్స్‌వ్యాధి వస్తుంది.a ఎంతమంది యౌవనులకు ఈ వ్యాధి సోకిందో ఎవరికీ వాస్తవంగా తెలీదు, కాని స్పష్టంగా యౌవనులు చింతిస్తున్నారు. ఒక సర్వే చూపిన ప్రకారం బ్రిటీష్‌ యౌవనుల్లో, ఎయిడ్స్‌ వ్యాధిని గూర్చిన చింతే ఎక్కువగావుంది. ఈలాంటి చింతవున్నప్పటికీ, యు.ఎస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ చెప్పేదేమంటే: “అనేకమంది యువకులు హెచ్‌ఐవి సోకడానికి అనువుగావున్న కార్యకలాపాల్లో నిమగ్నమైనట్లు రిపోర్టులు వస్తూనేవున్నాయి.”

ఎయిడ్స్‌ ఎల్లప్పుడూ వినాశనకరమైంది, మరియు యిది మహమ్మారిలా ప్రపంచమంతటా వ్యాప్తిచెందుతుంది. దానినుండి నిన్ను నీవెలా తప్పించుకోగలవు?

ఎయిడ్స్‌—వాస్తవంనుండి కట్టుకథను వేరుచేయుట

యు.ఎస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ తయారుచేసిన చిన్నపుస్తకం యిలా వివరిస్తుంది: “హెచ్‌ఐవి అంటువ్యాధి ‘ఊరకే సంభవించదు.’ రొంప లేదా విషజ్వరం వలే మీరు దానికి ‘గురికాలేరు.’” కాబట్టి, ఆకస్మికంగా ప్రతిరోజూ ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులతో కలిసిమెలసి ఉండటం ప్రమాదకరమైందిగా కన్పించడంలేదు. ఎయిడ్స్‌ వ్యాధిగల తోటివిద్యార్థులనుండి, కేవలం మీరు అతనికి లేదా ఆమెకు దగ్గరగా కూర్చున్నందువల్లే ఎయిడ్స్‌ వ్యాధి వస్తుందని చింతించాల్సిన పనిలేదు. హెచ్‌ఐవి వైరస్‌ గాలిద్వారా వ్యాపించేదికాదు గనుక, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థుడు దగ్గినా లేదా తుమ్మినా మీరు కలతచెందనవసరం లేదు. వాస్తవంగా, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులున్న కుటుంబాల్లో కుటుంబ సభ్యులు తువాళ్లు, భోజనం చేసే పాత్రలు, పళ్లుతోముకునే బ్రష్‌లుకూడ ఒకరివి మరొకరు ఉపయోగించినప్పటికి వ్యాధి యితరులకు అంటుకోలేదు.b

ఎందుకంటే ప్రాణాంతకమైన ఈ వైరస్‌ ఒక వ్యక్తియొక్క రక్తంలోను శుక్లంలోను స్త్రీజననేంద్రియ స్రావాల్లోను నివసిస్తుంది. అయితే, చాలా సందర్భాల్లో, లైంగిక సంయోగంవల్ల అంటే సలింగసంయోగం లేదా భిన్నసంయోగంవల్ల ఎయిడ్స్‌ వ్యాధి వ్యాపిస్తుంది.c సూదులు లేదా సిరంజీలు ఒకరివి మరొకరు ఉపయోగించడంవల్ల, తరచూ హెచ్‌ఐవి సోకిన ఎవరో ఒకరితో మాదకద్రవ్యాలు సేవించడం ద్వారా అనేకమంది వ్యాధిగ్రస్థులయ్యారు.d బాగా స్క్రీనింగ్‌ చేయడంద్వారా ఈ ప్రమాదం “చాలామట్టుకు నివారించబడింద”ని వైద్యులు చెబుతున్నప్పటికీ, రక్తాన్ని ఎక్కించడంద్వారా కూడ ఎయిడ్స్‌ వ్యాధి సోకుతుంది.

కాబట్టి ఎవరైనా వివాహానికిముందు సంభోగంలో పాల్గొన్నా లేదా చట్టవిరుద్ధ మాదకద్రవ్యాలను ఎక్కించే ప్రయోగాలు చేసినా ఎయిడ్స్‌ అంటువ్యాధి సోకే ప్రమాదం అమితంగావుంది. నిజమే, సంభోగంలో పాల్గొనే సహయోగి నీరసంగా వున్నట్లు కన్పించకపోవచ్చు. కాని వాలంటరీ హెచ్‌ఐవి కౌన్సలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌: ఫ్యాక్ట్స్‌, ఇష్యూస్‌, అండ్‌ ఆన్సర్స్‌ అనే చిన్న పుస్తకం యిలా గుర్తుచేస్తుంది: “ఎవరి ముఖమైనా చూచి మీరు అతనికి లేదా ఆమెకు హెచ్‌ఐవి అంటువ్యాధి ఉందని చెప్పలేరు. ఎవరైనా మంచి ఆరోగ్యంగా ఉన్నట్లు కన్పించవచ్చు, భావించవచ్చు, అయిననూ వ్యాధిగ్రస్థుడైయుండవచ్చు. అందువల్లనే, హెచ్‌ఐవి అంటువ్యాధి అనేకమంది ప్రజలకున్నప్పటికి అది వారికి తెలియదు.”

“సురక్షిత సంభోగమా?”

కాబట్టి అనేకమంది ఆరోగ్య సిబ్బంది మరియు శిక్షకులు కండోమ్‌ల ఉపయోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.e ఈ గర్భనిరోధక సాధనం సంభోగాన్ని “సురక్షితం” చేస్తుందని లేదా కనీసం “ప్రమాదం నుండి తప్పిస్తుందని” టీవీ ప్రకటనలు, ప్రకటన కాగితాలు, పాఠశాల ప్రసంగాలు ఈ సందేశాన్ని వ్యాప్తిచేశాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కండోమ్‌లను పంచిపెట్టారు కూడ. అలాంటి పుకారువల్ల పురికొల్పబడి, ఎన్నడూ లేనంతగా ఎక్కువమంది యౌవనులు వాటిని ఉపయోగిస్తున్నారు.

అయినప్పటికి, “సురక్షిత సంభోగం” నిజంగా సురక్షితమైనదేనా? అమెరికన్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థచే ప్రచురించబడిన ఒక బ్రోషూర్‌ యిలా చెబుతుంది: “అంటువ్యాధి రాకుండా ఉండే మీకున్న అవకాశాల్ని కండోమ్‌లు మెరుగుచేయవచ్చు.” కాని ఎల్లప్పుడూ ప్రాణాంతకమైందని నిరూపించే అంటువ్యాధి రాకుండా ఉండే ‘మీకున్న అవకాశాల్ని మెరుగుచేసినంత’ మాత్రాన మీరు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారా? అమెరికాలో వ్యాధి అదుపుచేసే కేంద్రాలు యిలా ఒప్పుకుంటున్నాయి: “సున్నితమైన రబ్బరు కండోమ్‌లు హెచ్‌ఐవి అంటువ్యాధి మరితర సుఖవ్యాధులు సోకకుండా కాపాడటానికి సహాయం చేస్తున్నట్లు చూపబడింది. . . . కాని అవి పూర్తి హామీ యివ్వవు.” నిజమే, అవి పగిలిపోవచ్చు, చిరిగిపోవచ్చు, లేదా సంభోగించేటప్పుడు ఊడిపోవచ్చు. టైమ్‌ పత్రిక ప్రకారం, కండోమ్‌లు “పదినుండి పదిహేను శాతం వరకూ విఫలమవ్వవచ్చు”! అంత విపరీతమైన రీతిలో నిరుపయోగమౌతుంటే మీరు మీ జీవితాన్ని చిక్కుల్లో పెట్టుకుంటారా? ఇంకా విపరీతమైన విషయమేమంటే, అమెరికాలో లైంగిక విషయాల్లో జోరుగావున్న యౌవనుల్లో సగంకంటే తక్కువమంది యీ కండోమ్‌లను ఉపయోగిస్తున్నారు.

