కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 12/8 పేజీలు 12-14
  • ఎయిడ్స్‌—నేను అపాయంలో ఉన్నానా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎయిడ్స్‌—నేను అపాయంలో ఉన్నానా?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మాయా మహమ్మారి
  • యౌవనులు ఆపదలో ఉన్నారు
  • ఇది సంభవించ గలదు!
  • ఎయిడ్స్‌—యౌవనస్థులకొక క్లిష్టమైన సమస్య
    తేజరిల్లు!—1992
  • ఎయిడ్స్‌ రాకుండా నేనెలా కాపాడుకోగలను?
    తేజరిల్లు!—1994
  • ఎయిడ్స్‌—తలిదండ్రులు, పిల్లలు దాన్నిగూర్చి ఏమి తెలుసుకోవాలి
    తేజరిల్లు!—1992
  • ఎయిడ్స్‌—ఎలా ఎదుర్కోవాలి
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 12/8 పేజీలు 12-14

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

ఎయిడ్స్‌—నేను అపాయంలో ఉన్నానా?

ఆ వార్త ‘ప్రపంచాన్నే దిగ్భ్రాంతి పర్చింది’ అని న్యూస్‌వీక్‌ పత్రిక చెప్పింది. ప్రఖ్యాతిగాంచిన అమెరికా క్రీడాకారుడైన ఎర్విన్‌ “మ్యాజిక్‌” జాన్‌సన్‌ తనకు ఎయిడ్స్‌ వైరస్‌ సోకిందని నవంబరు 7, 1991న పత్రికా విలేకరులకు తెలియజేశాడు. తానంగీకరించిన యీ గగుర్పాటు కల్గించే సమాచారం వెలువడే సరికి, ఎయిడ్స్‌ సమాచార కేంద్రాల్లోని టెలిఫోన్‌ తీగలు హడావుడిగా వచ్చే పోయే సమాచారాలతో ఉక్కిరిబిక్కిరైపోయాయి. కొన్ని ఆసుపత్రులు ఎయిడ్స్‌ పరీక్షలు చేయించుకోడానికి వచ్చిన జనంతో కిటకిటలాడిపోయాయి. కొంతమంది కనీసం తాత్కాలికంగానైనా చెడు ప్రవర్తన మానేశారు.

బహుశ ఈ ప్రకటన ప్రభావం ఎక్కువగా యౌవనస్థులపైనే పడివుంటుంది. ఒక యూనివర్సిటీలోని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ యిలా చెబుతున్నారు: “‘ఇది ఆయనకే వచ్చిందంటే నాకు కూడా రావచ్చు’ అనే విషయాన్ని విద్యార్ధులు హృదయంలోకి తీసుకున్నారు—క్షణకాలం పాటు, వారు మ్యాజిక్‌ జాన్‌సన్‌కు సంభవించినదాంతో మార్పుచెందారు. . . . ఎక్కువమంది విద్యార్ధులు మ్యాజిక్‌ జాన్‌సన్‌కు జరిగిందాన్ని చూచి వారి ప్రవర్తనలో మార్పు చేసుకోలేదు. వారింకా ‘దాని ఫలితం అనుభవించకుండా తప్పించుకోవచ్చని’ అనుకుంటున్నారు.

మన కాలం ‘తెగుళ్లచే’ గుర్తింపబడుతుందని అనగా వేగంగా వ్యాపించే అంటువ్యాధులతో నిండిపోతుందని బైబిలు ముందుగానే ప్రవచించింది. (లూకా 21:11) ఎయిడ్స్‌ను వాస్తవంగా ఒక మహమ్మారి అని పిలువవచ్చు. అమెరికాలో ఎయిడ్స్‌ వ్యాధిసోకిన మొట్టమొదటి 1,00,000 మందిని కనుగొనడానికి 1981 నుండి 1989 వరకు అనగా ఎనిమిది సంవత్సరాలు పట్టింది. కాని దాని తర్వాత రెండోసారి 1,00,000 కేసులను రిపోర్టుచేయడానికి రెండేండ్లే పట్టింది!

అమెరికాలో వ్యాధిని అదుపు చేసే కేంద్రాల ప్రకారం, నొప్పించే ఈ లెక్కలు “అమెరికాలో [ఎయిడ్స్‌] అంటువ్యాధి పరిమాణం వేగంగా వృద్ధిచెందుతుందని నొక్కి చెబుతున్నాయి.” అయినను, ఎయిడ్స్‌ ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, లాటిన్‌ అమెరికాలలో అనేక మరణాలకు, దుఃఖానికి కారణమైనను, ఇది భూవ్యాప్తంగా వున్న అంటువ్యాధి. ప్రాముఖ్యంగా, లాస్‌ ఏంజెల్స్‌లో పిల్లల ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న డా. మార్విన్‌ బెల్జర్‌ ఎయిడ్స్‌ను “1990వ దశకంలో యౌవనులు ఎదుర్కొంటున్న అత్యంత భయంకరమైన సమస్య” అని పిలుస్తున్నాడు.

మాయా మహమ్మారి

ఏమిటీ విపరీత వ్యాధి, ఇదెందుకింత మరణాంతకమైంది? వైద్యులు విశ్వసించేదేమంటే, ఎయిడ్స్‌ వ్యాధి సూక్ష్మమైన రేణువును అంటే హెచ్‌ఐవి అని పిలువబడే వైరస్‌ను (మానవునిలో వ్యాధినిరోధకతను తగ్గించే వైరస్‌) వృద్ధిచేసినప్పుడు అది రక్తప్రవాహంలో చొచ్చుకుంటుంది. ఒకసారి అక్కడకు ప్రవేశించిన తర్వాత, శరీరంలోని సంరక్షక యంత్రాంగంపై (seek-and-destroy mission) అనగా సహాయక రక్షక కణాలైన (T cells) కొన్ని తెల్ల రక్తకణాలమీద దాడిచేస్తుంది. వ్యాధినుండి శరీరాన్ని సంరక్షించుటలో ఈ కణాలు ప్రముఖపాత్ర వహిస్తాయి. అయినను, ఎయిడ్స్‌ వైరస్‌ వాటిని శక్తిహీనం చేసి, వ్యాధినిరోధకశక్తిని పాడుచేస్తుంది.

వ్యాధి సోకిన వ్యక్తి జబ్బుపడటానికి ముందు గుర్తింపదగినంత సమయం పట్టవచ్చు. కొందరిలో షుమారు ఒక దశాబ్దంపాటు ఏ సూచనలూ కన్పించవు. కాని ఈలోపు బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, జ్వరం, విరేచనాలు మొదలైన ఫ్లూ వంటి సూచనలు వృద్ధవుతాయి. వ్యాధినిరోధకత దాని పర్యవసాన నాశనం కొనసాగుతుండగా, బాధితుడు న్యుమోనియా, గవదబిళ్లలు, క్షయవ్యాధి లేదా కొన్ని రకాల క్యాన్సరు వంటి అవకాశవ్యాధియనే వ్యాధులకు లోనౌతాడు, ఇలా ఎందుకు పిలిచారంటే ఇవి రోగిలో రోగనిరోధకత క్షీణించినందువల్ల ఏర్పడిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాయి.

“నేను తదేకంగా ఎల్లప్పుడూ నొప్పితో బాధపడుతున్నాను” ఎయిడ్స్‌ వ్యాధి సోకిన 20 సంవత్సరాల వయస్కుడు చెబుతున్నాడు. ఈ వ్యాధి అతని పెద్దప్రేగు, పురీషనాళంలో పుండ్లను కలుగజేసింది. అయినను ముదిరిన ఎయిడ్స్‌ వ్యాధి అంటే నొప్పి అసౌకర్యం కంటే ఎక్కువే; నిజంగా బాధితులందరూ చివరకు మరణించవలసిందే. కేవలం అమెరికాలోనే 1981 నుండి 10 లక్షలమందికి ఈ వైరస్‌ సోకింది. ఇప్పటికే 1,60,000 కంటే ఎక్కువమంది చనిపోయారు. నిపుణులు ఊహించేదేమంటే 1995వ సంవత్సరానికల్లా, ఈ దుర్మరణాల సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం ఎయిడ్స్‌ వ్యాధిని నివారించే మందు లేదు.

యౌవనులు ఆపదలో ఉన్నారు

ఇప్పటివరకు, అమెరికాలో కేవలం రిపోర్టు చేసిన ఎయిడ్స్‌ రోగుల్లో దాదాపు ఒక శాతం యౌవనులే ఉన్నారు. కాబట్టి, ఈ రోగంతో చనిపోయిన యౌవనులు మీకు వ్యక్తిగతంగా పరిచయం లేకపోవచ్చు. అలాగని యౌవనులు ఆపదలో లేరని దీని భావంకాదు! అమెరికాలో ఎయిడ్స్‌ సోకిన వారిలో దాదాపు ఐదింట ఒక వంతు 20 నుండి 30 సంవత్సరాల వయస్సున్న వారే. సూచనలు బహిర్గతం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కనుక, ఈ వ్యాధి సోకిన వారిలో చాలామంది బహుశ వారు 13 నుండి 19 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఈ వ్యాధి అంటుకుని ఉండొచ్చు. ఇటీవల వచ్చిన ధోరణులు కొనసాగితే, యింకా అనేక వేలమంది యౌవనులు ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులౌతారు.

అమెరికాలోని వ్యాధి అదుపుచేసే కేంద్రాల ప్రకారం, ఈ మరణాంతక వైరస్‌ “వ్యాధి సోకిన వారి రక్తం, వీర్యం, స్త్రీజనన స్రవాల్లో” దాగి ఉంటుంది. కాబట్టి “వ్యాధి సోకిన వ్యక్తితో—నోటిద్వారా, యోనిద్వారా, లేదా గుదంద్వారా సంపర్కం”చేస్తే హెచ్‌ఐవి వైరస్‌ సోకుతుంది. అనేకమందికి ఈ వ్యాధి ఈ విధంగానే సోకింది. “ఎయిడ్స్‌ వ్యాధి సోకిన వారికి ఉపయోగించిన సిరంజి, వాళ్లకు గుచ్చిన సూది” ద్వారా కూడ ఎయిడ్స్‌ వ్యాధి అంటుకుంటుంది. అంతేకాకుండా, హెచ్‌ఐవి వైరస్‌తో మలినమైన “రక్తాన్ని ఎక్కించుకోవడం వల్ల కూడ కొందరికి ఈ వ్యాధి సంక్రమించింది.”—వాలంటరీ హెచ్‌ఐవి కౌన్సెలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌: ఫేక్ట్స్‌, ఇష్యూస్‌, అండ్‌ ఆన్సర్స్‌.

ఫలితంగా అనేకమంది యౌవనులు ఆపదలో ఉన్నారు. అనేకమంది యౌవనులు (షుమారు 60 శాతం మంది అమెరికాలో ఉన్నారని కొందరంటారు) చట్టవిరుద్ధ మాదక ద్రవ్యాల నుపయోగిస్తున్నారు. వీటిలో కొన్ని మాదక ద్రవ్యాలు సిరంజితో శరీరంలోకి ఎక్కించబడతాయి గనుక, మలినమైన సూదుల ద్వారా ఈ అంటువ్యాధి సోకే ప్రమాదం అధికంగావుంది. అమెరికాలో చేసిన సర్వే ప్రకారం, 82 శాతం ఉన్నత పాఠశాల (సెకండరీ పాఠశాల) విద్యార్థులు మత్తుపానీయాలు ఉపయోగించారు, దాదాపు 50 శాతం మంది ఈ మధ్యనే ఆరంభించారు. ఒక సీసా బీరు తాగితేనే మీకు ఎయిడ్స్‌ అంటుకోదు కాని, తాగిన తర్వాత అది మీ ఆలోచనను క్షీణింపజేసి, బహుశ మీరు చెడుగా ప్రవర్తించడానికి, దిగజారిన లైంగికత, సలింగసంయోగం లేదా భిన్నరకాల లైంగికతలో భాగం వహించడానికి నడుపవచ్చును.

పందొమ్మిది వందల డెబ్భైలో దాదాపు 5 శాతంమంది 15 ఏండ్ల ఆడపిల్లలు లైంగిక సంయోగాన్ని అనుభవించారు. ఆ సంఖ్య 1988 వచ్చేసరికి 25 శాతానికి పెరిగింది. సర్వే యింకా చెబుతున్నట్లుగా అమెరికాలో 75 శాతంమంది ఆడవాళ్లు, 86 శాతం మగవాళ్లు 20 ఏండ్లొచ్చేసరికే లైంగికంగా చురుకుగా ఉన్నారు. మరొక భయానక లెక్కలు గమనించండి: యౌవనుల్లో ఐదుగురిలోని దాదాపు ఒకరు, నలుగురి కంటె ఎక్కువమందితో లైంగిక అనుభవం పొందారు. ఔను, వయస్సు రాకుండానే అనేకమంది యౌవనులు వివాహానికి ముందే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు, మరి వారు ఎన్నడూ లేనంత పసితనంలోనే యిలా మొదలుపెడుతున్నారు.

ఈ విషయం వేరే దేశాల్లో తక్కువేమీ కాదు. లాటిన్‌ అమెరికా దేశాల్లో నాల్గింట మూడు వంతుల యౌవనులు వయస్సు రాకుండానే వివాహానికి ముందే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఆఫ్రికా దేశాల్లో చాలామంది పురుషులు ఎయిడ్స్‌ వ్యాధి సోకకుండా తమను తాము కాపాడుకొనే ప్రయత్నంలో తమ లైంగిక సహవాసులుగా లేత బాలికలను ఎన్నుకుంటున్నారని రిపోర్టుచేయబడింది. ఫలితమేమిటి? ఆఫ్రికాలో బాలికల్లో ఎయిడ్స్‌ వ్యాధి పెచ్చుపెరిగింది.

ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తి నాశనకర ప్రవర్తనను కొంచెమే అదుపు చేయగల్గింది. ఒక లాటిన్‌ అమెరికా దేశాన్ని పరిశీలించండి. అరవై కంటే ఎక్కువ శాతంమంది “లైంగికంగా జోరుగావున్న అవివాహిత యౌవనులకు ఎయిడ్స్‌ వైరస్‌ సోకే ప్రమాదం అమితంగా వుంది.” అయినను, షుమారు పదిశాతం వ్యక్తిగతంగా తాము ప్రమాదంలో ఉన్నారని భావిస్తున్నారు. వారు తమకుతాము యిలా చెప్పుకుంటున్నారు: ‘ఇది నాకు సంభవించదు.’ కాని ఈ దేశంలో జీవించే “అమెరికన్లలో హెచ్‌ఐవి వైరస్‌ అంటువ్యాధి సోకే ప్రమాదం అమితంగా వుంది.”—యు. యస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌.

ఇది సంభవించ గలదు!

లైంగిక అవినీతి వలన చివరకు వచ్చే “ఫలం” “ముసిణిపండంత చేదు” అనే బైబిలు హెచ్చరికలోని సత్యాన్ని ఎయిడ్స్‌ వ్యాధి ఉన్నతపర్చింది. (సామెతలు 5:3-5; 7:21-23) నిజమే, బైబిలు ప్రథమంగా ఆత్మీయ, భావోద్రేక నష్టాన్ని సూచిస్తుంది. కాని లైంగిక అవినీతి కూడా అనేకమైన భౌతిక దుష్ఫలితాలను కల్గివుందనేది మనలను ఆశ్చర్యపర్చకూడదు.

కాబట్టి ప్రాముఖ్యమైన విషయమేమంటే వాస్తవంగా యౌవనులు ఎయిడ్స్‌ వ్యాధిని, మరితర లైంగిక సుఖవ్యాధులను ఎదుర్కోవలసివస్తుంది. ఎయిడ్స్‌ ‘నాకు రాదులే’ అని స్వంతంగా నీకు నీవు తృప్తిపడే మనోవృత్తి మరణాత్మకం కాగలదు. “మీరు పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పందొమ్మిది, లేదా ఇరవై సంవత్సరాల వయస్సున్న వారైతే, మీరు ఎయిడ్స్‌ దాడికి గురికామని తలుస్తారని,” డేవిడ్‌ అనే యౌవనుడు చెప్పాడు. అయినప్పటికి, వాస్తవాలు వేరేగా ఉన్నాయి. డేవిడ్‌ తన 15వ యేట ఎయిడ్స్‌ వ్యాధికి గురయ్యాడు.

అయితే, మొరటుగా చెప్పాలంటే: మీరు చట్టవిరుద్ధ మాదకపదార్ధాలు ఉపయోగిస్తున్నా లేదా వివాహం కాకుండానే లైంగిక వ్యవహారాల్లో నిమగ్నమైనా, మీరు ఆపదలో ఉన్నారు! అయినను, ఒక వ్యక్తి “ముందు జాగ్రత్తలతో అవినీతికర లైంగిక వ్యవహారాల్లో పాలుపంచుకోవచ్చని” చెప్పే విషయమేమిటి? ఈ అంటువ్యాధి నుండి ఒక వ్యక్తి తనకుతాను కాపాడుకోడానికి వాస్తవమైన పద్ధతులేవైనా ఉన్నాయా? ఈ థారావాహికలోని మా తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలను చర్చిస్తుంది. (g93 8/22)

[14వ పేజీలోని బాక్సు]

లైంగికంగా సంక్రమించే ఇతర సుఖవ్యాధులు

ఎయిడ్స్‌ వ్యాధి బాగా ప్రఖ్యాతిగాంచింది. అయినప్పటికి, ది మెడికల్‌ పోస్ట్‌ హెచ్చరించేదేమంటే: ‘కెనడాలో సుఖవ్యాధులు యౌవనుల్లోనే బాగా ముమ్మరంగా ఉన్నాయి.’ కేవలం కెనడా మాత్రమే కాదు. “ప్రతిసంవత్సరం 2.5 మిలియన్ల అమెరికా దేశస్థులైన యౌవనులు సుఖవ్యాధులతో పీడించబడుతున్నారని” యు. ఎస్‌. బేస్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ పాపులేషన్‌ ఆప్సన్స్‌ చెబుతుంది. “ఈ సంఖ్య లైంగికంగా చురుకుగావున్న ప్రతి ఆరుగురు యౌవనుల్లో షుమారుగా ఒకరిని, జాతీయ స్థాయిలో ఐదింట ఒకవంతు సుఖవ్యాధులున్న కేసులను సూచిస్తుంది.”

ఉదాహరణకు, ఒకానొకప్పుడు నిర్మూలం కాబోతుందని తలంచిన సిఫిలిస్‌ వ్యాధి, ఇటీవల సంవత్సరాల్లో మరలా విజృంభించి, దాదాపు అధికమొత్తంలో యౌవనులను బలితీసుకుంది. గనేరియా, క్లామిడియా (అమెరికాలో ముమ్మరంగా సోకుతున్న సుఖవ్యాధి) అనే వ్యాధులు కూడ అలాగే గుర్తింపదగినంతగా నిర్మూలించే ప్రయత్నాలకు ఎదురాడుతున్నాయి. మరి ఈ అంటువ్యాధులు యౌవనులకు అమితంగా సోకే ప్రమాదముంది. అదేరకంగా జననేంద్రియాల్లో ఒరిపిడి పుండ్లచే పీడింపబడే యౌవనుల సంఖ్య “బాగా వృద్ధి” అయ్యిందని న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టు చేస్తుంది. వేలకొలది యౌవనులకు జననేంద్రియాలపై వచ్చే బొబ్బలరోగం కూడ సోకింది. సైన్స్‌ న్యూస్‌ ప్రకారంగా, “జననేంద్రియాల్లో ఒరుపుడు పుండ్లున్న వారికి ఎయిడ్స్‌కు కారణమైన [హెచ్‌ఐవి] వైరస్‌తో అంటువ్యాధి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.”

సెంటర్‌ ఫర్‌ పాపులేషన్‌ ఆప్షన్స్‌ యిలా చెబుతుంది: “వేరే వయస్కుల కంటే యౌవనులకే సుఖవ్యాధులు సోకే అవకాశాలున్నప్పటికి, వారే బహుశ తక్కువగా ఆరోగ్యజాగ్రత్తలు తీసుకుంటారు. వైద్యపరీక్షలు జరుపకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే, సుఖవ్యాధులవల్ల పొత్తికడుపులో మంట పుట్టించే వ్యాధులు, సంతానలోపం, గర్భకోశానికి బయట గర్భం ఏర్పడటం, స్త్రీబీజవాహిక క్యాన్సరు రావడం ఎక్కువగా జరుగుతుంది.”

[12,13వ పేజీలోని చిత్రాలు]

ఎవరైనా చట్టవిరుద్ధ మాదకద్రవ్యాలు శరీరంలో ఎక్కించుకున్నా లేదా నీచమైన లైంగిక కార్యాల్లో నిమగ్నమైనా ఎయిడ్స్‌ వ్యాధి సొకే ప్రమాదం ఎక్కువగా వుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి