మంచు, వర్షం, ఉత్తరాల పరిమాణం ఏదియు బట్వాడాను ఆపలేవు
“పోస్టుమాన్లున్నంత కాలం, జీవితం ఆసక్తికరంగా వుంటుంది.”—విలియమ్ జేమ్స్, అమెరికా తత్వవేత్త (1842-1910)
ఇంచు మించు ప్రతి ఒక్కరికీ తపాలా బట్వాడాలను గూర్చి చెప్పుకోడానికి బెంబేలెత్తించే కథలుంటాయి. అనుకున్నదానికంటే కూడా వారాలు నెలలు ఆలస్యంగా అతని ఉత్తరం చేరుకుందనో, తపాలా ధరలు ఆకాశాన్నంటుతున్నాయనో, లేదా తపాలా కార్యాలయం దగ్గరి క్యూలో నిలబడ్డం విసుగు పుట్టిస్తోందనో చెపుతుంటారు. అక్టోబరు 1966లో తపాలా వ్యవస్థను విపత్తు ఒకటి భయపెట్టింది. “అప్పట్లో చికాగో కూడలి దగ్గర్లోని, అతిపెద్ద తపాలా సౌకర్యంలో తపాలాలు అధికమైపోయి, తపాలాలను సరిగ్గా నడిపించలేకపోవడంవల్ల దాదాపు మూతపడినంత పనయ్యింది” అని అమెరికా పోస్టలు సర్వీసు ప్రతినిధి అవేక్!నకు చెప్పాడు.
ఉత్తరాల పంపిణీ ఆగకుండా, మీ ఉత్తరాలు వాటి గమ్యం చేరుకుంటాయని నమ్మడానికి ఏ చర్యలు తీసుకోబడ్డాయి? మీరందుకునే సేవను మెరుగుపరచడానికి మీరు చేయగల్గిందేదైనా ఉందా? ఉత్తరాల బట్వాడా విధానాలూ, ఆధార పడగలమనే విషయాల్లో శతాబ్దాలుగా ఏవైనా విశేష మార్పులు కనబడుతున్నాయా?
ప్రాచీన పోస్టల్ సర్వీసు
మొట్టమొదట వ్యవస్థీకరింపబడిన పోస్టల్ సర్వీసులు కేవలం ప్రభుత్వ ఉపయోగానికే ఉండేవి. అలాంటి వ్యవస్థలు ప్రాచీన చైనా, ఈజిప్టు, అస్సీరియా, పర్షియా, గ్రీసులలో ఉండేవి. రోమా పోస్టల్ వ్యవస్థకు కర్సస్ పబ్లికస్ అనే పేరు పెట్టారు అంటే, అక్షరార్థంగా “ప్రజల మార్గము” అని భావం; అయినప్పటికీ, అవి ప్రాధమికంగా ప్రభుత్వ సేవకొరకే ఉండేవి. విచిత్రమేమంటే, బైబిలు రచయిత, పౌలు ఎఫెసీ, కొలొస్సీ, ఫిలేమోనులకు వ్రాసిన ఉత్తరాలు వ్యక్తిగత ఏర్పాట్లతోనే పంపబడేవి కానీ రోమా ప్రభుత్వ పోస్టల్ సర్వీసు ద్వారా పంపబడేవికావు.—ఎఫెసీయులు 6:21, 22; కొలొస్సయులు 4:7-9; ఫిలేమోను 21, 22.
పందొమ్మిదవ శతాబ్దంనాటి ఉత్తరాల రవాణాలో, వాటి పంపకాలలో పెద్దగా మార్పులేవీ రాలేదు. అయితే దానికంటె ముందే ప్రైవేట్ తపాలా బట్వాడాను ఆధీనపర్చుకోవాలనే లేక తీసివేయాలనే ఆలోచనలు బయలుదేరాయి. ఎందుకు? ఎందుకంటే, ప్రైవేట్ ఉత్తరాలను చట్టబద్ధం చేయడం అవసరమని అధికారులు భావించారు. ది యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనే తన పుస్తకంలో జార్జి ఎ. కాడ్డిన్, జూనియర్, పోస్టల్ సర్వీసులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడానికి రెండు పెద్ద కారణాలను ఇస్తున్నాడు. మొదటిది, “ప్రభుత్వ సేవలకు సహాయం చేయడంలో ఆదాయం ఒక శ్రేష్టమైన మూలం.” రెండవది, అందించబడిన భద్రత ప్రభుత్వ విరోధుల సంబంధాలను అదుపులో ఉంచడానికి సహాయపడింది.
అలా, 1464లో ఫ్రెంచ్ రాయల్ పోస్టు కొంత ప్రజా తపాలాలను నిర్వహించింది. ఇంగ్లాండుకు చెందిన చార్లెస్ 1, 1935లో రాజ్య తపాలా సర్వీసును ప్రజలకొరకు ప్రారంభించాడు. ఇతర ప్రభుత్వాలు కూడా అలాగే చేస్తూ, ప్రజల మధ్యనున్న ఈ వినిమయాన్ని తమ అదుపులో ఉంచుకుని, తపాలా సర్వీసును ఆధీనపర్చుకున్నారు.
రోమా సామ్రాజ్యం బ్రిటన్వరకూ తన తపాలా వ్యవస్థను పొడిగించినట్లు, బ్రిటన్ తొలి అమెరికా వ్యవస్థను క్రమపర్చింది. సా.శ.పూ ఆరవ శతాబ్దంలో ప్రారంభమైన గుర్రపు రౌతులతో అంచలంచెలుగా ఉత్తరాలను పంపే పర్షియన్ పద్ధతిని రోమా వ్యవస్థ చాలామట్టుకు నకలు చేసింది. ఆవిధంగా అనేక తపాలా కార్యపద్ధతులు పర్షియానుండి వచ్చినవేనని చెప్పవచ్చును.
అమెరికా వలసరాజ్యం విదేశీ తపాలా వ్యవస్థను 1639లో ప్రారంభించింది. బోస్టన్, న్యూ యార్క్‌ల నడుమ స్వదేశీ సర్వీసును 1673లో ప్రారంభించింది. అల్పకాలమే నిలిచిన ఆ తపాలా వెళ్లే మార్గానికి బోస్టన్ తపాలా రోడ్డు అనే పేరువచ్చింది. ఇది యిప్పుడు అమెరికా ప్రధానరహదారి 1లో ఒక భాగం. పందొమ్మిదవ శతాబ్దంనాటికి గుర్రపు బండ్లు, పొగ ఓడలు, రైలుమార్గాలగుండా తపాలా బట్వాడా చేయడం మొదలుపెట్టారు. న్యూ యార్క్ నుండి శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలకు ఓడల ద్వారా తపాలాలను చేరవేయడానికి సుమారు ఒక నెల లేక అంతకంటే ఎక్కువేపట్టేవి, అదే గుర్రపు బండ్లద్వారా అయితే యింకా ఎక్కువ కాలం పట్టేది.
పోనీ ఎక్స్‌ప్రెస్
అమెరికాలో ఖండాంతర బట్వాడాను వేగిర పర్చడానికి గుర్రపు బండ్లకంటే, ఓడలకంటే కూడా మెరుగైందేదో కావలసివచ్చింది. ఈ సమస్యను ఏది పరిష్కరించగలదు? శతాబ్దాల పురాతనమైన తపాలారౌతు, గుర్రం పద్ధతిని ఉపయోగించారు. హిస్టరీ ఆఫ్ ది యు. ఎస్ పోస్టల్ సర్వీస్ 1775-1984, మార్చి 1860 వార్తాపత్రిక ప్రకటనను ఎత్తిచూపించి ఇలా అన్నది:
“కావలెను: యౌవనులు, సన్నని దృఢమైన 18 సంవత్సరాలలోపు కుర్రాళ్లు కావలెను. గుర్రపు స్వారీలో ఆరితేరినవారై, ఎప్పుడైనా సరే తమ ప్రాణాలను వదులుకోడానికి ఇష్టతచూపేవారిగా వుండాలి. అనాధలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వబడతాయి.”
బాడుగకు వచ్చిన వాళ్లు “జంతువులకు ఎటువంటి హానీ కల్గించననీ, కొట్టనని లేక హింసించనని, నమ్మకస్థునిగా వుంటానని బైబిలుపై ప్రమాణంచేయాలి.” సేయింట్ జోసెఫ్, మిస్సురి, అమెరికాలోని ఉత్తర కోస్తా ప్రాంతాలకు బట్వాడాచేసే 3,200 కిలోమీటర్ల మార్గ ప్రయాణ సమయాన్ని పది రోజులకు తగ్గించిన ఈ పోనీ ఎక్స్‌ప్రెస్ చాలా పేరుగాంచింది. శరవేగంతో ఈ యౌవన రౌతులు 15 నుండి 25 కిలోమీటర్లు ప్రయాణించి, ఏమాత్రం ఆలస్యంచేయకుండా గుర్రాలను మార్చి, కొండలూ మైదానాలూ నదుల గుండా, అన్ని రకాల వాతావరణాలలో ప్రయాణించారు. అతి వేగంగా పరుగెత్తే గుర్రాలున్నందువలన, పోనీ ఎక్స్‌ప్రెస్ వున్నంత కాలం ఈ ధీరులైన వార్తాహరులు అమెరికా ఇండియన్లకూ, దోపిడీ దొంగలకూ అందకుండా దూసుకు వెళ్లేవారు; అయితే ఒక రౌతు చంపబడ్డాడు.
ఏప్రిల్ 3, 1860 నుండి అక్టోబర్ 26, 1861 వరకు మాత్రమే నిలిచిన ఈ తపాలా సర్వీసు చెప్పుడు కథల ద్వారా అధిక ఖ్యాతిని పొందింది. ఖండాంతర టెలీగ్రాఫ్ సర్వీసు ప్రారంభమైనప్పుడు, అమెరికా తపాలా చరిత్రలోనే అత్యంత కమనీయమైన అధ్యాయమైన ఈ సర్వీసు ముగిసింది.
ఆధునిక పద్ధతులు
ఈ రోజు మనమొక ఉత్తరం వేసి, దాన్నేలా పంపిస్తారో గమనిద్దాం. మీరు ఈ సేవను వినియోగించుకున్నదాన్ని బట్టి మీ ఉత్తరం అందజేయబడే బట్వాడా సమయం మారుతుంది.
మీరీరోజు మీ పనిని ముగించుకున్న తర్వాత, సమకూరిన ఉత్తరాలను పోస్టు చేస్తారు. మనలో చాలామందికిది పరిపాటే గనుక, దినాంతంలో తపాలా ప్రవాహంలోకి ఉత్తరాల వెల్లువొకటి వచ్చి చేరుతుంది. కాబట్టి, మీరు దిన ప్రారంభంలోనే మీ తపాలాను వేస్తే, మీకు కొన్ని గంటల లాభం లభిస్తుంది, ఆ దినం వెళ్లే తపాలాలో మీది ముందుంటుంది. పందొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రతిదిన తపాళా అందింపు సంఖ్య 45 కోట్ల 40 లక్షల ఉత్తరాలు, వాటిలో 1 కోటి 33 లక్షలు న్యూ యార్క్ నగరంలోకి; ఫ్రాన్స్‌కు చేరే, 7 కోట్ల 10 లక్షల తపాలాలలో 55 లక్షలు పారిస్‌కి; జపాన్, 6 కోట్ల 25 లక్షలలో ఒక కోటి 70 లక్షలు టోక్యోకి; బ్రిటన్‌కు, 6 కోట్ల ఉత్తరాలు వెళతాయి.
వీధిలోని పోస్టు బాక్సులో లేక చిన్న తపాలా కార్యాలయంలో ఉత్తరాన్ని వేసినా అవన్నీ పెద్ద తపాలా కార్యాలయంలోకే తీసుకురాబడతాయి. తపాలా సేకరించే సమయానికి ముందు గానీ లేక వీలుంటే, పెద్ద తపాలా కార్యాలయంలో గానీ మీ తపాలాను వేయడం మూలంగా పంపిణీ త్వరగా జరుగుతుంది.
ప్రాంతీయ తపాలా కార్యాలయంలో మీ ఉత్తరాన్ని సంచిలో వేసి, ఆ తర్వాత అలాంటి సంచులన్నింటినీ ట్రక్కులో పడేసి విభాగ కేంద్రమనే తపాలా సౌకర్య కేంద్రానికి తీసుకెళతారు. అక్కడ తపాలాలను వేరుపర్చే అటోమాటిక్ పరికరాలను ఉపయోగిస్తారు. ఇక్కడ, విశిష్టమైన ప్రజ్ఞతో తయారు చేసిన పరికరాలు, ఉత్తరాలను వాటంతటవే ఎగరేసి తిప్పి, తీసుకువెళ్లే బెల్టుపైన వేస్తూ, వాటిని వేరుపర్చి, ముందు భాగానికి తిప్పి, రద్దుచేయవలసిన వాటిని రద్దుచేసి ఎన్నుకుని, పేర్చుతాయి. అలాంటి ఒక పరికరమైన ఫేసర్ కాన్సిలర్, 27,000 ఉత్తరాలకు గంటలోనే చాలా వేగంగా పోస్టు ముద్రణ వేస్తుంది లేక రద్దుచేస్తుంది.
మధ్యాహ్నంనుండి రాత్రివరకూ బయటకు వెళ్లే ఉత్తరాల ఎంపిక జరుగుతూ వుంటుంది. సులభంగా చదవగల్గేటువంటి అంటే, టైప్చేసినవి, ప్రింట్ చేసినవి లేక చేతితోరాసిన—ఉత్తరాలను యంత్రం వేరుపర్చగలదు. నూతన పరికరాలు జిప్ కోడ్ లేక తపాలా కోడ్; పట్టణం, రాష్ట్రం, లేక మండలమున్న రెండు వరుసలున్న సాంకేతిక సంకేతనాలను అనువదిస్తాయి.
అలాంటి యంత్రాలు దానికి సంబంధించిన పరికరాలు వాటంతటవే యాంత్రికంగా ఒక్కగంటలోనే వేలకొలది ఉత్తరాల చిరునామాలను “చదువ” గలవు, వాటిపై ప్రత్యేకమైన తపాలా గుర్తులను ముద్రించగలవు. యంత్రాలవల్ల వేరుపర్చలేని మొదటి తరగతి ఉత్తరాలను సగటున గంటకు 800 చొప్పున చేత్తోనే వేరుపర్చాలి. జిప్ కోడ్‌తో (అనేక యితర దేశాలలో ఉపయోగించే తపాలా గుర్తు లేక పిన్ కోడ్), సులభంగా చదవగల్గే చిరునామాలు, మీ ఉత్తరం త్వరగా, సమర్థవంతంగా బట్వాడా అవ్వడానికి సహాయపడతాయి.
ఇతర దేశాలకు వెళ్లే తపాలాలు విమానాలద్వారా లేదా నేలపై రవాణా ద్వారా వెళతాయి. మొదటి తరగతి తపాలాలు మాత్రం, సహజంగా రాత్రికిరాత్రే ప్రత్యేక పట్టణాలకూ, విభాగించే కేంద్రాలకు పంపించబడతాయి. నియమిత స్థానిక రాష్ట్రాలకు రెండురోజుల్లో, అమెరికాలోని యితర ఏ ప్రాంతాలకైనా మూడు రోజుల్లో పంపించబడతాయి. బ్రిటన్‌లో 90 శాతం మొదటి తరగతి తపాలాలు మరుసటి పనిదినం నాటికి పంపించాలి, 97.4 శాతం రెండవ తరగతి తపాలా మూడవ రోజుకల్లా పంపించాలి. మే 1992లో ప్రచురించిన ఫ్రెంచి పోస్టల్ సర్వే ప్రచురణ ప్రకారం 81 శాతం ఇళ్లకు చేరే ఉత్తరాలు రాత్రికి రాత్రే పంపించబడ్డాయి, 96.3 శాతం తపాలా వస్తువులు ఆదివారాలు యితర సెలవుదినాలు తప్ప, రెండు రోజుల్లో పంపిణీ చేయబడ్డాయి. అలా, అర్థరాత్రి వేళ బయటికి వెళ్లే ఈ తపాలా, యితర ప్రాంతాలకు పంపే కేంద్రానికి అక్కడనుండి వాటి గమ్యస్థాన తపాలా కార్యాలయాలలో, లోనికి వచ్చే తపాలా అవుతుంది. రాత్రంతా కొనసాగి తెల్లవారుజామువరకూ కూడా వచ్చే తపాలా అంతా బట్వాడా కొరకు వేరు చేయబడుతుంది.
పెద్దమొత్తంలో తపాలాను వినియోగించే, వాచ్‌టవర్ సొసైటి వంటి వారు, తమ తపాలాను తామే తయారుచేసి, తమ పరిశ్రమవద్దే లోడ్‌చేసి తపాలా వారు అంగీకరించేలాగున వాటిని ట్రాక్టర్-ట్రైలర్లో పంపిస్తారు. ఈ తపాలాను, తపాలా పంపిణీ సిబ్బంది నేరుగా చేరాల్సిన గమ్యాలకు అందిస్తుంది. ఎలక్ట్రానిక్ తపాలా (ఇ-మెయిల్; సమాచారాన్ని టెలీకమ్యూనికేషన్ లైన్గుండా కంప్యూటర్లద్వారా పంపించడం) వంటి అత్యాధునిక తపాలా ఆధారాన్ని కూడా తపాలా సర్వీసు వారు బాగా ఉపయోగిస్తున్నారు. గత సంవత్సరం ఫ్రెంచ్ రిమోట్ అచ్చువిధానాన్ని (ఇ-మెయిల్) ఉపయోగించి ఒక కోటి ఉత్తర సమాచారాలను పంపింది.
తపాలా పద్ధతులు ప్రతి దేశానికి విభిన్నంగా వున్నా కూడా, ప్రపంచ తపాలా మొత్తంలో 40 శాతం తపాలాను నిర్వహించే అమెరికా తపాలా సర్వీసు గూర్చి ఇక్కడ వివరించిన పద్ధతినిపోలి వుంటాయి.
ఇతర తపాలా సర్వీసులు
తపాలా సర్వీసులు తపాలాను అందించడమేకాకుండా మరెన్నో సేవల్ని అందిస్తాయి. అమెరికా తపాలా కార్యాలయం మీకొక పాస్‌పోర్టును ఇప్పిస్తుంది. జపాన్ తపాలా కార్యాలయంలో లేక బ్రిటీష్ జెరోబ్యాంక్లో (మునుపు ఇది బ్రిటీష్ తపాలా సర్వీసువారిది) మీరు డబ్బు దాచుకోవచ్చు. అంతేకాకుండా, పోస్టుచేసిన వస్తువులు పాడైనా లేక పోయినా వాటి నష్టపరిహారం కొరకు తపాలాను భీమాచేస్తారు లేక రిజిస్టారు చేస్తారు. పోస్టుచేయబడిందని లేదా చేరిందన్న రుజువు అవసరమైతే, రిజిస్టారు చేయించడంకంటే భీమా చేయించడానికే తక్కువ ఖర్చు అవుతుంది. జాపాన్ తపాలా సర్వీసు నుండి ప్రజలు, జీవిత భీమాను పొందగలరు.
అమెరికా వంటి కొన్ని తపాలా సర్వీసుల వారు మీ విన్నపంపై చిరునామా సవరణ సమాచారాన్ని మీకు అందిస్తారు. ఎన్వలప్ పైన పంపినవారి చిరునామా క్రిందగా “చిరునామా సవరణ విన్నపం” లేదా “బట్వాడ చేయకండి” అని రాస్తే సరిపోతుంది. ఒక సంవత్సరం కంటే పాతవి కానివి (లేక ఒక సంవత్సరం కానిదైతే), అదనపు ఖర్చు లేకుండానే మొదటి తరగతి తపాలా క్రొత్త చిరునామాతో మీకు అందజేయబడుతుంది లేక దానిని పంపిణి చేయకపోవడానికి గల కారణాన్ని తెలియజేస్తుంది.
వీటికీ మరితర సేవలకూ ఈ ప్రపంచం, తపాలా వ్యవస్థపై చాలా ఆధారపడి వుంది. “ఎంతో మోతాదులో తపాలాను పంపిణీచేస్తూ, ఈ తపాలా సర్వీసు ఎంతో మంచి పనిని చేస్తోంది. అయితే వాస్తవానికి తపాలా సర్వీసు నుండి ఏమి అపేక్షించ వచ్చో ప్రజలు తెలుసుకోవడానికి, అనివార్యమైన లోపాలను ఒప్పుకోవాలి” అని ఇవాల్యువేషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ నివేదించింది. అమెరికాలో ప్రతిదినం 25,00,00,000లో మొదటి తరగతి తపాలా కేవలం 5 శాతం ఆలస్యమైతే, అవి రోజుకు 1,20,00,000 ఉత్తరాలవుతాయి. దానికారణంగా ఆలస్యంగా చేరాయన్న అనేక ఫిర్యాదులొస్తాయి.
ఇబ్బందికర ఆర్థిక పరిస్థితులు తపాలా వ్యవస్థను ప్రభావితంచేస్తాయి. ఆకాశాన్నంటే ధరలు, పాడైన వస్తువులు, ఆలస్యంగా అందే తపాలా, ఆధునిక సాంకేతిక నైపుణ్యత ప్రభుత్వాధీన సేవలతో బారీ పోటీని వృద్ధిచేసాయి. తపాలాను పంపిణీ చేయడాన్ని క్రొత పద్ధతులు మెరుగుపరచినా, అన్ని సంస్థలపైనున్న ఒత్తిడి, తపాలా వ్యవస్థకు కూడా క్లిష్టపరిస్థితిని తెచ్చి పెడుతున్నవి. పందొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరానికి అమెరికా తపాలా సేవలకు నూటా యాభై కోట్ల డాలర్ల ఆదాయం లోటు కల్గింది. ప్రస్తుత సర్వీసును కొనసాగించడానికి తపాలా ధరను పెంచడం, సిబ్బందిని తగ్గించడం వంటి చర్యలు అవసరం కావచ్చు.
పురాతన కాలంలోని ఒక బిందువునుండి, ఈనాటి పొంగిపొర్లుతున్న ప్రవాహమువరకూ ఎన్ని సమస్యలొచ్చినా తపాలా పంపిణీ కొనసాగుతూ ఒకరితో ఒకరు సంబంధాలు కల్గివుండాలనే స్వాభావిక కోరికను తీరుస్తోంది.—పోస్టల్ వర్కర్ యిచ్చినదానితో.
[18వ పేజీలోని బాక్సు/చిత్రం]
పర్షియా పద్ధతిలో తపాలా బట్వాడా
ఇది పురాతన పర్షియా సామ్రాజ్యపు ఘట్టం. వ్రాత ప్రతులు జాగ్రత్తగా తయారుచేయబడి, అధికార ముద్రవేయబడి, ప్రభుత్వ తపాలా సర్వీసు సహాయంతో పంపబడ్డాయి. తక్షణం ఆదేశాలు అందించకపోయినా లేక తదనుగుణ్యంగా ప్రవర్తించకపోయినా ఎన్నో ప్రాణాలు పోగలవు. అయితే, తపాలా బట్వాడా ఎలా జరిగేది? “రాజాశ్వశాలలోని గుర్రంపైన ప్రయాణించే వార్తాహరునితో అవి పంపించబడ్డాయి. . . . కాబట్టి అత్యవసర రాజాజ్ఞనుబట్టి రాచగుర్రంపై వార్తాహరులు శరవేగంతో వెళ్ళేవారు” అని ది న్యూ ఇంగ్లీష్ బైబిల్ ఎస్తేరు 8:10, 14లో చెప్తోంది.
దాదాపు 25 కిలోమీటర్ల అంతరంలో అంచలంచెలుగా గుర్రాలను మార్చే ఈ విశ్వసనీయ రౌతులు, సా.శ.పూ అయిదవ శతాబ్దంలో యూదులజాతి విధ్వంసం కాకుండా సంరక్షించడానికిగాను అర్తహశస్త రాజాజ్ఞను తీసుకువెళ్లడానికి వీరు ప్రత్యేకంగా ఎన్నుకోబడినవారిగా నిరూపించుకున్నారు. ఈ ఉత్తరాలు మోసుకువెళ్లే వాళ్ళు, “వారికి చేతనైనంత వేగంతో నియమించిన దూరం ప్రయాణించడానికి ఏ మంచు, వాన, ఎండ, లేక నిశిరాత్రి వారిని అడ్డగించవు” అని హెరిడాటస్ అనే చరిత్రకారుడన్నాడు. ఇదే పద్ధతి పర్షియా సామ్రాజ్యమంతటా వ్యాపించిన ప్రభుత్వ ప్రతిదిన సంబంధ మాధ్యముగావుండేది.
[17వ పేజీలోని చిత్రం]
యంత్రాలు వాటంతట అవే వేలకొలది ఉత్తరాలను ఒక గంటలో చదివి, వేర్పరుస్తాయి
[క్రెడిట్ లైను]
USPS Photo