అందుకే సామెతలు 22:3లోని సలహా సమయానుకూలమైంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.” ఎయిడ్స్‌ రాకుండా కాపాడుకొనే శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటేమంటే మాదకద్రవ్యాలు సేవించకుండా, అనైతిక సంభోగం చేయకుండా పూర్తిగా మానివేయడమే. చెప్పడం సులభమేకాని ఆచరణలో పెట్టడం కష్టమని మీరు భావిస్తున్నారా? ప్రాముఖ్యంగా యౌవనులు ఎదుర్కొంటున్న అపరిమిత ఒత్తిళ్ల దృష్ట్యా, చాలామంది ఆలాగే భావిస్తారు.

ఒత్తిళ్లు

‘ఈడు వచ్చినప్పుడు’ లైంగిక కోరికలు అధికమౌతాయి. (1 కొరింథీయులు 7:36) ప్రస్తుతం, టీవీ, చలనచిత్రాల ప్రభావం దానికి తోడౌతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, యౌవనులు ప్రతిరోజు ఐదు కంటే ఎక్కువ గంటలు లైంగిక అవినీతితో నిండిన టీవీ చూస్తున్నారు. కాని అస్వాభావికమైన టీవీ ప్రపంచంలో, సంభోగంవల్ల దుష్ఫలితాలే కానరావు. అమెరికా టీవీపై జరిపిన ఒక అధ్యయనం వెల్లడిచేసిందేమంటే, “వివాహంకాని భిన్న సంయోగ జంటలు, వివాహమైన స్త్రీపురుషులకంటే నాలుగు నుండి ఎనిమిది రెట్లు ఎక్కువ తరచుగా సంభోగిస్తున్నారు. గర్భనిరోధక పద్ధతులు అసలు పాటించరు లేదా ఉపయోగించరు, కాని స్త్రీలు గర్భం ధరించనే ధరించరు; వారు వ్యభిచారులు లేదా సలింగసంయోగులైతేనే తప్ప లేకపోతే స్త్రీపురుషులకు సుఖవ్యాధులు సంక్రమించడం అరుదు.”—సెంటర్‌ ఫర్‌ పాప్యులేషన్‌ ఆప్షన్స్‌.

అలాంటి టీవీ కార్యక్రమాలు అధికంగా చూస్తే, అది నిజంగా మీ ప్రవర్తనపై ప్రభావం చూపుతుందా? ఔను, గలతీయులు 6:7, 8లోని బైబిలు నియమం ప్రకారంగా: “మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును.” నాలుగు వందలమంది యౌవనులపై జరిపిన ఒక అధ్యయనం తెల్పేదేమంటే, “‘లైంగికతతో’ కూడిన టీవీ ప్రదర్శనలు తక్కువగా తిలకించిన వారికంటే ఎక్కువగా తిలకించినవారే లైంగికంగా చురుగ్గా ఉన్నారు.”

తోటివయస్కుల నుండి ఒత్తిడియనేది మరొక శక్తివంతమైన ప్రభావం. “నాకు అనురూపంగా ఉండే గుంపు కొరకు చూస్తున్నాను, అది చాలా కష్టం,” అని ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి ఒప్పుకుంటున్నాడు. “నేను నిజంగా అనేకసార్లు అవినీతికరమైన పరిస్థితిలో నాకు నేనే పడిపోయాను. . . . నాకు ఎయిడ్స్‌ వ్యాధి సోకినట్లు నిర్ధారించబడింది.” ఆలాగే బైబిలు కాలాల్లో యౌవనులు కూడ తరచూ తోటివయస్కుల ఒత్తిడికి గురయ్యారు. బైబిలు సలహా ఏమిటి? “నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము,” అని సామెతల రచయిత చెప్పాడు.—సామెతలు 1:10.

కాదని చెప్పడం

సంభోగించుటకు తిరస్కరించడం వాస్తవమైంది కాదని “సురక్షిత సంభోగాన్ని” ప్రోత్సహించేవాళ్లు వాదిస్తారు. కాని చివరకు, నిజంగా అది అవినీతిని విడిచిపెట్టడానికి సహాయపడుతుందా? ఇది యౌవనులను కేవలం గందరగోళం చేస్తుందని ఒప్పుకుంటూ ఒక యౌవనుడు యిలా చెబుతున్నాడు: “వారు ఊరకే సంభోగాన్ని కాదనమని చెప్తారేగాని, అది స్వచ్ఛమైనది నీతియుక్తమైందైతే పర్వాలేదంటారు. అదే సమయంలో, వారు [కండోమ్‌లు] పంచిపెట్టి, దుష్పరిణామాలు పొందకుండా ఎలా సంభోగించాలో మాతో చెబుతారు.”

అలాంటి నైతిక గందరగోళానికి బాధితులు కావద్దు. ఎయిడ్స్‌ అంటువ్యాధి సోకే ప్రమాదానికి గురిచేసే ప్రవర్తనను విసర్జించమని బైబిలు—అది పాతకాలంనాటిదిలా కన్పించినప్పుటికి—మీకు ఉద్బోధిస్తుంది. మీరు ‘రక్తాన్ని విసర్జించండి,’ అని చెప్పిన బైబిలు ఆజ్ఞకు లోబడితే, మీరు రక్తం ఎక్కించుకొనడం ద్వారా ఎయిడ్స్‌ వ్యాధికి గురికారు. (అపొస్తలుల కార్యములు 15:29) “అభిచారము”నకు విరుద్ధంగా ఇచ్చిన బైబిలు సలహాను పాటించండి, అప్పుడు మీరు కలుషితమైన సిరంజి సూదిద్వారా అంటువ్యాధి వస్తుందని భయపడనక్కర్లేదు. (గలతీయులు 5:20; ప్రకటన 21:8; ది కింగ్‌డమ్‌ ఇంటర్లీనియర్‌) ప్రాముఖ్యంగా బైబిల్లోని లైంగిక నీతినియమము మిమ్మల్ని సంరక్షిస్తుంది. బైబిలు ఆజ్ఞాపించేదేమంటే, “జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.” (1 కొరింథీయులు 6:18) ఎయిడ్స్‌ సంక్షోభం ఆ మాటల్లోని జ్ఞానాన్ని నొక్కితెల్పుతుంది.

ఒక యౌవనుడెలా అవినీతికి “దూరముగా పారిపో”గలడు? సంవత్సరాల తరబడి, “యౌవనస్థులు ఇట్లడుగుదురు . . . ” అనే శీర్షికలు (ఇంగ్లీషులో), గుంపులుగా ఉండి చెట్టాపట్టాలేసుకుని తిరగడం చేయడం, రాజీపడే పరిస్థితులను విసర్జించడం (నిలిచియున్న కారులో లేదా మేడగదిలో లేదా ఒక గదిలో స్త్రీపురుషులు ఒంటరిగా ఉండటం వంటి పరిస్థితులు), అనురాగాన్ని వ్యక్తం చేయడంలో హద్దులేర్పర్చడం, మత్తుపానీయం (అది తరచూ సరియైన నిర్ణయం తీసుకొనకుండ ఆటంకపరుస్తుంది) ఉపయోగించకుండడం, మరియు పరిస్థితి మోహంతో పురికొల్పేలా తయారైనప్పుడు కాదని చెప్పడం వంటి అనేకమైన ప్రయోగాత్మక సలహాలను యిచ్చాయి.f ఏమైనప్పటికీ, ఎవరూ కూడ మిమ్మల్ని భౌతికంగానే కాకుండా ఆత్మీయంగా కూడ నాశనంచేసే ప్రమాదంలో దించే ఒత్తిడి చేయడానికి అనుమతించవద్దు. (సామెతలు 5:9-14) “మీ జీవితాన్ని వేరొకరికి అప్పగించాలని కోరుకుంటారా?” అని అమీ అనే అవివాహిత యౌవన స్త్రీ అడిగిన ప్రశ్నను న్యూస్‌వీక్‌ పత్రికలో ఒక శీర్షిక ఎత్తివ్రాసింది. ఆమె ఉన్నత పాఠశాలనుండి గ్రాడ్యుయేషన్‌ పొందక మునుపే ఆమె తన ప్రియునిద్వారా హెచ్‌ఐవి వ్యాధిని సంక్రమించుకుంది. ఆమె యిలా నొక్కిచెప్పింది: “చనిపోవడానికి అర్హులెవరు, బాలుడా లేదా బాలికా? అది నాకు అనుమానంగానే ఉంది.” (g93 9/8)

[అధస్సూచీలు]

a ఉదాహరణకు, ఏప్రిల్‌ 22, 1986; ఏప్రిల్‌ 22, 1989; ఏప్రిల్‌ 22, 1992 ఇంగ్లీష్‌ సంచికల్లో “యౌవనస్థులు ఇట్లడుగుదురు . . . ” అనే శీర్షికలను చూడండి.

b అమెరికా మాజీ సర్జన్‌ జనరల్‌ అయిన డా. సి. ఎవరెట్‌ కూప్‌ యిలా చెబుతూ సందేహాలకు సమాధానమిచ్చాడు: “ఈ దేశంలో, మొట్టమొదటిగా 1981లో ఎయిడ్స్‌ వ్యాధిగురించి రిపోర్టు చేయబడింది. ఒకవేళ ఎయిడ్స్‌ సాధారణంగా, లైంగిక ప్రమేయం లేకుండానే సోకినట్లైతే, ఈపాటికి మాకు తెలిసేవుండేది.”

c నోరు, గుదంద్వారా సంయోగించడం దీనిలో యిమిడివుంది.

d యు.ఎస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఇంకనూ యిలా హెచ్చరిస్తుంది: “మీ చెవులు కుట్టించుకోవాలనుకుంటే . . . , సరిక్రొత్త లేదా శుద్ధిచేసిన సాధనాలనుపయోగించే యోగ్యతగల వ్యక్తి దగ్గరకే వెళ్లడానికి నిర్ణయించుకోండి. ప్రశ్నించడానికి సిగ్గుపడవద్దు.”

e ఎఫ్‌డిఎ కన్‌స్యూమర్‌ అనే పత్రిక యిలా వివరిస్తుంది: “కండోమ్‌ అనేది మొత్తం పురుషాంగాన్నంతా కప్పేటటువంటి ఒక తొడుగు. వీర్యం, రక్తం, మరియు స్త్రీజననేంద్రియ స్రావాలు ఒక వ్యక్తినుండి మరో వ్యక్తికి అంటకుండా ఉండడానికి, ఇది ఒక ప్రతిబంధకం, లేదా అడ్డు గోడలా పనిచేయడంద్వారా సుఖవ్యాధులు రాకుండా కాపాడుతుంది.”

f డిశంబరు 8, 1993, తేజరిల్లు! సంచికలో “యౌవనస్థులు ఇట్లడుగుదురు . . . ఎయిడ్స్‌—నేను అపాయంలో ఉన్నానా?” అనే శీర్షిక చూడండి.

[17వ పేజీలోని చిత్రం]

లైంగిక ఒత్తిళ్లకు లొంగిపోవడమనేది ఎయిడ్స్‌ వ్యాధికి నడిపిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి