యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
ఇంత ఎక్కువ హోమ్ వర్క్ ఉంటే నేనేం చేయాలి?
యౌవనులలో కలిగే మానసిక వత్తిడికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి “ఎక్కువ స్కూలు పని” యని పేర్కొనబడింది
“నీకో పద్ధతంటూలేకపోతే, తరువాత నీవేమి చేయాలో నిర్ణయించుకోడానికి ఎంతో సమయం వృధా అవుతుంది”
‘మాకు సమయం చాలడం లేదే!’ అని కొందరు ఉన్నత పాఠశాల విద్యార్థులున్నారు. ఈ సమస్యకు గల కారణమేమిటో? స్కూల్ కోరేపని, అదిచ్చే హోమ్‌వర్కే. “నా స్కూల్ ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై 5:30కు అయిపోతుంది,” అని వెరొనిక్ చెబుతుంది. “నేను ఇంటికి వచ్చేటప్పటికి 6:30 అవుతుంది. అది చాలా కష్టమనిపిస్తుంది. స్కూల్‌లో చదవడం అంటే చాలా అద్భుతమైన జీవితం అని తలిదండ్రులు అనుకుంటారు. స్కూల్ అనేది చాలా అలసటకరమైందని, వత్తిడి కలగజేస్తుందని వారు అర్థంచేసుకోరు, మరి మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇక అక్కడ హోమ్‌వర్క్ ఉంటుంది.” పదిహేడు సంవత్సరాల శాడ్రిన్ ఇంకా ఇలా అంటోంది: “వారాంతంలోనే గాక, ప్రతిరోజూ రాత్రి రెండు మూడు గంటలు హోమ్‌వర్క్ చేస్తున్నాను.”
వెరోనిక్, శాడ్రిన్ ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు. యూరప్‌లోకెల్లా అక్కడే ఎక్కువ పొడవైన స్కూలు దినాలున్నాయి. ఇతర ప్రాంతాలలోనున్న విద్యార్థులు కూడా అలాగే తమకున్న సమయంలో అధికంగా చేయవలసిన పనులలో మునిగి విసుగుచెంది వత్తిడికి గురౌతున్నారు. యౌవనుల మానసిక వత్తిడికి అత్యంత సాధారణ కారణాలలో “ఎక్కువ స్కూలు పని” ఒకటని పేర్కొనబడింది.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉద్యోగం సంపాదించడం అంతకుముందు కన్నా మరింత కష్టమౌతున్నందున ఉద్యోగరంగలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి పెద్దచదువులు చదవడమే కీలకమని అనేకమంది యౌవనులు తలస్తున్నారు. వీయొలాన్ అనే ఓ పాఠశాల విద్యార్థిని యిలా అన్నది: “ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించే అవకాశాలు చాలా కష్టమైనందున నేడు పిల్లలు చేయాల్సిన ఒకే ఒక పని—చదవడం!”
సమయం చాలడం లేదా?
అయినప్పటికి, దీనిని చేయడానికి ఎక్కువ సమయం, శక్తి అవసరమని స్కూల్‌లో బాగా చదివే వారికి తెలుసు. ఒకవేళ నీవు క్రైస్తవ యౌవనుడవైతే క్రైస్తవ కూటాలకు హాజరగుట, బైబిలు చదువుట, మరియు నీ విశ్వాసాన్ని గూర్చి యితరులతో పంచుకొనుట వంటి వాటికి నీకు అధిక సమయం అవసరమై వుంటుంది. (యోహాను 17:3; రోమీయులకు 10:10; హెబ్రీయులకు 10:24, 25) “నవ్వుటకును” ఆనందించుటకును సమయముందని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 3:1, 4; 11:9) అనేకమంది యౌవనులవలె, నీవుకూడా నిశ్చయంగా వినోదం, విశ్రాంతి కొరకు కొంత సమయం కావాలని కోరుకుంటావు. అయితే నీ స్కూలుపని మూలాన నీవు పూర్తి చేయాలనుకున్న వాటికి చేయాలని ఇష్టపడే వాటికి మరీ తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండవచ్చును.
అయినప్పటికి, సమయం లేనందువల్ల యీ సమస్య రావడంలేదు. “సమయాన్ని సద్వినియోగం చేయకపోవడం,” “క్రమ పద్ధతిలోపించడం” అనే రెండు ముఖ్యకారణాలను బట్టి ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యాసంబంధిత సమస్య లెదుర్కొన్నారని ఇటీవలి అధ్యయనం తెల్పింది. వ్యక్తిగత సంస్థీకరణ సరిగాలేకపోవడం వలన అది మార్కుల మీద కంటె యింకా ఎక్కువ ప్రభావం చూపించవచ్చునని, ఓలీవియ అనే పేరుగల యౌవనుడు కనుగొన్నాడు. నీకో పద్ధతంటూ లేకపోతే, తరువాత నీవేమి చేయాలో నిర్ణయించుకోవడానికి ఎంతో సమయం వృధా అవుతుంది” అని ఆ కుర్రాడు తెల్పాడు. అయితే, ఏ విధంగా నీకై నీవు సంస్థీకరించుకోగలవు?
స్కూల్ వర్క్ యెడల సమదృక్పథం
మొదటగా, నీ స్కూలు పనియెడల ఒక మంచి దృక్కోణం కల్గివుండాలి. బైబిలు మనకు ఇలా తెల్పుతుంది “శ్రేష్టమైన కార్యములను వివేచించాలి.” (ఫిలిప్పీయులకు 1:10) మరియు నీవు శ్రేష్టమైన దాన్నిగూర్చి ఆలోచించినట్లయితే, నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏమైయుండాలి? ఆత్మీయ బాధ్యతలు ప్రాముఖ్యమై ఉండాలి గదా? వీటన్నిటి తరువాత, ఏసు తన శిష్యులకు ఈ విధంగా తెల్పాడు: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి.” (మత్తయి 6:33) అంటే, క్రైస్తవ కూటములు, ప్రార్థన, పఠనం, మరియు ఇతరులకు ప్రకటించుట మొదలగు పనులకు ప్రాధాన్యతనివ్వాలని దాని భావం.
స్కూల్ వర్క్ ప్రాముఖ్యం కాదని దీని భావమా? ఎంతమాత్రం కాదు. కాని ఒక క్రైస్తవునిగా, విద్యనభ్యసించడం భౌతికంగా జీవనోపాధిని సంపాదించుకోవడానికి కాకూడదు. బదులుగా, దేవుని పరిచారకునిగా నీకుపయోగపడే వృత్తి నైపుణ్యాలను నేర్చుకోవడమే. అదే సమయంలో ఉద్యోగం చేసి నీకై నీవు పోషించుకోవడానికి, బహుశా భవిష్యత్తులో నీ కుటుంబాన్ని పోషించడానికి నీవు సిద్ధపడుతున్నావు. (1 థెస్సలొనీకయులకు 4:11, 12; 1 తిమోతికి 5:8) ఇవన్ని తెలుసుకోవడం నీ స్కూల్లో నీవు మంచిగా చదవడానికి సహాయపడుతుంది. అదే విధంగా, నీకైనీవు ఆత్మీయంగా బలంగా ఉండడానికి అనుకూలమైన ప్రయత్నాలు చేసుకోవాలి.
ఆత్మీయ పనులు, యింటిపనులు, వినోదం, స్కూలుపనుల కొరకు “సమయమును పోనియ్యక సద్వినియోగం చేసుకొనుట” నిజంగా ఒక సవాలైయుంది, కాని వాటిని చేయగలవు.—ఎఫెసీయులకు 5:15, 16.
దినచర్యను ఏర్పాటు చేసుకొనుటలో ప్రయోజనం
సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక పద్ధతేమనగా నీవు చదివే విధానాన్ని సమర్థవంతంగా చేసుకోవాలి. క్వష్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్స్‌ర్స్ దట్ వర్క్ అనే పుస్తకంలోని 18వ అధ్యాయం నీకు సహాయపడే అనేక సలహాలను ఇస్తుంది.a ఉదాహరణకు, నీ స్కూల్ వర్క్ కొరకు నియమావళి లేదా క్రమపద్ధతిని అనుసరించడానికి ప్రయత్నం చేశావా?—ఫిలిప్పీయులకు 3:16 పోల్చండి.
“నిస్సందేహంగా చదువుల్లో అత్యంత సామాన్య యిబ్బంది ఏమనగా ఏకాగ్రతతో క్రమంగా పనిచేయక పోవడమే” నని హేరీ మేడక్స్ అనే ఆయన హౌటు స్టడీ అనే తన పుస్తకంలో వ్రాశాడు. నీ విషయమేమిటి? హోమ్ వర్క్ చేయాలనిపించేంత వరకు లేక అనుకూల సమయం వచ్చేంతవరకు దానిని ప్రక్కన పెట్టేస్తున్నావా? ప్రసంగి 11:4 యిలా హెచ్చరిస్తుంది: “గాలిని గురుతు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు.”
హేరీ మేడక్స్ యింకా యిలా అంటున్నాడు: “సమయాన్ని క్రమేణ వృధాచేయడం చాలా సులభం. నీకై నీవు నిర్ధిష్ట పట్టిక వేసుకొనకపోతే బహుశా నీవు చదువుకోవలసిన సమయంలో టి.వి చూడడానికి, ఏదైనా పత్రిక చదవడానికి, . . లేదా మొద్దబ్బాయి హోమ్ వర్క్ చేయడానికి బదులుగా చేసే సవాలక్ష పనులను నీవు చేయవలసి వస్తుంది.” నీకు ఒక నిర్థిష్టపట్టిక ఉండి దాని ప్రకారం నీవు చేస్తున్నట్లయితే, ఉల్లంఘింప కూడని శక్తి దానికున్నది, మరి సమయము గడచుకొలది దానిని అనుసరించడం కష్టంకాదు, మరి దానిని నీవు నీ జీవితంలో ఒక భాగంగానే గుర్తిస్తావు.
ఒకవేళ నీవు స్కూల్ వర్క్ సరిగా సంస్థీకరించుకొని క్రమశిక్షణా పద్ధతిలో వుంచుకుంటే ఎక్కువ సమయం నీకు ఉంటుంది. నీ స్కూలుకు సంబంధించిన పనులను పూర్తిచేయుటకును సంఘకూటములకు హాజరగుటవంటి క్రైస్తవకర్తవ్యములను పూర్తిగావించుటకును మధ్యగల వత్తిళ్లను తొలగించుకొనుటకు నీవు వేసుకొనే మంచి పథకము కూడా నీకు సహాయపడగలదు.
నీ సమయాన్ని క్రమబద్ధీకరించుకో!
నీవు చేయగోరు, నీవు చేయాల్సిన ఇంటిపనుల వంటి యితర పనుల విషయమేమి? ఇక్కడ కూడా సరియైన రీతిలో క్రమబద్ధీకరించుకోవడమే కీలకం. ఈ క్రింది సలహాలను పాఠించడానికి ప్రయత్నించండి.
చేయవలసిన పనులకు పట్టికను తయారుచేసుకోండి. అన్ని వేళలా జేబులో నోట్ పుస్తకాన్ని పెట్టుకొని వెళ్లమని సమయ నిర్వహణా సలహాదారుడు స్టీఫెన్ విన్‌స్టన్ సిఫారసు చేస్తున్నాడు. “ప్రతి తలంపును, పనిని, ఫోన్‌కాల్‌ను, ఓ పథకాన్ని, పెద్దపనిని లేదా నియమిత పనిని పెద్దదైనా చిన్నదైనా ప్రాముఖ్యత ఉన్నాలేకున్నా ప్రతిదానిని” అందులో వ్రాసుకొనుటకు దానిని ఉపయోగించండి. మొదట చూచినపుడు మీరు వ్రాసుకున్న పట్టిక చాలా పెద్దదిగా కన్పించవచ్చు, కాని ఈ క్రింది సలహాలను పాటిస్తే, మీరు నిర్వహించదగ్గ పరిమాణానికి దానిని కుదించవచ్చును.
ప్రాధాన్యతా క్రమపట్టిక చేసుకోండి. నిజంగా చేయవలసిన విషయాలపై దృష్టిని కేంద్రీకరించుటకిది నీకు సహాయపడగలదు మరి తర్వాత చేయవలసిన వాటిని లేదా చేయడానికి సమయం దొరకని పనులను మానుకోవచ్చును.
పట్టికను తయారుచేసుకోండి. అవును, నీ పట్టికను కార్యాచరణ పద్ధతిలో, వ్రాతపట్టిక రూపంలో తయారుచేసుకో. చిన్న పాకెట్ క్యాలండర్, లేదా డైరీ వుంటే బాగుంటుంది. సమతూకమైన పట్టిక నీ స్వేచ్ఛకు భంగం కల్గించకుండానే నీ సమయంపై నీవు సరియైన నియంత్రణ కలిగి యుండుటకు నీకు సహాయపడగలదు.
యథార్థంగా ఉండు. ఏ విషయాలు ఎప్పుడు చేస్తే బాగుంటుందో ఆలోచించి ప్రయత్నించి చూడు. ఉదాహరణకు, మానసికంగా చురుకుగా ఉన్నప్పుడే, సాధ్యమైనంత త్వరలో పగలే నీ హోమ్‌వర్క్ చేసుకోవడానికి పట్టికను వేసుకుంటే ప్రయోజనకరంగా ఉండవచ్చును.
అయినప్పటికి, నీ జీవితాన్ని గూర్చి ప్రతిక్షణం ఆలోచించనవసరంలేదని గుర్తుంచుకో. సహజంగా, అనుకోకుండా జరిగే వాటికి తగినట్లు పట్టిక తయారుచేసుకో, అవసరమున్న చోట సవరణ చేసికో, కాని సాధ్యమైనంత వరకు నీ పట్టికను అనుసరించు. ఓ గమనిక: సాధారణంగా మీరొక ప్రత్యేకమైన పనిని పూర్తిచేయడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయాన్ని కేటాయించడం మంచిది. ఒకవేళ మీరు దాన్ని ముందుగా పూర్తిచేస్తే ఆ ప్రకారమే సర్దుబాటు చేసుకోవచ్చును.
నీ స్వంత గమ్యాలను పెట్టుకొనుము. ఓ పనిని చివరి క్షణం వరకు చేయకుండా ఉండాలనే ఉద్దేశమును తొలగించుకొనుటకు ఇది సహాయపడుతుంది. ఒకవేళ నీవు స్కూలుకు సంబంధించిన పనిచేయవలసివస్తే నీవు ఎప్పటికివ్వాలో ఆ తేదీకి ముందే పూర్తిచేసి ఇవ్వడానికి ప్రయత్నించు.
నీ పట్టికను అనుసరించడానికి నిన్ను నీవు ఓ క్రమశిక్షణలో పెట్టుకో. నీ ఫైనల్ పరీక్షల సమయంలో ఇంటిదగ్గరుండి చదువుకునే బదులు నీ స్నేహితుని ఇంటికి వెళ్లాలనే శోధన కలుగవచ్చు. నీ చదువు విషయంలో అశ్రద్ధ చూపితే, తరువాత నీకు తక్కువ మార్కులు రావచ్చును. (2 కొరింథీయులకు 9:6 పోల్చండి.) నీ వర్క్ పూర్తిచేసుకున్నట్లయితే సాధారణంగా నీవు నీ ఖాళీ సమయంలో ఆనందించవచ్చు. ఓ సహాయకర సూత్రమేమిటంటే, ముందు ముఖ్యమైన పనులు, తరువాత తమాషా పనులు.
పట్టిక వేసుకోవడానికి, నిన్ను నీవు సంస్థీకరించుకోవడానికి, సమయం పడుతుంది. దానికి సహనం క్రమశిక్షణ అవసరం, కాని అన్ని విషయాల్లో క్రైస్తవులు మితంగా ఉండాలని ఉపదేశింప బడియున్నారు. (1 కొరింథీయులకు 9:25) ఈ నియమాన్ని పాఠించడంలో షెడ్యూల్‌కు కట్టుబడి వుండడమనేది మంచి అలవాటు. ఇలా చేస్తే, నీవు చేసినదానికి సంతృప్తి కలుగవచ్చును, నీ జీవితం మీద అదుపు, నీవు చేయాలని అనుకున్న వాటిని, అవసరమైన వాటిని చేయడానికి సమయం దొరుకుతుంది.
[అధస్సూచీలు]
a వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ న్యూయార్క్, ఇన్‌కార్పోరేషన్ వారి ప్రచురణ.
[15వ పేజీలోని చిత్రం]
చదువుకోడానికి పట్టిక వేసుకొని దానికి కట్టుబడియుండండి