కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 1/8 పేజీలు 18-19
  • మనకు నిజంగా మతగురువులు అవసరమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనకు నిజంగా మతగురువులు అవసరమా?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మొదటి యాజకులు ఎవరు?
  • దేవుడు యాజకులను ఎందుకు నియమించాడు
  • క్రైస్తవులకు ఏ యాజకత్వం అవసరము?
  • మానవులందరికీ ప్రయోజనం చేకూర్చే రాజులైన యాజక సమూహం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధించడాన్ని విలువైనదిగా చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • దేవునికి ప్రీతిపాత్రమైన బలులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యెహోవాకు ప్రీతిపాత్రమైన స్తుతియాగాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 1/8 పేజీలు 18-19

బైబిలు ఉద్దేశము

మనకు నిజంగా మతగురువులు అవసరమా?

“మతగురువులు అనే వరానికి కృతజ్ఞతలు చెల్లించండి,” అని జాన్‌పాల్‌ II మతగురువులకు “పరిశుద్ధ గురువారం,” 1992న వ్రాసిన తన వార్షిక పత్రంలో చెప్పాడు. కాథోలిక్కులు మాత్రమే కాదుకాని, ఇతరులు కూడ తమ పొరపాట్లను బాధాపూర్వకంగా ఎరిగినవారే. వారికి దేవుని చిత్తాన్ని చెప్పడానికి, ఆయనకు బలులర్పించడానికి, మరి వారి కొరకు దేవునిముందు మధ్యవర్తిగా పనిచేయడానికి దేవునిచే అంగీకరింపబడిన ఎవరో ఒకరి అవసరత ఉందని వారు భావించారు. అలాంటి వ్యక్తియే మతగురువు [యాజకుడు] అని పిలువబడ్డాడు. మనం దేవుని నుండి పాపక్షమాపణ పొందు నిమిత్తం నిజంగా మనకు యాజకుని సహాయం అవసరమా?

యాజకులు, బలులు అనే ఆలోచనలు మానవులనుండి ఏర్పడినవి కావుగాని దేవుని నుండి ఏర్పడ్డవే. దేవునికి వ్యతిరేకంగా చేసే పాపాలు లేకపోతే, యాజకుల అవసరత లేనేలేదు. ఏదెనులో, పరిపూర్ణుడైన ఆదాముకు యాజకుల అవసరత లేదు. ఆయన పాపరహితంగా సృష్టించబడ్డాడు.—ఆదికాండము 2:7, 8; ప్రసంగి 7:29.

మొదటి యాజకులు ఎవరు?

ఈనాడు మనమంతా పాపాన్ని సంక్రమించుకున్నాం ఎందుకంటే ఆదాము బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు, మరి మనం ఆయన సంతానమే. (రోమీయులు 3:23) మొదటి మానవుడైన ఆదాము కుమారుడు హేబెలు, దీన్ని గుర్తించాడు. అతన్ని గూర్చి బైబిలు యిలా చెబుతుంది: “విశ్వాసమునుబట్టి హేబెలు . . . శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను.” (హెబ్రీయులు 11:4) హేబెలు మరియు నోవహు, అబ్రాహాము, యోబు వంటి ప్రాచీనకాల విశ్వాసులు యాజకులుగా పిలువబడలేదు, వారు తమ లేదా వారి కుటుంబాల నిమిత్తం దేవునికి బలులర్పించారు. ఉదాహరణకు, యోబు, అతని కుమారులను గూర్చి బైబిలిలా చెబుతుంది: “[యోబు] తన కుమారులు పాపముచేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచువచ్చెను.” (యోబు 1:5) అయినను, యాజకులు, బలులనేవి అనేక సంస్కృతులకు ఎలా సాధారణమయ్యాయి?

ప్రాచీనకాలంనాటి పితరుడైన నోవహు సమయంలో జరిగిన సంఘటనలను పరిశీలించండి. కేవలం నోవహు, అతని కుటుంబం మాత్రమే భూవ్యాప్త జలప్రళయంలో రక్షించబడ్డారు. శుభ్రంగా నిర్మలం చేయబడిన భూమిపై అడుగుపెట్టినప్పుడు, నోవహు ఒక బలిపీఠం కట్టి, యెహోవా దయ, సంరక్షించే హస్తం యెడల మెప్పుదలను ప్రదర్శిస్తూ బలులర్పించాడు. జనాంగాలన్నియు నోవహు సంతానమే గనుక, వారు ఆయన పద్ధతినే అవలంభించారు, కాలం గడచినకొలది మధ్యవర్తులు, పాపాల నిమిత్తం అర్పించే బలులకు సంబంధించి వేర్వేరు సాంప్రదాయాలు వృద్ధయ్యాయి.—ఆదికాండము 10:32.

ఒక శతాబ్దం తర్వాత, బాబెలు నగరంలో దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చెలరేగింది. ప్రజల భాషలను దేవుడు తారుమారు చేయగా, వారు నలుమూలలకు చెదరిపోయారు. (ఆదికాండము 11:1-9) కొంతమంది యాజకులు, ఆనాడు వక్రమైన, దిగిజారిన నమ్మకాలను ప్రోత్సహిస్తూ, వారు వెళ్లిన దేశాల్లో హీనమైన మూఢాచారాలను వృద్ధిచేశారు. అయినప్పటికి, దేవుడు తన ఆరాధికులకు కావల్సిన ప్రధాన యాజకుడు, ఉప యాజకులు మరియు ఆయనకు అంగీకారమైన బలులతో ఒక నిజమైన యాజకత్వాన్ని గూర్చి బోధించే అవసరతను గమనించాడు.

దేవుడు యాజకులను ఎందుకు నియమించాడు

సకాలంలో యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి రెండు ప్రధాన కార్యాలను నిర్వర్తించే యాజకులను ఇచ్చాడు. మొదటిగా, వారు దేవుని ప్రతినిధులుగా ప్రజలయెదుట న్యాయాధిపతులుగాను దేవుని నిబంధనయొక్క ఉపదేశకులుగాను ఉండిరి. (ద్వితీయోపదేశకాండము 17:8, 9; మలాకీ 2:7) రెండవదిగా, దేవుని యెదుట ప్రజల నిమిత్తమై బలులర్పించడం ద్వారా ప్రజల ప్రతినిధులుగా ఉండిరి. పౌలు హెబ్రీ క్రైస్తవులకు వ్రాసిన పత్రిక యిలా వివరిస్తుంది: “ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలోనుండి ఏర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. . . . ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, . . . దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.”—హెబ్రీయులు 5:1, 4.

పౌలు ఇంకనూ వివరించేదేమంటే ఇశ్రాయేలీయుల యాజకత్వం, దేవుడు తన ప్రజలు తనతో సమాధానపడుటకు ఏర్పాటు చేసిన చివరి మార్గం కాదు. యాజకుల పనులనేవి రాబోయే శ్రేష్ఠమైన వస్తువులైన “పరలోక సంబంధమగు వస్తువుల” ఛాయారూపాలను సూచించేవే. (హెబ్రీయులు 8:5) పరలోక సంబంధమగు వస్తువులు వచ్చాయంటే, ఇక ఎన్నటికీ ఛాయారూపాలు అవసరముండవు. ఇలా వివరించవచ్చు: “మీరొక వస్తువు కావాలంటూ ఎంతో ఆశతో ప్రకటన చేశారనుకోండి, కాని ఒకసారి ఆ వస్తువును ఆర్జించిన తర్వాత ఇక మీరు ఆ ప్రకటనను ఉపసంహరించుకొనరా?

ఇశ్రాయేలు జనాంగము ఉనికిలోనికి రాక మునుపు చాలాకాలం క్రితం, కేవలం ఇశ్రాయేలీయుల నిమిత్తమే కాదుగాని, మొత్తం మానవజాతిని ఆశీర్వదించేందుకే దేవుడు యాజకత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశించాడు. మొట్టమొదట, ఆ యాజకత్వానికి సంబంధించిన సభ్యులను అందించే ఆధిక్యత ఇశ్రాయేలు జనాంగం పొందింది. ఈ జనాంగం ఏర్పడినప్పుడు, ఇశ్రాయేలీయులతో యెహోవా యిలా చెప్పాడు: “నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల . . . మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు.” (నిర్గమకాండము 19:5, 6; ఆదికాండము 22:18, పోల్చండి.) విచారకరమైనదేమంటే, ఈ జనాంగము దేవుని మాటకు అరుదుగా లోబడ్డారు. అందువల్లనే, యేసు యాజకులకు, పరిసయ్యులకు యిలా చెప్పాడు: “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును.” ప్రస్తుతం మానవజాతి ఆశీర్వాదం నిమిత్తమై యాజకులుగా సేవచేసే వారెవరు?—మత్తయి 21:43.

క్రైస్తవులకు ఏ యాజకత్వం అవసరము?

మనం ఆదామునుండి పాపం సంక్రమించుకున్నాం గనుక, కేవలం యేసు ఇచ్చిన పరిపూర్ణ బలిద్వారానే నిరంతర జీవితం కొరకైన రక్షణ సాధ్యమౌతుంది. (1 యోహాను 2:2) ఇశ్రాయేలీయుల యాజకత్వంలో ముందుగా సూచించినట్లు, యేసు తనకుతాను మన కొరకు ప్రధాన యాజకునిగా మధ్యవర్తిత్వాన్ని వహిస్తున్నాడు. హెబ్రీయులు 9:24 యిలా చెబుతుంది: “నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.” అందువలన, క్రీస్తు ప్రధాన యాజకత్వపు అపరిమితమైన మహాత్మ్యమునుబట్టి ప్రాచీనకాలంలో మానవ యాజకులు మధ్యవర్తులుగా ఉండే అవసరతను కలుగజేసింది. అయినను, ఉప యాజకుల సేవలు ఇంకనూ అవసరమే. ఏ పద్ధతిలో అవసరమైయున్నవి?

యాజకులు “యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల”నర్పించాల్సి ఉన్నారు. (1 పేతురు 2:5) ఇవి ఎలాంటి అర్పణలో, పౌలు ఈ విధంగా వ్రాశాడు: “మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.” (హెబ్రీయులు 13:15) కాబట్టి, రాజులైన యాజక సమూహమునకు చేరినవారంతా, భూమిపై నుండగా మనుష్యుల ఎదుట దేవునికి మధ్యవర్తులుగా కాకుండా, ఆయనకు సాక్షులుగానే వ్యవహరిస్తారు. తర్వాత, పరలోకంలో యేసుక్రీస్తుతోపాటు, వారు దేవుని సముఖమందు మనుష్యుల ప్రతినిధులుగా ఉంటారు, అంగవైకల్యతలన్నింటిని నయంచేస్తూ, క్రీస్తు బలియొక్క ప్రయోజనాలను అమలుపరుస్తారు.—మార్కు 2:9-12, పోల్చండి.

విశ్వాసులందరూ సాక్ష్యమివ్వాల్సియుండగా, కేవలం కొద్దిమంది మాత్రమే పరలోకంలో “రాజ్య యాజకులుగా” సేవచేస్తారు. యేసు యిలా చెప్పాడు: “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమైయున్నది.” (లూకా 12:32; ప్రకటన 14:1) వీరు పరలోక జీవితానికి పునరుత్థానము చేయబడి, “దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.”—ప్రకటన 20:6.

ఆత్మీయంగాను భౌతికంగాను ఇంతవరకు ఏ యాజకులు కూడా చేయనటువంటి రీతిలో పనులు చేయడానికి ఈ పరలోక యాజకులకు దేవుడు ఏర్పాటుచేశాడు. త్వరలోనే, వారు యేసు విమోచనా బలియొక్క ప్రయోజనాలను అన్వయిస్తూ, విశ్వాసులైన మానవులందర్నీ పరిపూర్ణతకు తీసుకువచ్చుటలో భాగంవహించగలరు. ఆ తర్వాత, యెషయా 33:24 అద్భుతంగా నెరవేరుతుంది. ఆ వాక్యం యిలా చెబుతుంది: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.” (g93 10/8)

[Picture Credit Line on page 18]

“Benediction of the Wheat at Artois” 1857, by Jules Breton: France / Giraudon/Art Resource, N.Y.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి