కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 7/8 పేజీలు 20-21
  • మన మ్రొక్కుబడులను మనం చెల్లించాలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన మ్రొక్కుబడులను మనం చెల్లించాలా?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుంటిసాకులు చెప్పొద్దు
  • మంచి మనస్సాక్షి కల్గివుండండి
  • తప్పుడు లేదా లేఖనరహిత మ్రొక్కుబడులు
  • మీ గత, భవిష్యత్‌ మ్రొక్కుబడులను పరిశీలించండి
  • మీ మొక్కుబళ్లు చెల్లించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ‘నీ మొక్కుబడి చెల్లించు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • యెహోవాకు నమ్మకంగా ఉండేవాళ్లు మాట మీద నిలబడతారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 7/8 పేజీలు 20-21

బైబిలు ఉద్దేశము

మన మ్రొక్కుబడులను మనం చెల్లించాలా?

మామూలుగా సంతోషంగా వున్న దంపతులు ఒక బాధాకర సమస్య నెదుర్కొంటున్నారు. ఏళ్ల క్రితం కుటుంబం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, దేవుడు ఆ కష్టాలనుండి వారిని వెలికితీస్తే తమ ఆదాయంలో పదోవంతు సమర్పించుకుంటామని మ్రొక్కుకున్నారు. వయస్సులో పెద్దవారై, అనుకోని డబ్బు సమస్యల సుడిగుండంలో వున్న ఈ సమయంలో “మేము తప్పని సరిగా ఈ మ్రొక్కును చెల్లించాలా?” అనే ఆలోచనలో పడ్డారు.

వారి పరిస్థితిని గూర్చి, మాటల్లో అతితొందర విషయంలో జ్ఞాని ఇచ్చిన సలహా నొక్కితెలుపుతోంది: “నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీనోటివలన జరుగనియ్యకుము; అది పొరపాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము.”—ప్రసంగి 5:5, 6.

కుంటిసాకులు చెప్పొద్దు

నిస్సార మ్రొక్కుబడులు, ఎగవేసే వాగ్దానాలు ఈ అదుపు తప్పిన విధానంలో సాధారణమైనా, దేవుడు అటువంటి కల్పిత సాకులను నమ్ముతాడని మనం ఆశించలేము; వ్యాపారస్తులకు సహితం దీనికంటే ఎక్కువ తెలుసు. “వ్యాపార యథార్థత: విభేదాల మాటల మూటలా?” అనే శీర్షిక నామం క్రింద వాణిజ్య పత్రిక, ఇన్డస్ట్రీ వీక్‌ బాధగా యిలా చెప్పింది: “తమ నిబద్ధతలకు తగినట్లు జీవిస్తూ, ప్రజలు నిజం పలికి, లాభం చూసుకోకుండా సరైనది చేస్తారని మేము ఏమాత్రం నమ్మడంలేదు.” “ఇదిగో యిప్పుడే చెక్‌రాసి పోస్టులో పడేసి వచ్చా” అన్న అనుకూలమైన అబద్ధము చెప్పి అప్పులవారినుండి ఆ సమయానికి తప్పించుకోవచ్చుగానీ, దేవదూతలు మాత్రం మోసపోవు.

అంటే తాను వడ్డీకి అప్పిచ్చిన దౌర్భాగ్యులైన బాధితులనుండి, నీతీ నియమాలులేని అక్రమ వడ్డీవ్యాపారి గూండాలను ఉపయోగించి వారి దగ్గిరనుండి ఆ డబ్బును వసూలు చేయించినట్లుగా దేవుడు తన దూతలనుపయోగించి మ్రొక్కుబడులను చెల్లింపజేస్తాడని దాని భావం కాదు. అలాకాకుండా, దేవుడు ప్రేమపూర్వకంగా తన దూతలను, “రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన [ప్రోత్సాహకర] సేవకులైన ఆత్మలుగా” చేస్తాడు. (హెబ్రీయులు 1:14) అలా దేవదూతలు మన యథార్థమైన ప్రార్థనలకు ప్రత్యుత్తరం యివ్వడంలో పాలుపంచుకుంటారు.

అయినప్పటికీ, మనం మన ప్రార్థనలలో శుష్క వాగ్దానాలు చేస్తూ, దేవుడు ఆశీర్వాదాలిస్తాడని మనం అపేక్షించవచ్చునా? “నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును [కనీసం కొంతమేరకైనా] వ్యర్థపరచుకొనెదవు?” అని జ్ఞాని పేర్కొన్నాడు.—ప్రసంగి 5:6.

కాబట్టి సాకులు చెప్పకుండా, మ్రొక్కుబడులు చెల్లించడానికి పగతీర్చుకొనే దూత భయము మనలను ప్రేరేపించకూడదు. అలాకాకుండా, దేవునితో మనకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచి, మన కార్యాలపై దేవుని దయ వుండాలని మనం యథార్థంగా కోరుకోవాలి. ముందు ప్రస్తావించబడిన దంపతులు దీనిని ఎంతో చక్కగా వ్యక్తపర్చారు: “దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో వుండాలని, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నాము.”

మంచి మనస్సాక్షి కల్గివుండండి

మన మ్రొక్కుబడులను చెల్లించే విషయంలో మనం మంచి మనస్సాక్షి కల్గివుండాలంటే ముందు మనకైమనం యథార్థంగా వుండాలి. ఉదాహరణకు: ఎవరో మీకు చాలా మొత్తంలో డబ్బు అచ్చివున్నారు అయితే, దురదృష్టవశాత్తు అతను మీకు తిరిగివ్వలేని స్థితిలో వున్నాడనుకోండి. ఏది మిమ్మల్ని ఎక్కువ ప్రీతి పరుస్తుంది—తిరిగివ్వలేనని మొత్తం సొమ్ము ఎగవేయడమా లేక అతనికి చేతనైనంతలో క్రమంగా కొంతకొంత యివ్వడానికి ఏర్పాటుచేయడమా?

అదే విధంగా, తమ్మును తాము పూర్తి కాలం లేక యితర వనరులను సరైన క్రైస్తవ కార్యాలకు వినియోగిస్తామని తొందరపడి చేసే వాగ్దానాలు నెరవేర్చలేమనుకోండి. అలాంటప్పుడు మన ప్రస్తుత పరిస్థితులకు వీలైనట్లుగా మ్రొక్కుబడిని చెల్లించాలన్న బాధ్యతను మనం భావించాలి కదా? మనం ఎక్కువిచ్చినా లేక తక్కువిచ్చినా “మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే,” అది “ప్రీతికరమవును” అని పౌలు వ్రాశాడు. (2 కొరింథీయులు 8:12) అయితే ఒకడు బైబిలు సత్యముల జ్ఞానం పొందక ముందు చేసిన మ్రొక్కుబడుల మాటేమిటీ?

తప్పుడు లేదా లేఖనరహిత మ్రొక్కుబడులు

మనం చేసిన మ్రొక్కుబడి అపవిత్రమైనది లేక అవినీతికరమైనదైతే, నిప్పును ఎలా పడేస్తామో అలానే దాన్ని పూర్తిగా వదులుకోవాలి. (2 కొరింథీయులు 6:16-18) అపవిత్రమైన మ్రొక్కుబడుల ఉదాహరణలు యిక్కడున్నాయి:

▫ అబద్ధ దేవతలు, దేవుళ్లకు చేసిన మ్రొక్కుబడులు. బబులోను “ఆకాశరాణి” వంటివి.—యిర్మీయా 44:23, 25.

▫ న్యాయవ్యతిరేక మ్రొక్కుబడులు. అపొస్తలుడైన పౌలును హతమార్చేంత వరకూ ఒక ముద్ద ఆహారంకూడా ముట్టుకోమని 40 మంది పురుషులు చేసిన మ్రొక్కుబడి వంటివి.—అపొస్తలుల కార్యములు 23:13, 14.

▫ మతభ్రష్ట మ్రొక్కుబడులు అనగా, “దయ్యముల బోధయందు, ఆ అబద్ధికులు . . . వివాహము నిషేధించుచు సత్యమువిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని” చెప్పే బోధలను అవి వెంబడిస్తున్నాయి.—1 తిమోతి 4:1-3.

కాబట్టి, కొన్ని గత మ్రొక్కుబడులను చెల్లించనవసరంలేదన్నది స్పష్టంగా వుంది. అయితే లేఖన రహితంకాని మ్రొక్కుబడుల విషయంలో లొసుగులు ఎందుకు వెతకాలి? మన ప్రస్తుత సరైన జ్ఞానం, గతంలో మనం చేసిన మ్రొక్కుబడుల యెడల మరింత గౌరవాన్ని మనం కనపర్చేదిగా చేయాలికదా?

మీ గత, భవిష్యత్‌ మ్రొక్కుబడులను పరిశీలించండి

అంటే మన ఆరాధనకు సంబంధించి ఏ మ్రొక్కుబడి చేసినా మొదట గంభీరంగా ఆలోచించాలి. క్రైస్తవ ఆరాధనలో వ్యయపర్చే సమయాన్ని ఎక్కువ చేయడం లేదా తిండిపోతుతనం నుండి వైదొలగడం వంటివి చేయడానికో, మానడానికో ప్రేరణగా ఒట్టు పెట్టుకొనకూడదు. న్యాయస్థానంలో చెప్పే ప్రమాణాల వంటి ప్రామాణాలన్నింటికీ యేసు అభ్యంతరం చెప్పలేదు. ఉదాహరణకు విచక్షణారహితగా ఒట్టులు పెట్టుకోవద్దని ఆయన స్పష్టపర్చాడు. ఎందుకంటే యేసు యిలా హెచ్చరించాడు: “నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా, నేను మీతో చెప్పునదేమనగా—ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు.” (మత్తయి 5:33, 34) యేసు ఎందుకు ఈ వైఖరిని అవలంభించాడు? మునుపు కన్నా యిప్పుడు మ్రొక్కుబడులు అంత సముచితం కాదా?

ప్రాచీనకాలంలోని నమ్మకమైనవారి ప్రమాణాలు, సాధారణంగా ఒక షరతుపై ఆధారపడేవి. వారి పవిత్ర ప్రార్థనలో వారు దేవునికి యిలా మ్రొక్కేవారు: ‘ఈ నా సంక్షోభంనుండి నన్ను కాపాడితే, నేను నీకొరకు ఫలానా ఫలానాది చేస్తాను.’ అయితే యేసు యిలా అన్నాడు: “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును.” తన కాలంలోని నమ్మకమైన వారికి షరతులపై ఆధారపడిన ప్రమాణాలను సిఫారస్సు చేయకుండా యేసు వారికిలాంటి అభయమునిచ్చాడు: “ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.”—యోహాను 16:23, 24.

యేసు నామం లేక ఆయన అధికారంలోని ఈ నమ్మకం, శాయశక్తులా ప్రయత్నించినా “ఒకడు పెదవులతో వ్యర్థముగా” చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతున్నాడు గనుక తన్ను తాను దోషిగా భావించుకునేవాడు ఓదార్పుపొందగలడు. (లేవీయకాండము 5:4-6) కాబట్టి మన పాత మ్రొక్కుబడులను చులకనగా తీసుకోకపోయినా, ప్రస్తుతం యేసు నామంలో ప్రార్థించడమే కాకుండా మన పాపాలకు యేసు విమోచన క్రయధనమును అన్వయించుమని దేవునికి విన్నవించవచ్చు, మరియు యేసు నామంలో క్షమాపణను అర్థించవచ్చును. అలా మనం “మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన [శుద్ధిచేయబడిన] హృదయము గలవారమును, . . . విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి” వుండవచ్చును.—హెబ్రీయులు 10:21, 22. (g93 4/8)

[Picture Credit Line on page 20]

Priests taking vows at Montmartre

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి